affordable smartphones
-
తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్‌ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!
భారతదేశం అభివృద్ధి మార్గంలో పరుగులు పెడుతున్న వేళ స్మార్ట్‌ఫోన్ వినియోగం సర్వ సాధారణంగా మారింది. అయితే స్మార్ట్‌ఫోన్ ధరలు ఇతర మొబైల్స్ కంటే కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నాయి. కానీ తక్కువ ధరలో కావాలనుకునే వారికోసం మార్కెట్లో లభించే స్మార్ట్‌ఫోన్స్ వివరాలు ఇక్కడ చూసేద్దాం.. లావా బ్లేజ్ 5జి: లావా కంపెనీకి చెందిన బ్లేజ్ 5జి మొబైల్ ధర మార్కెట్లో రూ. 10,999. ఇది 4 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ & 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు మొబైల్ ఆధునిక డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి 50 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ పొందుతుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆధునిక కాలంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వివో టి2ఎక్స్ 5జి: 5జి మొబైల్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వివో టి2ఎక్స్ 5జి ఒకటి. దీని ధర రూ. 12,999. ఇవి మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి 4 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.58 ఇంచెస్ HD+ LCD స్క్రీన్, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్స్ మైక్రో సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమరా వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జి: ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బ్రాండ్స్ లో ఒకటి శాంసంగ్. శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా విడుదలైన గెలాక్సీ ఎమ్14 5జి తక్కువ ధరలో లభించే ఉత్తమమైన మోడల్. దీని ధర రూ. 14,900. ఈ 5జి మొబైల్ 6.6 ఇంచెస్ HD డిస్ప్లే పొందుతుంది. అంతే కాకూండా ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ మరింత ఆధునికంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) పోకో ఎక్స్5 5జి: పోకో కంపెనీకి చెందిన ఎక్స్5 5జి మొబైల్ మార్కెట్లో లభించే ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ. 18,999. ఇది 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 6.67 ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఫీచర్స్ మాత్రమే కాకుండా కెమెరా ఆప్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. -
Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!
భారతీయ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) సిరీస్‌లో నూతన వేరియంట్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. 6జీబీ ర్యామ్, 128బీజీ స్టేరేజ్ కెపాసిటీతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. చవకైన రేంజ్లో లభించే ఈ 5జీ ఫోన్ గురించి లావా కంపెనీ గత ఏడాదిలోనే తెలియజేసింది. లావా బ్లేజ్ 5జీ ఫోన్ ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.11,499కే ఈ ఫోన్‌ను అందిస్తోంది. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్ల్యూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అలాగే అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. (ఇదీ చదవండి: టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!) లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్స్ 90హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ 2.2 గిగాహెడ్జ్ క్లాక్‌స్పీడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ మెమొరీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ 1 టీబీ వరకు పెంచుకునే ఎక్స్టర్నల్ మెమొరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అనానమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ -
అద్భుత ఫీచర్లు, చవక ధర: ఐ వూమీ మొబైల్స్
సాక్షి, న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ప్రముఖ మొబైల్ మేకర్ ఐ వూమీ సరసమైన ధరల్లో రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. మి సిరీస్‌లో భాగంగా 'మి 3', 'మి 3 ఎస్' పేరుతో భారత మార్కెట్లో శుక్రవారం ప్రవేశపెట్టింది. వీటి ధరలను వరుసగా రూ .5,499, రూ.6,499 గా నిర్ణయించింది. రెండు డివైస్‌లు 5.2 అంగుళాల ఫుల్హెచ్డీ షట్టర్ డిస్ ప్లే, (పగలని) , 64-బిట్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.0, 3000ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్స్‌గా ఉన్నాయి. 'మి 3' లో 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమరీ (128జీబీ దాకా ఎక్స్‌పాండబుల్) 8 మెగా పిక్సెల్ ముందు, వెనుక కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ ఇతర ఫీచర్లు. ‘మి 3 ఎస్ ’ లో 3 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ మెమెరీ, (128 వరకు ఎక్స్‌పాండబుల్), 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ మిస్ 3 ఎస్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు విక్రయానికి అందుబాటులోఉన్నాయి. దేశీయ మొబైల్ కస్టమర్ల జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు ఫ్లాగ్షిప్ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఆనందంగా వుందని ఐవూమీ ఇండియా సీఈఓ అశ్వన్ భండారి ఒక ప్రకటనలో తెలిపారు.