Boult Audio Rover Pro smartwatch launched in India; check details - Sakshi
Sakshi News home page

Boult Rover Pro: కేవలం రూ. 2499కే స్మార్ట్‌వాచ్: లేటెస్ట్ డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్

Published Fri, Apr 14 2023 11:05 AM

Boult audio rover pro smartwatch launched in india - Sakshi

దేశీయ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూలన ఏదో ఒక కొత్త ఉత్పత్తి విడుదలవుతూనే ఉంది. ఇందులో భాగంగానే దేశీయ కంపెనీ 'బోల్ట్ ఆడియో' (Boult Audio) ఒక కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల చేసింది. ఇది ఆకర్షణీయమైన డిస్‍ప్లే కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.

బోల్ట్ ఆడియో విడుదల చేసిన కొత్త స్మార్ట్‌వాచ్ పేరు 'బోల్ట్ రోవర్ ప్రో' (Boult Rover Pro). దీని ధర కేవలం రూ. 2,499 మాత్రమే. ఇది ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులకు ఈ వాచ్‍తో పాటు అదనంగా రెండు డిటాచబుల్ స్ట్రాప్స్ కూడా లభిస్తాయి.

కొత్త బోల్ట్ రోవర్ ప్రో వాచ్ 1.43 ఇంచెస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్‍ప్లే కలిగి 1000 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, 446x446 పిక్సెల్స్ రెజల్యూషన్ పొందుతుంది. అంతే కాకుండా బ్లూటూత్ 5.2 వెర్షన్‍ కలిగి ఉండటం వల్ల కాలింగ్ ఫీచర్ ఇందులో లభిస్తుంది. తద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. అంతే కాకుండా డయల్ ప్యాడ్, సింక్ కాంటాక్ట్ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

ప్రస్తుతం స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసే చాలామంది హెల్త్ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాచ్‌లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున బోల్ట్ రోవర్ ప్రోలో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్‍పీవో2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు వందకుపైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది.

(ఇదీ చదవండి: సి3 కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ధర ఎంతంటే?)

బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 7 రోజుల వరకు పనిచేస్తుంది. దీనిని కేవలం 10 నిముషాల ఛార్జ్‌తో 2 రోజులు ఉపయోగించుకోవచ్చు. చార్జింగ్ కోసం యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. ఇది వాయిస్ అసిస్టెంట్‍కు కూడా సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍ పొందుతుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో వినియోగించడానికి ఈ వాచ్ ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement