అవును. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. దీంతో ఆ కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ ఆలోచనలో పడ్డారు. వెంటనే యూజర్లకు అలెర్ట్ జారీ చేశారు.
‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటే ఇదే’ ఈ సామెత వినే ఉంటారు. ఇప్పుడు ఇదే అంశం టిమ్ కుక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ మార్కెట్‌లో యాపిల్ కంపెనీ పేరు చెప్పి.. నకిలీ ఉత్పత్తుల్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు నకిలీ రాయుళ్లు. దీంతో నకిలీ ఉత్పత్తుల నుంచి యూజర్లను అప్రమత్తం చేశారు టిమ్‌కుక్.
తమ సంస్థ తయారు చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గాడ్జెట్స్‌లకు ఉపయోగించే ఛార్జర్ల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల స్మార్ట్ మార్కెట్‌లో ఫేక్ ఛార్జర్ల బెడద ఎక్కువైంది. ఫలితంగా యాపిల్ ఉత్పత్తులకు ఛార్జింగ్ వెంటనే అయిపోవడంతో పాటు బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోతున్నట్లు యాపిల్ గుర్తించింది.
యూజర్లకు సూచనలు
ఈ నేపథ్యంలో కస్టమర్లకు యాపిల్ సంస్థ కొన్ని సూచనలు ఇచ్చింది. యూజర్ల భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఛార్జర్లను తయారు చేస్తామని, తద్వారా ఉత్పత్తుల పనితీరు, లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు, యాపిల్ ఛార్జర్లు యాపిల్ ఎఫ్‌ఐ సర్టిఫైడ్ గుర్తింపుతో పాటు యాపిల్ వాచ్ బ్యాడ్జ్‌లు ఉంటాయని చెప్పింది.
యాపిల్ ఛార్జర్లు ఈ రంగులోనే ఉంటాయ్
దీంతో పాటు యాపిల్ ప్రొడక్ట్‌ల కోసం కంపెనీ తయారు చేసిన ఛార్జర్లు ఏ రంగులో ఉంటాయి. మార్కింగ్, రెగ్యులేటరీ సమాచారం ఎలా ఉంటుందో వివరించింది. కుపెర్టినో (యాపిల్) కేవలం తెలుపు రంగు ఛార్జర్లనే కస్టమర్లకు అందిస్తుంది. తెలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో ఉంటే ఖచ్చింతంగా అవి ఫేక్ ఛార్జర్లేనని గుర్తించాలి. ఛార్జర్లపై యాపిల్ బ్యాడ్జి సైతం ఉంటుంది. ఒకవేళ నిజమైన ఛార్జర్లకు, నకిలీ ఛార్జర్‌లను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన యాపిల్.. సంస్థ తయారు చేసే ఒరిజినట్ ఛార్జర్‌ల సిరీస్ వివరాల్ని వినియోగదారులకు అందించింది.
ఇవి మాత్రమే ఒరిజినల్
ఏ1570, ఏ1598, ఏ1647, ఏ1714, ఏ1768,ఏ1923, ఏ2055, ఏ2056,ఏ2086, ఏ2255, ఏ2256, ఏ2257, ఏ2458, ఏ2515, ఏ2652, ఏ2879లను మాత్రమేనని చెప్పింది.
‘మేడ్ ఫర్ యాపిల్ వాచ్’
నకిలీ ఎంఎఫ్‌ఐ సర్టిఫైడ్ ఛార్జర్‌లకు యాపిల్ ఎంఎఫ్‌ఐ ఛార్జర్‌లకు పోలికలు చూడాలి. ఛార్జర్‌లపై ‘మేడ్ ఫర్ యాపిల్ వాచ్’ అని ఉంటుంది. ఐఫోన్, ఐపాడ్, ఐపోడ్, యాపిల్ వాచ్‌లపై ఎంఎఫ్‌ఐ లోగో, మ్యాగ్నెటిక్ టెక్నాలిజీతో మ్యాగ్‌సేఫ్ ఉంటుందని, వీటిని మాత్రమే వినియోగించాలని యాపిల్ సంస్థ యూజర్లకు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment