smartwatches
-
ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!
Best Smartwatches Under Rs. 1500: ఆధునిక ప్రపంచం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో టెక్నాలజీ వేగంగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఉత్పత్తులు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. నేడు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్స్ మాత్రమే కాకుండా స్మార్ట్‌వాచ్‌లను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దేశీయ మార్కెట్లో రూ. 1500 కంటే తక్కువ ధర వద్ద లభించే లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 (Fastrack Revoltt FS1) రూ. 1200 వద్ద అందుబాటులో ఉన్న 'ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1' ఎక్కువ ప్రజాదరణ పొందిన బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి. దీనిని ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. 1.83 ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా పొందింది. 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా పొందుతుంది. నాయిస్ క్రూ (Noise Crew) మన జాబితాలో రెండవ స్మార్ట్‌వాచ్ 'నాయిస్ క్రూ'. దీని ధర రూ. 1499 మాత్రమే. దీనిని రిటైల్ స్టోర్స్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 1.38 ఇంచెస్ రౌండ్ డిస్ప్లే కలిగి ఐపీ68 రేటింగ్ పొందుతుంది. లేటెస్ట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది. పెబుల్ ఫ్రాస్ట్ ప్రో (Pebble Frost Pro) రూ. 1299 వద్ద లభించే పెబుల్ బ్రాండ్ 'ఫ్రాస్ట్ ప్రో' స్మార్ట్‌వాచ్ మంచి ప్రజాదరణ పొందిన లేటెస్ట్ మోడల్. ఇది 1.96 ఇంచెస్ డిస్ప్లే కలిగి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, రొటేటింగ్ వంటి ఆఫ్షన్స్‌తో పాటు వినియోగదారులకు ఆధునిక కాలంలో ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే! నాయిస్ ఐకాన్ బజ్ (Noise Icon Buzz) మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌వాచ్ నాయిస్ ఐకాన్ బజ్. రూ. 1299 వద్ద లభించే ఈ వాచ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 1.69 ఇంచెస్ డిస్ప్లే కలిగి ఈ లేటెస్ట్ ప్రొడక్ట్ బ్లూటూత్ కాలింగ్ వంటి వాటితో పాటు వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా పొందుతుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! ఫైర్-బోల్ట్ నింజా టాక్ (Fire-Boltt Ninja Talk) ఫైర్-బోల్ట్ కంపెనీకి చెందిన నింజా టాక్ ధర రూ. 1499. రౌండ్ డయల్ డిజైన్ కలిగి చూడ చక్కగా కనిపించే ఈ వాచ్ ఎంతోమంది వినియోగద్రూలకు ఇష్టమైన ఉత్పత్తి. 120 స్పోర్ట్స్ మోడ్స్‌తో బ్లూటూత్ కాలిగి వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారుని ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. -
కేవలం రూ. 2499కే స్మార్ట్‌వాచ్: లేటెస్ట్ డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్
దేశీయ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూలన ఏదో ఒక కొత్త ఉత్పత్తి విడుదలవుతూనే ఉంది. ఇందులో భాగంగానే దేశీయ కంపెనీ 'బోల్ట్ ఆడియో' (Boult Audio) ఒక కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల చేసింది. ఇది ఆకర్షణీయమైన డిస్ప్లే కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. బోల్ట్ ఆడియో విడుదల చేసిన కొత్త స్మార్ట్‌వాచ్ పేరు 'బోల్ట్ రోవర్ ప్రో' (Boult Rover Pro). దీని ధర కేవలం రూ. 2,499 మాత్రమే. ఇది ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులకు ఈ వాచ్‌తో పాటు అదనంగా రెండు డిటాచబుల్ స్ట్రాప్స్ కూడా లభిస్తాయి. కొత్త బోల్ట్ రోవర్ ప్రో వాచ్ 1.43 ఇంచెస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 446x446 పిక్సెల్స్ రెజల్యూషన్ పొందుతుంది. అంతే కాకుండా బ్లూటూత్ 5.2 వెర్షన్ కలిగి ఉండటం వల్ల కాలింగ్ ఫీచర్ ఇందులో లభిస్తుంది. తద్వారా మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. అంతే కాకుండా డయల్ ప్యాడ్, సింక్ కాంటాక్ట్ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసే చాలామంది హెల్త్ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాచ్‌లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున బోల్ట్ రోవర్ ప్రోలో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్పీవో2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు వందకుపైగా స్పోర్ట్స్ మోడ్లకు సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: సి3 కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ధర ఎంతంటే?) బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 7 రోజుల వరకు పనిచేస్తుంది. దీనిని కేవలం 10 నిముషాల ఛార్జ్‌తో 2 రోజులు ఉపయోగించుకోవచ్చు. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. ఇది వాయిస్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో వినియోగించడానికి ఈ వాచ్ ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంది. -
మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది చూసుకోండి!
మనిషి రోజు వారీ జీవితంలో టెక్నాలజీ భాగమైపోయింది. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అయితే, అది మనం ఉపయోగించుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. సక్రమంగా ఉపయోగిస్తే అది మనిషి ప్రాణాలను సైతం కాపాడుతుందనడానికి స్మార్ట్ వాచ్‌లు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా యాపిల్ అరుదైన ఘనత సాధించింది. సాధారణంగా గుండె ఎడమ జఠరిక పనిచేయకపోవడం వల్ల హృద్రోగ (గుండె సంబంధిత) సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ వాటిని గుర్తించడంలోనే అలస్యం ఏర్పడి కొన్ని సార్లు గుండె పోటు వస్తుంది.సరైన సమయంలో ట్రీట్మెంట్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆ తరహా సమస్యలతో బాధపడే వారిని గుర్తించి యాపిల్ వాచ్ అలెర్ట్ ఇస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మాయో క్లినిక్ రీసెర్చ్ ప్రకారం..అమెరికాతో పాటు 11 ఇతర దేశాలకు చెందిన 2,454 మంది హృద్రోగులపై ఆగస్టు 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు పరిశోధనల్లో జరిగాయి. ఇందులో భాగంగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన ఏఐ అల్గారిదంతో యాపిల్ వాచ్ ద్వారా 1,25,000 ఈసీజీ (Electrocardiography) టెస్ట్‌లను చేయగా సత్ఫలితాలు నమోదైనట్లు రీసెర్చర్లు తెలిపారు. సరైన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాల్లో ఈసీజీ టెస్ట్‌లతో యాపిల్ వాచ్ గుండె సంబంధిత బాధితుల్ని గుర్తిస్తాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, భవిష్యత్‌లో యాపిల్ వాచ్ ద్వారా హార్ట్ ఎటాక్‌తో పాటు ఇతర గుండె సంబంధిత సమస్యలు గుర్తించి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు మనుషుల ప్రాణాలు కాపాడేలా వైద్య చరిత్రలో అరుదైన అద్భుతాలు జరుగుతాయని మాయో రీసెర్చర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’ -
Artificial intelligence: ఆరోగ్య మేధస్సు!
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారాలు చూపిస్తోంది. వైద్య, ఆరోగ్య రంగం స్వరూపాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పూర్తిగా మార్చేస్తోంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ముందే హెచ్చరిక జారీ చేయడం, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వివరించడం, మెడికల్ పారామీటర్స్‌ను విశ్లేషించడం, జబ్బు రాకుండా నివారించడం, రోగాలను గుర్తించడంలో కచ్చితత్వం, డాక్టర్ల అపాయింట్మెంట్స్ ఖరారు, మందుల వాడకాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేయడం.. ఎన్నో పనులను సులభంగా, చౌకగా చేయడానికి ఏఐ శక్తినిస్తోంది. రూపు మారుతున్న వైద్య రంగానికి సప్త మార్గాలు పేషెంట్ కేంద్రం వైద్యారోగ్యరంగం విప్లవాత్మక మార్పులవైపు అడుగులు వేస్తోంది. సరికొత్త లక్ష్యాల దిశగా సాగుతున్న ప్రయాణంలో 7 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వేరియబుల్స్, యాప్స్ స్మార్ట్‌వాచ్‌ల లాంటి వేరియబుల్స్, యాప్స్ వ్యక్తుల ఆరోగ్య సూచీలను డేటాను సేకరించి, ప్రాసెస్ చేసి, ఆయా వ్యక్తులకు రియల్‌టైంలో సలహాలు/హెచ్చరికలు జారీ చేస్తాయి. ఉదాహరణకు మధుమేహ స్థాయిలని ట్రాక్ చేసి పర్సనలైజ్డ్, రియల్‌టైం సూచనలు, సలహాలు ఇస్తాయి. ధరించిన వ్యక్తికే కాకుండా మనం సూచించిన దగ్గరి వ్యక్తులకు, ఫ్యామిలీ డాక్టర్‌కు కూడా ఈ సూచనలు చేరవేస్తుంది. ముందుగా గుర్తించడం స్మార్ట్‌వాచ్‌లు, బయోసెన్సర్స్, ఫిట్నెస్ ట్రాకర్స్ మన గుండె కొట్టుకుంటున్న తీరు, ఊపిరి తీసుకుంటున్న విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, అసాధారణ తీరు ఉంటే వెంటనే యూజర్‌కు విషయాన్ని చెబుతుంది. విషమ పరిస్థితులు ఏర్పడి చేయిదాటి పోకముందే ముందస్తు హెచ్చరికలను నోటిఫై చేస్తుంది. యాక్సలరోమీటర్ బ్రేస్లెట్స్, స్మార్ట్బెల్ట్స్.. వృద్ధులు పట్టుకోల్పోవడం, డీహైడ్రేషన్‌కు గురవటం, కిందపడిపోవడం లాంటి అంశాల గురించి బంధువులు, వైద్యులు, అత్యవసర వ్యవస్థకు నోటిఫికేషన్ జారీ చేయగలుగుతాయి. తక్షణ సాయం అందించే 108 లాంటి అంబులెన్స్ వ్యవస్థకు స్థలం, పరిస్థితిని తెలియజేసే నోటిఫికేషన్లు రావడం వల్ల తక్షణం బాధితులను ఆసుపత్రికి చేర్చి వైద్య సహాయం అందించడానికి వీలవుతుంది. విలువైన ప్రాణాలను రక్షించడానికి ఏఐ అవకాశం కల్పిస్తుంది. నిర్ణీత సమయంలో ఏ పరిస్థితులు తలెత్తాయనే అంశాలను రికార్డు చేసి విశ్లేషించే సామర్థ్యం కూడా ‘ఏఐ‘ ఉన్న ఉపకరణాలకు ఉంటుంది. వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా.. వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఉపకరణాలు అందుబాటులోకి రానున్నాయి. రోగులు చెబుతున్న విషయాన్ని, డాక్టర్ సూచించిన మెడికేషన్‌ను నోట్ చేసుకొని కేస్‌షీట్‌ను జనరేట్ చేయడమే కాకుండా క్లినికల్ డేటాను తప్పులు లేకుండా రికార్డు చేయగలిగే ఉపకరణాలు వచ్చే దశాబ్దంలో అన్ని ఆసుపత్రుల్లో మనకు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వైద్యులు, సిబ్బంది మీద పని ఒత్తిడి తగ్గి రోగి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆసుపత్రుల్లో ఈ ‘వర్చువల్ అసిస్టెన్స్’ మార్కెట్ 2027 నాటికి దాదాపు 3 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఫలితాల విశ్లేషణ రోగ నిర్ధారక పరీక్షల ఫలితాలను ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లో మాన్యువల్‌గా విశ్లేషిస్తున్నారు. ఫలితాలను నూరు శాతం కచ్చితత్వంతో విశ్లేషించే సామర్థ్యం ‘ఏఐ’కి ఉంది. శాంపిల్‌ను లోడ్ చేస్తే ఫలితాల విశ్లేషణ నివేదిక త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇది సాకారమైతే రోగ నిర్ధారణ పరీక్షల్లో మానవ తప్పిదాలను పూర్తిగా నివారించి కచ్చితత్వం ఊహించని స్థాయికి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్చువల్ కన్సల్టేషన్ డాక్టర్లతో వర్చువల్‌గా మాట్లాడి చికిత్స పొందడానికి ఏఐ ఆధారిత అప్లికేషన్లు ఉపయోగపడతాయి. డాక్టర్ అపాయింట్మెంట్ను నిర్దారించడం మొదలు సలహా తీసుకోవడం, మందులు ఇంటికి డెలివరీ, మందులు వాడుతున్న విధానం, డోసేజ్‌ను మానిటర్ చేయడం, రోగుల ఫీడ్‌బ్యాక్ డాక్టర్లకు చేరవేయడం.. ఇప్పుడు ఏఐ అప్లికేషన్లు చేయగలుగుతున్నాయి. వైద్య రంగం మీద ఒత్తిడి తగ్గుతుంది ► వినూత్న ఆవిష్కరణకు అవకాశం: సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఇటు రోగులకు సులభంగా వైద్య సేవలు పొందే అవకాశం రావడంతో పాటు, అటు వైద్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు వస్తాయి. ఆసుపత్రులు, హెల్త్‌కేర్ సిబ్బంది మీద ఒత్తిడి తగ్గుతుంది. రోగాల నివారణ మీద ఎక్కువ సమయం వెచ్చించడానికి డాక్టర్లకు సమయం దొరుకుతుంది. ► వైద్య, ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యం, చికిత్స అందించే వేగం పెరగడానికి ‘ఏఐ’ దోహదం చేస్తుంది. ఫలితంగా తక్కువ వ్యయంతో ఎక్కువ మందికి మెరుగైన చికిత్స అందించడం ప్రభుత్వాలకు సాధ్య మవుతుంది. ► రోగుల సాధికారత: రోగి వైద్యం కోసం ఆసుపత్రి మొట్లు ఎక్కిన దగ్గర నుంచి చికిత్స ముగిసే వరకు ప్రతి అంశం రికార్డు అవుతుంది. మళ్లీ జబ్బు చేసినప్పుడు అంతకుముందు ఏ చికిత్స తీసుకున్నారనే విషయం డాక్టర్‌కు అందుబాటులోకి ఉంటుంది. ఆసుపత్రికి రాకుండా కూడా చికిత్స పొందడానికి రోగికి అవకాశం ఉంటుంది. రోబోటిక్ సర్జరీ సర్జరీల్లో రోబోలను ఉపయోగించడం ఇప్పుడు అసాధారణ విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనలో కిడ్నీ సర్జరీల్లో రోబోలనువాడటం వల్ల సక్సెస్ రేట్ 52 శాతం పెరిగిందని తేలింది. పూర్తిస్థాయిలో ‘ఏఐ’ బ్యాకింగ్ ఉన్న రోబోటిక్ సర్జరీలు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది మీద ఒత్తిడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రిహాబిలిటేషన్ చికిత్సలో రిహాబిలిటేషన్ ముఖ్యమైన అంశం. సర్జరీ/చికిత్స పూర్తయిన తర్వాత సక్రమంగా మెడికేషన్ కొనసాగించాలి. ‘ఏఐ’ యాప్స్, ఉపకరణాలు ‘కేర్ మేనేజ్మెంట్’లో కీలకం కానున్నాయి. రోగులు కోలుకుంటున్న తీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకోమని గుర్తు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. రోగుల ఫీడ్‌బ్యాక్ తీసుకొని డాక్టర్లకు చేరవేసి ‘మెడికేషన్’లో మార్పులు చేర్పులను రోగికి అందించగలవు. వైద్యరంగం పరిశోధనకు కూడా ఈ డేటా ఉపయోపడుతుంది. ఇదంతా ఇప్పటికి ఊహాజనితంగా ఉన్నా వాస్తవరూపం దాల్చే రోజు దగ్గర్లోనే ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
యాపిల్ వాచ్ అల్ట్రా, వాచ్ ఎస్ఈ2, ఎయిర్ ప్రాడ్స్ ప్రో 2 విడుదల, ధర ఎంతంటే?
టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి అమెరికా క్యాలిఫోర్నియాలో క్యూపార్టినో నగరంలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో టిమ్ కుక్.. ఐఫోన్14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్, వాచ్ సిరీస్ 8, వాచ్ సిరీస్ ఎస్ఈ 2, వాచ్ ఆల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా యాపిల్ వాచ్ అల్ట్రా, వాచ్ ఎస్ఈ2, ఎయిర్ ప్రాడ్స్ ప్రో 2 గురించి తెలుసుకుందాం. యాపిల్ వాచ్ అల్ట్రా స్పెసిఫికేషన్లు యాపిల్ వాచ్ అల్ట్రా 49ఎంఎం డయల్‌తో వస్తుంది. sapphire గ్లాస్‌తో, వాచ్‌ను టైటానియంతో రూపొందించారు. వాచ్ పెట్టుకుంటే ఎలాంటి ఇరిటేషన్లేకుండా చర్మానికి అనువుగా ఉంటుంది. అతిపెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ వాచ్‌ను 36 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. తక్కువ పవర్ మోడ్‌తో 60 గంటల వరకు పొడిగించవచ్చు. తక్కువ సెల్యులార్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో పనిచేసేలా డ్యూయల్ జీపీఎస్‌తో వస్తుందని యాపిల్ తెలిపింది. హైకింగ్, ఇతర కార్యకలాపాలలో సహాయపడుతుంది. డబ్ల్యూఆర్ 100 రేటింగ్‌ను కలిగి ఉన్న ఈ వాచ్‌ను నీటిలో 100అడుగుల లోతు వరకు ధరించవచ్చు. వీటితో పాటు క్రాష్ డిటెక్షన్, కంపాస్, డెప్త్ గేజ్, నైట్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర 799 డాలర్లు ఉండగా (భారత్‌లో రూ.89,900) సెప్టెంబర్ 23 నుంచి లభించనుంది. యాపిల్ వాచ్ ఎస్ఈ (సెకండ్ జనరేషన్) స్పెసిఫికేషన్లు యాపిల్ వాచ్ ఎస్ఈలో రెటీనా ఓఎల్ఈడీ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 2020లో యాపిల్ వాచ్ ఎస్ఈ ( ఫస్ట్ జనరేషన్) కంటే ఈ వాచ్ 30 శాతం పెద్దగా ఉంది. వేగవంతమైన ఎస్8 ప్రాసెసర్‌ను అమర్చారు. యాపిల్ పాత మోడల్ ఎస్5 చిప్ సెట్ కంటే 20శాతం ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీంతో పాటు ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్ వంటి హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 8లో ఉన్న క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను సైతం యాపిల్ వాచ్ ఎస్ఈలో అందిస్తుంది. అంతేనా సెల్యులార్ కనెక్టివిటీ, ఫ్యామిలీ సెటప్ ఫీచర్‌తో స్మార్ట్‌వాచ్‌ని సెటప్ చేయడానికి అనుమతిస్తుంది. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. అదే సమయంలో యాపిల్ వాచ్ సెకండ్ జనరేషన్ ప్రారంభ ధర ధర 249 డాలర్లు ( భారత్‌లో దాదాపు రూ. 19,800), జీపీఎస్ ప్లస్ సెల్యులార్ మోడల్ ధర 299 డాలర్లకు ( భారత్‌లో దాదాపు రూ. 23,800) లభించనుంది. వాచ్ సెప్టెంబర్ 16 నుండి మిడ్నైట్, సిల్వర్, స్టార్‌లైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో: కొత్త హెచ్2 కలిగిన ఈ హెడ్ ఫోన్స్ గంటల పాటు పనిచేస్తుంది. అయితే పరిమాణాల్లో లభించే ఈ సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో ధర 249 డాలర్లుగా ఉంది. -
వావ్ ఏం ఫీచర్లు గురూ..అదరగొట్టేస్తున్నాయ్,యాపిల్ వాచ్ సిరీస్ 8 విడుదల!
Apple Watch Series 8 : ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ స్మార్ట్ వాచ్ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న యాపిల్ వాచ్ 8 సిరీస్ విడుదలైంది. ప్రమాదంలో యూజర్లను కాపాడేందుకు యాక్సిలరోమీటర్ సెన్సార్, మహిళల ovulation (అండోత్సర్గము) గురించి తెలిపే ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఆ వాచ్‌లోని ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం. స్మార్ట్ వేరబుల్ మార్కెట్లో యాపిల్ వాచ్‌ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్నీ యాపిల్ వాచ్ సిరీస్‌ల కంటే యాపిల్ వాచ్ 8 సిరీస్ విభిన్నంగా ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా క్యాలి ఫోర్నియాలో క్యూపార్టినో నగరంలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా నిర్వహించిన యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్లో టిమ్ కుక్ మహిళ ఆరోగ్యం కాపాడే లక్ష్యంగా విడుదల చేసిన యాపిల్ వాచ్ 8 సిరీస్ వాచ్ రించి మరిన్ని విషయాలు మీకోసం ovulation (అండోత్సర్గము) గురించి పెళ్లయిన జంటలన్నీ పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ఏ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. ముందుగా స్త్రీ శరీరంలో జరిగే ovulation (అండోత్సర్గము) గురించి తెలుసుకుంటే ఎప్పుడు కలిస్తే గర్భం ధరించడం సులువో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారి కోసమే అండోత్సర్గము అనే ఫీచర్‌ను తయారు చేసింది. టెంపరేచర్ సెన్సార్ తో పాటు హై ఎండ్ ఫీచర్లతో ఆపిల్ వాచ్ 8 ని పరిచయం చేస్తోంది. అయితే, మహిళల పర్సనల్ డేటా కేవలం వాళ్లు ధరించిన యాపిల్ వాచ్ 8లో నిక్షిప్తమై ఉంటుందని, ఆ డేటా యాపిల్ సర్వర్లలో స్టోర్ చేయడం లేదని జెఫ్ విలియమ్స్ స్పష్టం చేశారు. డిస్ప్లే సూపర్ ఇప్పటికే యూజర్లు వినియోగిస్తున్న అన్నీ యాపిల్ వాచ్‌ల కంటే ఈ యాపిల్ 8 సిరీస్ వాచ్ కింగ్ మేకరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వాచ్‌లో ఉన్న అప్డేటెడ్ ఫీచర్లు ఇతర వాచ్‌లలో లేవని తెలుస్తోంది. బిగ్గెస్ట్ యాపిల్ వాచ్ 49 రెక్టాంగిలర్ డిస్ప్లే తో పాటు 2000నిట్స్ల బ్రైట్నెస్, చేతికి ధరించినప్పుడు తేలికగా ఉండేందుకు వాచ్ కేస్ టైటానియంతో తయారు చేయబడింది. ఫిట్నెస్ ప్రియుల కోసం ఫిట్నెస్ ప్రియులకోసం యాపిల్ తయారు చేసిన ఈ వాచ్ డిజైన్, స్లైడ్స్ లేటెస్ట్ వెర్షన్‌లోకి అప్డేట్ చేసింది. కొత్త ఆరెంజ్ యాక్షన్ బటన్, బటన్ గార్డ్, రీడిజైన్ చేసిన క్రౌన్, sapphire క్రిస్టల్ డిస్ప్లే తో పాటు ఆ డిస్ప్లేను ప్రొటెక్ట్ చేసేందుకు రిమ్ సైజును పెంచింది. ఈ తరహా ఫీచర్‌ను శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రోలో కూడా మనం చూడొచ్చు. కారు ప్రమాదంలో ఉంటే కారు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించినట్లయితే, అత్యవసర సేవలకు కాల్ చేయడంలో సహాయపడటానికి సిరీస్ 8లో కొత్త గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ కూడా ఉన్నాయి. స్మార్ట్ఫోన్లలో పొందుపరిచే యాక్సిలరోమీటర్ సెన్సార్ స్మార్ట్‌ఫోన్ మోషన్‌ను డిటెక్ట్ చేస్తుంది. wake-up screen వంటి ఆప్షన్‌కు కూడా ఈ సెన్సార్‌ను ఉపయోగిస్తున్నారు. ధర ఎంతంటే యాపిల్ వాచ్ 8సిరీస్ ధర 499 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ..సెప్టెంబర్ 16 నుంచి కొనుగోలు దారులకు అందుబాటులో ఉండనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి👉 దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఐఫోన్ 14 విడుదల! -
అదిరిపోయే ఫీచర్లతో.. 'బోట్' స్మార్ట్ వాచ్ విడుదల, ధర ఇంత తక్కువా!
తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో ప్రముఖ వేరబుల్ తయారీ సంస్థ 'బోట్ ఎక్స్టెండ్ టాక్' అనే స్మార్ట్ వాచ్‌ను విడుదల చేయనుంది. స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, అలెక్సా సపోర్ట్, ఐపీ 68తో పాటు ఫీచర్లు ఉన్నాయి. 2.5 డీ కర్వ్డ్ స్క్రీన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.3వేల లోపు ఉండనుంది. ఫీచర్లు 300ఎంఏహెచ్ బ్యాటరీ, హెచ్డీ రెజెల్యూషన్‌తో 1.69 డిస్ప్లేతో డిజైన్ చేసింది. బోట్ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్లు, పల్స్ రేట్ ఎలా ఉందో చెక్ చేసే ఆక్సో మీటర్ తరహాలో (ఎస్పీ ఓ2 మానిటర్), ఉదాహరణకు ట్రెడ్ మిల్ మీద మీరు నడిచే సమయంలో ఎంత గాలి పీలుస్తున్నారు. ఎంత గాలి వదులుతున్నారో గుర్తించండం (వీఓ2 మ్యాక్స్), ఎన్ని మెట్లు ఎక్కారో ట్రాక్ చేయడం, మీ శరీరంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి. స్పోర్ట్స్ మోడ్స్ విభాగంలో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ బ్యాడ్మింటన్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఎంత సేపు చేశారో ఆటో మెటిగ్గా గుర్తిస్తుంది. బ్యాటరీ లైఫ్ టైం ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ లైఫ్ టైం 10రోజులు ఉంటుందని బోట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కొన్ని సమయాల్లో మాత్రం బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్‌తో 2 రోజుల బ్యాటరీ లైఫ్ టైంను వినియోగించుకోవచ్చని తెలిపారు. ధర ఐపీ68 రేటింగ్‌తో వస్తున్న ఈ ఎక్సెటెండ్ టాక్ స్మార్ట్ వాచ్‌లో 150 వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. అంటే వాచ్ డిస్ప్లే ను మీరు 150 రకాల డిస్ప్లే స్టైల్స్‌ను మార్చుకోవచ్చు. ఇక ఈ వాచ్ ప్రారంభ ధర రూ.2,999గా ఉంది. అమెజాన్‌లో లభ్యమయ్యే ఈ స్మార్ట్ వాచ్ పిచ్ బ్లాక్, చెర్రీ బ్లూసోమ్, టీమ్ గ్రీన్ వేరియంట్లలో లభ్యం అవుతుంది. -
స్మార్ట్ వాచ్‌ను విసిరి కొట్టాలనుకుంది..కానీ అదే ఆ యువతి ప్రాణాల్ని కాపాడింది!
టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన యాపిల్ వాచ్ అసాధారణ పరిస్థితుల్లో యూజర్లను అలెర్ట్ చేయడం, వారి ప్రాణాల్ని కాపాడడంలాంటి ఘటనల్ని మనం చూశాం. అయితే ఇప్పుడు అదే స్మార్ట్ వాచ్ ప్రమాదకరమైన ట్యూమర్లను గుర్తించి.. వినియోగదారుల ప్రాణాల్ని కాపాడుతున్నాయి. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..అమెరికాకు చెందిన కిమ్ దుర్కీ అనే యువతికి యాపిల్ వాచ్ అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇబ్బందులు తలెత్తిన చేతికి ధరించిన వాచ్‌ను తీసేది కాదు. ఈ తరుణంలో ఈ ఏడాది మే నెలలో రాత్రి నిద్రిస్తున్న కిమ్‌ను ఆమె చేతికి ఉన్న యాపిల్ వాచ్ అలెర్ట్ చేసింది. ఆ అలెర్ట్‌కు సెట్టింగ్ మారిపోయాయేమోనని భావించింది. ఆ మరోసటి రోజు కూడా రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుసుగా మూడు రోజుల పాటు స్మార్ట్ వాచ్ అలెర్ట్‌తో అసహనానికి గురై..ఆ వాచ్‌ను విసిరి కొట్టాలన్న కోపం వచ్చినట్లు కిమ్ తెలిపింది. కానీ ఆ వాచ్ ఎందుకు హెచ్చరికలు జారీ చేసిందోనన్న అనుమానంతో కుటుంబ సభ్యులు కిమ్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు షాకిచ్చారు. యువతికి మైక్సోమా అనే ప్రమాదమైన కణితి శరీరంలో ఏర్పడిందని చెప్పారు. శరీరంలో అరుదుగా ఏర్పడే ఈ కణితి పెరిగితే ప్రమాదమని, వెంటనే ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించాలని తెలిపారు.లేదంటే ట్యూమర్‌తో యువతి గుండెకు రక్తం సరఫరా ఆగిపోతుందని, దీంతో హార్ట్ అటాక్ వస్తుందని బాధితురాలి కుటుంబ సభ్యుల్ని అలెర్ట్ చేశారు. చివరికి వైద్యులు 5గంటల పాటు శ్రమించి కిమ్ శరీరం నుంచి కణితి తొలగించి ఆమె ప్రాణాల్ని కాపాడారు. ఈ సందర్భంగా కిమ్ దుర్కీ మాట్లాడుతూ..యాపిల్ వాచ్ తనకి హెచ్చరికలు జారీ చేయడంతో హార్ట్ బీట్‌లో మార్పులొచ్చాయి. డాక్టర్లని సంప్రదిస్తే ఆందోళన వల్ల ఇలా జరిగిందని చెప్పారు. కానీ మరో మారు అలెర్ట్ రావడంతో మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఈ ప్రమాదకరమైన ట్యూమర్ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకోగలిగాను అంటూ సంతోషం వ్యక్తం చేసింది. -
అమ్మ బాబోయ్! పేలుతున్న స్మార్ట్‌వాచ్‌లు, కాలిపోతున్న యూజర్ల చేతులు!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఇద్దరు మహిళలు గూగుల్‌పై దావా వేశారు. గూగుల్‌కు చెందిన స్మార్ట్ వాచ్‌లు ధరించడం వల్ల తమ చేతులు కాలిపోయాంటూ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో వేసిన దావాలో పేర్కొన్నారు. గూగుల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఫిట్‌బిట్' పేరుతో స్మార్ట్ వాచ్‌లను విడుదల చేసింది. ఏప్రిల్ 2018న ఫిట్ బిట్ వెర్సా 1, 2019 సెప్టెంబర్‌లో ఫిట్‌బిట్ వెర్సా 2, 2020 సెప్టెంబర్‌లో ఫిట్‌బిట్ వెర్సా 3ని విడుదల చేసింది. విడుదలైన ఈ స్మార్ట్‌వాచ్‌లు గూగుల్ సంస్థవి కావడంతో యూజర్లు సైతం వాటిని ధరించేందుకు మొగ్గుచూపారు. ఫలితంగా స్మార్ట్ వాచ్‌లను వినియోగించిన యూజర్లు చేతులు కాలి తీవ్రంగా గాయపడుతున్న వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాచ్‌లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు హీటెక్కీ పేలిపోవడంపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది మార్చి నెలలో యూజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం10మిలియన్ల ఫిట్‌బిట్ వాచ్‌లను వెంటనే రీకాల్ చేయాలని హెచ్చరింది. దీంతో కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ హెచ్చరికలతో కంగుతిన్న గూగుల్ ఆ వాచ్‌లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..జెన్నీ హౌచెన్స్, సమంతా రామిరేజ్ యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్‌ను ఆశ్రయించారు. ఫిట్‌బిట్ స్మార్ట్ వాచ్ వెర్సాలైట్ మోడల్‌ను ధరించిన తన కుమార్తె చేయి కాలిపోయిందని జెన్నీ హౌచెన్స్, వెర్సా 2 స్మార్ట్ వాచ్ ధరిండం వల్ల తాను గాయపడినట్లు రామిరేజ్ గూగుల్‌పై వేసిన దావాలో పేర్కొన్నారు. అంతేకాదు ఇద్దరూ తమ ఫిట్బిట్ల ధర వాపస్ తో పాటు చట్టపరమైన ఖర్చులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..బాధితుల తరుపు న్యాయ వాదులు కేలరీలను బర్న్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేస్తారు. కానీ ఇలా చేతుల్ని కాల్చుకునేందుకు కాదంటూ కోర్ట్‌లో వాదించారు. చదవండి👉గూగుల్‌కు భారీషాక్..అమ్మ బాబోయ్!! ఈ స్మార్ట్ వాచ్‌తో చేతులు కాలిపోతున్నాయ్!! -
గూగుల్‌కు భారీషాక్..అమ్మ బాబోయ్!! ఈ స్మార్ట్ వాచ్‌తో చేతులు కాలిపోతున్నాయ్!!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు యూఎస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ భారీ షాకిచ్చింది. గూగుల్‌కు చెందిన స్మార్ట్ వాచ్‌లను రీకాల్ చేయాలని సూచించింది. దీంతో గూగుల్ స్మార్ట్ వాచ్‌లను రీకాల్ చేసేందుకు సిద్ధమైంది. గూగుల్‌కు చెందిన ఫిట్‌బిట్ కంపెనీ రూ.22,631 ధరతో ఐకానిక్ స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఆ స్మార్ట్‌వాచ్ గూగుల్ కంపెనీది కావడంతో అమెరికాలో 1మిలియన్ వాచ్‌లు, మిగిలిన ప్రపంచ దేశాల్లో 693,000 వాచ్‌లను యూజర్లు కొనుగోలు చేశారు. ఫలితంగా స్మార్ట్ వాచ్‌లను వినియోగించిన యూజర్లు చేతులు కాలి తీవ్రంగా గాయపడ్డారు. స్మార్ట్ వాచ్‌లను ధరించడం, వాచ్‌లో ఉండే బ్యాటరీ వేడెక్కి పేలడం, చేతులకు తీవ్రగాయాలు కావడంతో గూగుల్ కంపెనీపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరుసగా యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై యూఎస్ కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ సభ్యులు గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు బిట్ఫిట్ కంపెనీకి 115 అమెరికన్ యూజర్లు, మిగిలిన దేశాల్లో 59మంది యూజర్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అంతేకాదు యూజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం ఫిట్‌బిట్ కు చెందిన 10మిలియన్ల వాచ్‌లను వెంటనే రీకాల్ చేయాలని హెచ్చరింది. దీంతో కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ హెచ్చరికలతో కంగుతిన్న గూగుల్ ఆ వాచ్‌లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: అదిరిపోయే స్మార్ట్ గ్లాస్లెస్.. సెల్ఫీలు దిగొచ్చు, కాల్ చేయొచ్చు..ఇంకా ఎన్నో -
కోవిడ్‌తో వచ్చే దీర్ఘకాలిక బాధలను ఇట్టే పసిగడతాయి...!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇంకా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో సుమారు 40 లక్షల మంది మరణించగా, 18. 5 కోట్ల మంది కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయ్యారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు లాంగ్ కోవిడ్-19 దీర్ఘకాలిక బాధలను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ నుంచి విముక్తి పొందినా కూడా శ్వాస కోశ, ఇతర బాధలతో అనేక మంది సతమతమవుతున్నారు. తాజాగా కోవిడ్ -19తో వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించడంలో స్మార్ట్‌వాచ్స్ ఎంతగానో సహాయపడుతున్నాయని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను గుర్తించడంలో స్మార్ట్ వాచ్‌లు ఎంతగానో సహాయపడుతున్నాయి. ఆపిల్ వాచ్, ఫిట్‌బిట్ స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఇతర స్మార్ట్‌వాచ్‌లు కోవిడ్ -19 దీర్ఘకాలిక ప్రభావాలను కచ్చితంగా గుర్తించగలవని ఓ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. స్మార్ట్‌వాచ్ ధరించడంతో హృదయ స్పందన రేట్లను, శరీర ఉష్ణోగ్రత, శారీరక శ్రమ వంటివి స్మార్ట్‌వాచ్‌లో రికార్డవడంతో కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తి ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం సులువు అవుతుందని పరిశోధకులు వెల్లడించారు. న్యూయర్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల్లో గణనీయమైన మార్పులను గుర్తించామని అధ్యయన పరిశోధకులు పేర్కొన్నారు. కోవిడ్-19 కోలుకున్న వ్యక్తుల్లో ప్రవర్తనా, శారీరక మార్పులను గమనించామని పరిశోధకులు తెలిపారు.అంతేకాకుండా కరోనా వైరస్ వారిని ఎంతగా ప్రభావం చేసిందనే విషయాన్ని గుర్తించడానికి స్మార్ట్‌వాచ్‌లు ఎంతగానో ఉపయోగపడ్డాయని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ రాబర్ట్ హిర్టెన్, ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వేరబుల్ నిపుణుడు పేర్కొన్నారు. డిజిటల్ ఎంగేజ్మెంట్ అండ్ ట్రాకింగ్ ఫర్ ఎర్లీ కంట్రోల్ అండ్ ట్రీట్మెంట్ (DETECT) ట్రయల్ అందించిన డేటా ప్రకారం.. మార్చి 2020 నుంచి 2021 జనవరి వరకు ఫిట్బిట్లను, స్మార్ట్‌వాచ్‌లను ఉపయోగిస్తోన్న 37,000 మందిపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి.వారు ధరించిన స్మార్ట్ వాచ్ డేటాలను పరిశోధకులతో పంచుకున్నారు. ఈ డేటాలో కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులకు అధిక హృదయ స్పందన రేటు ఉందని అధ్యయనంలో కనుగొన్నారు. సాధారణం కంటే ఎక్కువ హృదయ స్పందన రేట్లను కలిగి ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ నుంచి కోలుకున్న రెండు-మూడు నెలల తర్వాత చాలా మంది రోగులలో ఈ పరిస్థితి నెలకొంది. స్మార్ట్‌వాచ్ అందించే డేటాతో ముందుగానే రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. -
Facebook smartwatch ఆ దిగ్గజాలకు గట్టి పోటీ!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన తొలి స్మార్ట్‌వాచ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. స్మార్ట్‌ఫోన్ ను ఎలా వినియోగిస్తామో..స్మార్ట్‌వాచ్‌ను కూడా అలాగే ఉపయోగించుకునేలా స్మార్ట్‌వాచ్‌ను వచ్చే ఏడాది వేసవికి అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్బుక్ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. పల్స్రేట్ తెలుసుకోవడంతోపాటు, రెండు కెమెరాలుతో పాటు, ఫిట్నెస్ కంపెనీల సేవలు లేదా హార్డ్‌వేర్‌లకు కూడా కనెక్ట్ కావచ్చు. అంతేకాదు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఈ స్మార్ట్‌వాచ్‌ను కూడా ఆపరేట్ చేయగలగడం మరో ఆకర్షణ. అమెరికా టెక్నాలజీ సైట్ ది వెర్జ్ కథనం ప్రకారం. సెకండ్, థర్డ్ జెనరేషన్ వాచ్‌లను కూడా లాంచ్ చేయనుంది. దీని సుమారు 400 డాలర్లు (సుమారు రూ .29,000) గా ఉంటుందట. ఇంకా పేరు పెట్టని ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్, వైట్, గోల్డ్‌న్ రంగులలో లభించనుంది. స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ ఈ స్మార్ట్‌వాచ్ సాయంతో మెసేజెస్ను పంపడంతో పాటు హెల్త్, ఫిట్నెస్ గురించి తెలుసుకోవచ్చు. స్మార్ట్‌వాచ్‌లో రెండు కెమెరాల డిస్ప్లే ఉంటుంది. దీని సాయంతో యూజర్లు ఫోటోల్ని, వీడియోల్ని క్యాప్చర్ చేయవచ్చు. అలా క్యాప్చర్ చేసిన వీడియోల్ని ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా షేర్ చేసే సదుపాయం ఉంది. స్మార్ట్‌వాచ్ ముందు భాగంలో ఉండే కెమెరా సాయంతో వీడియో కాలింగ్ చేసుకోవచ్చని వెర్జ్ తన కథనంలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. స్మార్ట్ వాచ్ వెనుక భాగంలో పూర్తి హెచ్ డీతో డీజికామ్ ఉంటుంది. ఈ డిజికామ్ ద్వారా యూజర్లు తీసుకున్న ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకునేలా బ్యాక్‌ప్యాక్‌ల వంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఫేస్ బుక్ ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌కు స్మార్ట్ వాచ్ అటాచ్ చేసే పనిలేకుండా ఎల్‌టిఇ కనెక్టివిటీని జోడించాలని ఫేస్బుక్ యోచిస్తోంది. ఇందు కోసం యుఎస్ వైర్లెస్ క్యారియర్లతో కలిసి పనిచేస్తోంది. స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లో వినియోగదారును ఆకట్టుకుని, ఆపిల్, హువావే, గూగుల్‌లకు గట్టి పోటీనిచ్చే వ్యూహంలో భాగంగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ స్మార్ట్‌వాచ్‌ను తీసుకువస్తున్నారని ది వెర్జ్ నివేదించింది. చదవండి : Facebook షాక్: ట్రంప్ కౌంటర్ -
మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలా?
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మరీ వల్ల మృతుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. కరోనా భారీనా పడినవారు చనిపోవడానికి ముఖ్యకారణం ఆక్సిజన్ లభ్యత సరిపడినంత లేకపోవడమే. చాలా మందికి ఈ మహమ్మారి సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి(SpO2) ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కీలకంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో బ్లడ్ లో ఆక్సిజన్ స్థాయిని గుర్తించే స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ పరికరాలు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆపిల్, శామ్ సంగ్, షియోమీ, రియల్ మీ వంటి అనేక కంపెనీలు ఆక్సిజన్ స్థాయిని గుర్తించే పరికరాలను తయారు చేస్తున్నాయి. కాబట్టి, మీరు స్మార్ట్ వాచ్ లేదా ఫిట్నెస్ బ్యాండ్‌ను కలిగి ఉంటే అందులో బ్లడ్ లో ఆక్సిజన్ స్థాయిని కొలిచే ఫీచర్ అందుబాటులో ఉంది. SpO2 లెవల్‌ను కొలిచేటప్పుడు గుర్తించుకోవలసిన అంశాలు: మీ చేతికి వాచ్ లేదా బ్యాండ్ సరిగ్గా అమర్చారో లేదో చూసుకోండి. SpO2 స్థాయిని కొలిచేటప్పుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని, మీ చేతిని అలాగే ఉంచండి. మంచి ఫలితాల కోసం మీ చేతిని చదునైన ఉపరితలంపై ఉంచండి. మీ చేతిపై ఉండే వెంట్రుకలు, పచ్చబొట్లు, చెయ్యి వణకడం, సక్రమంగా ధరించకపోవడం వంటివి ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 6 మీ ఐఫోన్లో హెల్త్ యాప్‌ను సెటప్ చేసుకొని, బ్రౌజ్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. తర్వాత రెస్పిరేటరీ నావిగేట్ ఆన్ చేయండి. ఆ తర్వాత బ్లడ్ ఆక్సిజన్ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లడ్ ఆక్సిజన్ సెటప్ చేసుకోండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆపిల్ వాచ్ యాప్‌లో వెళ్లి SpO2 లెవన్‌ను కొలవండి. ఒకవేళ మీ యాపిల్ వాచ్‌లో బ్లడ్ ఆక్సిజన్ యాప్ లేకపోతే, యాప్ స్టోర్‌లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. అమేజ్‌ఫిట్ మీ అమేజ్‌ఫిట్ యాప్‌లోని లిస్ట్‌ను ఓపెన్ చేయడానికి డయల్ ఇంటర్ఫేస్ను ఎడమవైపు స్వైప్ చేయండి. బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ను కొలవడానికి బ్లడ్ ఆక్సిజన్ యాప్‌ను ఎంచుకోండి. రియల్‌మి వాచ్ యూజర్లు రియల్‌మి వాచ్‌లోని ఆక్సిజన్ శాచురేషన్ (SpO2) పేజీకి వెళ్లాలి. SpO2 లెవల్‌ను కొలవడానికి SpO2 ఎంపికపై నొక్కండి. 30 సెకన్లలో ఫలితం మీకు కనిపిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3లో మాత్రమే ఆక్సిజన్ లెవల్‌ను గుర్తించవచ్చు. ఈ వాచ్‌లో SpO2 ను కొలవడానికి, మీ స్మార్ట్‌ఫోన్‌లో శామ్సంగ్ హెల్త్ యాప్‌ను ఓపెన్ చేసి మీ గెలాక్సీ వాచ్ 2ను జత చేయండి. ఇప్పుడు, గెలాక్సీ వాచ్ 3లో గెలాక్సీ హెల్త్ యాప్ ఓపెన్ చేసి స్ట్రెస్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. SpO2 లెవల్‌ను పొందడానికి మెజర్ బటన్‌పై క్లిక్ చేయండి. చదవండి: వ్యాక్సిన్ కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి! -
మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్
అమెరికా: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మన అరచేతిలోకి వచ్చిందన్న మాట నిజం. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు టెక్నాలజీ ఎంతగానో మేలు చేసింది అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ కారణంగానే ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. అలాగే తాజాగా అమెరికాలో జరిగిన ఒక సంఘటన మాత్రం టెక్నాలజీ మనిషికి ఎంత అవసరమో మరోసారి నిరూపించింది. టెక్నాలజీలో స్మార్ట్‌వాచ్‌లు ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయి. ఇక యాపిల్ వాచ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి) తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో కిడ్నాపర్ల చెర నుంచి మహిళను రక్షించడంలో యాపిల్ స్మార్ట్‌వాచ్ కీలక పాత్ర పోషించింది. టెక్సాస్‌లోని సెల్మాప్రాంతానికి చెందిన ఒక మహిళా తాను ఆపదలో ఉన్నానంటూ తన కూతురికి యాపిల్ వాచ్ ద్వారా SOS కాల్ చేసింది. అయితే ఆమె ఉన్న ప్రదేశం గురుంచి తెలుసుకునే లోపే వాచ్ నుంచి కనెక్షన్ కట్ అయ్యింది. కిడ్నాప్ చేసే సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఈ కాల్ కట్ అయ్యింది. కానీ, ఆ మహిళా చేతికి ఉన్న యాపిల్ స్మార్ట్‌వాచ్ పనిచేస్తుంది.(చదవండి: ఏసీలు, ఫ్రిజ్‌లు కొనేవారికి షాక్!) దింతో వెంటనే తన కూతురు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. యాపిల్ స్మార్ట్‌వాచ్ SOS కాల్ డిస్కనెక్ట్ అయినప్పటికీ పోలీసులు ఎమర్జెన్సీ సెల్యూలార్ పింగ్ టెక్నాలజీ సాయంతో కిడ్నాప్‌కు గురైన మహిళను ట్రాక్ చేశారు. హయత్ ప్లేస్ హోటల్లోని ఈస్ట్ సోంటెర్రా బ్లవ్‌డిలోని పార్కింగ్ స్థలంలో కిడ్నాప్ గురైన మహిళా ఒక వాహనంలో కనిపించింది. వెంటనే పోలీసులు బాధిత మహిళను రక్షించి కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆ మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఆపిల్ వాచ్ ఇలా భయంకరమైన పరిస్థితుల నుంచి వ్యక్తులను కాపాడటం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం 25 ఏళ్ల వ్యక్తిని గుండెపోటు నుంచి రక్షించింది. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ప్రాణాపాయం నుంచి ఒక వృద్ధుడిని కాపాడింది. -
15 స్పోర్ట్స్ మోడ్లతో రియల్మీ స్మార్ట్ వాచ్
న్యూఢిల్లీ: భారతదేశంలో రూ.12,000 ఫిట్నెస్ వాచ్ కేటగిరీ కింద వాచ్ ఎస్ ప్రోను రియల్మీ తీసుకొచ్చింది. అంతర్నిర్మిత జిపిఎస్ తో వచ్చిన మొట్ట మొదటి రియల్మీ స్మార్ట్ వాచ్ ఇదే. రియల్మే వాచ్ ఎస్ ప్రో ప్రోలో చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి.(చదవండి: ఆ సమయంలో యూపీఐ పేమెంట్స్ చేయకండి) రియల్‌మి వాచ్ ఎస్ ప్రో ఫీచర్స్ 46 ఎంఎం లార్జ్ డయల్ బరువు: 63.5 గ్రా. బ్యాటరీ: 420 ఎంఎహెచ్ బ్లూటూత్: 5.0 454* 454 పిక్సెల్ రెజల్యూషన్ అడ్వాన్స్డ్ బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ మ్యూజిక్ కంట్రోల్ టహార్ట్రేట్ మానిటర్ గొరిల్లా గ్లాస్ టడ్రింక్ వాటర్ రిమైండర్ కెమెరా కంట్రోల్ (రిమోట్ షూటర్) 15 స్పోర్ట్ మోడ్స్ టకలర్: బ్లాక్ ధర: రూ.9,999 -
జనవరి 19న ఫస్ట్ సేల్ కు రానున్న జీటీఆర్ స్మార్ట్‌వాచ్
అమాజ్‌ఫిట్ నేడు తన జీటీఆర్ 2ఇ, జీటీఎస్ 2ఇ స్మార్ట్‌వాచ్‌ల ధరలను వెల్లడించింది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు రూ.9,999 అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తిగల కస్టమర్లు అమాజ్‌ఫిట్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేయవచ్చు. అలాగే జీటీఆర్ 2ఇ అమెజాన్ ద్వారా లభిస్తుండగా, జీటీఎస్ 2ఇ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు జనవరి 19న ఫస్ట్ సేల్ కు రానున్నాయి. ఫీచర్స్: ఇటీవల ముగిసిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2021లో అమాజ్‌ఫిట్ రెండు స్మార్ట్‌వాచ్‌లను ప్రవేశపెట్టింది. అమాజ్‌ఫిట్ జీటీఆర్ 2ఇ 1.39-అంగుళాల అమోలెడ్ హెచ్డి డిస్ప్లేతో 326 పిపిఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఇది 471 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 రోజుల బ్యాకప్‌ను అందిస్తుంది. దీనిలో 90కి పైగా స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. ఇందులో రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను కొలవడానికి SpO2 సెన్సార్‌తో వస్తుంది. ఇది ఒత్తిడి, నిద్రను ట్రాక్ చేయగలదు. జీటీఆర్ 2ఇలో హృదయ స్పందన మానిటర్ కూడా ఉంది. ఇందులో పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ హెల్త్ అసెస్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. జీటీఎస్ 2ఇలో 1.65-అంగుళాల హెచ్డి అమోలేడ్ డిస్ప్లే ఉంది. స్మార్ట్ వాచ్ జీటీఎస్ 2ఇ కూడా ఇదే లక్షణాలను కలిగిఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ సాధారణ వాడకంలో 14 రోజుల వరకు ఉంటుంది. -
3 వేలలోనే రెడ్ మీ స్మార్ట్ వాచ్
రెడ్ మీ నోట్ 9 సిరీస్‌తో పాటు రెడ్ మీ బ్రాండ్ వాచ్‌ను కూడా చైనాలో షియోమీ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ధరను 269యువాన్లుగా(సుమారు రూ.3,018) నిర్ణయించారు. రెడ్మి బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి స్మార్ట్‌వాచ్ ఇది. 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్ తో పాటు అవుట్ డోర్ రన్నింగ్, ఇండోర్ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, నడక, కొలనులో వంటి ఏడు స్పోర్ట్స్ మోడ్లతో వస్తుంది. దీని బరువు 35 గ్రాములు మాత్రమే. (చదవండి: బ్యాటరీ సేవింగ్ కోసం ఇలా చేయండి!) రెడ్మి వాచ్ ఫీచర్స్ రెడ్మి వాచ్‌లో 324 పిపి పిక్సెల్ డెన్సిటీ, 2.5డి టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్‌తో 1.4-అంగుళాల (320x320 పిక్సెల్స్) ఎల్సీడీ ఆకారంలో ఉన్న స్క్రీన్‌ను ఇందులో అందించారు. దాదాపు 120 వాచ్ ఫేసెస్ను ఇందులో అందించారు. అందిస్తుంది. ఇది 5ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, అందువల్ల నీటిలో 50 మీటర్ల లోతువరకు పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 5.0, ఆ పైబడిన, ఐవోఎస్ 10.0+ ఆ పైబడిన ఫోన్లకు దీన్ని పెయిర్ చేసుకోవచ్చు. దీనిలో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, సిక్స్-యాక్సిస్ సెన్సార్, జియో మాగ్నెటిక్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఇది 230 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి రెండు గంటలు పడుతుంది. ఇందులో మొత్తం ఏడు స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. వీటిలో ఇండోర్ రన్నింగ్, అవుట్ డోర్ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, ఫ్రీస్టైల్ వంటి స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇందులో అందించారు. రెడ్మి వాచ్ 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్ స్లీప్ ట్రాకింగ్, సెడెంటరీ మానిటరింగ్, రెస్టింగ్ హార్ట్ రేట్ 30 రోజుల రిపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఎన్ఎఫ్సీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. రెడ్మి వాచ్ ధరను చైనాలో 299 యువాన్లుగా (సుమారు రూ .3,300) నిర్ణయించారు. ఇది ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ల కోసం 269 యువాన్ల(సుమారు రూ .3,000) తగ్గింపు రేటుతో లభిస్తుంది. ఎలిగెంట్ బ్లాక్, ఇంక్ బ్లూ, ఇవోరీ బ్లూ రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌కు చెర్రీ పింక్, పింక్ గ్రీన్ స్ట్రాప్‌లు కూడా ఉన్నాయి. డిసెంబర్ 1న నుంచి మి.కామ్‌లో లభిస్తాయి. -
సొంత స్మార్ట్ వాచ్ లతో గూగుల్...!
ఇప్పటికే ఆండ్రాయిడ్ వేర్ డివైజ్ లతో మార్కెట్లోకి వచ్చిన గూగుల్.. తన సొంత స్మార్ట్ వాచ్ ల తయారీలో ప్రస్తుతం నిమగ్నమై ఉందట. నెక్షస్ బ్రాండ్ లో సొంత ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్ వాచ్ లను తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. రెండు వివిధ సైజుల్లో ఈ వాచ్ లను తీసుకురానుందట. 43.5 ఎంఎం, 42 ఎంఎం డయామీటర్ సర్ క్యూలర్ డిస్ ప్లేలతో ఈ స్మార్ట్ వాచ్ లు వినియోగదారుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. మూడు బటన్ లను 43.5 ఎంఎం డయామీటర్ డిస్ ప్లే వాచ్ కలిగి ఉంటుందని, ఆ వాచ్ ముదురు బూడిద రంగులో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. మొదటి దానితో పోలిస్తే సైజులో తక్కువున్న రెండో వాచ్, స్వార్డ్ ఫిష్ కోడ్ నేమ్ తో మార్కెట్లోకి తీసుకు రాబోతుందని తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ వేర్ వాచ్ ల మాదిరిగా కేవలం ఒక్కటే బటన్ ఉంటుదట. అయితే ఈ వాచ్ మూడు రంగుల్లో మార్కెట్లోకి వస్తుందట. సిల్వర్, టైటానియం, రోజ్ గోల్డ్ రంగుల్లో దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం. జీపీఎస్, హార్ట్ రేట్ సెన్సార్, ఎల్ టీఈ ప్రత్యేకతలను పెద్ద సైజు స్మార్ట్ వాచ్ కలిగిఉండగా.. చిన్న సైజు స్మార్ట్ వాచ్ లో ఎల్ టీఈ, జీపీఎస్ సిస్టమ్ లు ఉండవని రిపోర్టులు పేర్కొంటున్నాయి. నోటిఫికేషన్లు, యాప్స్, ఇతర కంట్రోల్స్ ను చిన్న స్క్రీన్ లో అభివృద్ధి చేయడంలో ప్రస్తుతం గూగుల్ ప్రయత్నిస్తుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. ఎల్ జీ వాచ్, మోటో 360, శామ్ సంగ్ గేర్ లైవ్ బ్రాండ్లతో 2014లో ఆండ్రాయిడ్ వేర్ వాచ్ లను గూగుల్ మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన సొంత స్మార్ట్ వాచ్ హార్డ్ వేర్ తో రెండు కొత్త స్మార్ట్ వాచ్ లను వినియోగదారుల ముందుకు ప్రవేశపెట్టేందుకు గూగుల్ సిద్ధమవుతోందని తెలుస్తోంది.