టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన యాపిల్ వాచ్ అసాధారణ పరిస్థితుల్లో యూజర్లను అలెర్ట్ చేయడం, వారి ప్రాణాల్ని కాపాడడంలాంటి ఘటనల్ని మనం చూశాం. అయితే ఇప్పుడు అదే స్మార్ట్ వాచ్ ప్రమాదకరమైన ట్యూమర్లను గుర్తించి.. వినియోగదారుల ప్రాణాల్ని కాపాడుతున్నాయి.
వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..అమెరికాకు చెందిన కిమ్ దుర్కీ అనే యువతికి యాపిల్ వాచ్ అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇబ్బందులు తలెత్తిన చేతికి ధరించిన వాచ్‌ను తీసేది కాదు. ఈ తరుణంలో ఈ ఏడాది మే నెలలో రాత్రి నిద్రిస్తున్న కిమ్‌ను ఆమె చేతికి ఉన్న యాపిల్ వాచ్ అలెర్ట్ చేసింది. ఆ అలెర్ట్‌కు సెట్టింగ్ మారిపోయాయేమోనని భావించింది. ఆ మరోసటి రోజు కూడా రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుసుగా మూడు రోజుల పాటు స్మార్ట్ వాచ్ అలెర్ట్‌తో అసహనానికి గురై..ఆ వాచ్‌ను విసిరి కొట‍్టాలన్న కోపం వచ్చినట్లు కిమ్ తెలిపింది.
కానీ ఆ వాచ్ ఎందుకు హెచ్చరికలు జారీ చేసిందోనన్న అనుమానంతో కుటుంబ సభ్యులు కిమ్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు షాకిచ్చారు. యువతికి మైక్సోమా అనే ప్రమాదమైన కణితి శరీరంలో ఏర్పడిందని చెప్పారు. శరీరంలో అరుదుగా ఏర్పడే ఈ కణితి పెరిగితే ప్రమాదమని, వెంటనే ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించాలని తెలిపారు.లేదంటే ట్యూమర్‌తో యువతి గుండెకు రక్తం సరఫరా ఆగిపోతుందని, దీంతో హార్ట్ అటాక్ వస్తుందని బాధితురాలి కుటుంబ సభ్యుల్ని అలెర్ట్ చేశారు.
చివరికి వైద్యులు 5గంటల పాటు శ్రమించి కిమ్ శరీరం నుంచి కణితి తొలగించి ఆమె ప్రాణాల్ని కాపాడారు. ఈ సందర్భంగా కిమ్ దుర్కీ మాట్లాడుతూ..యాపిల్ వాచ్ తనకి హెచ్చరికలు జారీ చేయడంతో హార్ట్ బీట్‌లో మార్పులొచ్చాయి. డాక్టర్లని సంప్రదిస్తే ఆందోళన వల్ల ఇలా జరిగిందని చెప్పారు. కానీ మరో మారు అలెర్ట్ రావడంతో మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఈ ప్రమాదకరమైన ట్యూమర్ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకోగలిగాను అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment