
మార్కెట్లో ఎట్టకేలకు బోల్ట్ ఆడియో కర్వ్ ఏఎన్‍సీ నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్ విడుదలయ్యాయి. దీని ధర కేవలం రూ. 1,299 మాత్రమే. విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఫీచర్ 'యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్'.
కొత్త బోల్ట్ ఆడియో ఇయర్‌ఫోన్స్ ఒక ఫుల్ చార్జ్‌పై 40 గంటలు, ఏఎన్‍సీతో అయితే 30 గంటలు ఉపయోగించుకోవచ్చు. అతి తక్కువ ధరలో ఎక్కువ టైమ్ ఇయర్‌ఫోన్ ఉపయోగించుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ అప్షన్ అనే చెప్పాలి. 10 నిమిషాల చార్జింగ్‍తో 10 గంటల వరకు వినియోగించుకునేలా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది.
లేటెస్ట్ బోల్ట్ ఇయర్‌ఫోన్స్ 12మిమీ సౌండ్ డ్రైవర్లతో, బూమ్ఎక్స్ టెక్నాలజీ పొందుతుంది. ఒకేసారి రెండు డివైజ్‍లకు కనెక్ట్ చేసుకునేలా డ్యుయల్ పెయిరింగ్ ఫీచర్ ఇప్పుడు దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఏఎన్‍సీ ఫీచర్ ఉండటం వల్ల బయటి శబ్దాలు వినపడే అవకాశం ఉండదు.
(ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు)
చార్జింగ్ కోసం యూఎస్‍బీ టైప్-సీ పోర్టు, గేమింగ్ కోసం 60ms అల్ట్రా లో ల్యాటెన్సీ, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కొత్త ఇయర్‌ఫోన్స్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తాయి. ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍తో పాటు బోల్ట్ కంపెనీ వెబ్‍సైట్‍లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు.