China smartphone
-
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్
GST Evasion: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో,లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు. పన్ను మొత్తం/వడ్డీ/పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షావోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్ లాంటి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ. 1,108.98 కోట్ల జీఎస్టీ, రూ. 7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జూలై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. 2019-20లో, షావెమి రూ. 653.02 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ. 46 లక్షలు మాత్రమే చెల్లించింది. కంపెనీ లోటుపై ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిందని చంద్రశేఖర్ తెలిపారు. అదే విధంగా, 2020-21లో, ఒప్పో మొబైల్ ఇండియా రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించింది. (లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్) వివో ఇండియా అదే సంవత్సరంలో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ.72 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తంగా వివో ఈ రెండేళ్లలో 2,875 కోట్ల కస్టమ్స్ డ్యూటీలను ఎగవేసినట్లు ఆరోపణలు రాగా, కేవలం రూ. 117 కోట్లను రికవరీ చేసిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ పరంగా కంపెనీ రూ.48.25 కోట్లు ఎగవేసిందని, ఎగవేతలో కొంత భాగం ఇంకా ప్రాసెస్‌లో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.51.25 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ( జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్) భారతదేశంలో మోటరోలా బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తున్న లెనోవా ఇంకా రికవరీలు నమోదు చేయనప్పటికీ, రూ. 42.36 కోట్ల జీఎస్టీ ఎగవేసిందన్నారు. ప్రధాన చైనీస్ మొబైల్ హ్యాండ్సెట్ బ్రాండ్లు భారతదేశంలో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాయని, అలాగే నేరుగా 75 వేల మందికి పైగా , అమ్మకాలు ,కార్యకలాపాలలో మరో 80,000 మందికి ఉపాధి కల్పించారని మంత్రి చెప్పారు. -
సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పోవా-4: ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి!
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో భారతదేశంలో పోవా-4 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదల చేసింది. రూ. 11,999 ధరతో ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 13 నుండి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ మరియు జియో మార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. క్రయోలైట్ బ్లూ, యురానోలిత్ గ్రే , మాగ్మా ఆరెంజ్ రంగులలో ఇది లభ్యం. (సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?) స్మార్ట్ఫోన్లపై యూజర్ల అంచనాలకు అనుగుణంగా 15 వేల లోపు రేంజ్ 13 జీబీ ర్యామ్‌తో Helio G99 ప్రాసెసర్‌ని ఏకైక స్మార్ట్‌ఫోన్ పోవా-4ని పరిచయం చేయడం సంతోషంగా ఉందని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో అరిజీత్ తలపాత్ర అన్నారు. (ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం) టెక్నో పోవా-4 స్పెసిఫికేషన్లు 6.82-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత HiOS 12.0 MediaTek Helio G99 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునే సదుపాయం AI లెన్స్‌తో జతచేసిన 50 ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా 8ఎంపీ సెల్పీ కెమెరా 6000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఐఫోన్ ఇన్స్పిరేషన్తో..బోలెడన్ని ఫీచర్లతో బడ్జెట్ ఫోన్! ధర ఎంతంటే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఇన్స్పిరేషన్తో 'రెడ్మీ నోట్ 11ఎస్ఈ' ఫోన్‌ను డిజైన్ చేసింది. అంతేకాదు ఐఫోన్లో ఉన్న ఫీచర్లు ఈ కొత్త చైనా ఫోన్లో ఉన్నాయి. ధర విషయంలో ఐఫోన్ అంత కాస్ట్లీ కాకుండా బడ్జెట్ ధరనే నిర్ణయించింది. మైక్రో ఎస్డీ స్లాట్ వరకు అప్‌గ్రేడ్ చేసుకునేలా 64జీబీ స్టోరేజ్,మీడియా టెక్ హీలియా జీ95 చిప్ సెట్‌తో వస్తుంది. రెడ్మీ నోట్ 11ఎస్ఈ స్పెసిఫికేషన్లు 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.43అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, హోల్ పంచ్ కటౌట్‌తో 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2400*1080పిక్సెల్ రెజెల్యూషన్‌తో డిస్ప్లే,ఎంఐయూఐ తరహాలో కంటిపై ఒత్తిడి తగ్గించేందుకు రీడింగ్ మోడ్ 3.0, సన్‌లైట్ మోడ్ 2.0, 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ర్యామ్ అండ్ 64జీబీ యూఎఫ్ఎస్2.2 స్టోరేజ్‌తో మీడియాటెక్ హీలియా చిప్సెట్, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది దీంతో పాటు ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా, కెమెరా యాప్‌లో నైట్ మోడ్,ఏఐ బ్యూటీఫై, ఏఐ పోట్రేట్ వంటి మోడ్లు ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్,ఏఐ ఫేస్ అన్‌లాక్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ బ్యాండ్ వైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెడ్మీ నోట్ 11ఎస్ఈ ధర 64జీబీ ర్యామ్ అండ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్మీ నోట్ 11ఎస్ ఫోన్ ధర రూ.13,499గా ఉంది. బ్లాక్,వైట్,బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇక ఈ ఫోన్ ఆగస్ట్ 31 నుంచి షావోమీ వెబ్సైట్, ఫ్లిప్ కార్ట్‌లో లభ్యం అవుతుంది. ఈ ఫోన్‌తో పాటు రెడ్ మీ నోట్ 11 రెగ్యూలర్ (రూ.13,499),రెడ్మీ నోట్ 11 టీ 5జీ (రూ.15,999),రెడ్మీ నోట్ 11 ప్రో (18,999)ఫోన్లు సైతం అందుబాటులో ఉంటాయని రెడ్ మీ ప్రతినిధులు తెలిపారు. -
ఇండియన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్, అదిరిపోయే ఫీచర్లతో!
స్మార్ట్ ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ఆయా టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే గడిచిన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో 25శాతం ఉన్న రియల్ మీ ప్రత్యర్ధి కంపెనీల కంటే దూకుడుగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు సాధించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ 'రియల్ మీ 9ఐ'ని మార్కెట్‌కి పరిచయం చేయనుంది. జనవరి 18న రియల్ మీ' ఇండియాలో నిర్వహిస్తున్న ఈవెంట్లో రియల్ మీ 9ఐ ఫోన్ తో పాటు స్పెసిఫికేషన్ల గురించి ప్రకటన చేయనుంది. ఈ వారం వియాత్నంలో జరిగిన ఈవెంట్లో రియల్ మీ సంస్థ 'రియల్ మీ 9ఐ' విడుదల చేసింది. ఈ సందర్భంగా ఫోన్ ధరతో పాటు ఫీచర్లు లీకయ్యాయి. అయితే ఇప్పుడు మనం లీకైన ఆ ఫోన్ స్పెసిఫికేషన్లతో పాటు దాని ధరెంతో తెలుసుకుందాం. రియల్ మీ 9ఐ స్పెసిఫికేషన్స్ రియల్ మీ 9ఐ 90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఎల్సీడీ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ పంచ్హోల్తో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ,పీక్ బ్రైట్ నెస్ 480 నిట్స్, పిక్సెల్ డెన్సిటీ 401పీపీఐ, పంచ్ హోల్‌తో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680, మోడెస్ట్ 4జీ ప్రాసెసర్. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంట్నల్ స్టోరేజ్‌తో పాటు గరిష్టంగా 1టీబీ మైక్రో ఎస్ కార్డ్‌తో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. మెమరీ కార్డ్ కోసం ప్రత్యేక స్లాట్‌ను అందిస్తుంది. రియల్ మీ 9ఐ ఫోన్ వెనుక 50 మెగా ఫిక్సెల్తో మూడు కెమెరాలు, 2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 గాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం యూఎస్బీ-సీ పోర్ట్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లు ఉన్నాయి. భారతదేశంలో రియల్ 9ఐ ఫోన్ ధర వియాత్నంలో రియల్ 9ఐ ఫోన్ ధర రూ.20,500 ఉండగా, భారత్‌లో ఈ వేరియంట్ ఫోన్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫోన్ ధర భారత్‌లో ఎంతుందో తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: డీఎస్ఎల్ఆర్ కెమెరా కాస్ట్ ఎంతైనా..ఫోన్లోని ఈ ఫీచర్ ముందు దిగదుడుపే! -
5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా ఉంటాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అంచనా వేస్తోంది. విక్రయాలు 14 శాతం అధికమై 17.3 కోట్ల యూనిట్లకు చేరతాయని వెల్లడించింది. జూలై–డిసెంబరు కాలంలోనే 10 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. కోవిడ్–19 పరిమితులు ఎత్తివేసిన తర్వాత జూన్ మొదలుకుని కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంది. ఆగస్ట్–నవంబర్ మధ్య అమ్మకాల హవా ఉంటుంది. చైనా తర్వాత స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి వినియోగదార్లు అప్‌గ్రేడ్ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. ఇక కొన్నేళ్లలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 20 కోట్ల మార్కును దాటనుంది. 2019లో దేశంలో 15.8 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. గతేడాది స్వల్పంగా 4 శాతం తగ్గి 15.2 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంచనాలను మించి..: సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ అంచనాలను మించి మార్కెట్ వేగంగా పుంజుకుంది. 2021 జనవరి–జూన్ కాలంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. కోవిడ్ కేసులు నియంత్రణలో ఉండి, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కస్టమర్లలో సెంటిమెంట్ బలపడుతుందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. కాగా, 2020లో 5జీ మోడళ్ల వాటా కేవలం 3 శాతమే. ఈ ఏడాది ఇది 19 శాతం వాటాతో 3.2 కోట్ల యూనిట్లను తాకనుంది. 5జీ చిప్సెట్ చవక కావడం, స్మార్ట్ఫోన్ల ధర తగ్గడంతో ఈ విభాగంలో అమ్మకాలు దూసుకెళ్లనున్నాయి. ఎంట్రీ లెవెల్లో సగటు ధర ఏడాదిలో 40 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ.15,000లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' -
చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ నయా కింగ్.. ‘ఒప్పొ’
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కొత్త లీడర్‌గా ‘ఒప్పొ’ అవతరించింది. ‘ఆర్’ సరీస్ బాగా క్లిక్ కావడం ఒప్పొకు బాగా కలిసొచ్చింది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ‘ఆర్ 9’ స్మార్ట్‌ఫోన్ (భారత్‌లో ఎఫ్ 1 ప్లస్) చైనా ప్రజలకు బాగా చేరువరుు్యంది. దీంతో కంపెనీ తొలిసారిగా క్యూ3లో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. చైనా మార్కెట్లో మంచి పనితీరు కనబరచడం కంపెనీకి అంతర్జాతీయంగా కూడా కలిసొచ్చింది. దీంతో ఒప్పొ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ విషయాలను ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తన తాజా నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ఒప్పొ కంపెనీ క్యూ3లో 2.53 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రరుుంచింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే విక్రయాల్లో 121 శాతం వృద్ధి నమోదరుు్యంది. గ్లోబల్ టాప్-5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో మరేఇతర కంపెనీ కూడా ఈ స్థారుులో వృద్ధిని నమోదు చేయలేకపోవడం గమనార్హం. -
‘హంగామా’లో షావొమి పెట్టుబడి
రూ. 165 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడి న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ, టెక్నాలజీ దిగ్గజం షావొమి.. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్లో 25 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.165 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఒక భారతీయ కంపెనీలో షావొమికి ఇదే తొలి ఇన్వెస్ట్మెంట్ కావడం గమనార్హం. భారత్‌లోని స్థానిక భాషల్లో కంటెంట్, సర్వీసుల పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడానికి ఈ పెట్టుబడులు దోహదం చేస్తాయని షావొమి వైస్‌ప్రెసిడెంట్ హ్యూగో బరా పేర్కొన్నారు. -
జియోనీ ఈలైఫ్ ఎస్...
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జియోనీ భారత మార్కెట్లోకి తన తాజా ఉత్పత్తి ఈలైఫ్ ఎస్ 5.5ను విడుదల చేసింది. రీటైల్ స్టోర్ల ద్వారా లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.22,900. కేవలం 5.5 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ ఫోన్ అయిదు అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇప్పటివరకూ ఈ అమోలెడ్ స్క్రీన్లు ఒక్క శాంసంగ్ మాత్రమే ఉపయోగించేది. ఈలైఫ్ ఎస్‌లోని మరో ప్రత్యేకత దీని మైక్రో ప్రాసెసర్. మొత్తం ఎనిమిది కోర్లు, 1.7 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో వచ్చే ఈ ప్రాసెసర్ మల్టీటాస్కింగ్‌కు, గేమింగ్‌కు బాగా ఉపయోగపడుతుందని అంచనా. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 మెగాపిక్సెళ్లు కాగా, వీడియో కాలింగ్ కెమెరా రెజల్యూషన్ కూడా 8 ఎంపీగా ఉండటం విశేషం. త్రీజీ నెట్‌వర్క్‌లోని 6 వేర్వేరు బ్యాండ్లపై పనిచేసే అవకాశముండటం వల్ల కనెక్టివిటీ బాగా ఉంటుందని అంచనా. బ్యాటరీ సామర్థ్యం 2300 ఎంఏహెచ్. జియోనీ ఇతర ఫోన్ల మాదిరిగానే దీంట్లోనూ కొన్ని మార్పులు చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘అమిగో’ను ఉపయోగించింది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఎలాంజా... మైక్రోమ్యాక్స్ కంపెనీ తాజాగా ఎలాంజా 2 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఫీచర్ల పరంగా మధ్యమశ్రేణికి చెందిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో చెప్పుకోదగ్గ అంశం టాక్‌టైమ్. బ్యాటరీ సామర్థ్యం 2000 ఎంఏహెచ్ మాత్రమే అయినప్పటికీ దీనిద్వారా 7.5 గంటల టాక్‌టైమ్, 240 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక కెమెరా రెజల్యూషన్ సంగతి చూద్దాం. ఎనిమిది మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా ఫ్లాష్‌తో కూడి ఉండటం ఒక విశేషమైతే... దీంతో 1280 బై 780 రెజల్యూషన్, ప్లేబ్యాక్ సౌకర్యం ఉండటం మరో ప్రత్యేకత. త్రీజీ, బ్లూటూత్, వైఫై, 2జీ, జీపీఎస్ వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. అన్ని రకాల ఆడియో ఫార్మాట్లనూ సపోర్ట్ చేస్తుంది. అయిదు అంగుళాల స్క్రీన్ సైజు, 1.2 గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 200 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఒక గిగాబైట్ ర్యామ్, 4జీబీల ఇంటర్నల్ మెమరీ (మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32 జీబీల దాకా పెంచుకోవచ్చు), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఎలాంజా 2 స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఇతర విశేషాలు. రూ.7000లకే మోటోరోలా - ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండెడ్ కంపెనీ, తక్కువ ధర.. ఒక మోస్తరు ఫీచర్లు... ఇవీ ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన మోటోరోలా -ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రెండు నెలల క్రితమే కొంచెం ఎక్కువ ధర కలిగిన మోటోరోలా జీ, ఎక్స్ మోడళ్లను పరిచయం చేసిన ఈ కంపెనీ తాజగా కేవలం రూ.6900లకే మోటో-ఈని అందుబాటులోకి తెచ్చింది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌ను వాడటం, మరో ప్రత్యేకత. స్క్రీన్‌సైజు 4.3 అంగుళాలు కాగా, ప్రాసెసర్ మాత్రం కొంచెం తక్కువ స్పెసిఫికేషన్ (1.2 డ్యుయెల్ కోర్) కలది. ర్యామ్ 1 జీబీ, ఇంటర్నల్ మెమరీ 4 జీబీ కాగా... మోటో ఎక్స్, జీలకు భిన్నంగా దీంట్లో మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని పెంచుకునే అవకాశం కల్పించారు. ఫ్రంట్ కెమెరా అస్సలు లేకపోవడం ఒక లోపం కాగా, ప్రధాన కెమెరా కూడా 5 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్ కలిగి ఉండటం, ఫ్లాష్ లేకపోవడం నిరాశ కలిగించే అంశాలు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు పెట్టే ఖర్చుకు ఈ ఫీచర్లు ఫర్వాలేదనిపిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 1980 ఎంఏహెచ్ మాత్రమే ఉన్నప్పటికీ ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుందని కంపెనీ చెబుతోంది. నానో కోటింగ్ కారణంగా ఈ ఫోన్ వర్షానికి తొందరగా పాడవదని కంపెనీ చెబుతోంది.