హామిల్టన్: మిడిలార్డర్ విఫలమవడంతో వెస్టిండీస్‌తో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో న్యూజిలాండ్ శుభారంభాన్ని భారీస్కోరుగా మలుచుకోలేకపోయింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు జీత్ రావల్ (84; 15 ఫోర్లు), లాథమ్ (22) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు. లాథమ్ అవుటయ్యాక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (43; 5 ఫోర్లు), రావల్ రెండో వికెట్‌కు 89 పరుగులు జత చేశారు.
ఒకదశలో వికెట్ నష్టానికి 154 పరుగులతో పటిష్టంగా కనిపించిన కివీస్ రావల్, విలియమ్సన్ అవుటయ్యాక తడబడింది. రాస్ టేలర్ (16), నికోలస్ (13) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా... 189/5తో కష్టాల్లో పడిన జట్టును గ్రాండ్‌హోమ్ (58; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), శాంట్నర్ (24) ఆదుకున్నారు. వీరి మధ్య ఆరో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆట ముగిసే సమయానికి బ్లండెల్ (12 బ్యాటింగ్), వాగ్నర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లలో షానన్ గాబ్రియెల్ (3/79), కమిన్స్ (2/37) రాణించారు.
న్యూజిలాండ్ 286/7
Published Sun, Dec 10 2017 1:25 AM | Last Updated on Sun, Dec 10 2017 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment