సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో భారతదేశంలో పోవా-4 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదల చేసింది. రూ. 11,999 ధరతో ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 13 నుండి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ మరియు జియో మార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. క్రయోలైట్ బ్లూ, యురానోలిత్ గ్రే , మాగ్మా ఆరెంజ్ రంగులలో ఇది లభ్యం. (సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?)
స్మార్ట్‌ఫోన్లపై యూజర్ల అంచనాలకు అనుగుణంగా 15 వేల లోపు రేంజ్ 13 జీబీ ర్యామ్‌తో Helio G99 ప్రాసెసర్‌ని ఏకైక స్మార్ట్‌ఫోన్ పోవా-4ని పరిచయం చేయడం సంతోషంగా ఉందని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో అరిజీత్ తలపాత్ర అన్నారు. (ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం)
టెక్నో పోవా-4 స్పెసిఫికేషన్‌లు
6.82-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత HiOS 12.0
MediaTek Helio G99 ప్రాసెసర్
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
AI లెన్స్‌తో జతచేసిన 50 ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా
8ఎంపీ సెల్పీ కెమెరా
6000ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment