Poco X5 Pro Launching In India Today, Know Price And Expected Specifications - Sakshi
Sakshi News home page

Poco X5 Pro 5g: వచ్చేస్తోంది.. రాక్‌స్టార్‌ చేతులమీదుగా

Published Mon, Feb 6 2023 12:56 PM | Last Updated on Mon, Feb 6 2023 1:56 PM

Poco X5 Pro Launching Today Specifications Expected - Sakshi

సాక్షి,ముంబై: పోకో ఎక్స్‌5 ప్రో ఈరోజు( సోమవారం)  సాయంత్రం విడుదలవుతోంది. సాయంత్రం 5.30 గంటలకు జరిగే లాంచింగ్‌ కార్యక్రమాన్ని కంపెనీ తమ యూట్యూబ్‌ చానెల్‌, ఫ్లిప్‌కార్ట్‌ చానెల్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనుంది. పోకో ఎక్స్‌5 ప్రో స్మార్ట్‌ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు కంపెనీ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది.

గతేడాది విడుదల చేసిన పోకో ఎక్స్‌4 ధర రూ.18,999. అయితే తాజాగా లాంచ్‌ చేయనున్నపోకో ఎక్స్‌5 ప్రో బేసి వేరియంట్‌ ధర 20 వేల లోపే ఆవిష్కరించ నుందట. అలాగే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ వేరియంట్‌  ధర  రూ. 22,999 ఉంచనుంది.  అయితే  ఐసీఐసీఐ బ్యాంకు కార్డు ద్వారా 2వేల తగ్గింపుతో 20,999 అందించనుంది.  ఫిబ్రవరి 13 నుంచి తొలి  సేల్‌ షురూ కానుంది.  

ప్రత్యేకతలు ఇవే.. (అంచనా)
ఈ  ఫోన్‌ స్పెసిఫికేషన్లలో కొన్నింటిని కంపెనీ ఇదివరకే వెల్లడించింది. పోకో ఎక్స్‌5 ప్రో 5జీ ఫోన్‌  6.67 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 778 ఎస్‌ఓసీ టెక్నాలజీతో రాబోతోంది. ఇదే టెక్నాలజీతో వచ్చిన శాంసంగ్‌, ఐక్యూ కంపెనీలకు చెందిన ఫోన్ల ధర రూ.30 వేలకు పైనే. పోకో ఫోన్‌లో 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉంటుంది. 108+8+ 2  ఎంపీ రియర్‌ కెమెరా, 120హెడ్జ్‌ ఆమోల్డ్‌ డిస్‌‍ప్లే, స్లిమ్‌ డిజైన్‌ ఉండబోతోంది. 5000 ఎంఏహచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 67 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌తో ఇది పనిచేస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement