
డ్యూనెడిన్: పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (5/17) నిప్పులు చెరిగే బంతులతో పాకిస్తాన్‌ను హడలెత్తించడంతో... శనివారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 183 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత న్యూజిలాండ్ సరిగ్గా 50 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం పాకిస్తాన్ జట్టు బౌల్ట్ ధాటికి 27.2 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్‌గా వన్డేల్లో పాకిస్తాన్ తమ మూడో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. సిరీస్‌లో నాలుగో వన్డే ఈనెల 16న జరుగుతుంది.