GST Evasion: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్‌టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో,లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు.
పన్ను మొత్తం/వడ్డీ/పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షావోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్ లాంటి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ. 1,108.98 కోట్ల జీఎస్‌టీ, రూ. 7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జూలై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు.
2019-20లో, షావెమి రూ. 653.02 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ. 46 లక్షలు మాత్రమే చెల్లించింది. కంపెనీ లోటుపై ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిందని చంద్రశేఖర్ తెలిపారు. అదే విధంగా, 2020-21లో, ఒప్పో మొబైల్ ఇండియా రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించింది. (లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్)
వివో ఇండియా అదే సంవత్సరంలో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ.72 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తంగా వివో ఈ రెండేళ్లలో 2,875 కోట్ల కస్టమ్స్ డ్యూటీలను ఎగవేసినట్లు ఆరోపణలు రాగా, కేవలం రూ. 117 కోట్లను రికవరీ చేసిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ పరంగా కంపెనీ రూ.48.25 కోట్లు ఎగవేసిందని, ఎగవేతలో కొంత భాగం ఇంకా ప్రాసెస్‌లో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.51.25 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ( జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్)
భారతదేశంలో మోటరోలా బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తున్న లెనోవా ఇంకా రికవరీలు నమోదు చేయనప్పటికీ, రూ. 42.36 కోట్ల జీఎస్‌టీ ఎగవేసిందన్నారు. ప్రధాన చైనీస్ మొబైల్ హ్యాండ్‌సెట్ బ్రాండ్‌లు భారతదేశంలో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాయని, అలాగే నేరుగా 75 వేల మందికి పైగా , అమ్మకాలు ,కార్యకలాపాలలో మరో 80,000 మందికి ఉపాధి కల్పించారని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment