2021 పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు బిజినెస్ ‘కొంచెం ఇష్టం..కొంచెం కష్టం’గా గడిచింది. మరికొన్ని కంపెనీలకేమో మూడు పువ్వులు ఆరుకాయలుగా గణనీయమైన వృద్ధిని సాధించాయి. దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను చిప్స్ కొరత, సప్లై చైన్ వంటి సమస్యలు వెంటడాయి. అయినప్పటికీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత్ కాసుల వర్షాలను కురిపించాయి. 2021 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు గొప్ప సంవత్సరంగా నిలిచింది.
2021లో వచ్చిన సూపర్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాను ప్రముఖ టెక్ వెబ్‌సైట్ గాడ్జెట్స్ 360 ఎంపిక చేసింది. ఆయా స్మార్ట్‌ఫోన్ల పర్ఫార్‌మెన్స్, బ్యాటరీ, ధరలు ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని గాడ్జెట్స్ 360 ఈ ఏడాది వచ్చిన సూపర్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. కాగా గాడ్జెట్స్ 360 ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్లలో ఏ మోడల్స్ కూడా 10/10 స్కోర్‌ను సాధించలేకపోయాయి. గాడ్జెట్స్ 360 ఎంపిక స్మార్ట్ ఫోన్లలో యాపిల్, వివో, రియల్ మీ, ఎంఐ, శాంసంగ్, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ నిలిచాయి
ఈ ఏడాది వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
►యాపిల్‌కు చెందిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐపోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్స్ తొలి నాలుగుస్థానాల్లో నిలిచాయి. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్‌ప్లే పరంగా మిగతా స్మార్ట్‌ఫోన్ల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు అధికంగా ఉండడంతో కొంతమంది వ్యక్తులకే మాత్రమే పరిమితమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు అధికంగా ఉండడంతో 10/10 స్కోర్‌ను సాధించలేకపోయింది.
►రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ జీటీ నిలిచింది. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, విషయంలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. యాపిల్ స్మార్ట్‌ఫోన్లతో పోల్చితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర తక్కువగా ఉండడంతో రియల్‌మీ జీటీ అమ్మకాలు భారీగానే జరిగినట్లు తెలుస్తోంది.
►ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ ఈ ఏడాది రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్లలో Mi 11 అల్ట్రా అత్యంత శక్తివంతమైన ఫోన్‌గా నిలిచింది. శామ్‌సంగ్ గెలాక్సీ S21 కు గట్టిపోటీనే ఇచ్చింది.
►భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌గా Samsung S21 అల్ట్రా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ అదరగొట్టాయి.
►కెమెరాస్ విత్ గింబల్ తో వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో Vivo X70 Pro+ అద్బుతంగా ఉంది. సొగసైన డిజైన్, IP68 రేటింగ్, పదునైన 120Hz డిస్ప్లే, అద్భుతమైన వీడియో స్థిరీకరణ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం.
►వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌లో OnePlus 9 ప్రో అద్బుతమైన పనితీరును కనబర్చింది.50W వైర్‌లెస్ ఛార్జింగ్ , క్లాస్-లీడింగ్ అల్ట్రా-వైడ్ కెమెరా వంటి కొన్ని కొత్త గుర్తించదగిన ఫీచర్లు వన్‌ప్లస్ 9 ప్రొలో ఉన్నాయి.
చదవండి: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ లిస్ట్‌లో ఒకేఒక్కడు! అంతలా ఎందుకు వెతికారంటే..
Comments
Please login to add a commentAdd a comment