టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి అమెరికా క్యాలిఫోర్నియాలో క్యూపార్టినో నగరంలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో టిమ్ కుక్.. ఐఫోన్14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్, వాచ్ సిరీస్ 8, వాచ్ సిరీస్ ఎస్‌ఈ 2, వాచ్ ఆల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా యాపిల్ వాచ్ అల్ట్రా, వాచ్ ఎస్‌ఈ2, ఎయిర్ ప్రాడ్స్ ప్రో 2 గురించి తెలుసుకుందాం.
యాపిల్ వాచ్ అల్ట్రా స్పెసిఫికేషన్లు
యాపిల్ వాచ్ అల్ట్రా 49ఎంఎం డయల్‌తో వస్తుంది. sapphire గ్లాస్‌తో, వాచ్‌ను టైటానియంతో రూపొందించారు. వాచ్ పెట్టుకుంటే ఎలాంటి ఇరిటేషన్‌లేకుండా చర్మానికి అనువుగా ఉంటుంది. అతిపెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ వాచ్‌ను 36 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. తక్కువ పవర్ మోడ్‌తో 60 గంటల వరకు పొడిగించవచ్చు.
తక్కువ సెల్యులార్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో పనిచేసేలా డ్యూయల్ జీపీఎస్‌తో వస్తుందని యాపిల్ తెలిపింది. హైకింగ్, ఇతర కార్యకలాపాలలో సహాయపడుతుంది. డబ్ల్యూఆర్ 100 రేటింగ్‌ను కలిగి ఉన్న ఈ వాచ్‌ను నీటిలో 100అడుగుల లోతు వరకు ధరించవచ్చు. వీటితో పాటు క్రాష్ డిటెక్షన్, కంపాస్, డెప్త్ గేజ్, నైట్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర 799 డాలర్లు ఉండగా (భారత్‌లో రూ.89,900) సెప్టెంబర్ 23 నుంచి లభించనుంది.
యాపిల్ వాచ్ ఎస్‌ఈ (సెకండ్ జనరేషన్) స్పెసిఫికేషన్‌లు
యాపిల్ వాచ్ ఎస్‌ఈలో రెటీనా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 2020లో యాపిల్ వాచ్ ఎస్‌ఈ ( ఫస్ట్ జనరేషన్) కంటే ఈ వాచ్ 30 శాతం పెద్దగా ఉంది. వేగవంతమైన ఎస్8 ప్రాసెసర్‌ను అమర్చారు. యాపిల్ పాత మోడల్ ఎస్5 చిప్ సెట్ కంటే 20శాతం ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీంతో పాటు ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్ వంటి హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 8లో ఉన్న క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను సైతం యాపిల్ వాచ్ ఎస్‌ఈలో అందిస్తుంది.
అంతేనా సెల్యులార్ కనెక్టివిటీ, ఫ్యామిలీ సెటప్ ఫీచర్‌తో స్మార్ట్‌వాచ్‌ని సెటప్ చేయడానికి అనుమతిస్తుంది. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. అదే సమయంలో యాపిల్ వాచ్ సెకండ్ జనరేషన్ ప్రారంభ ధర ధర 249 డాలర్లు ( భారత్‌లో దాదాపు రూ. 19,800), జీపీఎస్ ప్లస్ సెల్యులార్ మోడల్ ధర 299 డాలర్లకు ( భారత్‌లో దాదాపు రూ. 23,800) లభించనుంది. వాచ్ సెప్టెంబర్ 16 నుండి మిడ్‌నైట్, సిల్వర్, స్టార్‌లైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఎయిర్‌పాడ్స్ ప్రో: కొత్త హెచ్2 కలిగిన ఈ హెడ్ ఫోన్స్ గంటల పాటు పనిచేస్తుంది. అయితే పరిమాణాల్లో లభించే ఈ సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో ధర 249 డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment