5 జీ నెట్‌వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే వరుసగా 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. తాజాగా తక్కువ ధరలో హై ఎండ్ ఫోన్లు అందించే పోకో సైతం కొత్త మోడల్‌ను సిద్ధం చేసింది. పోకో ఎం 3 ప్రో పేరుతో కొత్త మొబైల్‌ని రేపు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు చేయనుంది.
జూన్ 8న
పోకో ఎం 3 పప్రోను తొలుత ఇండియా మార్కెట్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కోవిడ్ కల్లోకం కారణంగా రద్దయ్యింది. గత వారమే ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలైంది. జూన్ 8న ఉదయం 11:30 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయి.
ఆకట్టుకునే ఫీచర్లు
కష్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఫీచర్లను జత చేసింది పోకో సంస్థ. ఫోన్ వెనుక వైపు కర్వ్‌డ్ త్రీడీ గ్లాసీ ఫినిష్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను యాడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే మూడు కెమెరాలను వెనుక వైపు ఇచ్చారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. 18 వాట్ స్పీడ్ ఛార్జర్‌తో వచ్చే ఈ ఫోన్ బ్యాటరీ రెండు రోజుల వరకు డ్రైయిన్ అవదని పోకో హామీ ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment