పతంజలికి హిందూస్తాన్ యూనిలివర్ కౌంటర్ | Hindustan Unilever launching a raft of Ayurvedic products to counter Patanjali | Sakshi
Sakshi News home page

పతంజలికి హిందూస్తాన్ యూనిలివర్ కౌంటర్

Published Thu, Dec 29 2016 8:58 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

పతంజలికి హిందూస్తాన్ యూనిలివర్ కౌంటర్

పతంజలికి హిందూస్తాన్ యూనిలివర్ కౌంటర్

ముంబాయి : ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో మరో యుద్ధానికి తెరలేవబోతుంది. 1980లో నెలకొన్న వీల్ వర్సెస్ నిర్మా యుద్ధానికి సీక్వెల్గా దేశీయ దిగ్గజ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ హిందూస్తాన్ యూనిలివర్, ఆయుర్వేదిక్ ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకుపోతున్న పతంజలితో పోటీకి సిద్ధమైంది. పతంజలికి కౌంటర్గా తను కూడా  ఆయుర్వేద పర్సనల్ కేర్ ప్రొడక్ట్లను లాంచ్ చేయాలని హిందూస్తాన్ యూనిలివర్ నిర్ణయించింది. టూత్పేస్ట్, స్కిన్ కేర్ నుంచి సోప్స్, షాంపుల వరకు దాదాపు 20 ఉత్పత్తులను ప్రస్తుత ఆయుర్వేద బ్రాండు ఆయుష్లో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. ప్రీమియం బ్రాండుగా ఆయుష్ను హెచ్యూఎల్ 2001లో ప్రారంభించింది. కానీ 2007లో దాన్ని ప్రాబల్యం కోల్పోయింది. ప్రస్తుతం ఆయుష్కు తన స్థానాన్ని తిరిగి తీసుకురావాలని హిందూస్తాన్ యూనిలివర్ నిర్ణయించింది. ఈ బ్రాండుపై విడుదల చేసే ఆయుర్వేద ఉత్పత్తులను ధరలు రూ.30 నుంచి రూ.130 పరిధిలో ఉండేలా కంపెనీ ప్లాన్ చేసింది.
 
దశాబ్ద కాలంలోనే మార్కెట్లోకి దూసుకుపోయిన  పతంజలి రూ.5000 కోట్ల కంపెనీగా అవతరించింది. అయితే హెచ్యూఎల్కు రూ.30,000కు పైగా రెవెన్యూలు వస్తుంటాయి. ఎఫ్ఎమ్సీజీ దిగ్గజాలను పడగొట్టి మార్కెట్లో దూసుకుపోవాలని పతంజలి ప్లాన్స్ వేయడంతో, దానికి కౌంటర్ ఇచ్చేందుకు హెచ్యూఎల్ సిద్ధమైంది.  దీంతో 2017లో ఎఫ్ఎమ్సీజీ విభాగంలో మరో క్లాసిక్ కార్పొరేట్ యుద్ధానికి తెరలేవబోతుందని తెలుస్తోంది. హెచ్యూల్ పర్సనల్ కేర్ బిజినెస్లు దాన్ని విక్రయాల్లో దాదాపు సగం శాతం ఉంటాయి. వాటినుంచే 60 శాతం లాభాలను కంపెనీ ఆర్జిస్తోంది. పతంజలి, హెచ్యూఎల్కు గట్టి పోటీని ఇస్తుండటంతో, ఆ కంపెనీ సైతం ప్రణాళికలు రచిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement