Best 5G Mobile Phones Under Rs 20,000 In India - Sakshi
Sakshi News home page

5G Smartphones: తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్‌ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!

Published Tue, May 2 2023 8:49 AM | Last Updated on Tue, May 2 2023 9:40 AM

Affordable 5G smartphones lava poco and more - Sakshi

భారతదేశం అభివృద్ధి మార్గంలో పరుగులు పెడుతున్న వేళ స్మార్ట్‌ఫోన్ వినియోగం సర్వ సాధారణంగా మారింది. అయితే స్మార్ట్‌ఫోన్ ధరలు ఇతర మొబైల్స్ కంటే కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నాయి. కానీ తక్కువ ధరలో కావాలనుకునే వారికోసం మార్కెట్లో లభించే స్మార్ట్‌ఫోన్స్ వివరాలు ఇక్కడ చూసేద్దాం..

లావా బ్లేజ్ 5జి:
లావా కంపెనీకి చెందిన బ్లేజ్ 5జి మొబైల్ ధర మార్కెట్లో రూ. 10,999. ఇది 4 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ & 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు మొబైల్ ఆధునిక డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి 50 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ పొందుతుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆధునిక కాలంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

వివో టి2ఎక్స్ 5జి:
5జి మొబైల్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వివో టి2ఎక్స్ 5జి ఒకటి. దీని ధర రూ. 12,999. ఇవి మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి 4 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.58 ఇంచెస్ HD+ LCD స్క్రీన్, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్స్ మైక్రో సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమరా వంటివి పొందుతుంది.

(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!)

శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జి:
ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బ్రాండ్స్ లో ఒకటి శాంసంగ్. శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా విడుదలైన గెలాక్సీ ఎమ్14 5జి తక్కువ ధరలో లభించే ఉత్తమమైన మోడల్. దీని ధర రూ. 14,900. ఈ 5జి మొబైల్ 6.6 ఇంచెస్ HD డిస్ప్లే పొందుతుంది. అంతే కాకూండా ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ మరింత ఆధునికంగా ఉంటాయి.

(ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?)

పోకో ఎక్స్5 5జి:
పోకో కంపెనీకి చెందిన ఎక్స్5 5జి మొబైల్ మార్కెట్లో లభించే ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ. 18,999. ఇది 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 6.67 ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఫీచర్స్ మాత్రమే కాకుండా కెమెరా ఆప్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement