
హామిల్టన్: ఊహించిన ఫలితమే వచ్చింది. మరోసారి న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్‌ను హడలెత్తించారు. ఫలితంగా రెండో టెస్టులో న్యూజిలాండ్ 240 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 444 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 30/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకే ఆలౌటైంది.
వాగ్నర్ బౌలింగ్‌లో మోచేతికి తీవ్ర గాయమైన సునీల్ ఆంబ్రిస్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. పేసర్లు వాగ్నర్ (3/42), బౌల్ట్ (2/52), సౌథీ (2/71) ధాటికి పర్యాటక జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. రోస్టన్ ఛేజ్ (64) టాప్ స్కోరర్. రాస్ టేలర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నెల 20 నుంచి రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టి20ల సిరీస్ మొదలవుతంది.