ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మరీ వల్ల మృతుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. కరోనా భారీనా పడినవారు చనిపోవడానికి ముఖ్యకారణం ఆక్సిజన్ లభ్యత సరిపడినంత లేకపోవడమే. చాలా మందికి ఈ మహమ్మారి సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి(SpO2) ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కీలకంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో బ్లడ్ లో ఆక్సిజన్ స్థాయిని గుర్తించే స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ పరికరాలు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆపిల్, శామ్ సంగ్, షియోమీ, రియల్ మీ వంటి అనేక కంపెనీలు ఆక్సిజన్ స్థాయిని గుర్తించే పరికరాలను తయారు చేస్తున్నాయి. కాబట్టి, మీరు స్మార్ట్ వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌ను కలిగి ఉంటే అందులో బ్లడ్ లో ఆక్సిజన్ స్థాయిని కొలిచే ఫీచర్ అందుబాటులో ఉంది.
SpO2 లెవల్‌ను కొలిచేటప్పుడు గుర్తించుకోవలసిన అంశాలు:
- మీ చేతికి వాచ్ లేదా బ్యాండ్ సరిగ్గా అమర్చారో లేదో చూసుకోండి.
- SpO2 స్థాయిని కొలిచేటప్పుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని, మీ చేతిని అలాగే ఉంచండి.
- మంచి ఫలితాల కోసం మీ చేతిని చదునైన ఉపరితలంపై ఉంచండి.
- మీ చేతిపై ఉండే వెంట్రుకలు, పచ్చబొట్లు, చెయ్యి వణకడం, సక్రమంగా ధరించకపోవడం వంటివి ఫలితాలను ప్రభావితం చేస్తాయి.
ఆపిల్ వాచ్ సిరీస్ 6
మీ ఐఫోన్‌లో హెల్త్ యాప్‌ను సెటప్ చేసుకొని, బ్రౌజ్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. తర్వాత రెస్పిరేటరీ నావిగేట్ ఆన్ చేయండి. ఆ తర్వాత బ్లడ్ ఆక్సిజన్ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లడ్ ఆక్సిజన్ సెటప్ చేసుకోండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆపిల్ వాచ్ యాప్‌లో వెళ్లి SpO2 లెవన్‌ను కొలవండి. ఒకవేళ మీ యాపిల్ వాచ్‌లో బ్లడ్ ఆక్సిజన్ యాప్ లేకపోతే, యాప్ స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి.
అమేజ్‌ఫిట్
మీ అమేజ్‌ఫిట్ యాప్‌లోని లిస్ట్‌ను ఓపెన్ చేయడానికి డయల్ ఇంటర్‌ఫేస్‌ను ఎడమవైపు స్వైప్ చేయండి. బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ను కొలవడానికి బ్లడ్ ఆక్సిజన్ యాప్‌ను ఎంచుకోండి.
రియల్‌మి వాచ్
యూజర్లు రియల్‌మి వాచ్‌లోని ఆక్సిజన్ శాచురేషన్ (SpO2) పేజీకి వెళ్లాలి. SpO2 లెవల్‌ను కొలవడానికి SpO2 ఎంపికపై నొక్కండి. 30 సెకన్లలో ఫలితం మీకు కనిపిస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 3
శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 3లో మాత్రమే ఆక్సిజన్ లెవల్‌ను గుర్తించవచ్చు. ఈ వాచ్‌లో SpO2 ను కొలవడానికి, మీ స్మార్ట్‌ఫోన్‌లో శామ్‌సంగ్ హెల్త్ యాప్‌ను ఓపెన్ చేసి మీ గెలాక్సీ వాచ్ 2ను జత చేయండి. ఇప్పుడు, గెలాక్సీ వాచ్ 3లో గెలాక్సీ హెల్త్ యాప్ ఓపెన్ చేసి స్ట్రెస్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. SpO2 లెవల్‌ను పొందడానికి మెజర్ బటన్‌పై క్లిక్ చేయండి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment