హామిల్టన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (107 నాటౌట్; 11 ఫోర్లు) శతకం బాదడంతో న్యూజిలాండ్... వెస్టిండీస్ ముందు 444 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. ఆట ముగిసే సమయానికి విండీస్ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో విండీస్ ఓటమి ని తప్పించుకోవడం కష్టమే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 215/8తో సోమవారం మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ మరో ఆరు పరుగులు జోడించి ఆలౌటైంది.
బౌల్ట్ (4/73) రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టేలర్‌తో పాటు కెప్టెన్ విలియమ్సన్ (54; 8 ఫోర్లు) రాణించాడు. టీ విరామం అనంతరం న్యూజిలాండ్ 291/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెరీర్‌లో 17వ టెస్టు శతకం సాధించిన రాస్ టేలర్... తన ఆరాధ్య ఆటగాడు, కివీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ మార్టిన్ క్రో రికార్డును సమం చేశాడు.
ఓటమి దిశగా విండీస్
Published Tue, Dec 12 2017 1:07 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment