2020లో ఎక్కువ వెతికిన మొబైల్స్ ఇవే! | Most Searched Smartphones By Indians in 2020 | Sakshi
Sakshi News home page

2020లో ఎక్కువ వెతికిన మొబైల్స్ ఇవే!

Published Thu, Dec 10 2020 8:36 PM | Last Updated on Thu, Dec 10 2020 9:03 PM

Most Searched Smartphones By Indians in 2020 - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పలు స్మార్ట్‌ఫోన్ల విడుదల ఆలస్యమైంది. అయినప్పటికీ భారత్‌లో లాక్‌డౌన్‌ తర్వాత పండుగ సీజన్ సందర్బంగా రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు జరిగాయి. ఆపిల్, వన్‌ప్లస్‌, షియోమీ, రియల్‌మీ‌ తదితర ప్రముఖ కంపెనీలు భారత మార్కెట్లో నూతన ఫోన్లను విడుదల చేశాయి. 2020లో భారతీయులు ఎక్కువగా సెర్చ్‌ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను గూగుల్‌ విడుదల చేసింది. 

1) వన్‌ప్లస్‌ నార్డ్‌
వన్‌ప్లస్‌ నార్డ్‌ బేసిక్ ప్రైస్ వచ్చేసి రూ.24,999గా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ 6.44 అంగుళాల డిస్ప్లే 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్ 20: 9 యాస్పెక్ట్ రేషియోలో లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 5జీ ప్రాసెసర్, 4115 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 48ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ యొక్క క్వాడ్-కెమెరా సెటప్ కలిగి ఉంది.

2) ఐఫోన్‌ 12
రూ.79,900 ప్రారంభ ధరతో వచ్చిన ఐఫోన్ 12 మొబైల్ 64జీబీ, 128జీబీ, 256జీబీ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది 5.4 అంగుళాల ఓఎల్ ఈఢీ డిస్ప్లేని కలిగి ఉంది. ఐఫోన్‌ 12 ఏ14 బయోనిక్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీనిని బ్లూ, వైట్, గ్రీన్, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. 

3)  రియల్ మీ 7 ప్రో
రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 65వాట్ సూపర్‌డార్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 48 ఎంపి ప్రధాన సెన్సార్‌తో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది, ఇది ప్రారంభ ధర రూ.19,999.

4) రెడ్‌మీ నోట్‌ 8 ప్రొ
షియోమీ రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.15,999. ఈ మొబైల్ హాలో వైట్, గామా గ్రీన్, షాడో బ్లాక్, డార్క్ బ్లూ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ హెలియో జీ90టీ ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

5) రెడ్‌మీ నోట్ 8
షియోమీ రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.11,499 రూపాయలు. రెడ్‌మి నోట్ 8 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో బ్యాకప్ చేయబడిన 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది

6) ఒప్పో ఎఫ్ 17 ప్రో
షియోమీ రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.21,490 రూపాయలు. ఒప్పో ఎఫ్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ ఎఫ్‌హెచ్‌డి + డిస్ప్లే (2400x1080p రిజల్యూషన్) కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో పీ 95 ప్రాసెసర్ ద్వారా వస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తున్న ఒప్పో ఎఫ్ 17ప్రో వెనుక భాగంలో 48 ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది.

7) రెడ్‌మి నోట్ 9 ప్రో
షియోమీ రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.12,999 రూపాయలు. రెడ్‌మి నోట్ 9 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5020 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, 48ఎంపీ ప్రధాన సెన్సార్‌తో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

8) వివో వీ20
సన్‌సెట్ మెలోడీ, మిడ్‌నైట్ జాజ్, మూన్‌లైట్ సోనాట వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభించే వివో వీ20 హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.44-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్‌ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ లో 44 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.దీని ప్రారంభ ధర రూ.23990.

9) రియల్ మీ  6ప్రో
ప్రస్తుతం రూ.17,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్న రియల్‌మీ 6ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్ప్లే 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీతో నడిచే ఈ హ్యాండ్‌సెట్ 4300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 64ఎంపీ + 8ఎంపీ + 12ఎంపీ + 2ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

10) రియల్ మీ 7
దీని ప్రారంభ ధర రూ.14,999. రియల్‌మీ 7 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. ఈ మొబైల్ వెనుక 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement