శ్రీ కల్యాణ్‌, శశి జంటగా 'మెగా పవర్‌' సినిమా ప్రారంభం | Kiran Abbavaram Launches Mega Power Movie | Sakshi
Sakshi News home page

శ్రీ కల్యాణ్‌, శశి జంటగా 'మెగా పవర్‌' సినిమా ప్రారంభం

Published Wed, Mar 22 2023 7:58 PM | Last Updated on Wed, Mar 22 2023 8:02 PM

Kiran Abbavaram Launches Mega Power Movie - Sakshi

శ్రీ కల్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న చిత్రం  ‘మెగా పవర్‌’.గేదెల రవిచంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ప్రారంభమైంది. కిరణ్‌ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. పృథ్వీరాజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సినిమా టైటిల్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ రవిచంద్ర మాట్లాడుతూ.. మదర్‌ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈ సినిమా అని, యాక్షన్‌ సీన్స్‌ కోసం హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు.

త్వరలో ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్‌ చేస్తామన్నారు. పృథ్వీ, రఘుబాబు, మురళీశర్మ, రచ్చ రవి, రియాజ్‌, రెహమాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సురేష్‌, సంగీత ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement