మనకు నచ్చిన సంగీతాన్ని వింటుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏలాంటి డిస్టారెబెన్స్ లేకుండా ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వింటే ఆ మజానే వేరు. ఇయర్‌ఫోన్స్ ఒక్కింతా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటాయి. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లతో పాటుగా ఇయర్‌ఫోన్స్‌ను ఒకప్పుడు అందించేవి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కస్టమర్లకు ఇయర్‌ఫోన్లను అందించడం నిలిపివేశాయి. దీంతో కచ్చితంగా సపరేటుగా ఇయర్‌ఫోన్లకు కొనాల్సిందే.
ఇయర్‌ఫోన్లను కొనేటప్పుడు ఏ కంపెనీకి చెందినవి బాగుంటాయి..? ఏంత ధరలో ఇయర్‌ఫోన్లను కొనాలి..? అనే ప్రశ్నలు మనందరికీ తొలచివేస్తుంది. ఇలా ఏ కంపెనీ ఇయర్‌ఫోన్లను కొనాలనే సందేహం ఉన్నవారి కోసమే.. ఈ వార్త! రూ.1000 కంటే తక్కువ రేట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే ఇయర్‌ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం...
రూ.1000 కంటే తక్కువ ధరలో బెస్ట్ ఇయర్‌ఫోన్స్ ఇవే..!
1.బోట్ బాస్‌హెడ్స్ 225
బోట్ కంపెనీకి చెందిన క్లాసిక్ ఇయర్‌ఫోన్లలో ఇది ఒకటి. మీ చెవులకు బాగా సరిపోయే విధంగా వీటి డిజైన్ ఉంటుంది. వీటి ధర రూ. 399
2. బోట్ బాస్ హెడ్స్ 242
ఈ ఇయర్‌ఫోన్స్ ఐపీఎక్స్4 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్ లైన్ మైక్‌తో వస్తుంది. తేలికగా ఉంటాయి. వీటి ధర రూ. 399
3.జెబీఎల్ సీ200ఎస్‌ఐ
సౌండ్, అకౌస్టిక్ పరికారాల్లో హర్మన్ కంపెనీకి చెందిన జెబీఎల్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ఇయర్‌ఫోన్స్ ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. జెబీఎల్ సీ200ఎస్‌ఐ ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది, ఇది మన్నికైనదిగా ఉంటుంది. వీటి ధర రూ. 749.
4. రియల్‌మీ బడ్స్ 2 నియో
రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ తన కంపెనీ నుంచి ఇయర్‌ఫోన్లను కూడా అందిస్తోంది. రియల్‌మీ బడ్స్ టీపీయూ మెటిరియల్‌తో తయారుచేశారు. రియల్‌మీ బడ్స్ 2 చెవులకు బాగా సరిపోయే విధంగా ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. వీటి ధర రూ. 399.
5. బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL
బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL అనేది వైర్‌లెస్ నెక్‌బ్యాండ్. బ్లూటూత్ 5.0 ఆధారంగా పనిచేస్తుంది. ఇది 12 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. X1-WL పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 1-2 రోజుల స్టాండ్‌బై టైమ్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా IPX5 రేటింగ్ కలిగి ఉంది. వీటి ధర రూ. 849.
గమనిక: ఎక్కువసేపు ఇయర్‌ఫోన్లను చెవులకు తగిలించుకోవడం మంచింది కాదు. పై ధరలు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో పేర్కొన్న ధరలు.
Comments
Please login to add a commentAdd a comment