Boult
-
కేవలం రూ. 2499కే స్మార్ట్‌వాచ్: లేటెస్ట్ డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్
దేశీయ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూలన ఏదో ఒక కొత్త ఉత్పత్తి విడుదలవుతూనే ఉంది. ఇందులో భాగంగానే దేశీయ కంపెనీ 'బోల్ట్ ఆడియో' (Boult Audio) ఒక కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల చేసింది. ఇది ఆకర్షణీయమైన డిస్ప్లే కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. బోల్ట్ ఆడియో విడుదల చేసిన కొత్త స్మార్ట్‌వాచ్ పేరు 'బోల్ట్ రోవర్ ప్రో' (Boult Rover Pro). దీని ధర కేవలం రూ. 2,499 మాత్రమే. ఇది ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులకు ఈ వాచ్‌తో పాటు అదనంగా రెండు డిటాచబుల్ స్ట్రాప్స్ కూడా లభిస్తాయి. కొత్త బోల్ట్ రోవర్ ప్రో వాచ్ 1.43 ఇంచెస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 446x446 పిక్సెల్స్ రెజల్యూషన్ పొందుతుంది. అంతే కాకుండా బ్లూటూత్ 5.2 వెర్షన్ కలిగి ఉండటం వల్ల కాలింగ్ ఫీచర్ ఇందులో లభిస్తుంది. తద్వారా మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. అంతే కాకుండా డయల్ ప్యాడ్, సింక్ కాంటాక్ట్ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసే చాలామంది హెల్త్ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాచ్‌లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున బోల్ట్ రోవర్ ప్రోలో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్పీవో2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు వందకుపైగా స్పోర్ట్స్ మోడ్లకు సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: సి3 కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ధర ఎంతంటే?) బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 7 రోజుల వరకు పనిచేస్తుంది. దీనిని కేవలం 10 నిముషాల ఛార్జ్‌తో 2 రోజులు ఉపయోగించుకోవచ్చు. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. ఇది వాయిస్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో వినియోగించడానికి ఈ వాచ్ ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంది. -
రూ. 1,299కే కొత్త ఇయర్‌ఫోన్స్.. ఒక్క ఛార్జ్‌తో 40 గంటలు
మార్కెట్లో ఎట్టకేలకు బోల్ట్ ఆడియో కర్వ్ ఏఎన్సీ నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్ విడుదలయ్యాయి. దీని ధర కేవలం రూ. 1,299 మాత్రమే. విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఫీచర్ 'యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్'. కొత్త బోల్ట్ ఆడియో ఇయర్‌ఫోన్స్ ఒక ఫుల్ చార్జ్‌పై 40 గంటలు, ఏఎన్‌సీతో అయితే 30 గంటలు ఉపయోగించుకోవచ్చు. అతి తక్కువ ధరలో ఎక్కువ టైమ్ ఇయర్‌ఫోన్ ఉపయోగించుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ అప్షన్ అనే చెప్పాలి. 10 నిమిషాల చార్జింగ్‌తో 10 గంటల వరకు వినియోగించుకునేలా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది. లేటెస్ట్ బోల్ట్ ఇయర్‌ఫోన్స్ 12మిమీ సౌండ్ డ్రైవర్లతో, బూమ్ఎక్స్ టెక్నాలజీ పొందుతుంది. ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునేలా డ్యుయల్ పెయిరింగ్ ఫీచర్ ఇప్పుడు దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఏఎన్సీ ఫీచర్ ఉండటం వల్ల బయటి శబ్దాలు వినపడే అవకాశం ఉండదు. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు) చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్టు, గేమింగ్ కోసం 60ms అల్ట్రా లో ల్యాటెన్సీ, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కొత్త ఇయర్‌ఫోన్స్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు బోల్ట్ కంపెనీ వెబ్సైట్లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. -
రూ.1000 కంటే తక్కువ ధరలో బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ ఇవే..!
మనకు నచ్చిన సంగీతాన్ని వింటుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏలాంటి డిస్టారెబెన్స్ లేకుండా ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వింటే ఆ మజానే వేరు. ఇయర్‌ఫోన్స్ ఒక్కింతా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటాయి. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లతో పాటుగా ఇయర్‌ఫోన్స్‌ను ఒకప్పుడు అందించేవి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కస్టమర్లకు ఇయర్ఫోన్లను అందించడం నిలిపివేశాయి. దీంతో కచ్చితంగా సపరేటుగా ఇయర్ఫోన్లకు కొనాల్సిందే. ఇయర్ఫోన్లను కొనేటప్పుడు ఏ కంపెనీకి చెందినవి బాగుంటాయి..? ఏంత ధరలో ఇయర్ఫోన్లను కొనాలి..? అనే ప్రశ్నలు మనందరికీ తొలచివేస్తుంది. ఇలా ఏ కంపెనీ ఇయర్ఫోన్లను కొనాలనే సందేహం ఉన్నవారి కోసమే.. ఈ వార్త! రూ.1000 కంటే తక్కువ రేట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే ఇయర్ఫోన్లను మీకోసం అందిస్తున్నాం... రూ.1000 కంటే తక్కువ ధరలో బెస్ట్ ఇయర్‌ఫోన్స్ ఇవే..! 1.బోట్ బాస్‌హెడ్స్ 225 బోట్ కంపెనీకి చెందిన క్లాసిక్ ఇయర్ఫోన్లలో ఇది ఒకటి. మీ చెవులకు బాగా సరిపోయే విధంగా వీటి డిజైన్ ఉంటుంది. వీటి ధర రూ. 399 2. బోట్ బాస్ హెడ్స్ 242 ఈ ఇయర్‌ఫోన్స్ ఐపీఎక్స్4 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్ లైన్ మైక్‌తో వస్తుంది. తేలికగా ఉంటాయి. వీటి ధర రూ. 399 3.జెబీఎల్ సీ200ఎస్ఐ సౌండ్, అకౌస్టిక్ పరికారాల్లో హర్మన్ కంపెనీకి చెందిన జెబీఎల్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ఇయర్‌ఫోన్స్ ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. జెబీఎల్ సీ200ఎస్ఐ ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది, ఇది మన్నికైనదిగా ఉంటుంది. వీటి ధర రూ. 749. 4. రియల్మీ బడ్స్ 2 నియో రియల్మీ స్మార్ట్‌ఫోన్ తన కంపెనీ నుంచి ఇయర్ఫోన్లను కూడా అందిస్తోంది. రియల్మీ బడ్స్ టీపీయూ మెటిరియల్తో తయారుచేశారు. రియల్మీ బడ్స్ 2 చెవులకు బాగా సరిపోయే విధంగా ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. వీటి ధర రూ. 399. 5. బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL అనేది వైర్లెస్ నెక్‌బ్యాండ్. బ్లూటూత్ 5.0 ఆధారంగా పనిచేస్తుంది. ఇది 12 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. X1-WL పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 1-2 రోజుల స్టాండ్‌బై టైమ్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా IPX5 రేటింగ్ కలిగి ఉంది. వీటి ధర రూ. 849. గమనిక: ఎక్కువసేపు ఇయర్ఫోన్లను చెవులకు తగిలించుకోవడం మంచింది కాదు. పై ధరలు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో పేర్కొన్న ధరలు. -
క్యాపిటల్స్‌కు వరుసగా నాలుగో ఓటమి
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతోంది...ప్లే ఆఫ్స్ స్థానం ఖరారైన తర్వాత కూడా ఏమాత్రం తీవ్రత తగ్గించని ఆ జట్టు ఢిల్లీని సునాయాసంగా ఓడించి తమ స్థాయిని ప్రదర్శించింది. భారీ రన్‌రేట్ కారణంగా ఆ జట్టు టాప్–2లో నిలవడం కూడా దాదాపుగా ఖాయమైంది. మరో వైపు పేలవ ప్రదర్శనతో క్యాపిటల్స్ మరింత దిగజారింది. బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిన ఆ టీమ్ రన్‌రేట్ కూడా మైనస్‌లోకి పడిపోయింది. ముందంజ వేసే అవకాశాలు ఇంకా ఉన్నా... పరిస్థితిని మాత్రం క్లిష్టంగా మార్చుకుంది. దుబాయ్: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో పెద్ద విజయం చేరింది. పేస్ ద్వయం బుమ్రా (3/17), బౌల్ట్ (3/21) అద్భుత ప్రదర్శన చేయడంతో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను 9 వికెట్లతో ముంబై చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ధావన్ మళ్లీ సున్నా... భారీ స్కోరు సాధించాలనే లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ ధాటికి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శిఖర్ ధావన్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే రెండు ఫోర్లతో జోరు కనబరిచిన పృథ్వీ (10) కూడా పెవిలియన్ చేరాడు. పరుగులు చేసేందుకు శ్రమించిన ఢిల్లీ పవర్‌ప్లేలో కేవలం 22 పరుగులు చేసింది. ఈ సీజన్లో పవర్‌ప్లేలో నమోదైన రెండో అత్యల్ప స్కోరు ఇదే. పంత్ (24 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో కలిసి అయ్యర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే 12 పరుగుల వ్యవధిలో అయ్యర్, స్టొయినిస్ (2), పంత్ వికెట్లను కోల్పోయి 62/5తో కష్టాల్లో పడింది. మరోసారి చెలరేగిన బుమ్రా... హర్షల్‌పటేల్ (5)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, హెట్‌మైర్ (11) విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ తడాఖా... భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై స్వల్ప లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఇషాన్ కిషన్ నాలుగు బౌండరీలతో రాణించడంతో వికెట్ కోల్పోకుండా పవర్‌ప్లేలో 41 పరుగులు సాధించింది. ఇషాన్‌కు సహకరించిన డికాక్ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు)... నోర్జే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సూర్యకుమార్ (12) అండతో ఇషాన్ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత చెలరేగిన ఇషాన్ సిక్సర్‌తో మరో 34 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డికాక్ (బి) బౌల్ట్ 10; ధావన్ (సి) సూర్యకుమార్ (బి) బౌల్ట్ 0; శ్రేయస్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చహర్ 25; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 21; స్టొయినిస్ (సి) డికాక్ (బి) బుమ్రా 2; హెట్‌మైర్ (సి) కృనాల్ (బి) కూల్టర్ నీల్ 11; హర్షల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 5; అశ్విన్ (సి) కృనాల్ (బి) బౌల్ట్ 12; ప్రవీణ్ దూబే (నాటౌట్) 7; రబడ (రనౌట్) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–50, 4–57, 5–62, 6–73, 7–78, 8–96, 9–110. బౌలింగ్: బౌల్ట్ 4–0–21–3, కృనాల్ 3–0–13–0, జయంత్ యాదవ్ 3–0–18–0, బుమ్రా 4–0–17–3, కూల్టర్‌నీల్ 2–0–14–1, రాహుల్ చహర్ 4–0–24–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (నాటౌట్) 72; డికాక్ (బి) నోర్జే 26; సూర్యకుమార్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 111. వికెట్ల పతనం: 1–68. బౌలింగ్: రవిచంద్రన్ అశ్విన్ 4–0–18–0, రబడ 3–0–27–0, నోర్జే 2.2–0–25–1, స్టొయినిస్ 1–0–4–0, ప్రవీణ్ 3–0–29–0, హర్షల్ పటేల్ 1–0–8–0. -
15 బంతులు.. 6 వికెట్లు!
-
ఇంగ్లండ్ బొక్కబోర్లా
ఆక్లాండ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన ఇంకా కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్ట్‌లో ఆడుతోంది టెస్ట్ మ్యాచా లేక టి20నా అనే అనుమానం వచ్చేలా తొలి రోజు తొలి సెషన్ కూడా పూర్తి కాకముందే ఆ జట్టు ఆలౌటైంది. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన ఇంగ్లీష్ జట్టు... కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (6/32) ధాటికి కేవలం 20.4 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఒవర్టన్ (25 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో ధాటిగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌల్ట్‌కు తోడు టిమ్ సౌథీ (4/25) నిప్పులు చెరగడంతో ఐదుగురు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. కివీస్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్‌కు ఇది ఆరో అత్యల్పం. ఈడెన్ పార్క్ (ఆక్లాండ్) వేదికగా గురువారం ప్రారంభమైన డే–నైట్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 94 నిమిషాల్లోనే ముగిసింది. కివీస్ పేసర్లు బౌల్ట్, సౌథీ ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరిద్దరి ధాటికి ఓ దశలో 27 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసేలా కనిపించినా... చివరి వికెట్‌కు ఒవర్టన్, అండర్సన్ 31 పరుగులు జోడించి కాస్త పరువు నిలిపారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి... తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (91 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. అతనితో పాటు నికోల్స్ (24 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో అండర్సన్ 2, బ్రాడ్ ఓ వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 6 పరుగుల వద్ద సీనియర్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్ (5) వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. ఆ తర్వాత కెప్టెన్ జో రూట్ (0)ఖాతా తెరవకుండానే వెనుదిరగగా... మలాన్ (2), స్టోన్‌మన్ (11) అతన్ని అనుసరించారు. ఆరు నెలల తర్వాత టెస్టు క్రికెట్లో పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ స్టోక్స్ (0), వికెట్ కీపర్ బెయిర్‌స్టో (0), మొయిన్ అలీ (0)లు కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. టెయిలెండర్లు వోక్స్ (5), బ్రాడ్ (0) అవుటైనా... అండర్సన్ (1)తో కలిసి ఒవర్టన్ జట్టు స్కోరు 50 పరుగులు దాటించాడు. 400 వికెట్ల క్లబ్లో బ్రాడ్.... టెస్ట్ క్రికెట్ చరిత్రలో 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్థానం దక్కించుకున్నాడు. 115వ టెస్ట్ ఆడుతోన్న ఈ ఇంగ్లీష్ బౌలర్ కివీస్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ వికెట్ పడగొట్టి అందరికంటే పిన్న వయసు (31 ఏళ్ల 271 రోజులు)లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అండర్సన్ (525) తర్వాత 400 వికెట్ల మైలురాయిని దాటిన రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా గుర్తింపు పొందిన బ్రాడ్...ఓవరాల్‌గా ఈ జాబితాలో 15వ బౌలర్. ►ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో ఇది (58) ఆరో అత్యల్ప స్కోరు కాగా, ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం 1976 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎదుర్కొన్న ఓవర్ల ప్రకారం చూస్తే ఈ ఇన్నింగ్స్ (20.4 ఓవర్లు) ఇంగ్లండ్‌కు మూడో అతి చెత్త ప్రదర్శన. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మొదటి 9 వికెట్లకు 27 పరుగులు జోడిస్తే... చివరి వికెట్‌కు 31 పరుగులు జత చేసింది. ►6/32 బౌల్ట్ కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. ►ఇద్దరు బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం 1994 (లంకపై అక్రమ్, వకార్) తర్వాత ఇదే తొలిసారి. న్యూజిలాండ్ తరఫున ఇదే మొదటి సారి. -
బౌల్ట్ ధాటికి పాక్ 74 ఆలౌట్
డ్యూనెడిన్: పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (5/17) నిప్పులు చెరిగే బంతులతో పాకిస్తాన్‌ను హడలెత్తించడంతో... శనివారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 183 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత న్యూజిలాండ్ సరిగ్గా 50 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్తాన్ జట్టు బౌల్ట్ ధాటికి 27.2 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్‌గా వన్డేల్లో పాకిస్తాన్ తమ మూడో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. సిరీస్‌లో నాలుగో వన్డే ఈనెల 16న జరుగుతుంది. -
బౌల్ట్ ధాటికి విండీస్ విలవిల
క్రైస్ట్‌చర్చ్: వెస్టిండీస్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఆ జట్టు ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోగా... ఇప్పుడు రెండో వన్డేలో ఓటమితో వన్డే సిరీస్‌నూ చేజార్చుకుంది. శనివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో పేసర్ ట్రెంట్ బౌల్ట్ (7/34) చెలరేగడంతో... న్యూజిలాండ్ 204 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ (62 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జార్జ్ వర్కర్ (53 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాస్ టేలర్ (66 బంతుల్లో 57; 5 ఫోర్లు), టాడ్ ఆస్టల్ (45 బంతుల్లో 49; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను బౌల్ట్ బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులతో కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకోవడంతోపాటు తన కెరీర్లో 100 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. బౌల్ట్‌కు తోడు ఫెర్గూసన్ (3/17) కూడా చెలరేగడంతో విండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోయింది. మూడో వన్డే మంగళవారం జరుగుతుంది. -
ధావన్‌కి గాయం!
కోల్‌కతా: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఎడమ చేతి వేలుకు తీవ్ర గాయమైంది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్ రెండో బంతి చూపుడు వేలు, బొటన వేలు మధ్య తాకగా ఫిజియో సహాయం తీసుకోవాల్సి వచ్చింది. బౌల్ట్ తర్వాతి ఓవర్లో కూడా అదే తరహాలో బొటనవేలుకు బంతి వేగంగా తగలడంతో అతను విలవిల్లాడాడు. ధావన్ అవుటైన తర్వాత అతని వేలికి ఎక్స్‌రే తీశారు. దీని ఫలితం ఇంకా రాలేదు. గాయం తీవ్రతను పరిశీలిస్తున్నట్లు మేనేజ్మెంట్ ప్రకటించగా... ధావన్ మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉందని తెలిసింది.