బౌల్ట్‌ ధాటికి విండీస్‌ విలవిల  | New Zealand warn of no let up as Boult destroys Windies | Sakshi
Sakshi News home page

బౌల్ట్‌ ధాటికి విండీస్‌ విలవిల 

Published Sun, Dec 24 2017 1:48 AM | Last Updated on Sun, Dec 24 2017 1:48 AM

 New Zealand warn of no let up as Boult destroys Windies - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: వెస్టిండీస్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఆ జట్టు ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోగా... ఇప్పుడు రెండో వన్డేలో ఓటమితో వన్డే సిరీస్‌నూ చేజార్చుకుంది. శనివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (7/34) చెలరేగడంతో...  న్యూజిలాండ్‌ 204 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్‌ (62 బంతుల్లో 83 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జార్జ్‌ వర్కర్‌ (53 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాస్‌ టేలర్‌ (66 బంతుల్లో 57; 5 ఫోర్లు), టాడ్‌ ఆస్టల్‌ (45 బంతుల్లో 49; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.

326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను బౌల్ట్‌ బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులతో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకోవడంతోపాటు తన కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. బౌల్ట్‌కు తోడు ఫెర్గూసన్‌ (3/17) కూడా చెలరేగడంతో విండీస్‌ 121 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కోల్పోయింది. మూడో వన్డే మంగళవారం జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement