iVOOMi
-
ఐ వూమి ఐ ప్రొ: షాటర్ ప్రూఫ్ డిస్ప్లే
సాక్షి, ముంబై: బడ్జెట్ఫోన్లకు పేరుగాంచిన హాంగ్‌కాంగ్ కంపెనీ ఐ వూమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఐ వూమి ఐ ప్రొ పేరుతో గురువారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ధర రూ.3999గా నిర్ణయించింది. 18.9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో(గో ఎడిషన్) ఆధారితంగా ఈ డివైస్ పనిచేయనుంది. షాటర్ ప్రూఫ్ డిస్ప్లే (పగలని, గీతలు పడని) ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. ప్లాటినం గోల్డ్, ఇండీ బ్లూ, మాటీ రెడ్‌కలర్ ఆప్షన్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది. అలాగే రిలయన్స్ జియో ద్వారా 2,200 క్యాష్ బ్యాక్ కూడా ఉంది. ఐ వూమి ఐ ప్రొ ఫీచర్లు 4.95 అంగుళాల తెర 480x960 పిక్సెల్స్ రిజల్యూషన్ 1.3గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ 6737 సాక్ 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 5 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!
చైనా స్మార్ట్ఫోన్ల కంపెనీ ఐవోమి తన సరికొత్త ఫోన్‌ని భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ‘ఐ2 లైట్’ పేరుతో ఈ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ నేటి(బుధవారం) నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం 6,499 రూపాయలకే బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ ఫోన్లో ఫీచర్లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5.42 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 18:9 యాక్సెప్ట్ రేషియో కలిగి ఉంది. మెయిన్‌స్ట్రీమ్ ఫోన్లు ఆఫర్ చేసే అన్ని ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. ఈ ఫోన్ టాప్ ఫీచర్ అతిపెద్ద 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లోనూ ఉన్నాయి. 1.5 గిగాహెడ్జ్ క్వాడ్ కోడ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రూపొందింది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో పాటు 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీని ఇది కలిగి ఉంది. 2 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్లలో రెండు రియర్ కెమెరాలతో పాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. పలుచైన బడ్జెట్ ఫోన్లలలో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ మెర్క్యూరి బ్లాక్, సాటన్ గోల్డ్, మార్స్ రెడ్, నెప్ట్యూన్ బ్లూ వంటి నాలుగు వేర్వేరు రంగుల్లో లభ్యం కానుందని ఐవోమి కంపెనీ తెలిపింది. -
రూ.1299లకే స్మార్ట్‌ఫోన్
సాక్షి,న్యూఢిల్లీ హాంగ్‌కాంగ్‌కు చెందిన ఐ వూమి కంపెనీ మరో బడ్జెట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో ఐవూమి వి5 పేరుతో కొత్త స్మార్ట్ఫోన్నుభారత మార్కెట్లో లాంచ్ చేసింది. జెడ్ బ్లాక్, షాంపైన్ గోల్డ్ రంగుల్లో రూ.3499 ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోల చేస్తే తక్షణం 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే జియో ద్వారా జియో ఫుట్ బాల్ ఆఫర్ కింద 2200 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అంటే జియో ఆఫర్ తరువాత 1299 రూపాయలకే ఐ వూమి వి5 స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల సొంతం కానుంది. సరసమైన ధరలో ఆధునిక టెక్నాలజీ, ఫీచర్లతో ఎంట్రీ లెవల్ డివైస్‌ను వినియోగదారులకు అందిస్తున్నామని ఐవూమి సీఈఓ అశ్విన భండారి చెప్పారు. ముఖ్యంగా పగుళ్లు, గీతలు నుంచి స్ర్రీన్కు మరింత భద్రతనిచ్చేలా షట్టర్ ప్రూష్ డిస్ప్లేని ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తున్నామన్నారు ఐవూమి వి5 ఫీచర్లు 5 అంగుళాల డిస్ప్లే 480x854 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ క్వాడ్-కోర్ స్ప్రెడ్ట్రమ్ ఎస్వోసీ 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ 128 వరకు విస్తరించుకునే అవకాశం 5 మెగాపిక్సెల్ రియర్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 2800 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఐ2 : అద్భుత ఫీచర్లు, బడ్జెట్ ధర
సాక్షి,న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఐవూమీని మంగళవారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫుల్ వ్యూ డిస్ప్లే, ఫేస్ అన్‌లాక్, 3 మిర్రర్ ఫీనిష్ లాంటి అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో ఐ2 పేరుతో ఈ డివైస్‌ను విడుదల చేసింది. 2ఏఫాస్ట్-ఛార్జ్ టెక్నాలజీతో యువ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చామని ఐవూమీ సీఈవో అశ్విన్ భండారి పేర్కొన్నారు. 7499 రూపాయల ధరలో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం. ఐ2 ఫీచర్లు 5.45-అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఎంటీకే 6739 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 3జీబీ ర్యామ్ , 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు 13+2ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుత ఫీచర్లు, చవక ధర: ఐ వూమీ మొబైల్స్
సాక్షి, న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ప్రముఖ మొబైల్ మేకర్ ఐ వూమీ సరసమైన ధరల్లో రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. మి సిరీస్‌లో భాగంగా 'మి 3', 'మి 3 ఎస్' పేరుతో భారత మార్కెట్లో శుక్రవారం ప్రవేశపెట్టింది. వీటి ధరలను వరుసగా రూ .5,499, రూ.6,499 గా నిర్ణయించింది. రెండు డివైస్‌లు 5.2 అంగుళాల ఫుల్హెచ్డీ షట్టర్ డిస్ ప్లే, (పగలని) , 64-బిట్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.0, 3000ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్స్‌గా ఉన్నాయి. 'మి 3' లో 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమరీ (128జీబీ దాకా ఎక్స్‌పాండబుల్) 8 మెగా పిక్సెల్ ముందు, వెనుక కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ ఇతర ఫీచర్లు. ‘మి 3 ఎస్ ’ లో 3 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ మెమెరీ, (128 వరకు ఎక్స్‌పాండబుల్), 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ మిస్ 3 ఎస్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు విక్రయానికి అందుబాటులోఉన్నాయి. దేశీయ మొబైల్ కస్టమర్ల జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు ఫ్లాగ్షిప్ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఆనందంగా వుందని ఐవూమీ ఇండియా సీఈఓ అశ్వన్ భండారి ఒక ప్రకటనలో తెలిపారు.