వెల్లింగ్టన్: తొలుత పేస్ బౌలర్ నీల్ వాగ్నర్ (7/39) విజృంభణ... ఆ తర్వాత బ్యాట్స్ మన్ నిలకడ... ఫలితంగా వెస్టిండీస్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజే న్యూజిలాండ్ జట్టు పట్టుబిగించింది. ముందుగా విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్ (24; ఒక సిక్స్), కీరన్ పావెల్ (42; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్ 22వ ఓవర్లో బ్రాత్‌వైట్‌ను అవుట్ చేసిన వాగ్నర్ విండీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. బౌల్ట్ బౌలింగ్‌లో పావెల్ నిష్క్రమించాక విండీస్ ఇన్నింగ్స్ పూర్తిగా తడబడింది.
విండీస్ చివరి 9 వికెట్లను 59 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. దాంతో విండీస్ ఇన్నింగ్స్ 45.4 ఓవర్లలో 134 పరుగులకే ముగిసింది. అనంతరం న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 85 పరుగులు సాధించింది. విండీస్ బ్యాట్స్‌మన్ సునీల్ అంబ్రిస్ తానాడుతున్న తొలి టెస్టులో తొలి బంతికే హిట్ వికెట్‌గా అవుటయ్యాడు. టెస్టు క్రికెట్‌లో ఈ రకంగా అవుటైన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment