Flipkart Mobile Bonanza Sale2020: Huge Discounts On Mobiles | డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 10 వరకు - Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్.. భారీ తగ్గింపు

Published Tue, Dec 8 2020 2:18 PM | Last Updated on Tue, Dec 8 2020 3:49 PM

Mobile Bonanza Sale Starts In Flipkart and Huge Discount on Mobiles - Sakshi

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్తగా మొబైల్స్ బొనాంజా సేల్ ని తీసుకొచ్చింది. ఈ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ ద్వారా కొనుగోలుదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను ఉత్తమ ధరకు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ మూడు రోజుల్లో షియోమి, రియల్‌మీ, ఆసుస్, శామ్‌సంగ్, పోకో, ఒప్పో, ఆపిల్ మరియు ఇతర ప్రముఖ పేర్ల బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ ని తీసుకొచ్చింది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.1,750 తగ్గింపు లభించనుంది.(చదవండి: టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్ ఇవే!)

ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్ సందర్బంగా షియోమీ మీ 10టీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 4, ఆసుస్ రాగ్ ఫోన్ 3, మోటో రాజర్(4జీ వెర్షన్) వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించననున్నారు. షియోమి మీ 10టీ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా డేస్ సేల్ సందర్భంగా రూ.35,999(అసలు ధర రూ.39,999)కి లభిస్తుంది. అలాగే, ఆసుస్ రోగ్ ఫోన్ 3 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 44,999 రూపాయలకు లభిస్తుంది. రెడ్‌మీ 9ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 నుంచే ప్రారంభం కానుంది. రియల్ మీ నార్జో 20 ప్రోపై కూడా రూ.1,000 తగ్గింపును అందించారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఏ31 ధర కూడా రూ.10,990కు తగ్గింది. ఇక మోటో జీ9 ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ వేరియంట్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం కానుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 రూ.15,499(అసలు ధర రూ.19,999)కి లభిస్తుంది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్ఛేంజ్ మరియు ఇఎంఐ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement