ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 అన్ని రంగాలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆటోమొబైల్, సర్వీస్ సెక్టార్స్ భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రేరిత బాధల నుంచి స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ సురక్షితంగా తప్పించుకుంది. 2021లో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు రెండు లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జరిపినట్లు తెలుస్తోంది.
చిప్స్ కొరత ఉన్నప్పటీకి..!
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత తీవ్రంగా వేధించింది. చిప్స్ కొరత ఉన్పప్పటీకి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లను అధిగమించింది. 2021లో దాదాపు రూ. 2,83,666 కోట్లకు చేరుకుంది. 2020తో పోలిస్తే 27 శాతం అధికంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయి. 2021లో భారతీయులు ప్రతి గంటకు 19,406 స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేశారు. మొత్తంగా 16 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఇది భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇప్పటివరకు చూసిన అత్యధిక షిప్‌మెంట్. ఇదిలా ఉండగా కాంపోనెంట్ కొరత కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఎగుమతులు మందగించడం విశేషం.
టాప్ బ్రాండ్ అదే..!
భారత స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 2021గాను షావోమీ బ్రాండ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. అయినప్పటికీ, కాంపోనెంట్స్ సరఫరాలో పరిమితుల కారణంగా కంపెనీ నాల్గవ త్రైమాసికంలో ఎగుమతులలో మందగమనాన్ని ఎదుర్కొంది.
ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రూ. 20,000 నుంచి రూ. 45,000 సెగ్మెంట్‌లోని 5G స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మార్కెట్లో 18 శాతం వాటాను పొందింది. శామ్‌సంగ్‌కు ఇది శుభవార్త అయినప్పటికీ, ఇది కూడా సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కోవలసి వచ్చింది. శాంసంగ్ ఫోల్డబుల్ విభాగంలో అగ్రగామిగా నిలిచింది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లలో 2021గాను 388 శాతం వృద్ధిని శాంసంగ్ సాధించింది.
రియల్‌మీ మూడో స్థానంలో నిలవగా, భారత్‌లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్‌మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. వివో 2021లో 19 శాతం వాటాతో టాప్ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిగా...ఒప్పో 6 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక యాపిల్ 2021గాను 108 శాతం వృద్దిని నమోదుచేసింది.
చదవండి: చిప్ షార్టేజ్ సంక్షోభం.. అయినా 583.5 బిలియన్ డాలర్ల షాకింగ్ బిజినెస్‌తో హిస్టరీ!
Comments
Please login to add a commentAdd a comment