ఐ వూమి ఐ ప్రొ: షాటర్ ప్రూఫ్ డిస్‌ప్లే | iVoomi iPro Android Go Smartphone With Shatterproof Display | Sakshi
Sakshi News home page

ఐ వూమి ఐ ప్రొ లాంచ్‌ : షాటర్ ప్రూఫ్ డిస్‌ప్లే

Published Thu, Sep 20 2018 2:35 PM | Last Updated on Thu, Sep 20 2018 3:46 PM

iVoomi iPro Android Go Smartphone With Shatterproof Display - Sakshi

సాక్షి, ముంబై: బడ్జెట్‌ఫోన్‌లకు పేరుగాంచిన హాంగ్‌కాంగ్‌ కంపెనీ ఐ వూమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.  ఐ వూమి ఐ ప్రొ పేరుతో గురువారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ధర రూ.3999గా నిర్ణయించింది. 18.9 యాస్పెక్ట్‌ రేషియో, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో(గో ఎడిషన్‌) ఆధారితంగా ఈ డివైస్‌ పనిచేయనుంది.  షాటర్‌ ప్రూఫ్‌ డిస్‌ప్లే (పగలని, గీతలు పడని) ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. ప్లాటినం గోల్డ్‌, ఇండీ బ్లూ, మాటీ రెడ్‌కలర్‌ ఆప‍్షన్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది. అలాగే రిలయన్స్‌ జియో ద్వారా 2,200  క్యాష్‌ బ్యాక్‌ కూడా ఉంది. 
 

ఐ వూమి ఐ ప్రొ ఫీచర్లు
4.95 అంగుళాల తెర
480x960 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
1.3గిగాహెడ్జ్‌  క్వాడ్‌ కోర్‌ మీడియా టెక్‌ 6737 సాక్‌ 
1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌
128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం  
5 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement