Apple Watch
-
యాపిల్ వాచ్‌తో క్యాన్సరా? కోర్టులో వ్యాజ్యం
ఐఫోన్‌తో సహా యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఇక అత్యంత ప్రీమియం యాపిల్ వ్యాచ్ల (Apple Watch) సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ వ్యాచ్ల విషయంలోనే యాపిల్ ఇప్పుడు యూఎస్‌లో వ్యాజ్యాన్ని (Lawsuit) ఎదుర్కొంటోంది. ఇది వినియోగదారులను విష రసాయనాలకు గురిచేస్తోందని, క్యాన్సర్‌తో (cancer) సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆరోపించింది.హానికర రసాయనాలువివిధ కంపెనీలకు చెందిన 22 వాచ్ బ్యాండ్లపై (వాచ్ బెల్ట్) చేసిన అధ్యయనం ఫలితంగా ఈ వ్యాజ్యం దాఖలైంది. ఇందులో 15 వాచ్ బ్యాండ్ల తయారీకి ఉపయోగించిన పదార్థాల్లో హానికర రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన “ఓషన్”, “నైక్ స్పోర్ట్”, సాధారణ “స్పోర్ట్” వాచ్ బ్యాండ్లు అధిక స్థాయిలో పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ పదార్థాలను (PFAS) కలిగి ఉన్నాయని డైలీ మెయిల్ నివేదిక అధ్యయనాన్ని ఉదహరించింది.ఈ హానికర పదార్థాలను ‘ఎప్పటికీ నిలిచిపోయే రసాయనాలు’గా పేర్కొంటారు. ఎందుకంటే ఈ రసాయనాలు పర్యావరణంలో, మానవ శరీరంలో చాలా ఏళ్లు వాటి దుష్ప్రభావాలను కొనసాగిస్తాయి. వీటితో కలిగే అనారోగ్య దుష్పరిణామాలలో పుట్టుకతో వచ్చే లోపాలు, ప్రోస్టేట్, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్, అలాగే సంతానోత్పత్తి సమస్యలు ఉన్నాయి.యాపిల్ వాదన ఇదీ..కాగా తమ వాచ్ బ్యాండ్లు 'ఫ్లోరోఎలాస్టోమర్' అనే సింథటిక్ రబ్బరు నుండి తయారవుతాయాయని, ఇది ఫ్లోరిన్ కలిగి ఉంటుంది కానీ హానికరమైన పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలు మాత్రం ఉండవని యాపిల్ సంస్థ చాలా కాలంగా వాదిస్తోంది. ఈ ఫ్లోరోఎలాస్టోమర్ సురక్షితమైనదని, ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిగా పరీక్షించినట్లు కూడా చెబుతోంది.అయితే యాపిల్ తమ వాచ్లకు వినియోగించే ఫ్లోరోఎలాస్టోమర్ ఆధారిత బ్యాండ్లు ఆరోగ్య ప్రమాదాలకు దోహదపడే ఇతర పదార్థాలతో పాటు పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను కలిగి ఉన్నాయనే వాస్తవాన్ని దాచిపెట్టిందని వ్యాజ్యంలో ఆరోపించారు.హృదయ స్పందన రేటు, నడక, నిద్ర వంటి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు యూజర్లను అప్రమత్తం చేసే హెల్త్-ట్రాకింగ్ ఉపకరణాలుగా కూడా విస్తృతంగా అమ్ముడుపోతున్న ఈ స్మార్ట్‌వాచ్‌లే క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని అధ్యయనాల్లో తేలడం ఆందోళనకరం. -
దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో తయారీ యూనిట్లను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. కర్ణాటకకు చెందిన ఏక్యూస్ గ్రూప్ యాపిల్ ఉత్పత్తుల తయారీదారుగా ఎదిగేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ట్రయిల్ స్టేజ్‌ను పూర్తి చేయనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఒకవేళ ఈ ట్రయిల్ స్టేజ్‌లో యాపిల్ నిబంధనల ప్రకారం ఏక్యూస్ గ్రూప్ ఉత్పత్తులను తయారు చేస్తే, భారత్‌లో టాటా ఎలక్ట్రానిక్స్ తర్వాతి స్థానం కంపెనీదేనని భావిస్తున్నారు. ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్ దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది.ఏక్యూస్ గ్రూప్ ప్రస్తుతం ఏరోస్పేస్ విడిభాగాలు, టాయ్స్ తయారీ రంగంలో సేవలందిస్తోంది. ఈ కంపెనీ ట్రయల్ దశను అదిగమిస్తే యాపిల్ ఉత్పత్తుల సరఫరాదారుల జాబితాలో చోటు సంపాదించిన రెండో భారతీయ కంపెనీగా నిలుస్తుంది. మ్యాక్‌బుక్ పర్సనల్ కంప్యూటర్లు, యాపిల్ వాచ్‌లు, యాపిల్ ఉత్పత్తుల విడిభాగాలను తయారు చేసే ఏకైక దేశీయ సంస్థగా అవతరించే అవకాశం ఉంది. ఏక్యూస్ ట్రయల్‌కు సంబంధించి యాపిల్ వాచ్, మ్యాక్‌బుక్ మెకానికల్ భాగాల ఉత్పత్తిని ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ ట్రయిల్‌కు సంబంధించి ఇరు కంపెనీల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి టాటా ఎలక్ట్రానిక్స్ మాత్రమే యాపిల్‌కు భారతీయ సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. ఇది ఐఫోన్లను తయారు చేస్తోంది.ఇదీ చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం!యాపిల్ కంపెనీ భారతదేశంలో 2021లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. క్రమంగా దేశంలో ఉత్పత్తిని పెంచుతోంది. దేశీయంగా ఐఫోన్ తయారీ విభాగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.20 లక్షల కోట్లు సమకూర్చింది. ఇందులో రూ.85,000 కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీంతో యాపిల్ గ్లోబల్ సప్లై చెయిన్‌లో భారతదేశం కీలకంగా మారింది. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో 14 శాతం ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. -
ఐఫోన్ 16 వచ్చేసింది..
క్యుపర్టినో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా కృత్రిమ మేథ ఆధారిత ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో 4 మోడల్స్ (ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మ్యాక్స్) ఉన్నాయి. ఐఫోన్ 16 ధర 799 డాలర్ల(సుమారు రూ.69000) నుంచి,16 ప్లస్ ధర 899 డాలర్ల(రూ.76000) నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్16లో ఐఫోన్ 15 కన్నా 30 శాతం వేగంగా పనిచేసే, 30 శాతం తక్కువ శక్తిని ఉపయోగించే 6–కోర్ ఏ18 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ల సైజు 6.1 అంగుళాల నుంచి 6.9 అంగుళాల వరకు ఉంటుంది. భారీ జనరేటివ్ మోడల్స్‌ను ఉపయోగించేందుకు అనువుగా ఐఫోన్ 16 కోసం సరికొత్త ఏ18 చిప్‌ను తయారు చేశారు. గ్లోటైమ్ పేరిట నిర్వహించిన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్, కొత్త తరం ఐఫోన్లను యాపిల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన సర్వర్లపై యాపిల్ ఇంటెలిజెన్స్ పని చేస్తుందని పేర్కొన్నారు. కస్టమైజ్ చేసుకోతగిన యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 16లో 48 ఫ్యూజన్ కెమెరా ఉంటుంది. కొత్తగా యాపిల్ వాచ్ సిరీస్ 10ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధర 399 డాలర్ల నుంచి ఉంటుంది. సెప్టెంబర్ 20 నుంచి ఇవి లభ్యమవుతాయి. -
ఉద్యోగులను తొలగించనున్న ప్రపంచ నం1 కంపెనీ.. కారణం..
ప్రపంచ నంబర్1 కంపెనీ యాపిల్ తయారుచేస్తున్న ఐఫోన్లు, వాచ్లకు ఉన్న క్రేజ్ తెలిసిందే. అలాంటి విలువైన కంపెనీలో ఉద్యోగం అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. కానీ, యాపిల్ తన ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి. యాపిల్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మీడియా కథనాల ప్రకారం.. యాపిల్ స్మార్ట్ వాచ్ డిస్ప్లే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ప్రాజెక్టును మూసేయనుంది. దాంతో కంపెనీ ఆ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వబోతుంది. కొంత కాలం క్రితమే మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్ల తయారీని కంపెనీ నిలిపేసింది. మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్లు, విజువల్స్ ఎంతో మెరుగ్గా ఉండటంతో అందరూ ‘యాపిల్ వాచ్’ కొనుగోలు చేస్తున్నారు. అయితే, డిస్ ప్లే తయారీ ఖర్చు ఎక్కువ కావడంతో యాపిల్ తన డిస్ ప్లే ఇంజినీరింగ్ టీంలో మార్పులు చేయనుందని సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా, ఆసియా ఖండాల్లోని ఆపిల్ యూనిట్లలో డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగించనుంది. అయితే సరిగ్గా ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే దానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. డిస్ప్లే డెవలప్మెంట్ ప్రాజెక్టును మూసేయడానికి ముందే ఉద్యోగులను ఇతర ప్రాజెక్టులు, కంపెనీల్లో తమకు వీలైన కొలువు వెతుక్కునేందుకు సంస్థ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. కానీ అందరికీ ఆ అవకాశం ఉండదు కాబట్టి మిగతా వారిని ఇంటికి సాగనంపేందుకు కంపెనీ సిద్ధమైనట్లు మీడియా కథనాల సారాంశం. ‘టైటన్’ను పక్కన పెట్టిన యాపిల్ యాపిల్ తన ప్రతిష్టాత్మకమైన కారు ప్రాజెక్టును ఎట్టకేలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని ఇటీవలే కథనాలు వెలువడ్డాయి. అటానమస్ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కారు విడుదల ప్రణాళికలను యాపిల్ పక్కన పెట్టింది. ఈ మేరకు గత దశాబ్దకాలంగా ‘టైటన్’ పేరిట పనిచేస్తున్న రహస్య ప్రాజెక్టుకు స్వస్తి పలికినట్లైంది. ఇదీ చదవండి: భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు గతేడాది భారీగా లేఆఫ్స్ లు ప్రకటించిన టెక్ కంపెనీలు..2024లో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీ పునర్వవస్థీకరణ, ఖర్చుల తగ్గింపు, అప్డేటెడ్ టెక్నాలజీ వినియోగం, కొత్త వ్యాపారంలోకి ప్రవేశించడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్, హెల్త్ రంగంలోని కంపెనీలు ఉద్యోగులపై వేటువేస్తున్నాయి. -
యూజర్లకు అలెర్ట్.. టెక్ దిగ్గజం యాపిల్‌కు కొత్త తలనొప్పి!
అవును. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. దీంతో ఆ కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ ఆలోచనలో పడ్డారు. వెంటనే యూజర్లకు అలెర్ట్ జారీ చేశారు. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటే ఇదే’ ఈ సామెత వినే ఉంటారు. ఇప్పుడు ఇదే అంశం టిమ్ కుక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ మార్కెట్లో యాపిల్ కంపెనీ పేరు చెప్పి.. నకిలీ ఉత్పత్తుల్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు నకిలీ రాయుళ్లు. దీంతో నకిలీ ఉత్పత్తుల నుంచి యూజర్లను అప్రమత్తం చేశారు టిమ్‌కుక్. తమ సంస్థ తయారు చేస్తున్న స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్స్లకు ఉపయోగించే ఛార్జర్ల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల స్మార్ట్ మార్కెట్లో ఫేక్ ఛార్జర్ల బెడద ఎక్కువైంది. ఫలితంగా యాపిల్ ఉత్పత్తులకు ఛార్జింగ్ వెంటనే అయిపోవడంతో పాటు బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోతున్నట్లు యాపిల్ గుర్తించింది. యూజర్లకు సూచనలు ఈ నేపథ్యంలో కస్టమర్లకు యాపిల్ సంస్థ కొన్ని సూచనలు ఇచ్చింది. యూజర్ల భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఛార్జర్లను తయారు చేస్తామని, తద్వారా ఉత్పత్తుల పనితీరు, లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు, యాపిల్ ఛార్జర్లు యాపిల్ ఎఫ్ఐ సర్టిఫైడ్ గుర్తింపుతో పాటు యాపిల్ వాచ్ బ్యాడ్జ్‌లు ఉంటాయని చెప్పింది. యాపిల్ ఛార్జర్లు ఈ రంగులోనే ఉంటాయ్ దీంతో పాటు యాపిల్ ప్రొడక్ట్‌ల కోసం కంపెనీ తయారు చేసిన ఛార్జర్లు ఏ రంగులో ఉంటాయి. మార్కింగ్, రెగ్యులేటరీ సమాచారం ఎలా ఉంటుందో వివరించింది. కుపెర్టినో (యాపిల్) కేవలం తెలుపు రంగు ఛార్జర్లనే కస్టమర్లకు అందిస్తుంది. తెలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో ఉంటే ఖచ్చింతంగా అవి ఫేక్ ఛార్జర్లేనని గుర్తించాలి. ఛార్జర్లపై యాపిల్ బ్యాడ్జి సైతం ఉంటుంది. ఒకవేళ నిజమైన ఛార్జర్లకు, నకిలీ ఛార్జర్లను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన యాపిల్.. సంస్థ తయారు చేసే ఒరిజినట్ ఛార్జర్ల సిరీస్ వివరాల్ని వినియోగదారులకు అందించింది. ఇవి మాత్రమే ఒరిజినల్ ఏ1570, ఏ1598, ఏ1647, ఏ1714, ఏ1768,ఏ1923, ఏ2055, ఏ2056,ఏ2086, ఏ2255, ఏ2256, ఏ2257, ఏ2458, ఏ2515, ఏ2652, ఏ2879లను మాత్రమేనని చెప్పింది. ‘మేడ్ ఫర్ యాపిల్ వాచ్’ నకిలీ ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ ఛార్జర్లకు యాపిల్ ఎంఎఫ్ఐ ఛార్జర్లకు పోలికలు చూడాలి. ఛార్జర్లపై ‘మేడ్ ఫర్ యాపిల్ వాచ్’ అని ఉంటుంది. ఐఫోన్, ఐపాడ్, ఐపోడ్, యాపిల్ వాచ్‌లపై ఎంఎఫ్ఐ లోగో, మ్యాగ్నెటిక్ టెక్నాలిజీతో మ్యాగ్‌సేఫ్ ఉంటుందని, వీటిని మాత్రమే వినియోగించాలని యాపిల్ సంస్థ యూజర్లకు విజ్ఞప్తి చేసింది. -
Apple: ప్రపంచ నం1 కంపెనీ వాచ్‌లపై నిషేధం!
ప్రపంచ నంబర్‌వన్ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆరోపణలు వస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే లైట్ టెక్నాలజీతో పనిచేసే యాపిల్ వాచ్ మోడళ్ల దిగుమతులను నిషేధించాలంటూ మాసిమో కార్ప్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ట్రేడ్ కమిషన్‌కు సిఫారసు చేసినట్లు మెడికల్ టెక్నాలజీ కంపెనీ మాసిమో కార్ప్ గురువారం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన మాసిమో తెలిపిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్(యుఎస్ఐటీసీ) 60 రోజులపాటు ‘పరిమిత మినహాయింపు ఉత్తర్వు’లు జారీ చేసినట్లు సమాచారం. యుఎస్ఐటీసీ ఇచ్చే తీర్పు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ కూడా చట్టానికి అతీతం కాదనే సందేశాన్ని పంపుతుందని మాసిమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ జో కియాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేటెంట్ టెక్నాలజీని యాపిల్ చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు. ‘లైట్-బేస్డ్ ఆక్సిమెట్రీ ఫంక్షనాలిటీ’ కోసం ఆపిల్ వాచ్ మాసిమో పేటెంట్ టెక్నాలజీని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 2021లో సంస్థ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?) యాపిల్ వినియోగదారుల ఆరోగ్యం కంపెనీకి చాలా ముఖ్యమని సంస్థ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్లకు మరింత సేవలందించేలా సంస్థ నిత్యం పనిచేస్తుందని చెప్పింది. అయితే కొందరు కావాలనే యాపిల్ ఉత్పత్తులను కాపీచేసి తమ సొంత ఉత్పత్తులుగా ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మాసిమో చర్యలపై ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తామని యాపిల్ తెలిపింది. యాపిల్ గత నెలలో వాచ్సిరీస్ 9ని విడుదల చేసింది. ఆరోగ్య డేటాను యాక్సెస్ చేసి వివరాలు విశ్లేషించే వెసులుబాటు అందులో ఉంది. -
Israel Hamas war: యాపిల్ వాచ్ ద్వారా కూతురి మృతదేహాన్ని గుర్తించిన తండ్రి..!
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా మరణించిన ఓ యువతి మృతదేహాన్ని ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా గుర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు అకస్మికంగా దాడిచేశారు. ఒకవైపు రాకెట్లుతో, మరోవైపు తుపాకులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో మెల్లనాక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఇయల్ వాల్డ్‌మాన్ కుమార్తె డేనియల్ మరణించారు. స్నేహితుడితో కలిసి ఇజ్రాయెల్‌లోని ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకు వెళ్లిన డేనియల్ హమాస్ దాడిలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అనంతరం డేనియల్ ఫోన్ నుంచి వాల్డమన్ ఫోన్‌కు అత్యవసర కాల్ వచ్చింది. కానీ ఎటువంటి సమాచారం అందలేదు. అయితే కుమార్తెను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకొని ఉంటారని తొలుత భావించారు. అనంతరం కుమార్తె వినియోగిస్తున్న ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా లోకేషన్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు డేనియల్ ఆపిల్ వాచ్ నుంచి సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ అందిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. కుమార్తె మృతదేహం కనిపించింది. ఆమెతోపాటు వెళ్లిన డేనియల్ స్నేహితుడు మృతదేహం కూడా అక్కడే కనిపించింది. వారిద్దరికి త్వరలో పెళ్లి చేయాలని భావించినట్లు వాల్డమన్ తెలిపారు. అంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డేనియల్ ఐఫోన్లో క్రాష్ డిటెక్షన్ కాల్ టెక్నాలజీ ఉందని, అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే తనకు అత్యవసర కాల్ వచ్చినట్లు వాల్డమన్ వెల్లడించారు. ఆ కాల్ రావడంతోనే తమ కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిపారు. (బైక్‌పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!) యాపిల్ ఐఫోన్, వాచ్‌లో ఉన్న క్రాష్ డిటెక్షన్ కాల్ ఫీచర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అందించిన ఫోన్ నంబర్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఆ ప్రాంతం లోకేషన్‌ను కూడా షేర్ చేస్తుంది. ఫలితంగా తమ ఆత్మీయులను త్వరగా కాపాడుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. -
'ట్యాప్ & పే' ఫీచర్‌తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్‌కు షాకే!
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేసింది. బుధవారం సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 6, క్లాసిక్ పేరుతో రెండు వేరియంట్లను బుధవారం తీసుకొచ్చింది. ముఖ్యంగా అభిమానులకు ఇష్టమైన ఫీచర్, ఫిజికల్ రొటేటింగ్ బెజెల్‌ను తీరిగి పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో AFib లేదా క్రమరహిత హృదయ స్పందన రేటు ట్రాకింగ్, ఎమర్జెన్సీ ఎస్‌వోఎస్, ఫాల్డిటెక్షన్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, స్లీప్ ట్రాకింగ్, పీరియడ్ ట్రాకింగ్ లాంటివి కీలక ఫీచర్లుగా ఉన్నాయి. (శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...) అలాగే దేశంలో తొలిసారిగా గెలాక్సీ వాచ్ 6 సిరీస్ 'ట్యాప్ & పే' ఫీచర్‌తో వీటిని లాంచ్ చేసింది. అంటే యూజర్లు, చేతికి వాచ్ ఉండగానే ప్రయాణంలో చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ లాంచింగ్ సందర్భంగా ప్రకటించింది. (యాపిల్ ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్) వీటి కోసం ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 44ఎంఎ గ్రాఫైట్ , సిల్వర్‌లో , 40ఎంఎం గ్రాఫైట్,గోల్డ్ కలర్స్‌లో లభ్యం.300mAh , 400mAh బ్యాటరీలను ఇందులో అందించింది. ప్రీమియం, టైమ్‌లెస్ టైమ్‌పీస్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ బ్లాక్ అండ్ సిల్వర్ , 43ఎంఎ, 47ఎంఎం మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. AOD ఫీచర్ ఆన్‌తో 30 గంటల బ్యాటరీ లైఫ్‌ని, AOD ఫీచర్ ఆఫ్‌తో 40 గంటల వరకు అందించబడతాయని కంపెనీ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 ధర రూ. 29,999 నుండి ప్రారంభం. 44ఎంఎ డయల్, LTE సపోర్ట్‌ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 36,999. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 43 ఎంఎం మోడల్ ధర రూ.36,999. LTT, 47 ఎంఎం మోడల్ ధర రూ.43,999గా నిర్ణయించింది. వినియోగదారులు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ నుండి జూలై 27 నుండి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 11న సేల్స్ మొదలవుతాయి. ప్రీ-బుక్ చేసుకున్న వారు రూ.19,999తో ప్రారంభమయ్యే సరికొత్త గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌ని సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. -
యాపిల్ వాచ్ కొత్త ఫీచర్ వచ్చేసింది: క్రానిక్ హార్ట్ కండిషన్ ఈజీ ట్రాక్
యాపిల్ వాచ్ భారత వినియోగదారులకు చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గుండెకు స్పందలను సంబంధించిన హిస్టరీని ట్రాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లకు అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం భారతీయ ఆపిల్ వాచ్ వినియోగదారులు కూడా ఇప్పుడు ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. AFib అనేది క్రానిక్ హార్ట్ కండిషన్‌ను సూచిస్తుంది. ఇది ఒక రకమైన అరిథ్మియా. గుండె దడ , వేగంగా, క్రమరహితంగా కొట్టుకోవడం. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకుండా, సరియైన చికిత్స తీసుకోకుండా ఉంటే మాత్రం గుండె ఆగిపోవడానికి లేదా స్ట్రోక్ సంభవించే క్లాట్స్‌కు దారితీస్తుంది. అయితే దీనికి సరియైన మందులువాడే వ్యక్తులు ఆరోగ్య కరమైన, చురుకైన జీవితాలను గడపొచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గుండె-ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన బరువు, ఇతర వైద్య చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. (US H1B visa: భారతీయ టెక్ నిపుణులకు శుభవార్త) ఎవరికి పనిచేస్తుంది? ♦ యాపిల్‌వాచ్ 4, తర్వాత వాచ్ ఏఓస్ 9లోని వినియోగదారులకు ఈ ఫీచర్ పని చేస్తుంది. ♦ భారతదేశంలోని వాచ్ యూజర్లు ఐఫోన్లో ఐఓఎస్ 16ని ఉపయోగించాలి ♦ AFib హిస్టరీ ఖచ్చితంగా 22 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అని యాపిల్ సపోర్ట్ పేజీ స్పష్టంచేసింది. ఇదీ చదవండి : శ్రావణం అలా వచ్చిందో లేదో,రూ. 60వేల ఎగువకు బంగారం ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి? ♦ ఐఫోన్లో హెల్త్యాప్ ఓపెన్ చేసి, బ్రౌజ్ క్లిక్ చేసి హార్ట్ ఆప్షన్నుఎంచుకోవాలి ♦ AFib హిస్టరీ సెట్ చేసిన స్టార్ట్ అప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ మీ పుట్టిన తేదీని నమోదు చేయండి ♦ AFibతో బాధపడుతున్నారని వైద్యుడు నిర్ధారించిన వైనాన్ని ధృవీకరించాలి ♦ తరువాత AFib చరిత్ర, ఫలితాలు , లైఫ్ ఫ్యాక్ట్ గురించి మరింత తెలుసుకునేలా కంటిన్యూపై క్లిక్ చేయాలి. -
అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!
సాక్షి, ముంబై: ఖరీదైన యాపిల్ వాచ్ కొనుగోలు చేయలేని వారికి గిజ్మోర్ తీపి కబురు అందించింది. అచ్చం యాపిల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌వాచ్ ‘అల్ట్రా’ లా కనిపించే స్మార్ట్‌వాచ్‌ను భారతీయ బ్రాండ్ గిజ్మోర్ తీసుకొచ్చింది. అదీ కూడా కేవలం 1,999 రూపాయలకే. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 2023 నుండి అందుబాటులో ఉంటుంది. బ్లాక్, ఆరెంజ్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. (ఇదీ చదవండి: ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది!150 కి.మీ. రేంజ్లో) బడ్జెట్ ధరలో గిజ్మోర్ తీసుకొచ్చిన కొత్త వాగ్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే స్మార్ట్‌వాచ్‌కు 10రోజుల బ్యాటరీ లైఫ్, 1.95-అంగుళాల HD డిస్ప్లే 320X385 పిక్సెల్స్, 91% బాడీ-టు-స్క్రీన్ రేషియో, మెరుగైన ఫారమ్ ఫ్యాక్టర్‌తో పెద్ద ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లేను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ షార్ట్‌కట్ మెనూ కోసం స్ప్లిట్-స్క్రీన్ వ్యూ కూడా ఉంది. పవర్ ఆన్ అండ్ ఆఫ్ కోసం 2 ప్రత్యేక బటన్స్, ఎపుడూ ఆన్‌లో ఉండే డిస్ప్లే స్క్రీన్ 600 నిట్స్ బ్రైట్నెస్ను కూడా అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ GPS ట్రాజెక్టరీ ఫీచర్‌ను హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్, పీరియడ్ ఎలర్ట్, స్లీప్ సైకిల్, meditation, sedentary and dehydration లాంటి రిమైండర్స్ కూడా ఇస్తుందట. యాపిల్ స్మార్ట్‌వాచ్ ‘అల్ట్రా’ ప్రారంభ ధర రూ. 89,900. (మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్) -
‘హార్ట్ ఎటాక్’ను గుర్తించే యాపిల్ వాచ్ సిరీస్ 8పై భారీ డిస్కౌంట్లు!
హార్ట్ ఎటాక్ అంటే ఒకప్పుడు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు వారికేననే ఓ అభిప్రాయం ఉండేది. అయితే ఆ ముప్పు ఇప్పుడు యువతను, చిన్నారులను చుట్టుముడుతోంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలల్లో హటాత్తుగా అడ్డంకులు ఏర్పడటాన్ని గుండె పోటు అంటారు. మరి గుండెకు రక్తం, ఆక్సీజన్ సరిగ్గా అందకపోతే అది పంపింగ్ చేయలేదు. ఎంత ఎక్కువ సేపు అడ్డంకి ఏర్పడితే అంత నష్టం జరుగుతోంది. పురుషుల్లో ఇలాంటి గుండె పోట్లు 65 ఏళ్లకు, మహిళలకు 72 ఏళ్లకు వస్తాయనే పాతలెక్క. కానీ ఆ వయస్సు ఇటీవల కాలంలో క్రమంగా కిందకు పడిపోతుంది. యువకుల్లో గుండెకు సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం అతిపెద్ద సమస్య. చాలా సార్లు నిశబ్ధంగా విరుచుకుపడి ప్రాణాల మీదకు తెస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళనల్ని పెంచుతున్నాయి. దీని కారణం ఏంటనేది వైద్య నిపుణులు రకరకాల అంశాలను ఉదహరిస్తుండగా.. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్.. పైన పేర్కొన్నట్లుగా గుండె సంబంధిత సమస్యల్ని ముందే గుర్తించి యూజర్లను అలెర్ట్ చేసేందుకు యాపిల్ వాచ్ సిరీస్ 8ను గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకొని యూనికార్న్ స్టోర్ అనే సంస్థ వాటిని నేరుగా భారత్‌లో అమ్మకాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు అదే సంస్థ యాపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వాటిలో యాపిల్ వాచ్ సిరీస్ 8 కూడా ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 8 ఫీచర్లు యాపిల్ వాచ్ సిరీస్ 8లో గుండె పనితీరు సంబంధించిన సమస్యల్ని గుర్తించవచ్చు. అలా గుర్తించేందుకు టెక్ దిగ్గజం ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లడ్‌లో నీరసం, అలసటతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు లేకుండా చూసేందుకు ఉపయోగపడే హిమోగ్లోబిన్ లెవల్స్ ఎలా ఉన్నాయో గుర్తించడం, గుండె ఎలా కొట్టుకుంటుందో చెక్ చేయడం, కర్ణిక దడ (atrial fibrillation detection)ని గుర్తించడం, గుండెలోని విద్యుత్ సంకేతాలను కొలిచే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (Electrocardiogram (ECG)ను పర్యవేక్షించడం వంటివి చేస్తుంది. ఈ పర్యవేక్షణ గుండె సమస్యలను గుర్తించడానికి, గుండె ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు టెంపరేచర్ సెన్సార్, దంపతులు ఏ సమయంలో కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో గుర్తించే అండోత్సర్గము(ovulation cycles) అనే ఫీచర్‌ను యాపిల్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ వాచ్ సిరీస్ 8పై ఆఫర్లు పోయిన ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 8 ధర రూ.45,900 ఉండగా.. ఇప్పుడు ఆ ధర భారీగా తగ్గించింది. కొనసాగుతున్న యునికార్న్ యాపిల్ ఫెస్ట్‌లో భాగంగా వినియోగదారులు యాపిల్ వాచ్ సిరీస్ 8 పై 12 శాతం తగ్గింపు పొందవచ్చు. వీటితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లు, ఈజీ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3,000 తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్, రూ.2 వేల వరకు క్యాషీఫై ఎక్ఛేంజ్ బోనస్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. ఇలా అన్నీ బెన్ఫిట్స్ కలుపుకొని యాపిల్ వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ.25,000 నుంచి లభ్యమవుతుందని యానికార్న్ యాపిల్ ఫెస్ట్ తన వెబ్సైట్లో పేర్కొంది. చదవండి👉 ఏం ఫీచర్లు గురూ..అదరగొట్టేస్తున్నాయ్,యాపిల్ వాచ్ సిరీస్ 8 విడుదల! -
Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?
మారుతున్న ప్రపంచంలో మనం వినియోగించే వస్తువులు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటికే అనేక ఆధునిక ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న యాపిల్ వాచ్ ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ చేయడానికి ఉపయోగపడేలా తయారైంది. నిజానికి షుగర్‌బాట్ అనేది ఐఫోన్ యాప్. ఇది వినియోగదారులు తీసుకునే ఆహారంలో ఉన్న షుగర్ లెవెల్స్ ట్రాక్ చేస్తుంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేయడం వల్ల ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వాచ్ఓఎస్ వెర్షన్‌తో వస్తున్న లేటెస్ట్ అప్డేట్తో ఆపిల్ వాచ్ వినియోగదారులు నేరుగా యాక్సెస్ చేయవచ్చు. ఇక మీరు యాపిల్ వాచ్‌తో క్యాలరీలు, షుగర్ లెవెల్స్ తెలుసుకోవడంలో షుగర్‌బాట్ ఎంతగానో సహాయపడుతుంది. తెలియని వారు కూడా సులభంగా షుగర్‌బాట్ ఉపయోగించవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే రోజులో తీసుకున్న ఆహారం గురించి ప్రస్తావించాలి, ఇందులో చికెన్ సూప్ నుంచి బిగ్ మ్యాక్ వరకు అనేక ఆహారాల డేటాబేస్ ఉంటుంది. (ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే) మీరు తీసుకున్న ఆహరం యాప్‌లో లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాన్యువల్‌గా కూడా మీరు తీసుకున్న ఆహారం గురించి జోడించవచ్చు. ఈ యాప్ క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు వంటి డేటాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తుంది. -
మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది చూసుకోండి!
మనిషి రోజు వారీ జీవితంలో టెక్నాలజీ భాగమైపోయింది. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అయితే, అది మనం ఉపయోగించుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. సక్రమంగా ఉపయోగిస్తే అది మనిషి ప్రాణాలను సైతం కాపాడుతుందనడానికి స్మార్ట్ వాచ్‌లు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా యాపిల్ అరుదైన ఘనత సాధించింది. సాధారణంగా గుండె ఎడమ జఠరిక పనిచేయకపోవడం వల్ల హృద్రోగ (గుండె సంబంధిత) సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ వాటిని గుర్తించడంలోనే అలస్యం ఏర్పడి కొన్ని సార్లు గుండె పోటు వస్తుంది.సరైన సమయంలో ట్రీట్మెంట్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆ తరహా సమస్యలతో బాధపడే వారిని గుర్తించి యాపిల్ వాచ్ అలెర్ట్ ఇస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మాయో క్లినిక్ రీసెర్చ్ ప్రకారం..అమెరికాతో పాటు 11 ఇతర దేశాలకు చెందిన 2,454 మంది హృద్రోగులపై ఆగస్టు 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు పరిశోధనల్లో జరిగాయి. ఇందులో భాగంగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన ఏఐ అల్గారిదంతో యాపిల్ వాచ్ ద్వారా 1,25,000 ఈసీజీ (Electrocardiography) టెస్ట్‌లను చేయగా సత్ఫలితాలు నమోదైనట్లు రీసెర్చర్లు తెలిపారు. సరైన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాల్లో ఈసీజీ టెస్ట్‌లతో యాపిల్ వాచ్ గుండె సంబంధిత బాధితుల్ని గుర్తిస్తాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, భవిష్యత్‌లో యాపిల్ వాచ్ ద్వారా హార్ట్ ఎటాక్‌తో పాటు ఇతర గుండె సంబంధిత సమస్యలు గుర్తించి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు మనుషుల ప్రాణాలు కాపాడేలా వైద్య చరిత్రలో అరుదైన అద్భుతాలు జరుగుతాయని మాయో రీసెర్చర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’ -
150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’
ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ట్రెక్కింగ్ సమయంలో జోరున వర్షం. వర్షం ధాటికి వెనక్కి రాలేం. ముందుకు రాలేం. అలా అని అక్కడే ఉండిపోలేం. అచ్చం ఆ కుర్రాడు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి పై నుంచి 130 నుంచి 150 అడుగుల లోయలో పడ్డాడు. కాళ్లు విరిగి రక్తపు మడుగులో ఉన్న బాధితుడు ప్రాణాలు కాపాడమని హాహాకారాలు చేస్తున్నాడు. కానీ పట్టించుకునే నాథుడే లేడే! స్నేహితులు ఎక్కడున్నారో తెలియదు. అయినా ప్రాణాలతో బయటపడ్డాడు. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ సైతం త్వరగా కోలుకోవాలని ఆ బాలుడికి మెయిల్ పెట్టారు లోనావాలా పర్వత ప్రాంతం! మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, పరవశింపజేసే జలపాతాలతో భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్తంత ఉపశమనం పొందేందుకు ముంబైకు 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనావాలాకు ముంబై, పూణేల ప్రాంతాల వారు ఇక్కడ వాలిపోతుంటారు. చదవండి👉 స్మార్ట్ వాచ్‌ను విసిరి కొట్టాలనుకుంది..కానీ అదే ఆ యువతి ప్రాణాల్ని కాపాడింది! అలాగే పూణేకు చెందిన 17ఏళ్ల స్మిత్ మేథా తన స్నేహితులతో కలిసి లోనావాలాకు వెళ్లాడు.మధ్యాహ్నం 3గంటల సమయంలో లోనావాల పర్వతం మీద ట్రెక్కింగ్ చేస్తుండగా కురుస్తున్న కుండపోత వర్షానికి పర్వతం మీద నుంచి సుమారు 130 నుంచి 150 అడుగుల లోయలో ఉన్న ఓ చెట్టు మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు విరిగాయి. ప్రమాద స్థితిలో ఉన్నా తనని కాపాడమని కేకలు వేశాడు. కానీ ఫలితం లేదు. ఫోన్ సిగ్నల్స్ లేవు. కానీ ఆ యువకుడు శురక్షితంగా ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఎలా అంటారా? ఆపిల్ వాచ్ సిరీస్ 7 వల్ల. చదవండి👉 అమ్మ బాబోయ్! పేలుతున్న స్మార్ట్‌వాచ్‌లు, కాలిపోతున్న యూజర్ల చేతులు! ఐఫోన్ 13 లేదు తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నానని సమాచారం అందించేందుకు తన వద్ద ఐఫోన్ 13 లేదు. ఉన్న స్మార్ట్ ఫోన్లో సిగ్నల్స్ లేవు. కానీ అప్పుడే తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ యాపిల్ వాచ్ 7 సిగ్నల్స్ పనిచేస్తుంది. ఆ వాచ్ సాయంతో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి వివరించాడు. అతని స్నేహితులు ప్రథమ చికిత్స చేసి అతి కష్టం మీద అతన్ని పైకి తీసుకొచ్చారు. పైకి చేరుకున్న తర్వాత, మేథా వెంటనే తన లైవ్ లొకేషన్‌ను అతని తల్లిదండ్రులకు పంపాడు. లోనావాలాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ముంబైకి చెందిన ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చివరకు దాదాపు ఒక నెల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. తన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు,స్నేహితులు వాకాబు చేస్తున్నారు. అప్పుడే డిసైడ్ అయ్యా. నాకు ప్రమాదం ఎలా జరిగింది? యాపిల్ వాచ్ నా ప్రాణాలు ఎలా కాపాడింది? అని వివరిస్తూ టిమ్‌కుక్ మెయిల్ చేశాడు. ఆశ్చర్యంగా మేథా ప్రమాదం గురించి తెలుసుకున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఆ బాలుడికి మెయిల్‌కు రిప్లయి ఇచ్చాడు. మీరు కోలుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు పూర్తిగా, మరింత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని మెయిల్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. చదవండి👉 వావ్..కంగ్రాట్స్ మేడమ్.. మీరు గర్భవతి అయ్యారు!! -
దేవుడిలా రక్షించిన వాచ్...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...
ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఒక మహిళను భర్త చేతిలో హతం కాకుండా కాపాడింది. సరికొత్త ఫ్యూచర్లతో మంచి ఎలక్ట్రానిక్ గాడ్జ్ట్లు ఆకర్షణీయంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రజలు కూడా అంతే క్రేజ్‌గా కొంటున్నారు. ఈ కొంగొత్త టెక్నాలజీలు మనుషులను కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అచ్చం అలానే ఇక్కడొక మహిళను ఒక యాపిల్ వాచ్ విపత్కర సమయంలో దేవుడిలా రక్షించింది. వివరాల్లోకెళ్తే..వాషింగ్టన్‌కి చెందిన యంగ్ సూక్ ఆన్ అనే 42 ఏళ్ల మహిళ తన భర్త చాయ్ క్యోంగ్‌తో గత కొంతకాలంగా గొడవపడుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఐతే విడిపోతే ఆమెకు భరణంగా తన రిటైర్మెంట్ డబ్బు ఇవ్వాల్సి వస్తుందని ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా చాంగ్ క్యోంగ్ ఆమె ఇంటికి వచ్చి గొడవపడటేమే గాక తన కుట్రలో భాగంగా ఆమెను తీవ్రంగా హింసించాడు. తదనంతరం ఆమెను టేప్‌తో చుట్టి గ్యారెజ్ వద్దకు ఈడ్చుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను కార్‌వ్యాన్‌లో ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవ సమాధి చేశాడు. ఆమె ఎంత ప్రాధేయపడుతున్న వినలేదు. దీంతో ఆమె తన చేతికి ఉన్న యాపిల్ వాచ్ సాయంతో అత్యవసర నెంబర్ 911కి కాల్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి....వాషింగ్టన్‌లోని సీటెల్‌కు 60 మైళ్ల దూరంలో ఆమెను గుర్తించి రక్షించారు. ఐతే ఆమె అప్పటికే తీవ్ర అశ్వస్థకు గురై కొన ప్రాణాలతో కొట్టుకుంటోంది. ఆమె ఆ సమయంలో తన 20 ఏళ్లు కూతురుకి కూడా తాను ప్రమాదంలో ఉన్నట్లు వాచ్ ద్వారా తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అందరూ సమయానికి అప్రమత్తమవ్వడంతోనే ఆమెను సురక్షితంగా రక్షించగలిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రక్షించే సమయంలో ఆమె మొత్తం టేప్‌తో సీల్ చేసి తీవ్ర గాయలపాలై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతక మునుపు కూడా ఈ యాపిల్ వాచ్ ఎంతమందినో పలురకాలుగా వారి ప్రాణాలను కాపాడింది. (చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!) -
యాపిల్‌కు షాక్.. కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థ యాపిల్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. యాపిల్ ఇండస్ట్రియల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్, ఇవాన్స్ హాంకీ తన పదవికి రాజీనామా చేశారు. 2019 నుంచి ఆమె ఈ పదవిలో ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్ స్థానంలో హాంకీ బాధ్యతలు స్వీకరించారు. హాంకీ స్థానంలో ఎవర్ని నియమించిందీ యాపిల్ అధికారంగా ప్రకటించలేదు. అయితే కొత్త నియామకంగా జరిగేదాకా ఆమె తన పదవిలో కొనసాగ నున్నారు. కాగా ఐమాక్, ఐపాడ్ ఐఫోన్ల పరిచయం వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరిగా జోనీ ఐవ్ గుర్తింపు తెచ్చుకున్నారు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌తో కలిసి విభిన్నమైన యాపిల్ ఉత్పత్తులకు నాంది పలికారు. అయితే తన సొంత స్వతంత్ర కంపెనీ స్థాపన నేపథ్యంలో యాపిల్ నుంచి ఆయన నిష్క్రమించడం అప్పట్లో వ్యాపార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!
ప్రస్తుత జనరేషన్లో ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువుకు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటోంది. ఇక, మనం ధరించే వాచ్‌ల విషయానికి వస్తే.. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ అయిన యాపిల్ వాచ్ ఎంతో స్పెషల్. అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న యాపిల్ వాచ్.. క్రేజీ లైఫ్ సేవింగ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ యాపిల్ వాచ్ ఎంతో మంది ప్రాణాలకు కాపాడింది. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. దీంతో, మరోసారి యాపిల్ స్మార్ట్‌వాచ్ తన ప్రత్యేకతను చాటుకుంది. వివరాల ప్రకారం.. ఇమాని మైల్స్(12)కి యాపిల్ వాచ్ అంటే ఎంతో ఇష్టం. దీంతో, యాపిక్ స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసి తన చేతికి పెట్టుకోవడం ప్రారంభించింది. కాగా, యాపిల్ వాచ్ ధరించిన అనంతరం.. ఇమాన్ హెల్త్ గురించి వాచ్ ఎప్పటికప్పుడు ఆమెకు తెలియజేసింది. ఈ క్రమంలో ఓరోజు.. ఒక్కసారిగా యాపిల్ వాచ్.. ఇమాని హార్ట్‌రేట్ అసాధరణంగా ఎక్కువగా ఉందంటూ పలుమార్లు హెచ్చరించింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి జెస్సికా కిచెన్ ఆందోళనకు గురైంది. తన కూతురుకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని భావించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. దీంతో, ఇమానికి వైద్య చికిత్సలు అందించిన అనంతరం.. ఆమెకు అపెండిక్స్‌లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉందని కనుగొన్నారు. ఇటీవలి కాలంలో ట్యూమర్ పెరుగుతూ, ఇతర అవయాలకూ కూడా విస్తరిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని కేన్సర్ ట్యూమర్‌గా గుర్తించిన వైద్యులు.. సర్జరీ చేసి కణతులను తొలగించారు. ఇలా యాపిల్ వాచ్.. ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన అనంతరం.. ఇమాని తల్లి జెస్సికా కిచెన్ మాట్లాడుతూ.. వాచ్ కారణంగా నా కూతురుకు ఎంతో మేలు జరిగింది. ఈ విషయం తెలియకపోతే ఇంకా కొన్ని రోజలు ఆసుపత్రికి వెళ్లకుండా అలాగే ఉండిపోయేవాళ్లము అని తెలిపారు. ఇక, అంతకుముందు కూడా యాపిల్ వాచ్ యూకేకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. #AppleWatch detects signs of rare #cancer, saves life of 12-year-old girlhttps://t.co/u9mPi3YXQp — DNA (@dna) October 22, 2022 -
ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్
స్మార్ట్ వాచ్... ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. వాచ్ ప్రాణాలు కాపాడమేంటి? అదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అదెలా జరిగిందంటే... యూకేకు చెందిన 54 ఏళ్ల డేవిడ్‌కు ఇటీవల పుట్టినరోజు సందర్భంగా అతని భార్య సారా, యాపిల్ స్మార్ట్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. అది మణికట్టుకు పెట్టుకోగానే.. పల్స్రేట్ 30గా చూపించింది. సాధారణంగా ఆ వయసులో ఉన్న పురుషుల హృదయ స్పందనలు నిమిషానికి 100 చొప్పున ఉండాలి. కానీ డేవిడ్‌కు 30 మాత్రమే నమోదవుతుండటంతో వాచ్ సరిగ్గా పనిచేయట్లేదేమోనని డేవిడ్ అనుకున్నాడు. కానీ అతని భార్య పదేపదే వెంటపడటంతో హాస్పిటల్‌కు వెళ్లాడు. ఎమ్ఆర్ఐ స్కాన్ చేయిస్తే... అతను కార్డియాక్ అరెస్టుతో మృతి చెందే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. హార్ట్ బ్లాక్ వల్ల గుండెలోని ‘జంక్షన్ బాక్స్’ పనిచేయడం ఆగిపోతోందన్నారు. అలా 48 గంటల్లో 138 సార్లు పదేసి సెకన్లపాటు అతని గుండె పనిచేయడం మానేసింది. డేవిడ్ నిద్రిస్తున్న సమయంలో ఇలా జరిగిందట. అంతేకాదు.. అది ఆగిపోయినప్పుడు అతని గుండెలోని మరో భాగం రక్త ప్రవాహాన్ని కిక్ స్టార్ట్ చేసిందన్నమాట. గుండె సంబంధిత జబ్బు లక్షణాలు కనిపించకపోవడం, అతను ఆరోగ్యంగా ఉండటం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకు సర్జరీతో గుండెలోని బ్లాక్స్‌ను తొలగించారు. అలాగే భవిష్యత్తులో అతని హృదయ స్పందనల్లో ఏమైనా తేడాలు సంభవిస్తే ముందుగానే పసిగట్టేందుకు.. గుండె కవాటాలు సమన్వయంతో పనిచేసేలా చేసేందుకు వీలుగా గుండెలో ఒక ‘పేస్‌మేకర్’ పరికరాన్ని సైతం అమర్చారు. దీంతో ఇప్పుడు అతని గుండె పనితీరు మెరుగుపడింది. ‘నా భార్య నాకు స్మార్ట్‌వాచ్‌ను బహుమతిగా ఇచ్చి ఉండకపోతే నా సమస్య బయటపడేది కాదు... నేను బతికి ఉండేవాడిని కాదు. నేను ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటాను. ఒక్క చార్జింగ్ సమయంలో తప్ప వాచ్ ఎప్పుడూ నా చేతికే ఉంటుంది’ అని డేవిడ్ చెబుతున్నాడు. -
ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది?
న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 సిరీస్‌ను టెక్ దిగ్గజం ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా లాంచ్ చేసింది. అయితే లేటెస్ట్ ఐఫోన్ 14 ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్‌కు నచ్చినట్టు లేదు. అందుకే సెటైర్ వేయడం ఇంటర్నెట్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఊహించని విధంగా మీమ్‌ను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్ జరుగుతోంది. స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆపిల్ ఐఫోన్, 13, 14ని పోలుస్తూ ఒక స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. ఆపిల్ ప్రకటన తరువాత ఐఫోన్14ను అప్డేట్ చేసుకుంటున్నా అని క్యాప్షన్‌తో ఒక పోస్ట్ పెట్టారు. ఐఫోన్ 13తోపోలిస్తే. కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఐఫోన్ లవర్స్ పెదవి విరుస్తున్న సందర్భంలో ఈవ్ పోస్ట్ చర్చకు దారి తీసింది. మరోవైపు యుఎస్‌లోని ఐఫోన్ మోడల్స్‌లో ఇ-సిమ్ యాక్టివేషన్‌పై కూడా యూజర్లు అంసతృప్తిగా ఉన్నారు. తాజా అప్డేట్స్పై సోషల్ మీడియా మీమ్స్ ఒక రేంజ్లో పేలుతున్నాయి. "తదుపరి ఐఫోన్లో మైక్రోఫోన్ ఉండదు. ఇక మీరు నేరుగా మీరు మాట్లాడాలను కుంటున్న వారి దగ్గరకు వెళ్లాలి." అని ఒక యూజర్ కమెంట్ చేయగా, "త్వరలో ఇది ఐఫోన్‌కు బదులుగా ఇ-ఫోన్ అవుతుందని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఈ సిమ్స్ ఇండియాకు రాకపోవడం మంచిదైంది. ఐఫోన్ 14 సిరీస్ సిమ్ ట్రేతో ఉండడం గొప్ప విషయం. లేదంటే ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితి ఉండేది. తాము ఇంకా ఇ-సిమ్‌లకు సిద్ధంగా లేం అంటూ ఇండియన్ యూజర్ ఒకరు రాశారు. కాగా బుధవారం రాత్రి నిర్వహించిన "ఫార్ అవుట్" మెగా ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14, ఎయిర్‌పాడ్స్ ప్రో, ఆపిల్ వాచ్ అల్ట్రాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 మాక్స్‌ను ఆవిష్కరించింది. ఐఫోన్ 14 ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుండి , ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా ఉంటుంది. Eve Jobs, the daughter of Steve Jobs and Laurene Powell Jobs, reacts to today’s iPhone announcement on her Instagram. pic.twitter.com/bfn2VtbpsA — Yashar Ali 🐘 (@yashar) September 7, 2022 -
యాపిల్ వాచ్ అల్ట్రా, వాచ్ ఎస్ఈ2, ఎయిర్ ప్రాడ్స్ ప్రో 2 విడుదల, ధర ఎంతంటే?
టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి అమెరికా క్యాలిఫోర్నియాలో క్యూపార్టినో నగరంలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో టిమ్ కుక్.. ఐఫోన్14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్, వాచ్ సిరీస్ 8, వాచ్ సిరీస్ ఎస్ఈ 2, వాచ్ ఆల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా యాపిల్ వాచ్ అల్ట్రా, వాచ్ ఎస్ఈ2, ఎయిర్ ప్రాడ్స్ ప్రో 2 గురించి తెలుసుకుందాం. యాపిల్ వాచ్ అల్ట్రా స్పెసిఫికేషన్లు యాపిల్ వాచ్ అల్ట్రా 49ఎంఎం డయల్‌తో వస్తుంది. sapphire గ్లాస్‌తో, వాచ్‌ను టైటానియంతో రూపొందించారు. వాచ్ పెట్టుకుంటే ఎలాంటి ఇరిటేషన్లేకుండా చర్మానికి అనువుగా ఉంటుంది. అతిపెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ వాచ్‌ను 36 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. తక్కువ పవర్ మోడ్‌తో 60 గంటల వరకు పొడిగించవచ్చు. తక్కువ సెల్యులార్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో పనిచేసేలా డ్యూయల్ జీపీఎస్‌తో వస్తుందని యాపిల్ తెలిపింది. హైకింగ్, ఇతర కార్యకలాపాలలో సహాయపడుతుంది. డబ్ల్యూఆర్ 100 రేటింగ్‌ను కలిగి ఉన్న ఈ వాచ్‌ను నీటిలో 100అడుగుల లోతు వరకు ధరించవచ్చు. వీటితో పాటు క్రాష్ డిటెక్షన్, కంపాస్, డెప్త్ గేజ్, నైట్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర 799 డాలర్లు ఉండగా (భారత్‌లో రూ.89,900) సెప్టెంబర్ 23 నుంచి లభించనుంది. యాపిల్ వాచ్ ఎస్ఈ (సెకండ్ జనరేషన్) స్పెసిఫికేషన్లు యాపిల్ వాచ్ ఎస్ఈలో రెటీనా ఓఎల్ఈడీ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 2020లో యాపిల్ వాచ్ ఎస్ఈ ( ఫస్ట్ జనరేషన్) కంటే ఈ వాచ్ 30 శాతం పెద్దగా ఉంది. వేగవంతమైన ఎస్8 ప్రాసెసర్‌ను అమర్చారు. యాపిల్ పాత మోడల్ ఎస్5 చిప్ సెట్ కంటే 20శాతం ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీంతో పాటు ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్ వంటి హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 8లో ఉన్న క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను సైతం యాపిల్ వాచ్ ఎస్ఈలో అందిస్తుంది. అంతేనా సెల్యులార్ కనెక్టివిటీ, ఫ్యామిలీ సెటప్ ఫీచర్‌తో స్మార్ట్‌వాచ్‌ని సెటప్ చేయడానికి అనుమతిస్తుంది. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. అదే సమయంలో యాపిల్ వాచ్ సెకండ్ జనరేషన్ ప్రారంభ ధర ధర 249 డాలర్లు ( భారత్‌లో దాదాపు రూ. 19,800), జీపీఎస్ ప్లస్ సెల్యులార్ మోడల్ ధర 299 డాలర్లకు ( భారత్‌లో దాదాపు రూ. 23,800) లభించనుంది. వాచ్ సెప్టెంబర్ 16 నుండి మిడ్నైట్, సిల్వర్, స్టార్‌లైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో: కొత్త హెచ్2 కలిగిన ఈ హెడ్ ఫోన్స్ గంటల పాటు పనిచేస్తుంది. అయితే పరిమాణాల్లో లభించే ఈ సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో ధర 249 డాలర్లుగా ఉంది. -
ఆపిల్ ఈవెంట్ : ఐఫోన్ 14 సిరీస్, కొత్త వాచ్, ఇయర్‌పాడ్స్ వచ్చేశాయ్ ఫోటోలు చూడండి
-
వావ్ ఏం ఫీచర్లు గురూ..అదరగొట్టేస్తున్నాయ్,యాపిల్ వాచ్ సిరీస్ 8 విడుదల!
Apple Watch Series 8 : ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ స్మార్ట్ వాచ్ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న యాపిల్ వాచ్ 8 సిరీస్ విడుదలైంది. ప్రమాదంలో యూజర్లను కాపాడేందుకు యాక్సిలరోమీటర్ సెన్సార్, మహిళల ovulation (అండోత్సర్గము) గురించి తెలిపే ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఆ వాచ్‌లోని ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం. స్మార్ట్ వేరబుల్ మార్కెట్లో యాపిల్ వాచ్‌ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్నీ యాపిల్ వాచ్ సిరీస్‌ల కంటే యాపిల్ వాచ్ 8 సిరీస్ విభిన్నంగా ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా క్యాలి ఫోర్నియాలో క్యూపార్టినో నగరంలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా నిర్వహించిన యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్లో టిమ్ కుక్ మహిళ ఆరోగ్యం కాపాడే లక్ష్యంగా విడుదల చేసిన యాపిల్ వాచ్ 8 సిరీస్ వాచ్ రించి మరిన్ని విషయాలు మీకోసం ovulation (అండోత్సర్గము) గురించి పెళ్లయిన జంటలన్నీ పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ఏ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. ముందుగా స్త్రీ శరీరంలో జరిగే ovulation (అండోత్సర్గము) గురించి తెలుసుకుంటే ఎప్పుడు కలిస్తే గర్భం ధరించడం సులువో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారి కోసమే అండోత్సర్గము అనే ఫీచర్‌ను తయారు చేసింది. టెంపరేచర్ సెన్సార్ తో పాటు హై ఎండ్ ఫీచర్లతో ఆపిల్ వాచ్ 8 ని పరిచయం చేస్తోంది. అయితే, మహిళల పర్సనల్ డేటా కేవలం వాళ్లు ధరించిన యాపిల్ వాచ్ 8లో నిక్షిప్తమై ఉంటుందని, ఆ డేటా యాపిల్ సర్వర్లలో స్టోర్ చేయడం లేదని జెఫ్ విలియమ్స్ స్పష్టం చేశారు. డిస్ప్లే సూపర్ ఇప్పటికే యూజర్లు వినియోగిస్తున్న అన్నీ యాపిల్ వాచ్‌ల కంటే ఈ యాపిల్ 8 సిరీస్ వాచ్ కింగ్ మేకరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వాచ్‌లో ఉన్న అప్డేటెడ్ ఫీచర్లు ఇతర వాచ్‌లలో లేవని తెలుస్తోంది. బిగ్గెస్ట్ యాపిల్ వాచ్ 49 రెక్టాంగిలర్ డిస్ప్లే తో పాటు 2000నిట్స్ల బ్రైట్నెస్, చేతికి ధరించినప్పుడు తేలికగా ఉండేందుకు వాచ్ కేస్ టైటానియంతో తయారు చేయబడింది. ఫిట్నెస్ ప్రియుల కోసం ఫిట్నెస్ ప్రియులకోసం యాపిల్ తయారు చేసిన ఈ వాచ్ డిజైన్, స్లైడ్స్ లేటెస్ట్ వెర్షన్‌లోకి అప్డేట్ చేసింది. కొత్త ఆరెంజ్ యాక్షన్ బటన్, బటన్ గార్డ్, రీడిజైన్ చేసిన క్రౌన్, sapphire క్రిస్టల్ డిస్ప్లే తో పాటు ఆ డిస్ప్లేను ప్రొటెక్ట్ చేసేందుకు రిమ్ సైజును పెంచింది. ఈ తరహా ఫీచర్‌ను శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రోలో కూడా మనం చూడొచ్చు. కారు ప్రమాదంలో ఉంటే కారు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించినట్లయితే, అత్యవసర సేవలకు కాల్ చేయడంలో సహాయపడటానికి సిరీస్ 8లో కొత్త గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ కూడా ఉన్నాయి. స్మార్ట్ఫోన్లలో పొందుపరిచే యాక్సిలరోమీటర్ సెన్సార్ స్మార్ట్‌ఫోన్ మోషన్‌ను డిటెక్ట్ చేస్తుంది. wake-up screen వంటి ఆప్షన్‌కు కూడా ఈ సెన్సార్‌ను ఉపయోగిస్తున్నారు. ధర ఎంతంటే యాపిల్ వాచ్ 8సిరీస్ ధర 499 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ..సెప్టెంబర్ 16 నుంచి కొనుగోలు దారులకు అందుబాటులో ఉండనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి👉 దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఐఫోన్ 14 విడుదల! -
ఆపిల్ ఐపోన్14: ధరలు,స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ లీక్స్
న్యూఢిల్లీ:ఆపిల్ అతిపెద్ద వార్షిక ఫార్ అవుట్ ఈవెంట్లో నాలుగు కొత్త ఐఫోన్లను-ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్లస్ మోడలల్స్గా లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. అయితే ఈ ఫోన్లకు సంబంధించి ధరలు,స్పెసికేషన్స్పై చైనీస్ సోషల్ వెబ్సైట్లో తాజా లీక్స్ ఆసక్తికరంగా మారాయి. ఐఫోన్ 14 ప్రొ మాక్స్ : 458ppi పిక్సెల్ డెన్సిటీ 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 2778×1244 రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్ప్లేను లాంచ్ కానుంది. 48ఎంపీ 8కే కెమెరా, 4323 mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ధరలు అంచనాలు: 256 జీబీ మోడల్ రూ. 1,25,525, 512 జీబీ వేరియంట్ రూ. 1,42,801 , 1 టీబీ మోడల్ రూ. 1,60,005గా ఉంటుందని అంచనా. ఐఫోన్ 14 ప్రొ: 6.1-అంగుళాలు డిస్ప్లే , 2532×1170 రిజల్యూషన్ 3200mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. ధరలు అంచనాలు: 256జీబీ మోడల్ ధర రూ. 1,14,011, 512 జీబీ ధర రూ. 1,31,284 . 1టీబీ వేరియంట్ ధర రూ. 1,49,711 ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 14 ప్లస్: 1000నిట్స్ బ్రైట్‌నెస్‌తో ట్రూ టోన్ P3 డిస్ప్లేతో వస్తోందట. 12ఎంపీ 4కే కెమెరా 4325mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ధరలు అంచనాలు: 128జీబీ ధర రూ. 85,219, 256జీబీ రూ. 93,297 , 512 జీబీ ధర రూ. 1,04, 817గా ఉండనుంది. ఐఫోన్ 14: 6.1 అంగుళాల డిస్ప్లేతో రావచ్చనిఅంచనా. అలాగే 173గ్రా బరువుతో 3279mAh బ్యాటరీతో వస్తోందట. ధరలు అంచనాలు బేస్ మోడల్ధర దాదాపు రూ. 77,112గా ఉండనుంది. 256జీబీ మోడల్ ధర రూ. 85,169, 512 జీబీ వేరియంట్‌కు రూ. 1,04,817గా ఆపిల్ నిర్ణయించిదట. అయితే అధికారిక లాంచింగ్ వరకు ఐఫోన్ మోడల్స్, ఫీచర్లు ధరలపై సస్పెన్స్ తప్పదు. ఇది చదవండి: iPhone 14: మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా? -
మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా?
న్యూఢిల్లీ: టెక్దిగ్గజం ఆపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్ 14, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఇంకా ఎయిర్ పాడ్స్ ప్రొ-2, ఆపిల్ వాచ్ ఎస్ఈ-2 లాంటి కీలక ఉత్పత్తుల లాంచింగ్ అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేదికపై ఎలాంటి విప్లవాత్మక ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆపిల్ ఐఫోన్ 14: కోవిడ్ సంక్షోభం తరువాత నిర్వహిస్తున్న ఆపిల్ అతిపెద్ద ఈవెంట్ కావడంతో మరింత జోష్ నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన పుకార్లు , లీక్‌ల ప్రకారం భారీ అప్డేట్స్ తో ఐఫోన్ -14 సిరీస్‌ను తీసుకొస్తోంది. 6.7 అంగుళాల భారీ డిస్ప్లే, 48ఎంపీ బిగ్ కెమెరా, ఆన్‌లోనే ఉండే డిస్ప్లే లాంటివి ఇందులో ఉన్నాయి. ఆపిల్ స్మార్ట్‌వాచ్ 8: ఆపిల్ 7 వాచ్ డిజైన్‌కు దగ్గరానేఈ కొత్త సిరీస్ ఉన్నప్పటికీ మరిన్ని విప్లవాత్మక మార్పులతో కొత్త వాచెస్ సీరిస్‌ను తీసుకొస్తోంది. ఆపిల్ స్మార్ట్‌వాచ్ వాచ్ 8 ప్రో: అతిపెద్ద డిస్ప్లే, టైటానియం సూపర్ డిజైన్, అదనపు బటన్‌తో ఈ స్మార్ట్‌వాచ్‌ను తీసుకు రానుందని సమాచారం. ఎయిర్‌పాడ్స్ ప్రో 2: తదుపరి జనరేషన్గా వస్తున్న వీటిల్లో ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సామర్థ్యాలను పెంచడంతో పాటు కొత్త డిజైన్‌తో లాంచ్ చేయనుంది. అలాగే కొత్త ఛార్జింగ్ కేస్ అంతర్నిర్మిత స్పీకర్‌తో ఫైండ్ మై ఫంక్షనాలిటీ ఫీచర్‌ను కూడా జోడించిందిట. ఈ ఆపిల్ మెగా ఈవెంట్ ఆపిల్ డాట్‌కామ్,యూ ట్యూబ్‌లో లైవ్ ఉంటుంది. -
కొత్త సిరీస్ లాంచ్ తరువాత పాత సిరీస్‌కు ఆపిల్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందిట. సెప్టెంబరు 7న నిర్వహించనున్న గ్లోబల్ ఈవెంట్ ఆపిల్ కొత్త మోడల్ సిరీస్ వాచెస్ లాంచ్ కాగానే పాత సిరీస్‌ను నిలిపివేయనుందని తెలుస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్‌లు త్వరలో నిలిపియనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా మార్కెట్లో వీటి విక్రయాలను నిలిపివేయనుందట.రాబోయే watchOS 9 Apple Watch Series 3కి సపోర్ట్ చేయని కారణంగా ఆన్లైన్ స్టోర్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతున్న ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్స్‌ను త్వరలో ఆపివేస్తుందని తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే అమెరికా,వాచ్ సిరీస్ 3 కాన్ఫిగరేషన్లలో మూడు ప్రస్తుతం యూకే ఆస్ట్రేలియాలో స్టాక్‌లో లేవనీ, అమెరికా స్టోర్‌లో సిరీస్ 3 మోడల్ అందుబాటులో లేవని MacRumors రిపోర్ట్ చేసింది. 2017లో ఆపిల్ వాచ్ సిరీస్ 3ను లాంచ్ చేసింది. కాగా కరోనా మహమ్మారి రెండేళ్ల తరువాత యుఎస్‌లోని ఆపిల్ కుపెర్టినో క్యాంపస్‌లో మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో నాలుగు ఐఫోన్ 14 మోడల్స్‌తోపాటు, వాచెస్, ఇతర ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తోందని అంచనా. ముఖ్యంగా వాచెస్ సిరీస్ 8, వాచ్ ప్రో, హై-ఎండ్ సిరీస్ 8 మోడల్, సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ ఎస్ఈని లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. -
స్మార్ట్ వాచ్‌ను విసిరి కొట్టాలనుకుంది..కానీ అదే ఆ యువతి ప్రాణాల్ని కాపాడింది!
టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన యాపిల్ వాచ్ అసాధారణ పరిస్థితుల్లో యూజర్లను అలెర్ట్ చేయడం, వారి ప్రాణాల్ని కాపాడడంలాంటి ఘటనల్ని మనం చూశాం. అయితే ఇప్పుడు అదే స్మార్ట్ వాచ్ ప్రమాదకరమైన ట్యూమర్లను గుర్తించి.. వినియోగదారుల ప్రాణాల్ని కాపాడుతున్నాయి. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..అమెరికాకు చెందిన కిమ్ దుర్కీ అనే యువతికి యాపిల్ వాచ్ అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇబ్బందులు తలెత్తిన చేతికి ధరించిన వాచ్‌ను తీసేది కాదు. ఈ తరుణంలో ఈ ఏడాది మే నెలలో రాత్రి నిద్రిస్తున్న కిమ్‌ను ఆమె చేతికి ఉన్న యాపిల్ వాచ్ అలెర్ట్ చేసింది. ఆ అలెర్ట్‌కు సెట్టింగ్ మారిపోయాయేమోనని భావించింది. ఆ మరోసటి రోజు కూడా రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుసుగా మూడు రోజుల పాటు స్మార్ట్ వాచ్ అలెర్ట్‌తో అసహనానికి గురై..ఆ వాచ్‌ను విసిరి కొట్టాలన్న కోపం వచ్చినట్లు కిమ్ తెలిపింది. కానీ ఆ వాచ్ ఎందుకు హెచ్చరికలు జారీ చేసిందోనన్న అనుమానంతో కుటుంబ సభ్యులు కిమ్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు షాకిచ్చారు. యువతికి మైక్సోమా అనే ప్రమాదమైన కణితి శరీరంలో ఏర్పడిందని చెప్పారు. శరీరంలో అరుదుగా ఏర్పడే ఈ కణితి పెరిగితే ప్రమాదమని, వెంటనే ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించాలని తెలిపారు.లేదంటే ట్యూమర్‌తో యువతి గుండెకు రక్తం సరఫరా ఆగిపోతుందని, దీంతో హార్ట్ అటాక్ వస్తుందని బాధితురాలి కుటుంబ సభ్యుల్ని అలెర్ట్ చేశారు. చివరికి వైద్యులు 5గంటల పాటు శ్రమించి కిమ్ శరీరం నుంచి కణితి తొలగించి ఆమె ప్రాణాల్ని కాపాడారు. ఈ సందర్భంగా కిమ్ దుర్కీ మాట్లాడుతూ..యాపిల్ వాచ్ తనకి హెచ్చరికలు జారీ చేయడంతో హార్ట్ బీట్‌లో మార్పులొచ్చాయి. డాక్టర్లని సంప్రదిస్తే ఆందోళన వల్ల ఇలా జరిగిందని చెప్పారు. కానీ మరో మారు అలెర్ట్ రావడంతో మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఈ ప్రమాదకరమైన ట్యూమర్ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకోగలిగాను అంటూ సంతోషం వ్యక్తం చేసింది. -
పెను ప్రమాదంలో ఐఫోన్, యాపిల్ ఉత్పత్తులు..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..!
ఇటీవల ఐఫోన్లతో పాటుగా పలు యాపిల్ ఉత్పత్తులపై కొత్త అప్డేట్ను విడుదల చేసింది యాపిల్. ఈ అప్డేట్తో పలు ఫీచర్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఫేస్ మాస్క్ అన్‌లాక్‌ను ఐఫోన్, ఐపాడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సైబర్-సెక్యూరిటీ వింగ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ డివైజ్‌లను వాడుతున్న వినియోగదారులందరూ వీలైనంత త్వరగా తమ డివైజ్‌లను అప్డేట్ చేయాలని కోరుతూ హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్ల చేతిలోకి..! యాపిల్ ఉత్పత్తుల్లో భద్రత లోపాలు ఉన్నట్లు సెర్ట్-ఇన్ గుర్తించింది. దీంతో యాపిల్ ఉత్పత్తులను హ్యకర్లు సులువుగా అపరేట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆయా యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సులువుగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తాయని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. మెమొరీ ప్రారంభ సమస్య, ఔట్ ఆఫ్ బౌండ్ రీడ్ అండ్ రైట్, మెమరీ కరప్షన్, సెన్సిటివ్ ఇష్యూ టైప్, యూజ్ ఆఫ్టర్ ఫ్రీ, నల్ పాయింటర్ డిరిఫరెన్స్, అథనిటికేషన్ సమస్య, కుకీ మేనేజ్మెంట్ , వ్యాలిడేషన్ ఇష్యూ, బఫర్ ఓవర్‌ఫ్లో, మెమరీ యూజ్ , యాక్సెస్ ప్రాబ్లమ్ వంటి భద్రతా లోపాలు కనుగొన్నామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది. ఈ భద్రతా లోపాల కారణంగా యాపిల్ ప్రొడక్ట్స్‌పై సైబర్ అటాక్ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అప్డేట్ చేయాల్సినవి Apple iOS,iPadOS ఉత్పత్తుల్లో 15.4 కంటే పాత వెర్షన్ Apple WatchOS ఉత్పత్తుల్లో 8.5 కంటే పాత వెర్షన్ Apple TV 15.4 కంటే పాత వెర్షన్ Apple macOS Monterey 12.3 కంటే పాత వెర్షన్ యాపిల్ మాకోస్ కాటాలినా వెర్షన్ కంటే పాత వెర్షన్ చదవండి: ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం భారీ అలర్ట్.. వెంటనే బ్రౌజర్ అప్డేట్ చేయండి? -
చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్ కుక్కు థ్యాంక్స్!
విమాన ప్రమాదంలో తండ్రీ- కూతుర్ని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువకుడ్ని ఇప్పుడు ఊపిరి ఆడక ప్రాణాలు పోతున్న ఓ డాక్టర్‌ను. ఇలా ప్రాంతాలు వేరైనా ఆయా ఘటనల్లో బాధితుల్ని రక్షిస్తుంది మాత్రం వస్తువులే. మనం ‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ అనే సినిమా డైలాగుల్ని వినే ఉంటాం. కానీ పై సంఘటనలు ఆ డైలాగ్ అర్ధాల్నే పూర్తిగా మార్చేస్తున్నాయి. వస్తువుల్ని సరిగ్గా వినియోగించుకుంటే మనుషుల ప్రాణాల్ని కాపాడుతాయని నిరూపిస్తున్నాయి. తాజాగా ఊపిరాడక ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ డెంటిస్ట్‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది. యాపిల్ సంస్థ స్మార్ట్ వాచ్ 'సిరీల్4, సిరీస్ 5, సిరీస్ 6, సిరీస్ 7' లలో ఈసీజీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ 'ఈసీజీ యాప్' చేసే పని ఏంటంటే హార్ట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ పల్సెస్ యాక్టివిటీని మెజర్ చేసి అప్పర్ ఛాంబర్, లోయర్ ఛాంబర్ హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే ఏట్రియాల్ ఫైబ్రిల్లటిన్ atrial fibrillation (AFib) స్మార్ట్ వాచ్‌కు రెడ్ సిగ్నల్స్ పంపిస్తుంది. దీంతో బాధితుల్ని వెంటనే ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. హర్యానాకు చెందిన నితేష్ చోప్రా (34) వృత్తి రీత్యా డెంటిస్ట్. గతేడాది నితేష్‌కు అతని భార్య నేహా నగల్ ఈసీజీ యాప్ ఫీచర్ ఉన్న యాపిల్ వాచ్ 'సిరీస్ 6' ని బహుమతిగా ఇచ్చింది. అయితే నితేష్‌కు తాను ధరించిన యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఫీచర్ గురించి తెలియదు. ఈ నేపథ్యంలో మార్చి 12న నితేష్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాధితుడి భార్య వాచ్‌లో ఈసీజీ యాప్‌ను చెక్ చేయమని భర్తకు సలహా ఇచ్చింది. వెంటనే నితేష్ యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఓపెన్ చేసి చూడగా.. అందులో అతని గుండె పనితీరు గురించి హెచ్చరికలు జారీ చేసింది. వాచ్ అలెర్ట్‌తో నితేష్ హుటాహుటీన వైద్యుల్ని సంప్రదించాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు..నితేష్ గుండెకు స్టెంట్ వేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో ఉన్న తన భర్త ప్రాణాల్ని యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు చెబుతూ యాపిల్ సీఈఓ టీమ్ కుక్ మెయిల్ చేసింది. "నా భర్తకు 30వ పుట్టిన రోజు సందర్భంగా యాపిల్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. అదే వాచ్ నా భర్త ప్రాణాల్ని కాపాడుతుందని అనుకోలేదు. ప్రమాదంలో ఉన్నాడని స్మార్ట్ వాచ్ హెచ్చరించినందుకు కృతజ్ఞతలు. నా భర్త ఆరోగ్యం కుదుట పడింది. నా భర్తకు జీవితాన్ని ప్రసాదించిన మీకు, అందులో భాగమైన టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలుపుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు మెయిల్లో పేర్కొంది. అనూహ్యంగా నేహా మెయిల్‌కు టిమ్ కుక్ స్పందించారు. సకాలంలో మీ భర్తకు ట్రీట్మెంట్ అందినందుకు చాలా సంతోషిస్తున్నాను. స్మార్ట్ వాచ్ మీ భర్తను కాపాడిందనే విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ టిమ్ కుక్ నేహా మెయిల్‌కు రిప్లయి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్ -
అచ్చం ఆ సినిమా తరహాలోనే మనిషి ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్..!
ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఉత్పత్తులంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతారు. ఆ కంపెనీ ఉత్పత్తులు మన చేతిలో ఉంటే చాలా రిచ్'గా కూడా ఫీల్ అవుతారు. రిచ్ సంగతి ఎలా ఉన్నా ఆపిల్ ఉత్పత్తులు ఇప్పుడు మనిషి ప్రాణాల్ని కూడా కాపాడుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.. అచ్చం చిత్రలహరి సినిమా తరహాలోనే ఆపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. జనవరి 22 ఉదయం 1:30 గంటల సమయంలో కాలిఫోర్నియాలో ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్న ఒక వ్యక్తి ఆకస్మికంగా కింద పడటంతో హెర్మోసా బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్కు కాల్ వచ్చినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. కాల్ వచ్చిన వెంటనే పోలీసులు స్పందించి అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తి పడటం డిటెక్షన్ చేసిన వాచ్ స్వయంచాలకంగా అత్యవసర సేవల నంబర్'కు డయల్ చేసింది. పోలీసులు సకాలంలో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఆ వాచ్ యజమాని బైక్ పక్కన రక్తం మడుగులో పడి ఉండటం చూశారు. తక్షణమే పోలీసులు అతనికి సంఘటనా స్థలంలో తాత్కాలిక చికిత్స చేసి, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిని విడుదల చేశారు. యాపిల్ వాచ్ ఎస్ఈ/యాపిల్ వాచ్ 4 సిరీస్ కంటే ఎక్కువ వాచ్‌లలో ప్రమాదం జరిగినప్పుడు గుర్తించే డిటెక్షన్ ఫీచర్స్ ఉంటాయి. మీరు అలాంటి వాచ్ ధరించి పడిపోయినప్పుడు మీకు ఒక అలారం లాంటి సౌండ్ మీకు వస్తుంది. అలాగే, డిస్ ప్లే మీద అలర్ట్ మెసేజ్ కూడా కనిపిస్తుంది. మీరు కదిలే స్థితలో ఉంటే దాని నుంచి అత్యవసర సేవలకు సంప్రదించవచ్చు. ఒకవేళ, ప్రమాదంలో పడిపోయి వ్యక్తి ఒక నిమిషం పాటు కదలకుండా ఉన్నారని వాచీ గుర్తించినట్లయితే, వాచ్ స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది. బైక్ పై నుంచి పడిపోయిన వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. (చదవండి: ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు చోటు!) -
ఆపిల్ వాచ్ సేల్స్ ప్రారంభం..ఫీచర్లు మాములుగా లేవుగా!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ స్మార్ట్ వాచ్ భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. దసరా సందర్భంగా ఇండియాలో ఆపిల్ వాచ్ 7సిరీస్ అమ్మకాల్ని ప్రారంభించింది. యాపిల్ ఈ ఏడాది 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్'ను నిర్వహించింది.‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో ఆపిల్ వాచ్ 7సిరీస్‌ను విడుదల చేయగా..దసరా పండుగ సందర్భంగా వాచ్‌పై ఆపిల్ అమ్మకాల్ని ప్రారంభించింది. ఆపిల్ వాచ్ సిరీస్ 7 ఫీచర్లు ఆపిల్ వాచ్ సిరీస్7 41ఎంఎం అండ్ 45 ఎంఎం సైజ్, రెటీనా డిస్ప్లే, 1.7ఎంఎం థిన్ బెజెల్స్ ఫీచర్లు ఉన్నాయి. డబ్ల్యూఆర్ 50 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, క్వర్టీ కీబోర్డ్‌తో వస్తుంది. ఇక ఈ వాచ్‌ను 45 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్ పెట్టుకోవచ్చుని ఆపిల్ తెలిపింది. యూఎస్బీ -సీ ఛార్జింగ్ కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.క్వర్టీ కీబోర్డ్ యాపిల్ వాచ్ సిరీస్ 6 మాదిరిగానే, ఆపిల్ వాచ్ సిరీస్ 7లో బ్లడ్ ఆక్సిజన్ (SpO2), ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్లు ఉన్నాయి. ఈ సెన్సార్ల ఆధారంగా హార్ట్ ట్రాకింగ్ ఈజీ అవుతుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 7 ధరలు భారత్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 7 ప్రారంభ ధర రూ. 41,900కే లభించనుంది. 41ఎంఎం సైజ్ వేరియంట్లో అల్యూమినియం కేస్, జీపీఎస్ సెల్యూలర్ వెర్షన్ మోడల్ ధర రూ. 50,900కే అందుబాటులో ఉంది. 45 ఎంఎం వేరియంట్ ధర రూ. 44,900, 45 ఎంఎం సైజ్‌లో జీపీఎస్ ప్లస్ సెల్యులర్ ధర రూ.53,900గా ఉంది. అల్యూమినియం కేస్ ఆప్షన్, స్పోర్ట్స్ బ్యాండ్‌తో స్టైన్ లెస్ స్టీల్ కేస్‌తో ఉన్న వాచ్ ధర రూ.69,900గా ఉంది. ఇక మిలనీస్ లూప్ స్ట్రాప్‌తో స్టెయిన్లెస్ స్టీల్ కేస్ ధర రూ. 73,900గా ఉంది. టైటానియం కేస్‌లో లెదర్ లింక్ స్ట్రాప్‌తో ఉన్న వాచ్ ధర రూ. 83,900గా ఉందని ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్ పోర్టల్‌లో అధికారికంగా తెలిపింది. డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఆపిల్ ఆథరైజ్డ్ డిస్టిబ్యూటర్స్, రీసెల్లర్ స్టోర్స్, ఇతర ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లలో ఈ ఆపిల్ వాచ్ సిరీస్7 కొనుగోలపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.3వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. ఇక కొన్ని స్టోర్లలో రూ.9వేల వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. -
మనుషులు పట్టించుకోలేదు.. స్మార్ట్ వాచ్ బతికించింది
Apple Smart Watch Saves Singapore Man's Life: ‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించవలసిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ ఓ ఫేమస్ సిన్మా డైలాగ్ ఇది. కానీ, ఈ ఘటన చదివాక వస్తువులనే ప్రేమించడం బెటర్ ఏమో అనిపించకమానదేమో!. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే.. అటుపక్కగా వెళ్తున్న వాళ్లు ‘మనకెందుకు లే’ అనుకుంటూ వెళ్లిపోయారు. కానీ, అతని చేతికున్న స్మార్ట్ వాచ్ మాత్రం విధిగా పని చేసి అతని ప్రాణాల్ని నిలబెట్టింది. సెప్టెంబర్ 25న సింగపూర్ అంగ్ మో కియో టౌన్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మహముద్ ఫిట్రీ(24) అనే వ్యక్తి బైక్ మీద వెళ్తుండగా టౌన్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. సాయంత్రం ఏడున్నర గంటల టైంలో యాక్సిడెంట్ జరగ్గా.. జనాలు పక్కనుంచి చూస్తూ వెళ్లిపోయారే తప్ప సాయం అందించేందుకు ముందుకు రాలేదు. కనీసం ఆంబులెన్స్‌కు కాల్ చేయాలనే ప్రయత్నం కూడా చేయలేదు ఎవరూ(ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది). ఆ టైంలో అతని చేతికున్న వాచ్ అతని ప్రాణం కాపాడింది. ఫిట్రీ చేతికి ఉంది ఓ స్మార్ట్‌వాచ్. ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే.. కాల్స్‌కు, మెసేజ్‌లకు యూజర్ స్పందించకపోతే (కట్ చేయడం తప్పించి) ఆ వ్యక్తి ఆపదలోఉన్నట్లు గుర్తించి.. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో ఉన్న నెంబర్లను అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు ప్రమాదాలకు గురైనప్పుడు, ఏదైనా బలంగా ఢీకొట్టినప్పుడు.. స్మార్ట్ వాచ్ నుంచి ‘ఫాల్ అలర్ట్’ మోగుతుంది. యూజర్ ఒకవేళ దానిని ఆఫ్ చేయకపోతే.. సదరు వ్యక్తి ఆపదలో ఉన్నట్లు నిర్ధారించుకుంటుంది ఆ వాచ్. తద్వారా అతని కాంటాక్ట్‌లో ఉన్న లిస్ట్‌కు కాల్స్, మెసేజ్‌లు పంపించి అప్రమత్తం చేస్తుంది. ఫిట్రీకి ప్రమాదం జరిగిన 30 నిమిషాలకు స్మార్ట్ వాచ్‌లోని అలర్ట్ ద్వారా సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రమాద స్థలానికి చేరుకుంది. అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి చేర్చింది. టైంకి చికిత్స అందడంతో ఆ యువకుడి ప్రాణాలు నిలిచాయి. ఇదిలా ఉంటే యాపిల్ 4 సిరీస్ వాచ్‌ను ఫిట్రీకి అతని గర్ల్‌ఫ్రెండ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో నార్త్ కరోలినాకు చెందిన ఓ వృద్ధుడి ప్రాణాల్ని స్మార్ట్ వాచ్ నిలబెట్టిన సంగతి తెలిసిందే. చదవండి: స్మార్ట్‌వాచ్ చెప్పేవరకు తెలీదు ఆమెకు గుండెపోటు వచ్చిందని!! ఇదీ చదవండి: రన్నింగ్ కోచ్ జీవితాన్ని కాపాడిన స్మార్ట్‌వాచ్..! -
Apple: ఏంది యాపిల్ ఇది.. భారత్ అంటే లెక్కేలేదా?
Anupam Kher On Apple: యాపిల్ ఉత్పత్తుల పట్ల భారతీయులకు యమ క్రేజు ఉంటుంది. పైగా ఆ ప్రొడక్టుల కొనుగోళ్లలో భారత్ అతిపెద్ద మార్కెట్ అని తెలిసిన విషయమే కదా. అందుకే తాజాగా జరిగిన అతిపెద్ద ఈవెంట్‌ను భారత్ నుంచే ఎక్కువ మంది లైవ్‌లో వీక్షించారు. అయితే యాపిల్ మాత్రం భారత్ విషయంలో లెక్కలేని తనం ప్రదర్శిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. నటుడు అనుపమ్ ఖేర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్ ఫిఫ్త్ ఎవెన్యూలోని యాపిల్ స్టోర్‌ను మొన్న మంగళవారం ఆయన సందర్శించారట. అక్కడ ఒలింపిక్స్ కలెక్షన్ పేరుతో కొన్ని వాచీలను డిస్ప్లే ఉంచారు. ఆ వాచీలపై దాదాపు అన్ని జెండాలు ఆయనకు కనిపించాయి. అయితే భారత్ జెండా కనిపించకపోయే సరికి ఆయన చిన్నబుచ్చుకున్నారు. ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. స్మార్ట్ వాచీ కలెక్షన్ బాగుంది. కెనెడా, ఆసీస్, ఫ్రాన్స్.. జమైకా లాంటి చిన్న దేశాల జెండాలతో కలెక్షన్స్ ఉంచారు. కానీ, అందులో భారత్ జెండా మాత్రం లేదు. ఈ విషయంలో నిరాశ చెందాను.. కారణం ఏమై ఉంటుంది? యాపిల్ ఉత్పత్తులను ఉపయోగించేవాళ్లు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు కదా! మరి మా జెండా కనిపించలేదా? అని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే యాపిల్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి! Dear @Apple! Visited your store on 5th ave in NY! Impressive! There were watches of International Olympic collection representing flags of various countries! Was disappointed not to see INDIA’s watch there? I wonder why? We are one of the largest consumers of #Apple products!😳🇮🇳 pic.twitter.com/IVvB8TmkGU — Anupam Kher (@AnupamPKher) September 14, 2021 చదవండి: ఐఫోన్ 13 లాంఛ్.. ఊహించని ట్విస్ట్ -
Apple: పడిపోయిన యాపిల్ మార్కెట్! భారమంతా ఐఫోన్ 13 పైనే?
Apple iPhone 13: టెక్ దిగ్గజం యాపిల్‌కి షాక్ తగిలింది. నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ తాజా లెక్కలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తగ్గిన అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ట్రెండ్ ఫోర్స్ సంస్థ తాజా గణంకాలు విడుదల చేసింది. ఇందులో రెండో క్వార్టర్‌కి సంబంధించి గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు 13.7 శాతానికే పరిమితమైనట్టుగా తెలిపింది. గతేడాది ఫోన్ అమ్మకాలతో పోల్చితే 22 శాతం మేరకు ఐఫోన్ అమ్మకాలు తగ్గినట్టు ట్రెండ్‌సెట్ పేర్కొంది. నాలుగో స్థానానికి ఒక్కసారిగా ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో యాపిల్ సంస్థ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసినికి సంబంధించిన అమ్మకాల్లో 19 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 16.1 శాతం అమ్మకాలతో షావోమీ, ఒప్పోలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాటి తర్వాత 13.7 శాతం మార్కెట్‌తో యాపిల్ నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.1 శాతం వాటాతో వివో ఐదో స్థానంలో ఉంది. వివో సంస్థ అమ్మకాల్లో సైతం 18 శాతం తగ్గుదల నమోదైంది. ఐఫోన్ 13పైనే భారం యాపిల్ సంస్థ ఈ నెలాఖరు కల్లా సరికొత్త మోడల్ ఐఫోన్ 13ను రిలీజ్ చేయబోంది. ఇప్పటికే ఐఫోన్ 13 ఫీచర్లకు సంబంధించి మార్కెట్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌తో పని లేకుండా లో ఎర్త్ ఆర్బిట్ టెక్నాలజీపై ఐఫోన 13 పని చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఐఫోన్ 13కి మరింత క్రేజ్ తెచ్చేందుకు యాపిల్ వాచ్ 7 సిరీస్‌ను సైతం రిలీజ్ వచ్చంటూ కథనాలు వస్తున్నాయి. మొత్తంగా పడిపోయిన మార్కెట్ షేర్‌ను దక్కించుకునేందుకు ఐఫోన్ 13పైనే ఆ సంస్థ భారం వేసింది. చదవండి: గూగుల్ సెర్చ్‌లో తొలి పదం.. ఆసక్తికరమైన విషయం -
థర్మామీటర్ గడియారాలొస్తున్నాయ్!
టెక్ వరల్డ్‌లో కింగ్ మేకర్‌గా ఉన్న ఆపిల్ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతుంది. భూమి నుంచి 500 కి.మీ ఎత్తులో ఉండే 'లో ఎర్త్ ఆర్బిట్' సాయంతో సిమ్ లేకుండా వాయిస్ కాల్, బ్రౌజింగ్.. పోయిన వస్తువుల్ని గుర్తించేందుకు ఎయిర్ ట్యాగ్స్, గేమ్ లవర్స్ గేమ్ ఆడి సమయంలో ఢీలా పడిపోకుండా యాక్టీవ్‌గా ఉండేలా వైర్ లెస్ ఇయర్ పాడ్ ఇలా కొత్త కొత్త టెక్నాలజీలను ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో అడుగు ముందుకేసింది. జ్వరాన్ని గుర్తించేందుకు ఉపయోగించే థర్మా మీటర్ వాచ్‌లను (గడియారాలను) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. చదవండి: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్పై ఎలన్ మస్క్ కీలక ప్రకటన ! ఇప్పటికి ఎన్ని ధర్మామీటర్లు ఉన్నాయంటే గెలీలియో గెలీల! ఇటలీకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్రయోగాలతో ప్రమేయం లేకుండా సృష్టిలోని నిజాల్ని స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చనే అరిస్టాటిల్ సిద్ధాంతాల్ని విభేదించారు. ఆ విభేదాలతో ఆర్ధికంగా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు గెలీల.. మూసి ఉన్న గాజు గొట్టంలో గాలిని నింపి దానిని ఒక నీరు ఉన్న పాత్రలో ఉంచినపుడు ఆ గాలి తరగాల ఆధారంగా థర్మామీటర్‌ను కనిపెట్టారు. ఇన్నోవేటర్స్ ఆ ధర్మామీటర్‌ను కాలానికి అనుగుణంగా మారుస్తూ వచ్చారు. అలా వచ్చినవే మనో మెట్రిక్ థర్మామీటర్, లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్, గ్యాస్ థర్మామీటర్, బయోమెటల్ థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్లు .. తాజాగా కరోనా కారణంగా ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ వినియోగం ఎక్కువైంది. అయితే రాను రాను ఈ థర్మామీటర్లు కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది. వాచ్ థర్మామీటర్ అంటే! యూజర్లకు అనుగుణంగా ఆయా టెక్ దిగ్గజాలు ధర్మా మీటర్ల స్థానంలో వాచ్ థర్మామీటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇప్పటికే సౌత్ కొరియా టెక్ జెయింట్ శాంసంగ్ గతేడాది ' Samsung Galaxy Watch Active 2' పేరుతో బ్లడ్ ప్రెజర్ ను గుర్తించేందుకు స్మార్ట్‌వాచ్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే తాజాగా ఆపిల్ సైతం ప్రత్యర్ధి టెక్ కంపెనీలకు చెక్ పెట్టేలా థర్మామీటర్ వాచ్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాచ్ సాయంతో బ్లడ్ ప్రజెర్, టెంపరేచర్, స్లీప్, బ్లడ్ షుగర్ లను గుర్తించేలా బిల్డ్ చేయనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. వాచ్ బిల్డ్ చేయడం కంప్లీట్ అయినా మార్కెట్లోకి వచ్చే ఏడాది విడుదల కానుందని తెలిపింది. -
ఆపిల్ లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే?!
మీరు ఆపిల్ ప్రాడక్ట్ లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. సెప్టెంబర్ 14, 15 తేదీలలో (అంచనా) ఆపిల్ సంస్థ 'వరల్డ్ డెవలపర్ కాన్ఫిరెన్స్' (wwdc) 2021 ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున కొత్త ప్రాడక్ట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బ్లూమ్ బెర్గ్ కథనం ప్రకారం..ఆపిల్ సంస్థ ప్రతి ఏడాది డెవలపర్ కాన్ఫిరెన్స్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.ఈ ఈవెంట్లో విడుదల చేయబోయే ఉత్పత్తుల గురించి అనౌన్స్ చేస్తుంది. వచ్చే నెలలో జరగనున్న ఈవెంట్లో యాపిల్ వాచ్ 7 సిరీస్, ఐపాడ్ మినీ 6, ఆపిల్ ఎయిర్ పాడ్స్ 3, ఐపాడ్ మినీ 6 విడుదల చేయనున్నట్ల బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. పై ప్రాడక్ట్స్తో పాటు గతేడాది వరల్డ్ డెవలపర్ కాన్ఫిరెన్స్ 2020లో విడుదల కాకుండా ఆగిపోయిన ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఐపాడ్స్‌ను విడుదల చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 13 ఐఫోన్ 13లో కొన్ని ముఖ్యమైన డిజైన్, హార్డ్‌వేర్ లను మార్చనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రిమ్డ్ డౌన్ డిస్ప్లే నాచ్, ఫేస్-ఐడి కాంపోనెంట్లను యాడ్ చేయనుంది. ఫేస్ ఐడి సిస్టమ్‌లో వీఎస్సీఈఎల్ (Vertical-cavity surface-emitting laser) చిప్‌ని జోడించడం, ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ లలో 120 హెచ్ జెడ్ ఎల్టీపీఓ డిస్ ప్లేలు, లార్జ్ సైజ్ బ్యాటరీతో రిలీజ్ చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా. ప్రస్తుతం ఐఫోన్ 12 మోడల్‌కు 512జీబీ స్టోరేజ్‌ను అందిస్తుండగా ఐఫోన్13 ను 1టెరాబైట్ స్టోరేజ్‌తో అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఐఫోన్ 13 వివరాలు అందుబాటులో ఉండగా.. మిగిలిన ప్రాడక్ట్‌ల వివరాలను ఆపిల్ సంస్థ పూర్తి స్థాయిలో రివిల్ చేయలేదు. చదవండి : వాట్సాప్‌లో మరో ఫీచర్, ఇకపై ఐపాడ్లో కూడా -
రన్నింగ్ కోచ్ జీవితాన్ని కాపాడిన స్మార్ట్‌వాచ్..!
వాషింగ్టన్: మానవుడి నిత్యజీవితంలో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు ఒక భాగమైయ్యాయి. కోవిడ్-19 రాకతో స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్ గణనీయంగా పెరిగింది. కోవిడ్ సమయంలో స్మార్ట్ వాచ్‌లు ఆక్సిజన్ లెవల్స్‌ను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. స్మార్ట్‌వాచ్‌లు యూజర్లకు అనేక విధాలుగా రక్షణను కల్పిస్తున్నాయే ఉన్నాయి. గతంలో ఓ మహిళను కిడ్నాపర్ల చెర నుంచి కాపాడటం.., పల్స్ పడిపోతున్న మహిళను కాపాడిన స్మార్ట్‌వాచ్ అంటూ అనేక వార్తలను చదివే ఉంటాం. తాజాగా ఆపిల్ స్మార్ట్‌వాచ్ రన్నింగ్ కోచ్‌ను ప్రాణపాయ పరిస్థితుల నుంచి కాపాడింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూయర్క్‌కు చెందిన 25 ఏళ్ల బ్రాండన్ ష్నైడర్ ఒక రన్నింగ్ కోచ్. తన కోచింగ్‌ను ముగించుకుని బాత్రూమ్లో ఫ్రేష్ అవుతున్న సందర్బంలో బ్రాండన్ పల్స్ ఒక్కసారిగా పడిపోయింది. ఆపిల్ వాచ్‌లో ఉన్న ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌తో వెంటనే అతని బంధువులను అలర్ట్ చేసింది. బంధువులు వెంటనే స్పందించి బ్రాండన్ సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. బ్రాండన్‌కు పరీక్షలు చేయగా అతని మెదడులో రక్త గడ్డకటిన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. అందువల్లనే బ్రాండన్ స్పృహ తప్పి పడిపోయారని పేర్కొన్నారు. కాగా డాక్టర్లు వెంటనే అతడికి ఆపరేషన్ చేసి ప్రాణపాయ పరిస్ధితుల నుంచి కాపాడగల్గిగారు. ఈ విధంగా ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లో ఉన్న సడన్ ఫాల్ ఫీచర్ బ్రాండన్ ప్రాణాలను కాపాడింది. ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌ను 2018లో ఆపిల్ స్మార్ట్‌వాచ్ సిరీస్ 4 లో తొలిసారిగా ఆపిల్ పరిచయం చేసింది. -
గడియారం చెప్పేవరకు తెలీదు ఆమెకు గుండెపోటు వచ్చిందని
వాషింగ్టన్: యాపిల్ స్మార్ట్ వాచ్ వీరోచిత గాథలు కొనసాగతునే ఉన్నాయి. గతంలో ఓ మహిళను కిడ్నాపర్ల చెర నుంచి కాపాడటం.. మధ్యప్రదేశ్‌లో ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైనం చదివాం. తాజాగా ఓ మహిళను గుండెపోటు బారిన పడి చనిపోకుండా కాపాడింది యాపిల్ స్మార్ట్ వాచ్. ఆ వివరాలు.. మిచిగాన్కు చెందిన డయాన్ ఫీన్స్ట్రా అనే మహిళకు ఓ రోజు యాపిల్ స్మార్ట్ వాచ్‌లో తన హృదయ స్పందనలు అసాధరణంగా నమోదవ్వడం గమనించింది. భర్తను పిలిచి దాన్ని చూపించింది. వెంటనే అతడు డయాన్ను ఆస్పత్రికి వెళ్లమని సూచించాడు. హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత డాక్టర్లు డయాన్‌కు ఈసీజీ నిర్వహించగా.. ఆమెకు కొన్ని రోజుల క్రితం గుండెపోటు వచ్చిందని.. కానీ దాని గురించి డయాన్‌కు తెలియలేదని గుర్తించారు. ఈ క్రమంలో డయాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఏప్రిల్ 22న నా గుండె నిమిషానికి 169 సార్లు కొట్టుకుంది. కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు, కనీసం మెట్లు ఎక్కినప్పుడు కూడా గుండె ఇంత వెగంగా కొట్టుకోలేదు. అందుకే నా భర్తను పిలిచి.. తనకు ఇది చూపించి.. ఏమైనా సీరియసా అని అడిగాను. ఆయన నన్ను ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. వాచ్ రికార్డైన హృదయస్పందనలు పరిశీలించి.. ఈసీజీ నిర్వహించారు. గతంలో నాకు గుండెపోటు వచ్చింది.. కానీ దాని గురించి నాకు తెలయలేదని తెలిపారు. ఇక పురుషులతో పోల్చుకుంటే.. మహిళల్లో గుండెపోటు సందర్భంగా కనిపించే లక్షణాలు చాలా వేరుగా ఉంటాయి’’ అని డయాన్ తెలిపారు. ‘‘ఇక వయసు పెరుగుతున్న కొద్ది నా ఎడమ చేతిలో నొప్పి.. ఎడమ పాదంలో వాపు వంటి లక్షణాలను నేను గమనించాను. అయితే గ్యాస్ సమస్య వల్ల ఇలా అనిపిస్తుందనుకున్నాను. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే నా భుజంలో నొప్పి వచ్చేది. కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాను’’ అని తెలిపారు డయాన్. ఈసీజీ రిపోర్టు తర్వాత మరిన్ని టెస్టులు చేసి.. డయాన్‌కు స్టెంట్ వేయడం అవసరం అని తెలిపారు వైద్యులు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి.. స్టెంట్ వేశారు. ఈ క్రమంలో డయాన్.. జనాలు ఎప్పటికప్పుడు తమ హృదయ స్పందనలు చెక్ చేసుకుంటే.. గుండెపోటు బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని సూచిస్తున్నారు. -
10కోట్లకు పైగా అమ్ముడైన ఆపిల్ వాచ్‌లు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల వినియోగదారులు ఆపిల్ వాచ్‌ను ధరిస్తున్నారని ఆపిల్ ఉత్పత్తుల విశ్లేషకుడు నీల్ సైబర్ట్ తెలిపారు. నీల్ సైబర్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఆపిల్ వాచ్ 10 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి 6 సంవత్సరాల కన్నా తక్కువ సమయం పట్టింది. 2020లోనే 30 మిలియన్ల మంది కొత్త వినియోగదారులు ఆపిల్ వాచ్‌ను కొన్నట్లు నీల్ సైబర్ట్ పేర్కొన్నారు. అయితే ఈ వినియోగదారుల సంఖ్య 2015, 2016, 2017 సంవత్సరాల్లో ఆపిల్ వాచ్ కొన్న వినియోగదారుల కంటే ఎక్కువ. పది కోట్ల మంది కొనుగోలుదారులతో ఆపిల్ వాచ్ ఆపిల్ ఐఫోన్, ఐపాడ్, మాక్ తర్వాత నాలుగో అతిపెద్ద ఆపిల్ ప్రోడక్ట్‌గా నిలిచిందని సైబర్ట్ చెప్పారు. ప్రస్తుత అమ్మకాలు చూస్తే 2022లో ఆపిల్ వాచ్ మాక్ ఉత్పత్తులను అధిగమించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఐప్యాడ్‌ను అధిగమించడానికి ఎక్కువ సమయం పట్టనున్నట్లు నీల్ సైబర్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020 చివరిలో యుఎస్‌లో సుమారు 35శాతం ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ వాచ్ ధరించారు. యాక్టివిటీని పర్యవేక్షించడం, కీలక ఆరోగ్య డేటా మానిటర్ వంటి వినూత్న ఫీచర్లతో ఆపిల్ వాచ్ యూజర్లను ఆకట్టుకొన్నట్టు అనలిస్ట్ నీల్ సైబర్ట్ తెలిపారు. ఆపిల్ వాచ్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో 55 శాతం వాటా కలిగి ఉంటే, శామ్సంగ్ 13.9 శాతం వాటాను కలిగి ఉంది. గ్లోబల్ మార్కెట్లో 8 శాతం వాటాతో గార్మిన్ రబుల్ మార్కెట్లో మూడవ స్ధానంలో నిలిచింది. చదవండి: కర్ణాటకలో టెస్లా ప్లాంట్ సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు!