అద్భుత ఫీచర్లు, చవక ధర: ఐ వూమీ మొబైల్స్‌ | iVOOMi launches two affordable smartphones in India | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లు, చవక ధర: ఐ వూమీ మొబైల్స్‌

Published Fri, Sep 8 2017 2:17 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

అద్భుత ఫీచర్లు, చవక ధర: ఐ వూమీ మొబైల్స్‌

అద్భుత ఫీచర్లు, చవక ధర: ఐ వూమీ మొబైల్స్‌

సాక్షి, న్యూఢిల్లీ:  చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ప్రముఖ మొబైల్‌ మేకర్‌  ఐ వూమీ సరసమైన ధరల్లో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  మి సిరీస్‌లో భాగంగా   'మి 3', 'మి 3 ఎస్'  పేరుతో భారత మార్కెట్లో  శుక్రవారం  ప్రవేశపెట్టింది. వీటి ధరలను వరుసగా  రూ .5,499, రూ.6,499 గా నిర్ణయించింది.  రెండు డివైస్‌లు  5.2 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ  షట్టర్‌ డిస్‌  ప్లే,  (పగలని) , 64-బిట్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.0,   3000ఎంఏహెచ్‌ బ్యాటరీ ప్రధాన ఫీచర్స్‌గా ఉన్నాయి.
 'మి 3' లో  2జీబీ ర్యామ్‌,  16జీబీ అంతర్గత మెమరీ (128జీబీ దాకా ఎక్స్‌పాండబుల్‌) 8 మెగా పిక్సెల్‌ ముందు, వెనుక కెమెరా విత్‌  ఎల్ఈడి ఫ్లాష్ ఇతర ఫీచర్లు.
‘మి 3 ఎస్‌ ’  లో 3 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ మెమెరీ, (128 వరకు ఎక్స్‌పాండబుల్‌),  13 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా విత్‌  ఎల్ఈడి ఫ్లాష్ మిస్‌ 3 ఎస్‌  ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.  అలాగే ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు  విక్రయానికి అందుబాటులోఉన్నాయి.
దేశీయ మొబైల్‌ కస్టమర్ల జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు ఫ్లాగ్‌షిప్‌ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఆనందంగా వుందని   ఐవూమీ ఇండియా సీఈఓ అశ్వన్ భండారి ఒక ప్రకటనలో తెలిపారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement