iPhone Market Share Drops And Limited To Fourth Place In Global Market Share - Sakshi
Sakshi News home page

Apple: పడిపోయిన యాపిల్‌ మార్కెట్‌! భారమంతా ఐఫోన్‌ 13 పైనే?

Published Mon, Sep 6 2021 1:14 PM | Last Updated on Mon, Sep 6 2021 6:20 PM

iPhone Market Share Drops And Limited To Fourth Place In Global Market Share - Sakshi

Apple iPhone 13: టెక్‌ దిగ్గజం యాపిల్‌కి షాక్‌​ తగిలింది. నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ఐఫోన్‌ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ట్రెండ్‌ ఫోర్స్‌ తాజా లెక్కలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

తగ్గిన అమ్మకాలు
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు సంబంధించి ట్రెండ్‌ ఫోర్స్‌ సంస్థ తాజా గణంకాలు విడుదల చేసింది. ఇందులో రెండో క్వార్టర్‌కి సంబంధించి గ్లోబల్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ అమ్మకాలు 13.7 శాతానికే పరిమితమైనట్టుగా తెలిపింది. గతేడాది ఫోన్‌ అమ్మకాలతో పోల్చితే 22 శాతం మేరకు ఐఫోన్‌ అమ్మకాలు తగ్గినట్టు ట్రెండ్‌సెట్‌ పేర్కొంది.

నాలుగో స్థానానికి
ఒక్కసారిగా ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో యాపిల్‌ సంస్థ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసినికి సంబంధించిన అమ్మకాల్లో 19 శాతం మార్కెట్‌ వాటాతో శామ్‌సంగ్‌ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 16.1 శాతం అమ్మకాలతో షావోమీ, ఒప్పోలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాటి తర్వాత 13.7 శాతం మార్కెట్‌తో యాపిల్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.1 శాతం వాటాతో వివో ఐదో స్థానంలో ఉంది. వివో సంస్థ అమ్మకాల్లో సైతం 18 శాతం తగ్గుదల నమోదైంది.

ఐఫోన్‌ 13పైనే భారం
యాపిల్‌ సంస్థ ఈ నెలాఖరు కల్లా సరికొత్త మోడల్‌ ఐఫోన్‌ 13ను రిలీజ్‌ చేయబోంది. ఇప్పటికే ఐఫోన్‌ 13 ఫీచర్లకు సంబంధించి మార్కెట్‌లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌తో పని లేకుండా లో ఎర్త్‌ ఆర్బిట్‌ టెక్నాలజీపై ఐఫోన​ 13 పని చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఐఫోన్‌ 13కి మరింత క్రేజ్‌ తెచ్చేందుకు యాపిల్‌ వాచ్‌ 7 సిరీస్‌ను సైతం రిలీజ్‌ వచ్చంటూ కథనాలు వస్తున్నాయి. మొత్తంగా పడిపోయిన మార్కెట్‌ షేర్‌ను దక్కించుకునేందుకు ఐఫోన్‌ 13పైనే ఆ సంస్థ భారం వేసింది.

చదవండి: గూగుల్‌ సెర్చ్‌లో తొలి పదం.. ఆసక్తికరమైన విషయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement