launching
-
కాశీలో శివశక్తి
నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా ‘తండేల్’ లోని శివశక్తి పాటను ఈ నెల 22న కాశీలోని డివైన్ ఘాట్స్‌లో లాంచ్ చేయనున్నాను.‘‘శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్యాన్ని, పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉంటుంది. సంగీతం పరంగా, విజువల్‌గా ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. పండగను వైభవంగా జరుపుకుంటున్న అనుభూతిని కలిగించే ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
‘ఆంధ్ర సంపాదక శిఖరాలు’.. పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, విజయవాడ: సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన 'ఆంధ్ర సంపాదక శిఖరాలు' పుస్తకాన్ని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ రాజశేఖర్,ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు సోమవారం ఆవిష్కరించారు. నాగార్జున యూనివర్సిటీ(ఎన్యూ)లో జరిగిన "తెలుగు భాష సేవా రత్న" అవార్డుల ప్రదానోత్సవ సభలో ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఆర్. మీడియా అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్రికా రంగాన్ని ఉర్రూతలూగించిన తొలి తరం సంపాదకుల సంక్షిప్త జీవిత చరిత్రలను ప్రస్తుత తరానికి అందించాలన్న తలంపుతో మీడియా అకాడమీ ఈ పుస్తకాన్ని ప్రచురించిందన్నారు. ఆయా సంపాదకుల వివరాలు సేకరించి మా శర్మ ఈ పుస్తకాన్ని అద్భుతంగా రచించారని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీతో మీడియా అకాడమీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కొమ్మినేని గుర్తుచేసుకున్నారు. వర్కింగ్ జర్నలిస్టులకోసం తాను ఛైర్మన్‌గా పనిచేసిన కాలంలో ప్రారంభించిన జర్నలిజం డిప్లమో కోర్సుకు సహకరించిన వైస్ ఛాన్సిలర్, ప్రొ. రాజశేఖర్‌కు, జర్నలిజం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ డా. జి. అనితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రచయిత మా శర్మను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సిలర్ ప్రొ. కొలకలూరి ఇనాక్ సి.ఆర్. మీడియా అకాడమీ తరపున శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస ఆంధ్రుల కమిటీ చైర్మన్, మేడపాటి వెంకట్, తెలుగు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ వాసుదేవరావు, జర్నలిజం హెచ్‌వోడీ డా. జి. అనిత, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి.. తిరుమల ధార్మిక సదస్సులో పలు తీర్మానాలు -
పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మొత్తం 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు. చదవండి: పవన్ వ్యాఖ్యలు.. పోలీసు నోటీసులు -
జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు!
మారుతి సుజుకి జిమ్నీ ప్రియులకు నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. మహీంద్రా థార్ కు పోటీగా వస్తున్న మారుతి సుజుకి జిమ్నీ కోసం కొనుగోలుదారులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే జిమ్నీ భారత్ లో మే నెలలో విడుదల కావడం లేదని తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో అరంగేట్రం చేసింది. ఈ SUV మే నెలలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావించారు. అయితే తాజా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి జిమ్నీ లాంచ్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 24,500 పైగా బుకింగ్‌లు దేశంలో జిమ్నీ కోసం ఇప్పటి వరకు 24,500 కుపైగా బుకింగ్‌లు వచ్చాయి. జూన్ మొదటి వారంలో లాంచ్ అయిన వెంటనే డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 5-డోర్ల జిమ్నీ కంపెనీ.. మారుతి సుజుకి గుర్గావ్ ప్లాంట్‌లో తయారవుతోంది. ఆటోమొబైల్ సమాచార సంస్థ కార్టాక్ ప్రకారం, దేశీయ, విదేశీ డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి నెలా 7,000 యూనిట్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో ఆల్ఫా ట్రిమ్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. జిమ్నీ రంగుల విషయానికి వస్తే కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్ కలర్లను చాలా మంది ఇష్టపడుతున్నారు. రూ. 10 లక్షల నుంచి ప్రారంభం లీక్ అయిన డీలర్ ఇన్వాయిస్ ప్రకారం.. భారత్ లో మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ భారత్ లో నెక్సా షోరూమ్‌ల ద్వారా బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
ఘనంగా ‘మన అమెరికన్ తెలుగు అసొసియేషన్’ ప్రారంభోత్సవం
ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ప్రజల నుంచి మరో అసొసియేషన్ ప్రారంభమయింది. ‘మన అమెరికన్ తెలుగు అసొసియేషన్’ (మాట) పేరుతో న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ పాలెస్ వేదికగా లాంచింగ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అమెరికాలో వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన 2500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. 2 వేల మంది లైఫ్ మెంబర్లతో 20 నగరాల్లో చాప్టర్లను ప్రకటించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించడం, అమెరికాలో ఉంటోన్న తెలుగు వారికి అండగా నిలవడం, మహిళా సాధికారతతో పాటు యువతను ప్రోత్సహించడం, సీనియర్ సిటిజన్లకు మరింత మెరుగైన సంరక్షణను అందించడం లక్ష్యంగా మన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మాట కోర్ టీంలో శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, శ్రీ అట్లూరి, శ్రీధర్ చిల్లర, దాము గెడల, స్వాతి అట్లూరి, జితేందర్ రెడ్డి, స్టాన్లీ రెడ్డి, పవన్ దర్శి, ప్రసాద్ కూనిశెట్టి, శేఖర్ వెంపరాల, హరి ఇప్పనపల్లి, గంగాధర్ ఉప్పల, కిరణ్ దుగ్గడి, విజయ్ భాస్కర్ కలాల్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మాట ఫౌండర్లయిన శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల సంస్థ లక్ష్యాలను వివరించారు. అలాగే యూత్ టీంకు సంబంధించిన విజన్‌ను లక్ష్మీ మోపర్తి తెలియజేశారు. వడ్డేపల్లి కృష్ణ రాసిన ‘మాట’ స్వాగత గీతాన్ని స్వాతి అట్లూరి నేతృత్వంలోని బృందం ప్రదర్శించగా, పార్థసారథి మ్యూజిక్ అందించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత, అనిరుధ్ తమ సంగీతంతో ఆహుతులను అలరించారు. -
కొత్త ప్రొడక్షన్ హౌస్.. బాబు మోహన్ చేతుల మీదుగా శ్రీకారం
రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. ప్రొడక్షన్ హౌస్ సంస్థను బాబు మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు నిర్వాహకులు. ఈ మేరకు రామానాయుడు స్టూడియోస్ ఆవరణలో మూడు సినిమాలను పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ చేశారు. ఇందులో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కిస్తున్న సినిమా 'సోషల్ వర్కర్స్'. ప్రసాద్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో 8మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వీటితో పాటు ‘కోబలి’,‘హ్యాపీ ఉమెన్స్ డే’సినిమాలకు సంబంధించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజ అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 20 సినిమాలు ప్లాన్ చేశారని, త్వరలోనే వాటి అనౌన్స్మెంట్ ఉంటుందని తెలిపారు. -
రక్షిత్ అట్లూరి హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
రక్షిత్ అట్లూరి హీరోగా గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో ‘పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ’ అనే సినిమా షురూ అయింది. విశ్వేశ్వర శర్మ, రాజరాయ్ నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ చందు మొండేటి క్లాప్ కొట్టారు.అనంతరం గొల్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, యాక్షన్ డ్రామా, పోలీస్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు రక్షిత్. ‘‘మా సినిమాలో నటించే ఇతర నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు విశ్వేశ్వర శర్మ. -
శ్రీ కల్యాణ్, శశి జంటగా 'మెగా పవర్' సినిమా ప్రారంభం
శ్రీ కల్యాణ్, శశి జంటగా నటిస్తున్న చిత్రం ‘మెగా పవర్’.గేదెల రవిచంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ప్రారంభమైంది. కిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పృథ్వీరాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ.. మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఈ సినిమా అని, యాక్షన్ సీన్స్ కోసం హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తామన్నారు. పృథ్వీ, రఘుబాబు, మురళీశర్మ, రచ్చ రవి, రియాజ్, రెహమాన్, శ్రీకాంత్ అయ్యంగర్, సురేష్, సంగీత ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
Poco X5 Pro 5g: వచ్చేస్తోంది.. రాక్‌స్టార్ చేతులమీదుగా
సాక్షి,ముంబై: పోకో ఎక్స్5 ప్రో ఈరోజు( సోమవారం) సాయంత్రం విడుదలవుతోంది. సాయంత్రం 5.30 గంటలకు జరిగే లాంచింగ్ కార్యక్రమాన్ని కంపెనీ తమ యూట్యూబ్ చానెల్, ఫ్లిప్‌కార్ట్ చానెల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. పోకో ఎక్స్5 ప్రో స్మార్ట్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు కంపెనీ ట్విటర్ ద్వారా తెలియజేసింది. గతేడాది విడుదల చేసిన పోకో ఎక్స్4 ధర రూ.18,999. అయితే తాజాగా లాంచ్ చేయనున్నపోకో ఎక్స్5 ప్రో బేసి వేరియంట్ ధర 20 వేల లోపే ఆవిష్కరించ నుందట. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ. 22,999 ఉంచనుంది. అయితే ఐసీఐసీఐ బ్యాంకు కార్డు ద్వారా 2వేల తగ్గింపుతో 20,999 అందించనుంది. ఫిబ్రవరి 13 నుంచి తొలి సేల్ షురూ కానుంది. ప్రత్యేకతలు ఇవే.. (అంచనా) ఈ ఫోన్ స్పెసిఫికేషన్లలో కొన్నింటిని కంపెనీ ఇదివరకే వెల్లడించింది. పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 778 ఎస్ఓసీ టెక్నాలజీతో రాబోతోంది. ఇదే టెక్నాలజీతో వచ్చిన శాంసంగ్, ఐక్యూ కంపెనీలకు చెందిన ఫోన్ల ధర రూ.30 వేలకు పైనే. పోకో ఫోన్లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. 108+8+ 2 ఎంపీ రియర్ కెమెరా, 120హెడ్జ్ ఆమోల్డ్ డిస్ప్లే, స్లిమ్ డిజైన్ ఉండబోతోంది. 5000 ఎంఏహచ్ బ్యాటరీ సామర్థ్యం, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో ఇది పనిచేస్తుంది. Rockstar on the field and a superstar IRL. Catch @hardikpandya7 #UnleashX with the #POCOX5Pro5G behind the scenes. Revealing today @ 5:30 PM on @Flipkart: https://t.co/fRPK7AdL8X pic.twitter.com/hfCNQWuCGA — POCO India (@IndiaPOCO) February 6, 2023 -
NBK108 : అనిల్ రావిపూడితో బాలయ్య యాక్షన్ సినిమా ప్రారంభం
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో NBK108 అనే క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. షూటింగ్ కూడా నేడు(గురువారం)ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య ఇంతకుముందెప్పుడూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారట. శ్రీలీల ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. Here's a cherishing glimpse from our #NBK108 Opening Puja Ceremony🪔 Kickstarted the Shoot Today😎#NBK108Begins❤️🔥 Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna #CRamPrasad #Rajeevan #TammiRaju #VVenkat @Shine_Screens pic.twitter.com/RWhIjtCMzy — Shine Screens (@Shine_Screens) December 8, 2022 -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం
సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నూతన చిత్రం శుక్రవారం ప్రారంభమైంది.ఈ చిత్రంతో జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై బాపినీడు సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బాపినీడు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తేజ్ క్లాప్ కొట్టారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘తేజ్‌తో మా నిర్మాణ సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదే అనుబంధంతో ఇప్పుడు ఆయన మా బ్యానర్లో మరో సినిమా చేస్తున్నారు. అన్ని వరాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాం. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని అన్నారు. -
అమెరికా ప్రెసిడెంట్ కూతురు ప్రేమలో పడితే? మూవీ లాంఛింగ్
కిషోర్ తేజ హీరోగా అంకిత మూలేర్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం హీరో ఆఫ్ ఇండియా. ఆకుల రాఘవ దర్శకత్వంలో తుమ్మల సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇండియా వచ్చినప్పుడు ఓ తెలుగు యువకుడి ప్రేమలో ఆమె పడితే? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు ఆకుల రాఘవ. -
పోకో ఎం5 వచ్చేసింది.. లాంచింగ్ ఆఫర్, ధర, ఫీచర్లు
సాక్షి,ముంబై: పోకో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇండియాతోపాటు ప్రపంచ మార్కెట్లో పోకో ఎం5ని లాంచ్ చేసింది. పోకో ఎం 4 M4 సిరీస్ సక్సెసర్ కొన్ని అప్గ్రేడ్లతో దీన్నివిడుదల చేసింది. భారతదేశంలో పోకో ఎం5 ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ ధర రూ.12,499 6 జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్ మోడల్ ధర రూ.14,499 ఎల్లో, ఐసీ బ్లూ , పవర్ బ్లాక్ మూడు రంగుల్లో ఇవి లభ్యం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సెప్టెంబర్ 13న సేల్ షురూ కానుంది. అయితే పరిమిత కాలానికి విక్రయ ఆఫర్లను అందిస్తున్నట్లుపోకో తెలిపింది. రెండు వేరియంట్లపై రూ. 1500 తగ్గింపును అందిస్తోంది. అంటే వీటిని వరుసగా రూ. 10,999 ప్రారంభ ధరతో రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. పోకో ఎం5 స్పెసిఫికేషన్స్ 6.58అంగుళాల డిస్ప్లే 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+2+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్ -
ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1)ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లోనే పూర్తి చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు.. అంటే ఆదివారం రాత్రి 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. ప్రయోగంలోని మూడు దశలను ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు. చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్! సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేలా.. చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగిస్తున్నారు. 8 కిలోల ఆజాదీశాట్ ఉపగ్రహం ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది. విద్యార్థినులు తీర్చిదిద్దిన బుల్లి ఉపగ్రహం.. బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్ కౌంటర్లు, సోలార్ ప్యానల్ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ–ఇంజనీరింగ్ మ్యాథమేటిక్స్’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్ షరూక్ అనే మహిళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు. -
కేంద్రం తరపున ఏపీకి కిషన్ రెడ్డి హామీ
-
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ను ప్రారంభించిన నితిన్ గడ్కరి,సీఎం వైఎస్ జగన్
-
ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్...! హైదరాబాద్ జోరు మాత్రం తగ్గేదేలే..!
సాక్షి, హైదరాబాద్: కొత్త గృహాల ప్రారంభంలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. 2021 నాల్గో త్రైమాసికం (అక్టోబర్ – డిసెంబర్)లో లాంచింగ్స్ లో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని జేఎల్ఎల్ రెసిడెన్షియల్ మార్కెట్ రిపోర్ట్ వెల్లడించింది. అంతకుక్రితం త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో లాంచింగ్స్‌లో 26.1 శాతం వృద్ధి నమోదు కాగా.. పుణేలో 17.6 శాతం, బెంగళూరులో 16.4 శాతం, ముంబైలో 16.1% పెరుగుదల కనిపించిందని వివరించింది. నగరంలో గృహాల అమ్మకాలు కరోనా ముందస్తు స్థాయికి చేరుకున్నాయి. 2019లో 15,805 ఇళ్లు విక్రయం కాగా 2020లో 9,926, 2021లో 15,787 యూనిట్లు అమ్ముడుపోయాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ పెరగడం, రియల్టీ మార్కెట్ సెం టిమెంట్ బలపడటం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడు తుండటంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారం భం వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలోని ఏడు ప్రధా న నగరాలలో 2021 నాల్గో త్రైమాసికంలో 45,383 అపార్ట్మెంట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ3తో పో లిస్తే ఇది 38% ఎక్కువ. ఇందులో 19 % యూనిట్లు పుణేలో ప్రారంభం కాగా.. బెంగళూరు, హైదరాబాద్ ఒక్కోటి 17% వాటాను కలిగి ఉన్నాయి. -
విను వీధిలోకి వెబ్ టెలిస్కోప్!
కౌరూ: ప్రపంచంలోనే భారీ, అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం శనివారం దిగ్విజయంగా ముగిసింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్లో దీన్ని నింగిలోకి పంపారు. విశ్వ ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాల గుట్టును, ఖగోళ ప్రపంచం రహస్యాలను తెలుసుకోవడంలో ఈ టెలిస్కోప్ కీలకపాత్ర పోషించనుంది. భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించిన అనంతరం టెలిస్కోపు నిర్దేశిత స్థానానికి చేరుకుంటుంది. ఈ మొత్తం దూరం పయనించేందుకు సుమారు నెల పట్టవచ్చు. అక్కడ కక్ష్యలోకి ప్రవేశించి సర్దుకొని పని ప్రారంభించేందుకు మరో 5 నెలలు పడుతుందని అంచనా. అంటే 6 నెలల అనంతరం(సుమారు 2022 జూన్ నాటికి) వెబ్ టెలిస్కోపు తన ఇన్ఫ్రారెడ్ నేత్రంతో చూసేవాటిని భూమికి పంపడం ఆరంభమవుతుంది. ఒక టెన్నిస్ కోర్ట్ విస్తీర్ణంలో ఈ టెలిస్కోపులో పలు దర్పణాలున్నాయి. దీన్ని ఒరిగామి(జపాన్‌లో కాగితాన్ని వివిధ ఆకృతుల్లోకి మడిచే కళ) పద్ధతిలో మడిచి రాకెట్ కొనభాగంలో జాగ్రత్త చేశారు. నిర్దేశిత స్థానం చేరేలోపు ఇది నెమ్మదిగా దానంతటదే విచ్చుకుంటాయి. ఖగోళ రహస్యాల గుట్టు విప్పేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇదే అత్యంత క్లిష్టమైందని నాసా శాస్త్రవేత్తలు అన్నారు. నాసా హర్షం మన విశ్వాన్ని గురించి అందులో మన స్థానం గురించి మరింత అవగాహన కల్పించేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుందని నాసా అడ్మిన్ బిల్ నెల్సన్ అభిప్రాయపడ్డారు. ప్రయోగం విజయవంతం కావడంపై నాసా సంతోషం వ్యక్తం చేసింది. 1990నుంచి సేవలందిస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా భావిస్తున్న ఈ టెలిస్కోపుతో.. మనమెవరం? అన్న ప్రశ్నకు సమాధానం దొరకవచ్చని బిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి దీన్ని ఈ నెల 22న ప్రయోగించాల్సిఉండగా వివిధ కారణాలతో రెండు మార్లు వాయిదా పడి చివరకు క్రిస్మస్ రోజున నింగికెగిసింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు దీని ప్రయోగం కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. చివరకు లాంచింగ్ సమయం వచ్చేసరిగి లాంచింగ్ స్టేషన్ మొత్తం ఉద్విగ్నత వ్యాపించింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదున్నరకు ఏరియన్ రాకెట్ దిగ్విజయంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం మానవాళి కోసమని ఏరియన్‌స్పేస్ సీఈఓ స్టీఫెన్ ఇస్రాయెల్ ఆనందం వ్యక్తం చేశారు. టెలిస్కోపు కక్ష్యలోకి ప్రవేశించాక మనం ఆకాశాన్ని చూసే దృక్పథం మారుతుందన్నారు. మరో మూడు రోజుల ప్రయాణం అనంతరం టెలిస్కోపులోని సన్ షీల్డ్ తెరుచుకుంటుంది. ఇది పూర్తిగా తెరుచుకునేందుకు 5 రోజులు పడుతుంది. అనంతరం 12 రోజుల పాటు మిర్రర్ సెగ్మెంట్లు ఒక క్రమ పద్ధతిలో తెరుచుకుంటూ ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా జరిగేలా చూడడానికి వందలమంది శాస్త్రవేత్తలు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారు. జేమ్స్ వెబ్ విశేషాలు... ► దాదాపు 16లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ స్థానం వద్దకు చేరుతుంది. ► సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టే సామర్ధ్యం దీని సొంతం. ► బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ అంశాల పరిశీలన దీని ముఖ్య లక్ష్యం. ► దీని తయారీలో దాదాపు 10వేల మంది శాస్త్రవేత్తలు నాలుగు కోట్లగంటల పాటు పనిచేశారు. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ, నాసాకు చెందిన దాదాపు 20కి పైగా దేశాలకు దీనిలో భాగస్వామ్యముంది. ► 50 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో ఆరంభించిన ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి 966 కోట్ల డాలర్ల మేర ఖర్చైంది. ► 1996లో ఆరంభమైన ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి పాతికేళ్లు పట్టింది. ► దీని సైజు 72గీ39 అడుగులు. బరువు 6 టన్నులు. కనీసం పదేళ్లు పనిచేస్తుంది. ► దీనిలో బంగారు పూత పూసిన 6.5 మీటర్ల వ్యాసమున్న 18 షట్కోణ ఫలకాల దర్పణం ఉంది. ► 0.6– 28.3ఎం వరకు ఉన్న కాంతి కిరణాలను ఈ దర్పణం గమనించగలదు. ► సూర్యకాంతిలో మండిపోకుండా –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు సిలికాన్, అల్యూమినియం సౌర కవచం అమర్చారు. ► కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు. ► ఎల్2 వద్దకు చేరిన తర్వాత పూర్తిస్థాయిలో పనిప్రారంభించడానికి ఐదు నెలలు పడుతుంది. -
అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతం
బాలాసోర్: అగ్ని ప్రైమ్(అగ్ని– పి) క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలు మోసుకవెళ్లే సామర్ధ్యమున్న ఈ బలాస్టిక్ మిసైల్‌ను ఒడిషా తీరంలోని అబ్దుల్‌కలామ్ ద్వీపం నుంచి శనివారం దిగ్విజయంగా పయ్రోగించినట్లు డీఆర్డీఓ తెలిపింది. ఇందులో పలు అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచామని తెలిపింది. 1000– 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ క్షిపణిని ఉపరితలం నుంచి ప్రయోగిస్తారు. పరీక్షలో క్షిపణి కచ్ఛితమైన లక్ష్యసాధన చేసిందని డీఆర్డీఓ వెల్లడించింది. ఈ సందర్భంగా సైంటిస్టుల బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాధ్ ప్రశంసించారు. అగ్ని– పి పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్డీఓ చైర్మన్ సతీశ్‌రెడ్డి హర్షం ప్రకటించారు. తొలిసారి ఈ క్షిపణిని జూన్ 28న పరీక్షించారు. నేడు జరిపిన రెండో పరీక్షతో క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధి సాధించిందని, వీలయినంత త్వరలో దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నామని డీఆర్డీఓ తెలిపింది. -
Mahindra XUV700: బుకింగ్స్ ప్రారంభం.. ముందు వచ్చిన వారికే ఆ ఆఫర్
అందుబాటు ధరలో మెరుగైన ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించి కీలక అప్డేట్ని మహీంద్రా సంస్థ వెల్లడించింది. అక్టోబరులో మార్కెట్లోకి వస్తున్న ఈ కారు బుకింగ్స్ తేదీని మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన బుకింగ్ ప్రక్రియ అక్టోబరు 7 నుంచి మొదలు కానుంది. వినియోగదారులకు ఉండే విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని డిఫెరెంట్ వేరియంట్స్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, సీటింగ్ లేఅవుట్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ రోడ్లపై పరుగులు పెట్టేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ పెట్రోల్ ఇంజన్ బేస్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షలుగా ఉంది. మొదటి 25.000 బుకింగ్‌లకే మాత్రమే ఈ ధరకు కారును అమ్ముతామంటూ మహీంద్రా చెబుతోంది. మిగిలిన వేరియంట్లకు సంబంధించి చిప్సెట్లతో పాటు కార్ల తయారీలో ఉపయోగించే కాంపోనెంట్ల ధరలు పెరగడంతో వరుసగా ఒక్కో ఆటోమోబైల్ సంస్థ ధరలు పెంచుకుంటూ పోతుంది. మహీంద్రా సైతం ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మహీంద్రా ఎక్స్‌యూవీకి సంబంధించి తొలి 25,000 మంది కస్టమర్లకు ముందుగా ప్రకటించిన ధరకే వాహనాలను అమ్మనుంది. చదవండి : మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్ -
అక్టోబరులో గూర్ఖా... ధర ఎంతంటే ?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఎస్యూవీ కొత్త వెర్షన్ ధరను ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.13.59 లక్షల నుంచి ప్రారంభం. రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అక్టోబరు 15 తర్వాతి నుంచి డెలివరీలు మొదలు కానున్నాయి. ఇవి ఫీచర్స్ గూర్ఖా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 2.6 లీటర్ 91 బీహెచ్పీ మెర్సిడెస్ డిరైవ్డ్ కామన్ రైల్, డైరెక్ట్ ఇంజెక్షన్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, 5 స్పీడ్ మెర్సిడెస్ జి–28 ట్రాన్స్మిషన్, రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఆరు రంగుల్లో లభిస్తుంది. టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో స్టీరింగ్, 500 లీటర్ల బూట్ స్పేస్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, వైపర్స్‌తో సింగిల్ పీస్ రేర్ డోర్, పూర్తి మెటల్ టాప్‌తో తయారైంది. చదవండి : దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్! -
ఫోర్స్ గూర్ఖా... ప్రత్యేకతలు ఇవే
ఆఫ్‌రోడ్ రైడింగ్‌లో స్పెషల్ వెహికల్‌గా ఫోర్స్ సంస్థ నుంచి వస్తున్న గూర్ఖా సెప్టెంబరు 27 నుంచి బుకింగ్స్ మొదలతువున్నాయి. మహీంద్రా థార్‌కి పోటీగా వస్తున్న గూర్ఖా ఫీచర్లు ఇలా ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టూఐర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం బ్లాక్ థీమ్‌తో ఇంటీరియర్ రూపొందించారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలు వర్క్ చేస్తాయి. డ్రైవర్ డిస్ప్లేను సెమి డిజిటల్‌గా అందించారు 2.6 ఫోర్ సిలిండర్ బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్ ఇంజన్ అమర్చారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. గూర్ఖా ఇంజన్ 90 బీహెచ్పీతో 250 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది రెడ్, గ్రీన్, వైట్ , ఆరెంజ్, గ్రే రంగుల్లో లభిస్తుంది చదవండి : టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ -
‘జియో నెక్ట్స్ ’లాంఛింగ్ వాయిదా! మార్కెట్లోకి వచ్చేది అప్పుడే?
ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో నెక్ట్స్ లాంఛింగ్ వాయిదా పడింది. రిలయన్స్ వార్షిక సమావేశంలో వినాయక చవికి తమ ఫోన్‌ను లాంఛ్ చేస్తామని ఆ కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. దీపావళికి అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు అందించే ఫోన్‌గా జియో నెక్ట్స్ గురించి ప్రచారం జరిగింది. టెక్ దిగ్గజం గూగుల్, ఇంటర్నెట్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో సంస్థల భాగస్వామ్యంలో వస్తోన్న తొలి ఫోన్‌గా దీనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సెప్టెంబరు 10న వచ్చే వినాయక చవితిన ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపారు. అయితే ఈ ఫోన్ విడుదలని దీపావళికి వాయిదా వేశాయి గూగుల్ , జియో సంస్థలు. మరింత ఆకర్షణీయంగా గూగుల్ అందిస్తోన్న అనేక అధునాత ఫీచర్లను జియో నెక్ట్స్ ఫోన్లో పొందు పరిచారు. ఇప్పటికే ఈ ఫోన్ పనితీరురు పరిశీలిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో చిప్సెట్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో సెప్టెంబరు 10 మార్కెట్లోకి తేవడం కంటే కొంత సమయం తీసుకుని దీపావళికి రిలీజ్ చేయడం బెటర్ అని రెండు కంపెనీలు భావించాయి. దీంతో లాంఛింగ్‌కి ఒక రోజు ముందే వాయిదా నిర్ణయాన్ని ప్రకటించాయి. ఎదురు చూపులు జులైలో రిలయన్స్ వార్షిక సమావేశం జరిగినప్పటి నుంచి నెక్ట్స్ ఫోన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనీసం పది కోట్ల మందికి నెక్ట్స్ ఫోన్‌ను అందివ్వడం తమ లక్క్ష్యమని ముఖేశ్ అంబాని ప్రకటించారు. అందుకు తగ్గట్టే కేవలం రూ.500 చెల్లిస్తే చాలు మిగిలిన సొమ్ము ఈఎంఐలో చెల్లించండి అంటూ అనేక ఆర్థిక సంస్థలు ఫైనాన్స్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇక ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఫోన్ లాంఛింగ్ వాయిదా పడింది. చదవండి : Realme: ఫెస్టివల్ సీజన్.. టార్గెట్ బిగ్‌సేల్స్! -
దళితబంధు లబ్ధిదారులు: ఆ 15 మంది ఎవరు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళితబంధు పథకాన్ని సోమవారం(నేడు) ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలుత ఎంపిక చేసిన 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు. అయితే ఈ లబ్ధిదారుల వివరాలను అధికారులు, నేతలు వెల్లడించడంలేదు. పాత్రికేయులు ఎంత ప్రశ్నించినా ఎవరూ నోరు మెదపడం లేదు. అనర్హులను జాబితాలో చేర్చారంటూ పలువురు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా లబ్ధిదారుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. లబ్ధిదారుల పేరిట కొందరు ప్రభుత్వ ఉద్యోగులను పథకానికి ఎంపిక చేశారంటూ శుక్రవారం ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై కలెక్టర్ కర్ణన్, సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతవరకూ ఎలాంటి జాబితా ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే శనివారం నాటికే 15 మంది లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారని తెలిసింది. ఈ విషయాన్ని లబ్ధిదారులకు కూడా తెలియపరచకపోవడం గమనార్హం. సోమవారం ఉదయమే వారికి ఈ విషయం వెల్లడిస్తారని సమాచారం. దళితుల జీవనప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వారిని ఎంటర్‌ప్రెన్యూయర్లుగా తీర్చిదిద్దేందుకు హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘దళితబంధు’పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసింది. పథకంపై ఎలాంటి అపోహలు వద్దని, క్రమంగా అర్హులందరికీ అందజేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. -
Ola Electric Scooter:వచ్చేసిందోచ్... ఓలా.. ఆసక్తికరమైన ఫీచర్లు ఇవే
హైదరాబాద్: నెల రోజులుగా ఊరిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ధర గురుంచి నేడు తెలిసిపోయింది. పెట్రోలు ధరల బాదుడు నుంచి ఉపశమనం కలిగించే ఈ స్కూటర్ ను సొంతం చేసుకోవాలంటే ఎంత సొమ్ము చెల్లించాలనే విషయం వెల్లడైంది. ఓలా వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. S1, S1 Pro ప్రొ పేరుతో ఓలా రెండు మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొనివచ్చింది. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మోడల్ ధర రూ.99,999గా ఉంటే ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1,29,999గా నిర్ణయించారు. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఓలా ఎలక్ట్రిక్ లాంఛింగ్ ఈవెంట్లో ఈ వివరాలు వెల్లడించారు. . ఔరా అనిపిస్తున్న ఓలా - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1, S1 ప్రో అనే రెండు విభిన్న వేరియంట్లలో విడుదల అయ్యింది. - S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 50-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ఎల్ఈడీ లైటింగ్ అధునాత ఫీచర్లు అందిస్తోంది. - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పది రంగుల్లో లభిస్తోంది. - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90, ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిమీల దూరం వెళ్లనుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుంది. - ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 115 కి.మీ. ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కి.మీ. దూరం వెళ్లనుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సెకన్లలో 0-40 కిమీ/గం చేయగలదని పేర్కొంది. - స్కూటర్ ఎస్1లో 7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఇది 3 జీబీ ర్యామ్‌తోపాటు ఆక్టా కోర్ చిప్సెట్తో పనిచేస్తుంది. - ప్రత్యేక అప్లికేషన్ ఉపయోగించి స్కూటర్‌ను ఆటోమేటిక్‌గా లాక్, లేదా అన్‌లాక్ చేయవచ్చు. - ఓలా ఎస్1 లోకల్ నావిగేషన్ అప్లికేషన్‌తో వస్తుంది. - ఓలా స్కూటర్ 3.9 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 8.5 కిలోవాట్ పీక్ పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ కు పవర్ అందిస్తుంది. - ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 18 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. - లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ను సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. కోటి స్కూటర్ల తయారీ - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హోం డెలివరీ పద్దతిలో కస్టమర్లకు అందివ్వనున్నారు. ఇప్పటికే టెస్లా ఇదే పద్దతిలో తన కార్ల అమ్మకాలు చేపడుతోంది. ఆన్లైన్లో స్కూటర్ బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. షోరూమ్‌ల వ్యవస్థ ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టే. - 2021 ఫిబ్రవరిలో మొదటి స్కూటర్ని తయారు చేయడం ప్రారంభించగా ఫస్ట్ స్కూటర్ తయారీకి ఆరు నెలల సమయం పట్టింది. - తమిళనాడులో ఉన్న ఓలా మెగా ఫ్యాక్టరీలో స్కూటర్లు తయారవుతున్నాయి. ప్రారంభ దశలో ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసే అవకాశం ఉంది. గరిష్టంగా ఏడాదికి కోటి స్కూటర్ల తయారీ లక్క్ష్యంగా ఇక్కడ విస్తరణ పనులు జరుగుతున్నాయి. - స్కూటర్ సింపుల్ వన్, బజాజ్ చేతక్, ఏథర్ 450X, TVS iQubeలు ఓలా కంటే ముందే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మార్కెట్లో ఉన్నాయి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Micromax in 2b: అదిరిపోయే ఫీచర్లు... అతి తక్కువ ధరలో..
దేశీ బ్రాండ్‌గా ఒకప్పుడు ఇండియా మార్కెట్లో హవా చెలాయించిన మైక్రోమ్యాక్స్ మళ్లీ పట్టు కోసం ప్రయత్నిస్తోంది. తనదైన శైలిలో అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్ తెస్తోంది. హ్యాంగ్ ఫ్రీ గతేడాది మైక్రోమాక్స్ ఐఎన్ 1బీ మోడల్ని మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ విడుదల చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మైక్రోమ్యాక్స్ ఐన్ 2బీని రిలీజ్ చేస్తోంది. ఐఎన్ 2బీ ఫోన్ పెర్ఫామెన్స్ స్మూత్‌గా ఉంటుందని, హ్యంగ్ ఫ్రీ ఫోన్ అంటూ మైక్రోమ్యాక్స్ క్లయిమ్ చేసుకుంటోంది. ఈ మొబైల్లో యూనిసాక్ టీఎ610 చిప్సెట్ని మైక్రోమ్యాక్స్ ఉపయోగిస్తోంది. ధర ఆడ్రాంయిడ్ 11 వెర్షన్‌పై ఐన్ 2బీ మోడల్ ఫోన్ పని చేస్తుంది. ఈ మొబైల్‌ను 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌లు 64 జీబీ స్టోరేజీ వేరియంట్లుగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో 4 జీబీ వేరియంట్ మొబైల్ ధర రూ. 7,000లు ఉండగా 6 జీబీ ర్యామ్ మొబైల్ ధర రూ. 8,999లుగా ఉంది. ఆగస్టు 4న ఫ్లిప్‌కార్ట్ వేదికగా 2బీ మొబైల్ లాంచ్ చేయనుంది మైక్రోమ్యాక్స్. బిగ్ బ్యాటరీ మైక్రోమ్యాక్స్ 2బీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీంతో 15 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్, 20 గంటల బ్రౌజింగ్ టైమ్‌ని అందిస్తోంది మైక్రోమ్యాక్స్. అంతేకాదు ఈ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ ఫింగర్ ప్రింట్స్కానర్ ఈ మొబైల్లో పొందు పరిచారు. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్లలో ఈ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌కెమెరా, వెనుక వైపు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు రెండు అమర్చారు. 6.5 అంగులాల వాటర్ డ్రాప్ నాచ్ హెడ్డీ డిస్ప్లేని అమర్చింది. -
‘సోలార్’ కేరాఫ్ హైదరాబాద్
దక్షిణ భారత దేశంలో సోలార్ పవర్ ఉత్పత్తికి హైదరాబాద్ కీలక కేంద్రం కానుంది. నగరానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ భారీ ఎత్తున సోలార్ పరిశ్రమకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయనుంది. దీనికి సంబంధించిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. 1.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ సెల్, మ్యాడ్యుల్ తయారీ పరిశ్రమని 2021 జులై 19న హైదరాబాద్ నగరంలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ప్రారంభించబోతుంది. రూ. 483 కోట్ల వ్యయంతో ఈ తయారీ యూనిట్‌ను నెలకొల్పారు. ఇందులో 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల మాడ్యుల్స్ తయారీ సామర్థ్యంతో కంపెనీ పని చేయనుంది. అధునాతన మల్టీక్రిస్టలీన్, మోనో పీఈఆర్సీ టెక్నాలజీని ఈ యూనిట్లో ఉపయోగించనున్నారు. రాబోయే రోజుల్లో మరో రూ. 1200 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సోలార్ మాడ్యుల్ తయారీ యూనిట్‌ని విస్తరిస్తామని ప్రీమియర్ ఎనర్జీస్ తెలిపింది. విస్తరణ తర్వాత సంస్థ సోలార్ మాడ్యుల్ తయారీ సామర్థ్యం 3 గిగావాట్లకు చేరుకుంటుందని ప్రీమియర్ ఎనర్జీస్ ఎండీ చిరంజీవ్ సలూజా తెలిపారు. ఈ ఆర్థిక సంవ్సతరానికి రూ.1500 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతకు ముందు ఏడాది కంపెనీ రెవెన్యూ రూ. 850 కోట్లగా నమోదు అయ్యిందని ఆయన అన్నారు. -
రాష్ట్రానికి మేలు జరిగేలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాల తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా పార్టీ పెడుతున్నామని వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో మహానేత వైఎస్ఆర్ జయంతి రోజైన ఈ నెల 8న పార్టీని స్థాపించబోతున్నట్లు తెలిపారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఆమె టీం వైఎస్ఎస్ఆర్.కామ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. నూత న రాజకీయ పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలోని వైఎస్ఆర్ అభిమానులు, నేతలు, సోషల్ మీడియా వారియర్స్ కోసం ప్రత్యేకించి ఈ వెబ్‌సైట్‌ను రూ పొందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ముందుగా అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృ ద్ధి, సంక్షేమం కోసం రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తేవడమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్లు చెప్పారు. కార్యాలయం ముట్టడికి సీమ రైతుల యత్నం వైఎస్ షర్మిల కార్యాలయాన్ని ముట్టడించేందుకు అమరావతి పరిరక్షణ సమితి యత్నించింది. బుధవారం లోటస్‌పాండ్‌లోని ఆమె కార్యాలయానికి ఆ కమిటీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ తన అనుచరులతో వచ్చి కృష్ణా జలాల విషయంలో షర్మిల స్పష్టమైన వైఖరి తెలపాలంటూ ఆందోళన చేపట్టడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. -
POCO: పోకో నుంచి 5 జీ స్మార్ట్‌ఫోన్
5 జీ నెట్వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే వరుసగా 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. తాజాగా తక్కువ ధరలో హై ఎండ్ ఫోన్లు అందించే పోకో సైతం కొత్త మోడల్‌ను సిద్ధం చేసింది. పోకో ఎం 3 ప్రో పేరుతో కొత్త మొబైల్‌ని రేపు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు చేయనుంది. జూన్ 8న పోకో ఎం 3 పప్రోను తొలుత ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కోవిడ్ కల్లోకం కారణంగా రద్దయ్యింది. గత వారమే ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. జూన్ 8న ఉదయం 11:30 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయి. ఆకట్టుకునే ఫీచర్లు కష్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఫీచర్లను జత చేసింది పోకో సంస్థ. ఫోన్ వెనుక వైపు కర్వ్డ్ త్రీడీ గ్లాసీ ఫినిష్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది. ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను యాడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే మూడు కెమెరాలను వెనుక వైపు ఇచ్చారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. 18 వాట్ స్పీడ్ ఛార్జర్‌తో వచ్చే ఈ ఫోన్ బ్యాటరీ రెండు రోజుల వరకు డ్రైయిన్ అవదని పోకో హామీ ఇస్తోంది. -
రాయల్ లుక్‌లో రాజస్థాన్ రాయల్స్..
జైపూర్: ఐపీఎల్-2021 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు నూతన జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఇందుకోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి, ముందుగా ఓ వీడియో మాంటేజ్‌ను ప్లే చేశారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు త్రీడీ ప్రొజెక్షన్స్ రూపంలో కొత్త జెర్సీల్లో కనువిందు చేశారు. ఇప్పటివరకు జరిగిన జెర్సీ లాంచింగ్ ప్రోగ్రామ్స్‌లో ఇది అత్యద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న రాజస్థాన్ జట్టు.. ఈ నెల 12న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. కాగా, ఏప్రిల్ 9న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఢీకొంటుంది. చదవండి: రూల్ ప్రకారం అతను నాటౌట్.. అదనంగా 5 పరుగులు కూడా -
‘గ్రామీణ భారతంలో చారిత్రక ఘట్టం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు ప్రాపర్టీ కార్డులను అందించే స్వమిత్వ పథకం గ్రామీణ భారతాన్ని సమూలంగా మార్చే చారిత్రక ఘట్టం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వమిత్ర పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రాపర్టీ కార్డుల ద్వారా లబ్ధిదారులకు తమ ఆస్తులపై బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. దశాబ్దాలుగా గ్రామాల్లో నిరుపేదలు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వం రెండు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందచేసిందని చెప్పుకొచ్చారు. కాగా స్వమిత్వ పథకం ద్వారా లక్ష మంది ఆస్తిదారులు తమ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఎస్ఎంఎస్ లింక్ ద్వారా తమ ప్రాపర్టీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాపర్టీ కార్డులను లబ్ధిదారులకు అందచేస్తాయని పేర్కొంది. చదవండి : అసెంబ్లీ ఎన్నికలు : మోదీ, షా కీలక భేటీ -
మార్కెట్లోకి ‘కొడాక్ సీఏ సిరీస్’ టీవీలు
న్యూఢిల్లీ: గూగుల్ సర్టిఫికేట్ పొందిన అండ్రాయిడ్ టెలివిజన్లలో అత్యంత చౌక ధరలకే కొడాక్ తన కొత్త తరం టీవీలను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఈ బ్రాండ్ విక్రయానికి లైసెన్సు కలిగి ఉన్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీపీఎల్).. ‘కొడాక్ సీఏ సిరీస్’ పేరిట వీటిని సోమవారం మార్కెట్లోకి విడుదలచేసింది. డాల్బీ విజన్, 4కే హెచ్డీఆర్10, ఆండ్రాయిడ్ 9.0 ఇంటర్ఫేస్, డీటీఎస్ ట్రూసరౌండ్ కలిగిన డాల్బీ డిజిటల్ ప్లస్, యుఎస్బీ 3.0, బ్లూటూత్ వీ5.0 (తాజా వెర్షన్), అమెజాన్ ప్రైమ్ వంటి ఆప్షన్లు కలిగిన యూజర్ ఫ్రెండ్లీ రిమోట్ వంటి అధునాతన ఫీచర్లు కొత్త సిరీస్‌లో ఉన్నాయి. 43, 50, 55, 65 అంగుళాల సైజుల్లో టీవీలు లభిస్తుండగా.. ప్రారంభ ధర రూ. 23,999, హై ఎండ్ రూ. 49,999కే లభిస్తున్నట్లు ఎస్పీపీఎల్ డైరెక్టర్, సీఈఓ అవనీత్ సింగ్ మార్వ్ ప్రకటించారు. మార్చి 19 నుంచి ఈ సీరిస్ టీవీలు ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉండనున్నాయి. -
ఒంగోలులో నిధి అగర్వాల్ సందడి
-
రూ.200 కంటే తక్కువకే వెయ్యి ఉత్పత్తులు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజ రిటైలర్ ఐకియా స్టోర్, రేపే భారత్‌లో లాంచ్ కాబోతుంది. తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేసేందుకు ఐకియా సిద్ధమైంది. స్థానిక వనరుల నిబంధనలతో ఐకియా ఇండియా స్టోర్ లాంచింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పాటు తమ కార్యకలాపాల్లో సుమారు 30 శాతం, స్థానిక ముడి సరుకులనే వాడనున్నట్టు ఐకియా తెలిపింది. దేశీయ వినియోగదారుల అన్ని అవసరాలను అందిపుచ్చుకోవడం, ధరల్లో మార్పులు చేపట్టడం, వివిధ ప్రొడక్ట్‌లను ఆఫర్ చేయడం వంటివి చేపట్టనున్నట్టు ఐకియా పేర్కొంది. హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్న ఐకియా తొలి స్టోర్ హైటెక్ సిటీ, రాయ్‌దుర్గ్, శేరిలింగంపల్లి మండలం, సర్వే నెంబర్. 83/1, ప్లాట్ నెంబర్. 25,26, రంగారెడ్డి జిల్లాలో ఉంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో ఐకియా హైదరాబాద్ స్టోర్ తెరిచి ఉంచుతారు. 13 ఎకరాల కాంప్లెక్స్‌లో ఏర్పాటైన ఈ స్టోర్‌కు ఏడాదికి 60 లక్షల మంది విచ్చేసే అవకాశముందని తెలుస్తోంది. 4 లక్షల చదరపు అడుగుల ఈ షోరూంలో 7500 ఉత్పత్తులను ఆఫర్ చేయబోతుంది. వీటిలో వెయ్యికి పైగా ఉత్పత్తుల ధర రూ.200 కంటే తక్కువే. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, గుర్గామ్ ప్రాంతాల్లో కూడా ఐకియా స్టోర్ ఏర్పాటు కోసం ఆ కంపెనీ భూమిని కొనుగోలు చేసింది. సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, పుణే ప్రాంతాలకు ఈ స్టోర్‌ను విస్తరించనుంది. 2025 నాటికి 25 స్టోర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. బెడ్స్, కుర్చీలు, కుక్వేవ్, కర్టైన్లు, టేబుల్స్, లైటింగ్, కిచెన్ ట్రోలీ, ఓవెన్స్, హ్యాంగర్స్ వంటి పలు ప్రొడక్ట్‌లను ఈ స్టోర్ ఆఫర్ చేయనుంది. అర్బన్‌క్లాస్ అనే యాప్‌తో కూడా ఐకియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కార్పెంటర్స్ వంటి పలువురు సర్వీసు ప్రొవైడర్లకు వినియోగదారులను కనెక్ట్ చేయనుంది. ఈ స్టోర్‌లో వెయ్యి సీట్ల రెస్టారెంట్ కూడా ఉంది. ప్రతి రోజూ ఉదయం తొమ్మిదన్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ఈ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో సగం వెజిటేరియన్‌కు సంబంధించినవే. ఇడ్లీ, సమోసా, వెజిటేబుల్ బిర్యానీ వంటి వెజిటేరియన్ ఫుడ్‌నూ ఆఫర్ చేయనుంది. 50 శాతం భారతీయులు ఫుడ్‌నే ఎక్కువగా ఇష్టపడతారని, అందుకే రెస్టారెంట్‌ను కూడా ఆఫర్ చేస్తున్నట్టు ఐకియా ఇండియా డిప్యూటీ కంట్రీ మేనేజర్ పట్రిక్ ఆంటోనీ చెప్పారు. ఐకియా ఇండియా స్టోర్ వచ్చే ఏడాది ఈ-కామర్స్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. నగరాల్లో ఆన్లైన్ సేల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. ముంబైలో ఈ ఈ-కామర్స్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది. స్మాలాండ్, క్రెష్‌లను కూడా ఐకియా హైదరాబాద్ లాంచ్ చేయనుంది. వీటితో షాపర్లు తమ పిల్లలతో ఎంతో సురక్షితంగా షాపింగ్ చేసుకోవచ్చు. -
మెగా హీరోను లాంచ్ చేయనున్న అవసరాల
విభిన్న దర్శకుడు అవసరాల శ్రీనివాస్ స్టైలే వేరు. ఆ విషయం అతని గత సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా కథను నడిపించే విధానం, కథనం అన్నింట్లోనూ తన మార్క్ కనిపిస్తుంది. డైరెక్టర్‌గా కొనసాగుతూనే నటుడిగానూ బిజీగా ఉన్నారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం అవసరాల మెగా కాంపౌండ్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను అవసరాల శ్రీనివాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ (సాయి ధరమ్‌తేజ్ సోదరుడు), అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. అవసరాల టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే మెగాస్టార్ చిరంజీవి అతనికి అవకాశం ఇచ్చినట్లు మెగా కాంపౌండ్ చెబుతోంది. ఈయన సినిమాలు సగటు ప్రేక్షకుడికి నచ్చుతాయి. రొమాంటిక్ కామెడీలను తెరకెక్కించటంలో తనదైన ముద్ర వేసిన అవసరాల వైష్ణవ్ కోసం ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడన్న ఆసక్తి నెలకొంది. అంతేకాదు చిరు చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్( చిరు చిన్న కూతురు శ్రీజ భర్త)తో కూడా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా ఉండబోతోందన్న ప్రచారం జరుగుతోంది. -
‘కాలేజ్ పోరగాళ్లు’ సినిమా చిత్రీకరణ
మంచిర్యాలఅర్బన్ : సింగరేణి కార్మికుల పిల్లలు హైదరాబాద్‌కు పై చదువులకు వెళ్లి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నారా లేదా అనే అంశంతో మంత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న కాలేజ్ పోరగాళ్లు సినిమా చిత్రీకరణ మంగళవారం పట్టణ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. దర్శకుడు, నిర్మాత, కథ మాటల రచయిత అన్నం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ఏసీపీ గౌస్‌బాబా క్లాప్ కొట్టారు. మరో నాలుగు రోజుల పాటు మంచిర్యాల గోదావరి నది, క్వారీ తదితర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు అన్నం చంద్రశేఖర్ తెలిపారు. -
జియో కొత్త సర్వీసులు.. ఈ ఏడాది తర్వాతనే
టెలికాం రంగంలో సంచలనాలు సష్టిస్తున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఈ ఏడాది తర్వాత మరో ఎత్తుగడకు ప్లాన్ చేస్తోంది. సొంత యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులను ఈ ఏడాది తర్వాత ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. రిలయన్స్ జియో క్యాబ్స్‌గా వీటిని నామకరణం చేయనుందట. ఏప్రిల్ లోనే లాంచ్ చేద్దామనుకున్న ఈ సర్వీసులను మరికొన్ని నెలలు ఆలస్యంగా కమర్షియల్‌గా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుందని ఫాక్టర్ డైలీ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ సర్వీసులను ప్రారంభించేందుకు ఇప్పటికే కంపెనీ మహింద్రా, హ్యుందాయ్ వంటి వాటితో సంప్రదింపులు చేస్తుందని తెలుస్తోంది. 600 కార్లను కూడా ఆర్డర్ చేసిందట. తొలుత బెంగళూరు, చెన్నైలో వీటిని ప్రారంభించి, అనంతరం ఈ సర్వీసులను ఢిల్లీ, ముంబాయిలకు విస్తరిస్తుందని ఫాక్టర్ డైలీ పేర్కొంది. అదేసమయంలో చిన్న మార్కెట్లలో కూడా తన సర్వీసులను ప్రారంభిస్తుందట. జియో ఇటీవలనే టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. జియో కష్టమర్లు ఇకపై ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా చెల్లింపులు జరుపుకునేలా ఈ భాగస్వామ్యం సహకరించనుంది. టెలికాం రంగంలో ఉచిత ఆఫర్లతో దూసుకెళ్తున్న జియో తన కస్టమర్ల బేసిస్‌ను కూడా 10 కోట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. -
పతంజలికి హిందూస్తాన్ యూనిలివర్ కౌంటర్
ముంబాయి : ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో మరో యుద్ధానికి తెరలేవబోతుంది. 1980లో నెలకొన్న వీల్ వర్సెస్ నిర్మా యుద్ధానికి సీక్వెల్‌గా దేశీయ దిగ్గజ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ హిందూస్తాన్ యూనిలివర్, ఆయుర్వేదిక్ ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకుపోతున్న పతంజలితో పోటీకి సిద్ధమైంది. పతంజలికి కౌంటర్‌గా తను కూడా ఆయుర్వేద పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లను లాంచ్ చేయాలని హిందూస్తాన్ యూనిలివర్ నిర్ణయించింది. టూత్‌పేస్ట్, స్కిన్ కేర్ నుంచి సోప్స్, షాంపుల వరకు దాదాపు 20 ఉత్పత్తులను ప్రస్తుత ఆయుర్వేద బ్రాండు ఆయుష్‌లో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. ప్రీమియం బ్రాండుగా ఆయుష్‌ను హెచ్‌యూఎల్ 2001లో ప్రారంభించింది. కానీ 2007లో దాన్ని ప్రాబల్యం కోల్పోయింది. ప్రస్తుతం ఆయుష్కు తన స్థానాన్ని తిరిగి తీసుకురావాలని హిందూస్తాన్ యూనిలివర్ నిర్ణయించింది. ఈ బ్రాండుపై విడుదల చేసే ఆయుర్వేద ఉత్పత్తులను ధరలు రూ.30 నుంచి రూ.130 పరిధిలో ఉండేలా కంపెనీ ప్లాన్ చేసింది. దశాబ్ద కాలంలోనే మార్కెట్లోకి దూసుకుపోయిన పతంజలి రూ.5000 కోట్ల కంపెనీగా అవతరించింది. అయితే హెచ్‌యూఎల్‌కు రూ.30,000కు పైగా రెవెన్యూలు వస్తుంటాయి. ఎఫ్ఎమ్సీజీ దిగ్గజాలను పడగొట్టి మార్కెట్లో దూసుకుపోవాలని పతంజలి ప్లాన్స్ వేయడంతో, దానికి కౌంటర్ ఇచ్చేందుకు హెచ్‌యూఎల్ సిద్ధమైంది. దీంతో 2017లో ఎఫ్ఎమ్సీజీ విభాగంలో మరో క్లాసిక్ కార్పొరేట్ యుద్ధానికి తెరలేవబోతుందని తెలుస్తోంది. హెచ్‌యూల్ పర్సనల్ కేర్ బిజినెస్‌లు దాన్ని విక్రయాల్లో దాదాపు సగం శాతం ఉంటాయి. వాటినుంచే 60 శాతం లాభాలను కంపెనీ ఆర్జిస్తోంది. పతంజలి, హెచ్‌యూఎల్‌కు గట్టి పోటీని ఇస్తుండటంతో, ఆ కంపెనీ సైతం ప్రణాళికలు రచిస్తోంది. -
స్టైలిష్ లుక్‌లో స్కోడా ర్యాపిడ్
ఆటోమొబైల్ తయారీదారు స్కోడా తన తాజా స్కోడా ర్యాపిడ్ ను న్యూ లుక్ లో భారత మార్కెట్ లో గురువారం లాంచ్ చేయనుంది. ర్యాపిడ్ ఫేస్ లిఫ్ట్ లో పూర్తిగా అభివృద్ది చేసిన ఇంటీరియర్ అండ్ అప్డేటెడ్ డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఫోక్స్ వ్యాగన్ ప్లాట్ పాంలో ని వెంటో మోడల్ ఆధారంగానే దీన్ని రూపొందించినప్పటికీ, అప్ డేటెడ్ వెర్షన్ లో స్కోడాకు అద్భుతమైన స్టైలిష్ లుక్ జతచేసింది. స్కోడా ఆటో ఇండియా 2011 లో లాంచ్ చేసిన ర్యాపిడ్ స్కోడాను భారీ మార్పులతో మొదటి సారిగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో నేడు పరిచయం చేస్తోంది. స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిప్ట్ లో హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ డిజైన్‌తో ఆక్టావియా, సూపర్బ్ మోడల్స్ కంటే లుక్స్ లో ఆకట్టుకోనుంది. చాలావరకు స్కోడా ఫీచర్లనే పోలి ఉన్న ర్యాపిడ్ క్యాబిన్ లో కూడా భారీ మార్పులు చేసింది. హైట్ ఎడ్జస్టబుల్ సీట్, స్టీరింగ్ కోసం టిల్ట్ అండ్ టెలీ స్కోపిక్ ఎడ్జస్ట్ ఫెసిలిటీ అలాగే సెంట్రల్ హ్యాండ్ రెస్ట్ లతో పాటు టచ్ స్క్రీన్ ఆడియో సిస్టం విత్ మిర్రర్ లాక్, ప్రస్తుత వేగం, పెట్రోల్ నిల్వ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి మల్టీ ఇన్ ఫర్మేషన్ ను అందిస్తుంది. అలాగే కొత్తగా డిజైన్ చేసిన రియర్ బంపర్ , ఇండికేటర్స్ తో కూడిన కొత్త వింగ్ మిర్రర్స్, యాంటెన్నా ప్రత్యేక ఆకర్షణ. దీనిప్రారంభ ధరను రూ.8.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా కంపెనీ ప్రకటించింది. యాక్టివ్, యాంబిషన్ అండ్ స్టైల్ అనే మూడు వేరియంట్లలో వస్తున్న స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.8.27 -రూ.11. 36 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) డీజిల్ వేరియంట్ రూ.9.48 -12. 67 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉండనుంది. 1.6 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ వెర్షన్ లో 5 స్పీడ్ మాన్యుల్ ట్రాన్స్ మిషన్ ఇంజీన్ అమర్చగా, పెట్రోల్ ఇంజీన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ , డీజిల్ లో 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ డీఎస్ జీ అమర్చింది. న్యూ లుక్ లో వస్తున్న ఈ స్కోడా రాపిడ్ మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా లతో పాటు సొంత ఫోక్స్ వ్యాగన్ కు గట్టి పోటీ ఇవ్వనుంది -
అదరగొట్టే ఐఫోన్7 ఫీచర్లు ఇవేనట!
న్యూయార్క్ : యాపిల్ ఐఫోన్‌కు ఎంత క్రేజ్ అంటే... ఈ ఫోన్ కొనుకోవడమే ఓ ఫ్యాషన్‌గా భావిస్తుంటారు నేటి యువత. అలాంటి ఐఫోన్ తన కొత్త మోడల్‌తో నేడు వినియోగదారుల ముందుకు రాబోతుందట. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్లను అలరించడానికి శానిఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియం వేదికగా ఐఫోన్7 లాంచ్ కాబోతుంది. నేడు నిర్వహించబోయే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐఫోన్ 7 లాంచింగ్ ఉంటుందని యాపిల్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, నేడే ఈ ఫోన్‌ను యాపిల్ ఆవిష్కరిస్తుందని టెక్ వర్గాలు చెప్పేశాయి. అయితే ఇంత క్రేజ్ సృష్టిస్తున్న ఐఫోన్7 ఎలా ఉండబోతుందో ఓ సారి తెలుసుకుందాం... 4.7 అంగుళాల, 5.5 అంగుళాల డిస్ప్లేలతో ఐఫోన్ రెండు మోడళ్లను ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ పేర్లతో వినియోగదారుల ముందుకు యాపిల్ తీసుకు రాబోతుందట. ఐఫోన్6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్ కంటే ఇవి చాలా స్లిమ్‌గా కస్టమర్లను అలరించబోతున్నాయట. ముందస్తు ఫోన్లతో పోలిస్తే వీటిల్లో కెమెరా క్వాలిటీ పెరుగుతుందట. డ్యూయల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉండబోతున్న ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లతో రెండు వేర్వేరు ఎక్స్పోజ్యూర్లో ఫోటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త ఐఫోన్7 ప్లస్‌కు రెండు కెమెరాలు 12 ఎంపీ సెన్సార్సే ఉండబోతున్నాయట. ఐఫోన్7 కు ఒకటే 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుందని సమాచారం. రెండు కొత్త కలర్స్‌లో యాపిల్ ఈ సారి ఐఫోన్లను తీసుకురానుంది. అవి డీప్ బ్లూ, స్పేస్ బ్లాక్ వేరియంట్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరికొత్త త్రీడీ టెక్నాలజీ టచ్‌తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్ కొత్తగా ఉండబోతోందట.. ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్ దీన్ని ప్రత్యేకత. 32 జీబీ నుంచి 256 జీబీ వరకు స్టోరేజ్ సామర్థ్యంతో, వేగవంతమైన ఏ10 ప్రాసెసర్‌తో ఈ కొత్త మోడల్స్ వినియోగదారుల మందుకు వస్తున్నాయి. ఫోన్లకు, ఇతర ప్రొడక్ట్‌లకు డేటా, పవర్ ట్రాన్సఫర్ చేసుకునే విధంగా స్మార్ట్ కనెక్టర్‌ను ఈ ఫోన్లు కలిగి ఉంటాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 16 నుంచి ఈ మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తాయని, ఒక వారం నుంచి ప్రీ-ఆర్డర్లను యాపిల్ ప్రారంభిస్తుందని మార్కెట్ వర్గాల చెబుతున్నాయి వాటర్ రెసిస్టెంట్ డిజైన్, మెరుగైన స్టీరియో స్పీకర్స్, అత్యధిక బ్యాటరీ కెపాసిటీ, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్‌లు ఇవన్నీ కొత్త ఐఫోన్7లో ఉండబోతున్నాయని టాక్. స్క్రీన్కు కింద ఉన్న ఫిజికల్ టచ్ ఐడీ బటన్‌ను తొలగించి, నేరుగా బయోమేట్రిక్ కార్యాచరణతో ఇంటిగ్రేట్ చేయాలని యాపిల్ ప్లాన్ చేసిందట. మరి ధర అనుకుంటున్నారా..? అంతర్జాతీయంగా ఆపిల్-7 బేస్ మోడల్ (32జీబీ) ధరను 749 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత్ లో దీని ధర సుమారు రూ. 63వేలు ఉండే అవకాశముంది. ఈ ఫీచర్లన్నీ ఐఫోన్7లో చూడబోతున్నామో తెలుసుకోవాలంటే ఈ రాత్రి వరకు వేచిచూడాల్సిందే. -
ఉగ్రవాదంపై పొట్టి దేశం గట్టి ఆలోచన
టోక్యో: చిన్నదేశమే అయినా, అగ్రరాజ్యాలతో సమానంగా గొప్ప సాంకేతిక పరిజ్క్షానంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన జపాన్ మరో బృహత్తర కార్యక్రమానికి దిగింది. ఉగ్రవాదుల నుంచి తమ దేశ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమాచార కేంద్రాన్ని వారం రోజుల్లో ప్రారంభించనుంది. ఇటీవల ఉగ్రవాదుల దాడుల్లో తమ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ ఆలోచనను వేగవంతం చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 16, 2016న ప్రారంభించాలని జపాన్ నిర్ణయించుకుంది. కానీ, ఇటీవల ప్యారిస్ ఘటనతోపాటు అంతకుముందు ముందే ప్రకటించి మరీ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ దేశ పౌరులను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జపాన్ ఆ మేరకు చర్యలను వేగవంతం చేసింది. టోక్యోలో దీని ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరో ఇరవై దేశాల్లో కూడా తమ ప్రతినిధులను ఈ సంస్థకు అనుసంధానించి పనిచేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, ఉత్తర, పశ్చిమ ఆఫ్రికాలోని దేశాల్లో జపాన్ తన దృష్టిని నిలిపింది. ఈ సంస్థ జపాన్ విదేశాంగమంత్రిత్వ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ వివిధ దేశాల్లో ఉన్న తమ దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల అలికిడి, దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల సమాచారం అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమాచార కేంద్రం అందిస్తుంది. దీంతోపాటు ఇతర దేశాలకు కూడా తన వంతు సహాయాన్ని జపాన్ ఈ సంస్థ ద్వారా అందించనుంది.