![చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ నయా కింగ్.. ‘ఒప్పొ’](/styles/webp/s3/article_images/2017/09/4/51478114793_625x300.jpg.webp?itok=zGJ_aVlM)
చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ నయా కింగ్.. ‘ఒప్పొ’
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కొత్త లీడర్‌గా ‘ఒప్పొ’ అవతరించింది. ‘ఆర్’ సరీస్ బాగా క్లిక్ కావడం ఒప్పొకు బాగా కలిసొచ్చింది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ‘ఆర్ 9’ స్మార్ట్‌ఫోన్ (భారత్‌లో ఎఫ్ 1 ప్లస్) చైనా ప్రజలకు బాగా చేరువరుు్యంది. దీంతో కంపెనీ తొలిసారిగా క్యూ3లో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. చైనా మార్కెట్‌లో మంచి పనితీరు కనబరచడం కంపెనీకి అంతర్జాతీయంగా కూడా కలిసొచ్చింది. దీంతో ఒప్పొ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నాల్గవ స్థానంలో నిలిచింది.
ఈ విషయాలను ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తన తాజా నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ఒప్పొ కంపెనీ క్యూ3లో 2.53 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రరుుంచింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే విక్రయాల్లో 121 శాతం వృద్ధి నమోదరుు్యంది. గ్లోబల్ టాప్-5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో మరేఇతర కంపెనీ కూడా ఈ స్థారుులో వృద్ధిని నమోదు చేయలేకపోవడం గమనార్హం.