Earphones
-
కమలా హారిస్ క్లియర్ విన్నర్ కాదా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ వాడీవేడిగా సాగింది. అయితే, ఈ డిబేట్లో ఆద్యాంతం కమలదేపై చేయి నడిచిందంటూ అమెరికా మీడియా చెబుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ కొత్త చర్చ మొదలైంది.కమలా హారిస్ ఛీటింగ్ చేశారంటూ కొందరు నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. దానికి ట్రంప్ మద్దతుదారులు జత కలవడంతో అది తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఈ చర్చకు కారణం..డిబేట్ టైంలో ఆమె ధరించిన చెవిపోగులే.పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా ట్రంప్-కమల మధ్య సంవాదం 90 నిమిషాల పాటు కొనసాగింది. ఇద్దరూ పలు అంశాలపై పరస్పర విమర్శలు గుప్పించున్నారు. డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ డిబేట్‌ను అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా భావిస్తున్నానని చెప్పారు. అయితే కమలకే ఎక్కువ ఓట్లు పడ్డప్పటికీ.. ఇప్పుడు ఓ విమర్శ ఆమెను చుట్టుముట్టింది.ఈ చర్చలో కమలా హారిస్ ధరించిన చెవిపోగులు సీక్రెట్ పరికరమని, వాటి సాయంతోనే ఆమె డిబేట్లో అంత అద్భుతంగా మాట్లాడగలిగారంటూ కొందరు వాదిస్తున్నారు. ఈమేరకు కొన్ని వెబ్సైట్ ఫొటోలను, రివ్యూలను చూపిస్తున్నారు.Kamala Harris wasn’t wearing Nova H1 earring headphones. Quit lying to yourselves. She’s wearing Tiffany Hardwear pearl earrings. See how the Nova earrings only have one stalk coming off of them? See how Kamala’s has two? They’re not even the same thing. pic.twitter.com/zfTXRjEfDr— Daulton (@DaultonVenglar) September 11, 2024‘‘డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సంవాదంలో కమలా హారిస్ అద్భుతంగా మాట్లాడారు. ఇయర్రింగ్ మాదిరిగా ఉండే ఇయర్ఫోన్కు సంబంధించిన కథనం గుర్తుకు వచ్చింది’’ అని ఓ నెటిజన్, ఒబామా మాదిరిగానే కమలా బాగా మాట్లాడారన్న మరో యూజర్.. ఆమె ధరించిన చెవిపోగులు నోవా హెచ్1 ఆడియో ఇయర్రింగ్స్ మాదిరిగానే ఉన్నాయన్నారు. అయితే ఆమె మద్దతుదారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ఆమె రెగ్యులర్‌గా ధరించే ఇయర్రింగ్స్ అవని, వాటి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు.🚨🚨KAMALA HARRIS EXPOSED FOR WEARING EARPIECE IN DEBATE *PROOFShe is seen wearing an earring developed by Nova Audio Earrings first seen at CES 2023. This earring has audio transmission capabilities and acts as a discreet earpiece.Kamala Harris confirms claims that a… pic.twitter.com/1y60rUdJT0— ELECTION2024 🇺🇸 (@24ELECTIONS) September 11, 2024ఇక.. ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో విన్నర్‌గా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ గెలిచారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా చానెల్స్ అధికారికంగా ప్రకటించాయి. డిబేట్లో ట్రంప్, హారిస్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారంటూ విశ్లేషణాత్మక కథనాలు ఇచ్చాయి. డిబేట్లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు: ఫాక్స్ న్యూస్కమలా హారిస్‌పై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదనలు. అయితే టైం వేస్ట్ చేయకుండా ట్రంప్‌పై హారిస్ విరుచుకుపడ్డారు: ఏబీసీ మీడియాఈ డిబేట్లో కమలా హారిస్‌దే భారీ విజయం: పొలిటికోడిబేట్లో ట్రంప్ తనను తాను సమర్థించుకునేందుకు యత్నించారు. ట్రంప్ వాదనలు సత్యదూరంగా ఉన్నాయి. ఒక ప్రాసిక్యూటర్‌గా తన అనుభవాన్ని ఉపయోగించి ట్రంప్‌ను ఇరకాటంలో పడేసేందుకు కమల ప్రయత్నించారు: ది న్యూయార్క్ టైమ్స్కమలా హారిస్ ప్రసంగంతో ట్రంప్‌లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆమె పూర్తి సన్నద్ధతతో డిబేట్‌కు వచ్చారు: సీఎన్ఎన్డిబేట్లో ఇద్దరి మధ్య విమర్శ-ప్రతివిమర్శల్లో.. హారిస్‌దే పైచేయిగా సాగిందని, ట్రంప్ ఘోరంగా తడబడ్డారంటూ యూఎస్ మీడియా పేర్కొంది. అలాగే.. స్వింగ్ స్టేట్స్‌లోనూ కమలకు మంచి మార్కులు పడ్డాయని తెలిపాయి. మొత్తంగా హారిస్ ఈ డిబేట్లో క్లియర్ విన్నర్ అని తేల్చేశాయి.ఇదీ చదవండి: ట్రంప్ ఏమాత్రం మారలేదు -
ధర ‘వింటే’ మతిపోతుంది! అత్యంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్ ఇవే..
ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లదే హవా. కళ్లు చెదిరే ధరతో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటితోపాటు స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్లు కూడా అదే స్థాయిలో లాంచ్ అవుతున్నాయి. అయితే ఈ ఇయర్‌ఫోన్స్ ధర తెలిస్తే మాత్రం నిజంగానే మతిపోతుంది! లూయిస్ విట్టన్ అనే కంపెనీకి చెందిన ఇయర్‌ఫోన్స్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి. ఈ ఏడాది మార్చిలో హారిజన్ లైటప్ ఇయర్ఫోన్లను విడుదల చేసి అభిమానులను విస్మయానికి గురి చేసింది. వీటి ధర అక్షరాలా 1,660 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.38 లక్షలు. అత్యాధునిక ఫీచర్లతోపాటు ఈ సొగసైన ఇయర్‌బడ్‌ల ధర సోషల్ మీడియాలో వైరల్ మారి వీటికి క్రేజ్‌ను పెంచాయి. ప్రత్యేకతలెన్నో.. మతిపోగొట్టే ధరతోపాటు క్రేజీ ఫీచర్లు వీటి సొంతం. బ్రాండ్ ఐకానిక్ మోనోగ్రామ్ ప్యాట్రన్‌తో తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ ఇయర్‌బడ్‌లను రూపొందించారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎలిమినేటింగ్ మైక్రోఫోన్, బ్లూటూత్ మల్టీపాయింట్ వంటివి వీటి ప్రత్యేకతలు. ఐదు రంగులలో లభ్యమయ్యే ఈ ఇయర్‌బడ్స్‌కు 28 గంటల బ్యాటరీ లైఫ్, గ్రేడియంట్ రంగులతో ప్రకాశించే సొగసైన స్టెయిన్లెస్ స్టీల్ ఛార్జింగ్ కేస్ స్పెషల్ ఫీచర్స్. -
రూ. 1,299కే కొత్త ఇయర్‌ఫోన్స్.. ఒక్క ఛార్జ్‌తో 40 గంటలు
మార్కెట్లో ఎట్టకేలకు బోల్ట్ ఆడియో కర్వ్ ఏఎన్సీ నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్ విడుదలయ్యాయి. దీని ధర కేవలం రూ. 1,299 మాత్రమే. విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఫీచర్ 'యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్'. కొత్త బోల్ట్ ఆడియో ఇయర్‌ఫోన్స్ ఒక ఫుల్ చార్జ్‌పై 40 గంటలు, ఏఎన్‌సీతో అయితే 30 గంటలు ఉపయోగించుకోవచ్చు. అతి తక్కువ ధరలో ఎక్కువ టైమ్ ఇయర్‌ఫోన్ ఉపయోగించుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ అప్షన్ అనే చెప్పాలి. 10 నిమిషాల చార్జింగ్‌తో 10 గంటల వరకు వినియోగించుకునేలా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది. లేటెస్ట్ బోల్ట్ ఇయర్‌ఫోన్స్ 12మిమీ సౌండ్ డ్రైవర్లతో, బూమ్ఎక్స్ టెక్నాలజీ పొందుతుంది. ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునేలా డ్యుయల్ పెయిరింగ్ ఫీచర్ ఇప్పుడు దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఏఎన్సీ ఫీచర్ ఉండటం వల్ల బయటి శబ్దాలు వినపడే అవకాశం ఉండదు. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు) చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్టు, గేమింగ్ కోసం 60ms అల్ట్రా లో ల్యాటెన్సీ, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కొత్త ఇయర్‌ఫోన్స్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు బోల్ట్ కంపెనీ వెబ్సైట్లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. -
శబ్ధాలు, పరికరాలతో చెవిచిల్లు.. ఆధునిక జీవనశైలి చెవి‘నిల్లు’
ఇటీవలి కాలంలో వినికిడి సమస్యలతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వైద్యులు అంటున్నారు. వైద్యుల గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, ఒక బిలియన్ పైగా యువతకు వినికిడి లోపం ప్రమాదం పొంచి ఉంది. టీనేజర్లలో వినికిడి శైలిని విశ్లేషించి దాని ప్రకారం వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉన్న వారి సంఖ్యల గురించి పరిశోధకులు ఈ అంచనాను రూపొందించారు. కరోనా విజృంభణ సమయంలో, ఆన్లైన్ సమావేశాలు, స్నేహితులు కుటుంబ సభ్యులతో వీడియో కాల్లు లేదా అతిగా చూసే సెషన్ల కారణంగా, మనలో చాలా మంది గంటల తరబడి హెడ్ఫోన్లకు అతుక్కుపోయారు. ఇప్పుడు, కోవిడ్‌తో సంబంధం లేకుండా హెడ్ఫోన్లు రోజువారీ జీవితంలో భాగంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాల (పిఎల్డిలు) వాడకం తో పాటు పెద్ద ఎత్తున హైఓల్టేజ్‌తో ఉండే సంగీత వేడుకలకు హాజరుకావడం వంటివి వినికిడి పాలిట శాపాలుగా అధ్యయనం తేల్చింది. పరిమితి మించిన సంగీతధ్వని.. పెద్దలకు 80 డీబీ, పిల్లలకు 75 డీబీ మాత్రమే అనుమతించదగిన ధ్వని స్థాయి. వినియోగదారులు తరచుగా 105 డెసిబెల్ (డిబి) కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటున్నారని గతంలో ప్రచురించిన మరో పరిశోధన వెల్లడించింది, అయితే మ్యూజిక్ కన్సర్ట్స్, వినోద వేడుకల్లో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డిబి వరకు ఉంటాయి. ఇందుగలదందు లేదని సందేహంబు లేదు.. ఇతర శబ్ధాల సమస్య లేకుండా సంగీతాన్ని ఆస్వాదించడానికి స్ట్రీమ్ సిరీస్, సినిమాలను చూడడానికి ఇష్టపడే యువతరం పెరిగింది. వీరు తరచుగా ఇయర్‌బడ్‌లు లేదా హెడ్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. మెట్రో నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టుపక్కల వారి మాటలు, శబ్ధాలు.. వగైరా తప్పించుకోవడానికి ఇయర్ఫోన్లు పెట్టుకుని వినడం సర్వసాధారణం. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా ఉండడానికి తమ వాల్యూమ్లను పెంచుతారు. మరోవైపు ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లు వినోదం మాత్రమే కాకుండా చాలా మందికి వృత్తిరీత్యా కూడా అవసరంగా మారాయి. ఏతావాతా ఈ ఆడియో గాడ్జెట్ల పెరుగుతున్న వినియోగం జుట్టు కణాలు, పొరలు, నరాలు లేదా చెవిలోని ఇతర భాగాలకు హాని కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి నష్టం కలిగిస్తుంది. వైద్యుల సూచనలివే.. ► టీవీ లేదా స్పీకర్లను లేదా హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాల్యూమ్‌ను నియంత్రించండి. ► ఇయర్‌బడ్‌లు హెడ్ఫోన్లలో మీ పక్కన ఉన్న వ్యక్తి వినే స్థాయికి వాల్యూమ్ చేరకుండా జాగ్రత్తపడాలి. ► బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా తరచుగా వాల్యూమ్‌ను పెంచాల్సిన అవసరం రాకుండా బయటి నుంచి శబ్దం–రాకుండాచేసే ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లను కొనుగోలు చేయండి. ► ఇయర్‌బడ్‌లు ఇయర్లోబ్ను కవర్ చేస్తాయి చెవికి అతి దగ్గరగా ఉంటాయి. మరోవైపు, హెడ్ఫోన్లు సంగీతపు వైబ్రేషన్‌ను నేరుగా చెవులకు పంపవు. కాబట్టి, దీర్ఘకాలంలో ఇయర్ బడ్స్ కన్నా హెడ్ఫోన్లకు మారడం మంచిది. ► ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాల విరామం లేదా ప్రతి 60 నిమిషాలకు 10 నిమిషాల పాటు చెవులకు విరామం ఇవ్వాలి. ► స్మార్ట్ఫోన్ల సెట్టింగ్‌లలో అనుకూల వాల్యూమ్ పరిమితిని కూడా సెట్ చేయవచ్చు. జాగ్రత్తలు అవసరం.. చెవిలో సున్నితమైన చర్మం, పొర ఉంటుంది. చెవికి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంటుంది. అయితే అతిగా ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఈ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది. తద్వారా చర్మానికి ఇన్ఫెక్షన్స్ అవకాశాలు పెరుగుతాయి. వాక్స్ జిగిరీ అనే ఆ పొర పోయిదంటే... ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వీటిని అతిగా వినియోగించకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు వీలున్నంత వరకూ అసలు వాడకూడదు. ఇయర్ డ్రమ్ ముఖ ద్వారం కాస్త పెద్దగా ఉన్నవాళ్ల కన్నా సన్నగా ఉన్నవాళ్లకి ప్రమాదం మరింత ఎక్కువ. వీళ్లు వాడేటప్పుడు దాన్ని ఇంకా ఇంకా లోపలికి తోస్తారు. అలా మరీ లోపలికి పెట్టడం వల్ల ఇయర్ డ్రమ్‌కు నష్టం కలుగుతుంది. వీలున్నంత వరకూ అవసరాన్ని బట్టి తప్ప ఎడాపెడా ఉపయోగించడం మంచింది కాదు. అలాగే వినికిడి సామర్ధ్యానికి హెడ్ ఫోన్స్, హై ఓల్టేజ్ సంగీతం కూడా హానికరమే. –డా.ఎం.ప్రవీణ్ కుమార్, ఇఎన్టీ సర్జన్ అమోర్ హాస్పిటల్స్ -
మ్యూజిక్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్.. సగం ధరకే యాపిల్ ఎయిర్‌పాడ్స్!
యాపిల్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఉత్పత్తులుకు డిమాండ్ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. ఐఫోన్, ఎయిర్‌పాడ్స్, ఐప్యాడ్ ఇలా ఏదైనా టూ కాస్ట్లీగా ఉంటాయి. అయినా కూడా ఇవి సేల్స్ పరంగా దుమ్ము దులుపుతుంటాయి. అందుకు ఈ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, ఇందులో ఉపయోగిస్తున్న టెక్నాలజీ కారణమనే చెప్పాలి. అయితే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ధరలు కూడా భారీ స్థాయిలో ధరలు ఉండడంతో, మిగిలిన ఉత్పత్తులతో పాలిస్తే ఇవి వినియోగదారులను అంతగా ఆకట్టుకోకపోతున్నామని యాపిల్ భావిస్తోంది. అందుకే తక్కువ ధరలో ఎయిర్‌పాడ్స్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఆడియో మార్కెట్‌పై కన్ను... రూ.8 వేలకే సమాచారం ప్రకారం.. యాపిల్ సరసమైన ధరలలో ఎయిర్‌పాడ్స్ తీసుకురావడం మాత్రమే కాకుండా, కొత్త తరం ఎయిర్‌పాడ్స్ మాక్స్( AirPods Max)పై కూడా పనిచేస్తోంది.సరసమైన ఎయిర్‌పాడ్స్ ధర 99 డాలర్లు(ఇది భారతదేశంలో కరెన్సీ ప్రకారం దాదాపు రూ.8000) ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎయిర్‌పాడ్స్ సరఫరాదారులను కూడా మార్చాలని కంపెనీ చూస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ ధరలో యాపిల్ ఎయిర్‌పాడ్స్ అందుబాటులోకి వస్తే సేల్స్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అయితే, బడ్జెట్లో వచ్చే ఎయిర్‌పాడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండకపోవచ్చని అనలిస్టులు చెబుతున్నారు. ఎయిర్‌పాడ్స్‌ను తక్కువ ధరలో తీసుకురావడం ద్వారా ఆడియో మార్కెట్లోనూ తమ సేల్స్పెంచుకోవాలన్నది యాపిల్ లక్ష్యంగా తెలుస్తోంది. ఒకవేళ రూ.8వేల ధరలో తీసుకొస్తే యాపిల్ సేల్స్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్ ఎయిర్‌పాడ్స్ (Airpods) కొనాలంటే కనీసం రూ.15వేలు వెచ్చించాల్సిందే. చదవండి: అమెజాన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కొత్త ప్లాన్, ప్రైమ్ కంటే చవక! -
పారదర్శక చార్జింగ్ కేస్‌తో పీట్రాన్ ఇయర్‌బడ్స్
హైదరాబాద్: డిజిటల్ లైఫ్‌స్టయిల్, ఆడియో యాక్సెసరీల బ్రాండ్ పీట్రాన్ సంస్థ కొత్తగా పారదర్శక డిజిటల్ చార్జింగ్ కేస్‌తో బేస్‌బడ్స్ నైక్స్ పేరిట వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను ప్రవేశపెట్టింది. తరచూ ప్రయాణాల్లో ఉండే ఎగ్జిక్యూటివ్‌లు, సంగీత ప్రియులకు ఇవి ఎంతగానో అనువుగా ఉంటాయని సంస్థ సీఈవో అమీన్ ఖ్వాజా తెలిపారు. దీని ధర రూ. 1,299 కాగా ప్రా రంభ ఆఫర్ కింద అమెజాన్ ఇండియాలో రూ. 999కే అందుబాటులో ఉంటుందని తెలిపారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఫ్రీగా ఫ్లైట్ జర్నీ చేయొచ్చు! -
బోట్‌కు రూ.500 కోట్లు
న్యూఢిల్లీ: బోట్ పేరుతో వేరబుల్స్ విక్రయాల్లో ఉన్న ఇమేజిన్ మార్కెటింగ్ తాజాగా రూ.500 కోట్లు సమీకరించింది. సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వార్బర్గ్ పింకస్ అనుబంధ కంపెనీతోపాటు నూతనంగా మలబార్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ నిధులను సమకూర్చింది. నిధుల రాకతో వ్యక్తిగత ఆడియో ఉత్పత్తుల విభాగంలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేస్తూనే వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌వాచ్‌ల సెగ్మెంట్లో విస్తరణకు ఆజ్యం పోస్తుందని కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా రూ.2,000 కోట్లు సమీకరణకై కంపెనీ గతంలో సెబీకి దరఖాస్తు చేసుకుంది. లిస్టింగ్ ప్రణాళికను ప్రస్తుతానికి విరమించుకున్న ఇమేజిన్ మార్కెటింగ్.. 12–18 నెలల్లో ఐపీవో అంశాన్ని పునర్‌పరిశీలించనుంది. విదేశాల్లోనూ బోట్ ఉత్పత్తులను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
హలో చలో.. గ్రేటర్లో 71.7 శాతం మంది హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): గ్రేటర్ వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగే కాదు.. ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్లలో లేదా హెల్మెట్ లోపల మొబైల్లో మాట్లాడుతూ (హ్యాండ్స్ ఫ్రీ) వాహనాలను నడుపుతున్నారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), కరుణ ట్రస్ట్, యాక్షన్ ఇన్ డిస్ట్రెస్ ఎన్జీఓలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. 11,787 డ్రైవర్లపై అధ్యయనం చేయగా.. 16.5 శాతం మంది సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని, ఇందులో 71.7 శాతం మంది హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నారని వెల్లడించింది. ♦మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్‌పేట బిజినెస్ ఏరియా, మేడ్చల్ హైవే ఇండ్రస్టియల్ ప్రాంతాలలో ఈ అధ్యయనం నిర్వహించాయి. 15 నిమిషాల పాటు వాహనాల రాకపోకలు, వాహనదారుల వీడియోను రికార్డ్ చేశారు. కరుణ ట్రస్ట్‌కు చెందిన సంధ్య, యాక్షన్ ఇన్ డిస్ట్రెస్కు చెందిన లక్ష్మి అర్చన, ఐఐపీహెచ్ నుంచి మెలిస్సా గ్లెండా లూయిస్, తేటాలి శైలజలు ఈ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయాన్ని క్లినికల్ ఎపిడిమియాలజీ, గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. ♦రోజు, సమయంతో పాటూ రోడ్డు పరిస్థితిని బట్టి సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లో తేడాలను అధ్యయన బృందం విశ్లేషించింది. సాధారణ రోజులలో కంటే వారాంతాలలో, రద్దీ ఉన్న రోడ్ల మీద కంటే లేని రహదారులలో హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్ ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. ♦డ్రైవింగ్‌లో హ్యాండ్స్ ఫ్రీ కమ్యూనికేషన్ పరికరాలను వినియోగించడం ప్రమాదకరని జాబితాలో ఉన్నప్పటికీ.. జరిమానాలు విధించడం లేదు. అందుకే ఈ తరహా డ్రైవింగ్‌లను కూడా ఎంవీ యాక్ట్‌లో చేర్చాలని పరిశోధకలు సూచించారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్–184 ప్రకారం ప్రమాదకరమైన రీతిలో వాహనాలను డ్రైవింగ్ చేసే వారికి రూ.5 వేల జరిమానా, 6– 12 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు. ♦గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 35,425, అంతకు క్రితం ఏడాది 26,984 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. 2021లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,788 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. -
వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ తో ముందుకు వచ్చింది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లపై డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ జనవరి 17నుండి ప్రారంభం కానుండగా..ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందు అంటే జనవరి 16 నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌పై అమెజాన్ డిస్కౌంట్లు అందిస్తుండగా..రెడ్మీ,వన్ ప్లస్, శాంసంగ్, ఐక్యూ, టెక్నోవంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. వీటితో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ లపై గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' లో ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. అమెజాన్ త్వరలో ప్రారంభించనున్నగ్రేట్ రిపబ్లిక్ డే సేల్' ఈ బ్రాండ్ ఫోన్లపై డిస్కౌంట్లను అందించనుంది. వీటితో పాటు అదనంగా మరికొన్ని ఫోన్లను డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. ►రెడ్మీ నోట్ 10ఎస్ ధర రూ. 16,999 కంటే తక్కువ ►వన్‌ప్లస్ నార్డ్ 2పై డిస్కౌంట్లతో ►రెడ్ మీ 9ఏ స్పోర్ట్స్ రూ. 8,499 కంటే తక్కువ ►రెడ్మీ 9 యాక్టీవ్ రూ.రూ. 10,999 కంటే తక్కువ ►వన్ ప్లస్ నార్డ్ సీఈ ఫోన్ పై డిస్కౌంట్లతో ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 ధర రూ. 23,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 12 ధర రూ.12,999 కంటే తక్కువ ►డిస్కౌంట్లో రెడ్ మీ నోట్ 11టీ ►టెక్నో స్పార్క్ 8టీ ధర రూ.12,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 5జీ ధర రూ.10,999 నుంచి రూ. 15,999 మధ్యలో ఉంది ►ఐక్యూ జెడ్ 5 ధర రూ. 29,990 కంటే తక్కువ ►రెడ్మి 10 ప్రైమ్ రూ. 10,999 నుంచి రూ. 13,999 వరకు ఉంది ►వన్ ప్లస్ 9ఆర్ పై డిస్కౌంట్లు ►ఐక్యూ జెడ్ 3 రూ. 22,990 కంటే తక్కువ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ఉదాహరణకు..ల్యాప్‌టాప్‌లు, హెడ్సెట్,స్మార్ట్‌వాచ్‌లు 70 శాతం డిస్కౌంట్లో పొందవచ్చు. శాంసంగ్, ఎల్జీ, షావోమీ టీవీలు, ఇతర ఉపకరణాలపై గరిష్టంగా 60 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో షాపింగ్ చేసే కస్టమర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ సౌకర్యంతో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్,అమెజాన్ పే, ఐసీఐసీఐ కార్డ్‌లపై నో కాస్ట్ ఈఎంఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులపై ఎక్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.16,000 వరకు తగ్గింపు పొందవచ్చని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్..! -
వారెవ్వా... ఏమి విగ్గు! వామ్మో ఏం తెలివిరా బాబోయ్.. వైరల్ వీడియో
ఏం బుర్రరా నీది..! అని అసాధారణ ప్రతిభాపాటవాలు, అమోఘ నైపుణ్యం కనబరుస్తున్న వారిని ప్రశంసిస్తుంటాం. ఇదిగో ఈ ఫొటోలో కనపడుతున్న వ్యక్తి తెలివితేటలను చూసి.. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. నెటిజన్లు కూడా.. విస్తుపోయారు. కాకపోతే చదువుల్లో ఇతనికున్న ప్రతిభను చూసి కాదు... వక్రమార్గంలో సబ్ఇన్స్పెక్టర్ పరీక్షను గట్టెక్కడానికి సదరు మహాశయుడు ఎంచుకున్న హైటెక్ కాపీయింగ్ పద్ధతిని చూసి. ఇంతకీ ఏం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల సబ్–ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి పోటీ పరీక్షలు జరిగాయి. ప్రభుత్వోద్యోగం... అందులోనా క్రేజీ జాబ్. మనోడు బాగా ఆలోచించి... కాపీయింగ్ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ బ్లూ టూత్ రిసీవర్‌ను విగ్గులో అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా క్రాపు బాగా తగ్గించుకొని తన తలపై ఈ విగ్గును జాగ్రత్తగా అతికించుకున్నాడు. అత్యంత సూక్ష్మమైన... బయటికి కనిపించని రెండు ఇయర్ఫోన్లను చెవుల్లోకి జొప్పించాడు. కంటికి కనిపించంనంత సూక్ష్మమైన తీగలతో ఈ బ్లూ టూత్ నుంచి ఇయర్ఫోన్లను కనెక్ట్ చేశాడు. దిలాసాగా నడుచుకుంటూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లబోతుండగా... అందరినీ చెక్ చేసినట్లే పోలీసులు మనోడిని కూడా మెటల్ డిటెక్టర్‌తో పరీక్షించారు. తల దగ్గరికి రాగానే బీప్.. బీప్.. అని శబ్దం వస్తోంది. నిశితంగా పరిశీలించిన పోలీసులు విగ్గు గుట్టును రట్టుచేశారు. విగ్గును తొలగించడం, లోపలున్న బ్లూటూత్ పరికరం, చెవుల్లోని సూక్ష్మమైన ఇయర్ఫోన్లను అతికష్టం మీద పోలీసులు వెలికితీయడం చూసి... వామ్మో ఏం తెలివిరా బాబోయ్... అంటూ నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పంచుకోగా... వైరల్‌గా మారింది. గూఢచారి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కొందరు సరదాగా అతనికి సూచించారు. #UttarPradesh mein Sub-Inspector की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry — Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021 -
టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే!
ఈ కామర్స్ విధానానికి అలవాటు పడిన జనాలు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.. ఈ క్రమంలో కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం సాధారణంగా జరగుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక వస్తువు మాత్రం తప్పకుండా వస్తుంది. కానీ ఈసారి డెలివరీ చేసిన దాంట్లో ఏం లేకండా ఏకంగా ఖాళీ డబ్బానే వచ్చింది. ఇలాంటి సంఘటనలు సాధారణ ప్రజలకు మాత్రమే జరుగుతాయనుకుంటే పొరపాటే.. సెలబ్రిటీలు సైతం ఇందుకేం అతీతులు కాదు. చదవండి: సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’‘ వివరాల్లోకి వెళితే.. టీవీ నటుడు, అనుపమ ఫేమ్ పరాస్ కల్వనాత్.. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్( ఏమీ లేదు అని అర్థం) అనే బ్రాండ్‌కు చెందిన ఇయర్-1 ఇయర్ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. డెలీవరీ వచ్చాక దాన్ని ఓపెన్ చేసి చూసిన నటుడు షాక్ కు గురయ్యాడు. ఆయనకు వచ్చిన ఆర్డర్లో నిజంగానే ఏం లేదు. ఈ కామర్స్ డెలీవరీ తప్పిదాన్ని పరాస్ ట్విటర్లో పోస్టు చేస్లూ.. ఫ్లిప్‌కార్ట్ నుంచి తాను అందుకున్న ఫోటోలను షేర్ చేశాడు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతుందనీ, సేవల్లో నాణ్యత తగ్గుతుందనీ కాప్షన్ చేశాడు. చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు ఇక నటుడి ట్వీట్‌పై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. తమ అధికారిక ట్విటర్ పేజ్ ద్వారా రిప్లై ఇచ్చింది. ‘జరిగిన దానికి చింతిస్తున్నాం. ఆర్డర్‌కి సంబంధించి మీకు ఎదురైన అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మేము మీకు సాయం చేసేందుకే ఉన్నాం. దయచేసి ఆర్డర్ ఐడీని మాకు షేర్ చెయ్యండి. దీని ద్వారా మేము పరిశీలించి సాయం అందిస్తాం.. మీ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం.’అని పేర్కొంది. So Here I Have Received Nothing In @nothing box From @Flipkart ! Flipkart is actually getting worse with time and soon people are going to stop purchasing products from @Flipkart ! pic.twitter.com/wGnzU0MlNq — Paras Kalnawat (@paras_kalnawat) October 13, 2021 -
రూ.1000 కంటే తక్కువ ధరలో బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ ఇవే..!
మనకు నచ్చిన సంగీతాన్ని వింటుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏలాంటి డిస్టారెబెన్స్ లేకుండా ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వింటే ఆ మజానే వేరు. ఇయర్‌ఫోన్స్ ఒక్కింతా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటాయి. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లతో పాటుగా ఇయర్‌ఫోన్స్‌ను ఒకప్పుడు అందించేవి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కస్టమర్లకు ఇయర్ఫోన్లను అందించడం నిలిపివేశాయి. దీంతో కచ్చితంగా సపరేటుగా ఇయర్ఫోన్లకు కొనాల్సిందే. ఇయర్ఫోన్లను కొనేటప్పుడు ఏ కంపెనీకి చెందినవి బాగుంటాయి..? ఏంత ధరలో ఇయర్ఫోన్లను కొనాలి..? అనే ప్రశ్నలు మనందరికీ తొలచివేస్తుంది. ఇలా ఏ కంపెనీ ఇయర్ఫోన్లను కొనాలనే సందేహం ఉన్నవారి కోసమే.. ఈ వార్త! రూ.1000 కంటే తక్కువ రేట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే ఇయర్ఫోన్లను మీకోసం అందిస్తున్నాం... రూ.1000 కంటే తక్కువ ధరలో బెస్ట్ ఇయర్‌ఫోన్స్ ఇవే..! 1.బోట్ బాస్‌హెడ్స్ 225 బోట్ కంపెనీకి చెందిన క్లాసిక్ ఇయర్ఫోన్లలో ఇది ఒకటి. మీ చెవులకు బాగా సరిపోయే విధంగా వీటి డిజైన్ ఉంటుంది. వీటి ధర రూ. 399 2. బోట్ బాస్ హెడ్స్ 242 ఈ ఇయర్‌ఫోన్స్ ఐపీఎక్స్4 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్ లైన్ మైక్‌తో వస్తుంది. తేలికగా ఉంటాయి. వీటి ధర రూ. 399 3.జెబీఎల్ సీ200ఎస్ఐ సౌండ్, అకౌస్టిక్ పరికారాల్లో హర్మన్ కంపెనీకి చెందిన జెబీఎల్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ఇయర్‌ఫోన్స్ ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. జెబీఎల్ సీ200ఎస్ఐ ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది, ఇది మన్నికైనదిగా ఉంటుంది. వీటి ధర రూ. 749. 4. రియల్మీ బడ్స్ 2 నియో రియల్మీ స్మార్ట్‌ఫోన్ తన కంపెనీ నుంచి ఇయర్ఫోన్లను కూడా అందిస్తోంది. రియల్మీ బడ్స్ టీపీయూ మెటిరియల్తో తయారుచేశారు. రియల్మీ బడ్స్ 2 చెవులకు బాగా సరిపోయే విధంగా ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. వీటి ధర రూ. 399. 5. బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL అనేది వైర్లెస్ నెక్‌బ్యాండ్. బ్లూటూత్ 5.0 ఆధారంగా పనిచేస్తుంది. ఇది 12 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. X1-WL పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 1-2 రోజుల స్టాండ్‌బై టైమ్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా IPX5 రేటింగ్ కలిగి ఉంది. వీటి ధర రూ. 849. గమనిక: ఎక్కువసేపు ఇయర్ఫోన్లను చెవులకు తగిలించుకోవడం మంచింది కాదు. పై ధరలు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో పేర్కొన్న ధరలు. -
ఈ ఇయర్ ఫోన్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?
ప్రముఖ జర్మన్-ఆడియో బ్రాండ్ సెన్‌హెయిసర్ భారతదేశంలో ఇప్పటి వరకు విడుదల చేయని అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని ప్రత్యేకంగా ప్రొఫెషనల్ డ్యాన్సర్స్, డిజే ఆపరేటర్స్ కోసం ఐఈ 900 ఇయర్ ఫోన్లను తీసుకొచ్చినట్లు పేర్కొంది. కంపెనీ ఐఈ 900లో సెన్ హీసర్ కొత్త సృజనాత్మక ఎక్స్ 3ఆర్ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. ఈ టెక్నాలజీ వల్ల స్వచ్ఛమైన, సహజ ధ్వనిని ఆస్వాదించవచ్చు. మెరుగైన స్థిరత్వం కొరకు గోల్డ్ ప్లేటెడ్ ఎమ్ ఎమ్ సీఎక్స్ కనెక్టర్లతో సహ ఫీచర్స్ తో ఈ ఇయర్ ఫోన్లు వస్తాయి. సెన్ హీసర్ ఐఈ 900 ఇయర్ ఫోన్ల ధర వచ్చేసి రూ.1,29,900. భారతదేశంలో ఇప్పటి వరకు లాంఛ్ చేసిన అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లు ఇవే. అయితే, ఈ ఇయర్ ఫోన్లను సెన్ హీసర్ వెబ్ షాప్ లో వీటిని ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద హెడ్ ఫోన్లలో కనిపించే పొందికైన, కళాఖండం లేని "సెన్హీసర్ సౌండ్"ను అందించే ఐఈ 900లో సెన్ హీసర్ తన కొత్త ఎక్స్ 3ఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ సిలికాన్ ఇయర్ అడాప్టర్లను, మూడు ఎలాస్టిక్ ఫోమ్ ఇయర్ అడాప్టర్ సెట్లను మూడు విభిన్న సైజుల్లో బండిల్ చేసింది. ఈ ఇయర్ ఫోన్ లు 7 మిమీ ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్ డ్యూసర్ ని కలిగి ఉంటాయి. ఇయర్ ఫోన్ లు సింగిల్ డ్రైవర్ సిస్టమ్ తో వస్తాయి. అలాగే ఇందులో అల్యూమినియం చాసిస్‌ను ఉపయోగించారు. సెన్‌హెయిసర్ ఇప్పటికే డీజే హెడ్‌ఫోన్స్, హెచ్డీ 25 మానిటరింగ్‌ను ఇండియాలో విడుదల చేసింది. -
బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్: తమ్ముడిని చంపి, స్టోర్‌రూంలో
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేయొద్దని వారించిన తమ్ముడిని అక్క(మైనర్ బాలిక )అమానుషంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయ్ బరేలి జిల్లాలో ఈ ఘటన గత గురువారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15 ఏళ్ల బాలిక తన సోదరుడు (9)ని ఇయర్‌ఫోన్ కేబుల్ గొంతుకు బిగించి చంపేసింది. తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బాయ్ ఫ్రెండ్‌తో అక్క ఫోన్లో చాట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. గంటలు గంటలు ఫోన్ ఎందుకు మాట్లాడతావంటూ గతంలో చాలాసార్లు అక్కను ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని అమ్మానాన్నకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతోవారు బాలికను మందలించారు. అయితే తాజాగా అదే తరహాలో ఫోన్లోమాట్లాడటం గుర్తించి వారించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో అక్కపై దాడి చేశాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన బాలిక ఇయర్ ఫోన్స్ కేబుల్‌ను అతడి మెడకు బిగించడంతో ఊపరాడక చనిపోయాడు. ఆ తరువాత మృతదేహాన్ని గుట్టుగా స్టోర్ రూంలో దాచి పెట్టి, ఏమీ తెలియనట్టుగా నటించింది. అయితే పిల్లవాడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి పొరుగువారిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఆరా తీయాలని భావించారు. మరుసటి రోజు, దుర్వాసన రావడంతో స్టోర్ రూం తెరిచి కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరికి పోలీసుల విచారణలో బాలిక తన నేరాన్ని అంగీకరించింది. అయితే తనపై అమ్మా నాన్నకు పదే పదే ఫిర్యాదు చేయడంతో కోపం వచ్చిందని, కానీ తమ్ముడిని చంపాలని అనుకోలేదని పోలీసులతో వాపోయింది. సోమవారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని రాయ్ బరేలి పోలీస్ సూపరింటెండెంట్ శ్లోక్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితురాలిని జువైనల్ హోంకు తరలించినట్టు చెప్పారు. -
18న రానున్న ఒప్పో కొత్త వైర్లెస్ ఇయర్‌ఫోన్స్
ఒప్పో ఇండియా కొత్త ఎన్కో ఎక్స్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్, ఒప్పో రెనో 5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 18న విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ రెండింటిని చైనాలో ఇప్పటికే విడుదల చేసారు. చైనాలో ఒప్పో ఎన్కో ఎక్స్ ధర సిఎన్‌వై 999(సుమారు రూ .11,000)కు, ఒప్పో రెనో 5 ప్రో 5జీ ధర సీఎన్‌వై 3,399(సుమారు రూ.38,200)కు అందుబాటులో ఉన్నాయి.(చదవండి: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా) ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్: ఒప్పో రెనో 5 ప్రోలో 6.55-అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ 90హెర్ట్జ్ డిస్ప్లేను 92.1 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిలో కలిగి ఉంది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ తో పని చేయనుంది. ఇది కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఎఫ్/1.7 లెన్స్‌తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ మాక్రో షూటర్, 2 ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా ఎఫ్/2.4 లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోలను తీయడానికి ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఒప్పో రెనో 5 ప్రో 5జీలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ 5జీ ఫోన్ లో 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో పని చేయనుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, ఎస్ఐ/ఎన్ఎస్ఎ, డ్యూయల్ 4జీ వోల్టిఇ, వై-ఫై 802.11ఎసి, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్సి, డ్యూయల్ సిమ్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దీనిని అరోరా బ్లూ, మూన్లైట్ నైట్, స్టార్రి నైట్ రంగులలో అందుబాటులోకి రానుంది. ఒప్పో ఎన్కో ఎక్స్ ఫీచర్స్: ఈ ఇయర్ఫోన్లు డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను అందిస్తున్నాయి. ప్రతి ఇయర్‌పీస్‌లో 11 ఎంఎం మూవింగ్ కాయిల్ డ్రైవర్, 6 ఎంఎం ప్లేన్ డయాఫ్రాగమ్ డ్రైవర్ ఉంటుంది. ఇది ఎస్బీసి,ఏఏసి, ఎల్ హెచ్ డీసి వంటి బ్లూటూత్ కోడెక్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇవి 4 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అదే చార్జింగ్ కేస్‌తో అయితే 20 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా వీటిని చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, ఐపీ54 స్వెట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. -
షావోమీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్
షావోమీ ఫ్యాన్స్‌కు శుభవార్త. భారీ డిస్కౌంట్స్‌తో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రకటించింది షావోమీ. ఈ సేల్ నవంబర్ 26 నుండి 29 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు మీ.కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్ లలో కొనుగోలు చేసే షియోమి ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్ పొందగలుగుతారు. ఈ సేల్‌లో రూ.699 ధరకే 10,000ఎంఏహెచ్ రెడ్మీ పవర్ బ్యాంక్ కొనొచ్చు. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ధర రూ.1,999 మాత్రమే. ఇలా అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మరి ఏ ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.(చదవండి: సోషల్ మీడియాలో ఇలాంటివి పోస్ట్ చేయకండి) రెడ్మీ స్మార్ట్ఫోన్లు రెడ్మి 8ఎ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ను బేస్ మోడల్‌కు రూ .6,999 వద్ద అందుబాటులో ఉంది. రెడ్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.8,299. రెడ్మీ 9 ప్రైమ్ అసలు ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.9,999. రెడ్మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.13,999. రెడ్మి నోట్ 8 అసలు ధర రూ.12,999కాగా, ఆఫర్ ధర రూ.12,999. రెడ్మీ ఇయర్‌బడ్స్ ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2సీ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,299. ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2 అసలు ధర రూ.5499 కాగా ఆఫర్ ధర రూ.2,999. రెడ్మీ ఇయర్‌బడ్స్ ఎస్ బ్లాక్ అసలు ధర రూ.2,399 కాగా ఆఫర్ ధర రూ.1,699. రెడ్మీ ఇయర్ బడ్స్ 2సీ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299. రెడ్మీ ఇతర ఉత్పత్తులు రెడ్మీ 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299. రెడ్మీ 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.999 కాగా ఆఫర్ ధర రూ.699. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ అసలు ధర రూ.1,199 కాగా ఆఫర్ ధర రూ.899. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అసలు ధర రూ.1,499 కాగా, ఆఫర్ ధర రూ.1,299. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 అసలు ధర రూ.2,499 కాగా ఆఫర్ ధర రూ. 1,999. ఎంఐ వాచ్ రివాల్వ్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ. 9,999. మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2 అసలు ధర రూ.3,999 కాగా ఆఫర్ ధర రూ.2,499. ఎంఐ ఫ్లెక్స్ ఫోన్ గ్రిప్ స్టాండ్ అసలు ధర రూ.199 కాగా ఆఫర్ ధర రూ.99. ఎంఐ టీవీ స్టిక్ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,499. -
యూజర్లకు షాక్ : ఐఫోన్ 12లో అవి మిస్
సాక్షి, న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు భారీ షాకే ఇచ్చింది. అట్టహాసంగా లాంచ్ చేసిన ఐఫోన్ 12కు సంబంధించి యూజర్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది. హైస్పీడ్, అధునాతన టెక్నాలజీ, 5జీ నెట్ వర్క్ అంటూ పరిచయమైన 24 గంటల్లోనే ఐఫోన్ 12 వివాదంలో పడింది. ఇంతకు విషయం ఏమిటంటే ఖరీదైన ఆపిల్ ఐఫోన్12తో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్ ను సంస్థ మిస్ చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు సోషల్ మీడియాలో ఆపిల్ సంస్థపై మండిపడుతున్నారు. (ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్) ఆపిల్ అధికారిక వెబ్ సైట్ లో ఐఫోన్ 12 బాక్స్ లో ఐఫోన్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్ ఇవ్వడం లేదంటూ ప్రకటించి కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లింది. 2030 నాటికి “నెట్-జీరో క్లైమేట్ ఇంపాక్ట్” తో ప్రపంచాన్ని తీర్చిదిద్దుతామన్న హామీని నెరవేర్చడానికే ఈనిర్ణయం తీసుకున్నామంటూ చావుకబురు చల్లగా చెప్పింది. దీంతోఎంతోకాలంగా లేటెస్ట్ ఐఫోన్ కోసం ఎదురుచూసిన యూజర్లు ట్విటర్లో విమర్శలు గుప్పిస్తున్నారు. కిడ్నీ అమ్ముకొని మరీ ఖరీదైన ఐఫోన్ కొనుక్కుంటే.. ఇంత అన్యాయమా అంటూ చమత్కరిస్తున్నారు. కాగా మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదలైన ఐఫోన్ 12 ప్రీ ఆర్డర్లు వచ్చే నెల 6 నుంచి డెలివరీలు 23 నుంచి షురూ కానున్న సంగతి తెలిసిందే. (5జీ ఐఫోన్ 12 వచ్చేసింది..) Imagine selling your kidney to buy the new iPhone 12 and it comes WITHOUT a charger and headphones. #AppleEvent pic.twitter.com/LuoUmAsLtJ — àbDullah✨ (@BehtareenInsan) October 13, 2020 2020: Charger and earphones not included in the box Year 2030: No Phone in the box...It's called iPhone Air#AppleEvent pic.twitter.com/obX3XPwc83 — Meera (@meera_3001) October 13, 2020 Apple should consider our wallet is also part of environment. Removing earpods, power adapter and increasing the PRICE of this years iPhone and calling it supporting environment is a BIG NOPE. 👎🏻 #AppleEvent #iPhone12 pic.twitter.com/y4Th0MAaYs — iRobinPro (@iRobinPro) October 14, 2020 -
4 వేల కోసం ప్రయత్నిస్తే 74 వేలు గాయబ్!
సాక్షి, సిటీబ్యూరో: ఓ ఈ–కామర్స్ యాప్‌లో రూ.4 వేలు వెచ్చింది ఇయర్ ఫోన్స్ ఖరీదు చేశారో యువతి... అది ఎంతకీ డెలివరీ కాకపోవడంతో ఆ సంస్థ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు... అందులో కనిపించిన నకిలీ కాల్ సెంటర్ నెంబర్ అసలుదిగా భావించి సంప్రదించారు... సైబర్ నేరగాళ్ళు చెప్పినవి చెప్పినట్లుగా చేసి రూ.74 వేలు పోగొట్టుకున్నారు. ఈమెతో పాటు సైబర్ నేరగాళ్ళ చేతిలో మరో రూ.1.5 లక్షలు కోల్పోయిన ముగ్గురు బాధితులు బుధవారం సిటీ సైబర్ క్రైౖమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ యువతి ఈ–జీ ఫోన్స్ అనే సంస్థకు చెందిన వెబ్సైట్ ద్వారా ఇయర్ ఫోన్లు ఆర్డర్ చేశారు. (పోస్టు చేయడమే పాపమైంది...) వాటి ఖరీదు రూ.4000 ముందే ఆన్లైన్ ద్వారా చెల్లించేశారు. ఆ సందర్భంగా వెబ్సైట్ వాటి డెలివరీ డేట్‌ను సూచించింది. ఆ నిర్ణీత గడువు ముగిసినా కొరియర్ ద్వారా సదరు ఇయర్‌ఫోన్స్ డెలివరీ కాలేదు. దీంతో ఈ–జీ ఫోన్స్ సంస్థను సంప్రదించాలని భావించిన ఆమె దాని ఫోన్ నెంబర్ కోసం సదరు వెబ్సైట్లో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఈ సంస్థ కాల్ సెంటర్ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో ఈ–జీ ఫోన్ కాల్‌సెంటర్ పేరుతో కనిపించిన సెల్ ఫోన్ నెంబర్ నిజమైనదిగా భావించారు. ఆ నెంబర్లో సంప్రదించిన యువతి జరిగిన విషయం చెప్పారు. దీంతో అవతలి వ్యక్తులు ఆ ఆర్డర్‌కు సంబంధించిన మొత్తం రిటర్న్ చేస్తామని అన్నారు. దానికోసం తాము మీ ఫోన్ నెంబర్‌కు పంపే లింకు ఓపెన్ చేయాలని సూచించి టీమ్ వ్యూవర్ యాప్ ఇన్‌స్టల్ చేయించారు. దీన్ని తమ ఫోన్ ద్వారా యాక్సస్ చేసిన సైబర్ నేరగాళ్ళు బాధితురాలి ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని ద్వారా ఆమె ఈ వ్యాలెట్ వినియోగించిన సైబర్ నేరగాళ్ళు రూ.74 వేలు కాజేశారు. ♦ అంబర్‌పేటకు చెందిన ఓ యువకుడికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్ళు తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజుతో రుణం ఇస్తామని ఆన్లైన్లో ప్రచారం చేసుకున్నారు. ఇది నిజమని నమ్మిన యువకుడు అందులో పేర్కొన్న నెంబర్లలో సంప్రదించారు. సైబర్ నేరగాళ్ళు చెప్పిన వాటికి అంగీకరించడంతో వివిధ ఫీజుల పేరుతో రూ.30 వేలు తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. ♦ ఈ–యాడ్స్ సైట్ ఓఎల్ఎక్స్లో ఉన్న సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ విక్రయం ప్రకటనకు నగర యువకుడు స్పందించారు. అందులో ఉన్న నెంబర్లో సంప్రదించగా ఆర్మీ అధికారిలా సైబర్ నేరగాళ్ళు మాట్లాడారు. బేరసారాల తర్వాత ఫ్రిడ్జ్‌కు రేటు ఖరారైంది. అడ్వాన్సులు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు, చెల్లించిన అధిక మొత్తం రిఫండ్ పేరుతో రూ.82 వేలు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్న మోసగాళ్ళు ఆపై ఫోన్ చేసినా స్పందించకుండా నిండా ముంచారు. ♦ వెస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆన్లైన్లో ఉన్న ప్రకటనపై స్పందించారు. అవతలి సైబర్ నేరగాళ్ళు వివిధ ఫీజుల పేరుతో రూ.38,500 కాజేశారు. ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రై మ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
షాకింగ్: ఇయర్ ఫోన్స్ వల్ల అతడి చెవిలో..
బీజింగ్: ఇయర్ ఫోన్స్ ఎక్కువ సేపు చెవిలో పెట్టుకోకూడదన్నది నిపుణుల మాట. వీటిని అధికంగా వాడటం వల్ల వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వల్ల రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇయర్ ఫోన్స్ శరీరంలో ఒక భాగంగా మారిపోయాయి. అంతలా దానికి బానిసలయ్యారు. తాజాగా ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడినందుకు ఓ బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బీజింగ్‌కు చెందిన పదేళ్ల బాలుడు చెవిలో నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆస్పత్రికి వెళ్లగా, అతడిని పరీక్షించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. (ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే!) చెవిలో దట్టంగా పెద్ద సమూహంలో శిలీంధ్రాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. దీన్ని 'బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగస్'గా తెలిపారు. సుదీర్ఘంగా అందిస్తున్న చికిత్స వల్ల ప్రస్తుతం అతడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను డా.వు యుహువా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇయర్ ఫోన్స్ విచ్చలవిడిగా వాడటం వల్లే ఇంత ఘోరం జరిగిందని చెప్పుకొచ్చాడు. కాబట్టి వైర్లెస్ ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్స్ వాడకందారులు దాని పర్యవసానాలను తెలుసుకుని పరిమితంగా వినియోగించాలని హెచ్చరించారు. ఇయర్ ఫోన్స్ వినియోగదారులు ఎల్లప్పుడూ చెవిని పొడిగా ఉంచడమే కాక, దాన్ని వాడే గంటలను తగ్గించాలని సూచించారు. (పిల్లలూ... పెద్దలూ... బ్రష్ చేసుకోండిలా!) -
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.. మొబైల్ చూస్తూ..
సెల్‌ఫోన్.. ఇది మనిషికి ప్రస్తుతం ఎంతో అత్యవసరమైన, ఇష్టమైన వస్తువు. చాలా పనులు దీని ద్వారానే చేసుకుంటున్నారు. ఒక్కోసారి ఇది ప్రాణం మీదకు తెస్తోంది. మొబైల్ చూస్తూ రోడ్డు, రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాల బారిన పడిన వారెందరో. జాగ్రత్తగా ఉండాల్సిందిపోయి మరింత నిర్లక్ష్యంగా ఉంటూ కొందరు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే నెల్లూరులో చోటుచేసుకుంది. నెల్లూరు(క్రైమ్): చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొని వీఆర్ లా కళాశాల విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని విజయమహాల్‌గేటు సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలపై సోమవారం చోటుచేసుకుంది. దీంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రైల్వే పోలీసులు, సంఘటనా స్థలంలోని వారి కథనం మేరకు.. సంగం తూర్పువీధిలో ఉపాధ్యాయడు డి.నరసింహారెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు భార్య, కుమారుడు రామ్‌ప్రతాప్‌రెడ్డి (23), కుమార్తె ఉన్నారు. పత్రాప్‌రెడ్డి నెల్లూరు వీఆర్ లా కళాశాలలో లా రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజూ కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. ఎప్పటిలాగే సోమవారం అతను ఇంటినుంచి బస్సులో నెల్లూరుకు చేరుకున్నాడు. మినీబైపాస్‌లో బస్సు దిగి నడుచుకుంటూ కళాశాలకు బయలుదేరాడు. విజయమహాల్‌గేట్ సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలు దాటసాగాడు. చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మొబైల్లో మాట్లాడుతున్నాడో? లేదా సంగీతం వింటున్నాడో తెలియదుకానీ రైలు రావడాన్ని గమనించలేదు. దీంతో అతడిని వేగంగా రైలు ఢీకొంది. ప్రతాప్‌రెడ్డి రెండు కాళ్లు మోకాళ్ల వద్దకు తెగిపోయి వేరుగా పడిపోయాయి. తలకి తీవ్రగాయమైంది. రెండు చేతులు విరిగిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై డీసీ వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులుకు అప్పగించారు. చేతికందివచ్చిన కుమారుడు విగతజీవిగా మారిపోవడం చూసి బాధిత తండ్రి గుండెలవిసేలా రోదించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంగంలో విషాదఛాయలు సంగం: రామ్‌ప్రతాప్‌రెడ్డి మృతితో సంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి విష యం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, మండల వైఎస్సార్సీపీ నేతలు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రతాప్ సంగంలో ఇంటర్ చదివాడు. -
మీరు ఇయర్ ఫోన్స్‌ను వాడుతున్నారా?
న్యూఢిల్లీ : మీకు సంగీతం ఇష్టమా? మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారా? అయితే, 4 నిమిషాలకు మించి ఇయర్ ఫోన్స్‌తో సంగీతం వినడం ప్రమాదమనే విషయం మీకు తెలుసా? తెలిసీ గంటల తరబడి ఇయర్ ఫోన్స్‌ను వినియోగిస్తున్నారా? అయితే మీరు వినికిడి సమస్యను ఎదుర్కొనక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిచ్చింది. ఆపకుండా అదే పనిగా ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినేవారికి చెవుడు వచ్చే ప్రమాదముందని తెలిపింది. పెద్దపెద్ద శబ్దాల వల్ల కలిగే వినికిడి సమస్యకు చికిత్స లేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయని, అవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేమని, వినికిడి పరికరాలు వాడడం తప్ప మరో మార్గమే లేదని చెబుతున్నారు. భారత్‌లో వయసు పెరగడం ద్వారా తలెత్తే వినికిడి సమస్యలకంటే పెద్ద శబ్దాలు వినడం వల్ల వినికిడి సమస్యలబారిన పడుతున్నవారే ఎక్కువమంది ఉంటున్నారని భారత్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వెల్లడించింది. -
ప్రాణాలు తీసిన ఇయర్‌ఫోన్స్
కోలారు: ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందాడు. ఈఘటన నగరంలోని సంతేగేట్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. కేరళకు చెందిన మోహన్(53) మూడు రోజుల క్రితం కేరళనుంచి తన ఇద్దరు శిష్యులతో కలిసి నగరానికి వచ్చాడు. ఎంబీ రోడ్డులోని లాడ్జిలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. మంగళవారం ఓ ఇంట్లో పూజలు చేసేందుకు బయల్దేరాడు. సైడ్ ఇవ్వాలని వెనుక కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ మోగించాడు. అయితే మోహన్ చెవులకు ఇయర్‌ఫోన్స్ ఉండటం వల్ల హారన్ వినిపించలేదు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డాడు. తలపై చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచచెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఎస్ఎన్ఆర్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం అతని శిష్యులకు అప్పగించారు. -
ప్రాణం తీసిన ఇయర్‌ఫోన్స్
దొడ్డబళ్లాపురం: ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ రైలుపట్టాలపై వెళ్తున్న యువకునికి అదే చివరి ఘడియ అయ్యింది. రైలు ఢీకొని మృతిచెందిన సంఘటన ఉత్తరకన్నడ జిల్లా కారవార తాలూకాలో చోటుచేసుకుంది. బావికేరి నివాసి గణేశ్‌నాయక్ (24) మృతుడు. తాలూకాలోని అమదళ్లి వద్ద ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం గణేశ్ చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూ రైలుపట్టాలపై నడుస్తుండగా మడగావ్–మంగళూరు ఇంటర్సిటీ రైలు వేగంగా ఢీకొంది. దీంతో గణేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా ఇయర్‌ఫోన్స్ చెవిలోనే ఉన్నాయి. కారవార రైల్వేపోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. -
నిషేధం వద్దన్నందుకు నిర్బంధం
సౌదీ అరేబియాలో స్త్రీవాద కార్యక్రమాలపై ప్రభుత్వం విరుచుకుపడడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫెమినిస్టు కార్యకర్తల్ని నిర్బంధించి, వేధింపులతో వారిని దారికి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్యకర్తల ఒత్తిడిపై ఇటీవల సౌదీ అరేబియా.. మహిళలు డ్రైవింగ్ చెయ్యడంపై ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని తొలగించింది. అయితే ఆ తొలగింపుకు కొద్ది వారాల ముందు ముగ్గురు కీలకమై మహిళా కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా బయట పడింది. ఇక గతవారం అయితే మరో ఏడుగురు మహిళల్ని అరెస్టు చేసి, గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు హక్కుల సంఘాలు తాజాగా వెల్లడించారు. అరెస్ట్ అయినవారంతా.. మహిళల డ్రైవింగ్‌పై నిషేధానికి వ్యతిరేకంగా పనిచేసినవారేనని, వారికి విడుదల కోసం ప్రగతివాదులంతా ఏకం కావాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పిలుపునిచ్చింది. ట్రంపు చెవుల్లోకి డప్పులు జూలై 13న ట్రంప్ య.కె. వస్తున్నారు. అయితే ఆయన్ని బ్రిటన్ లోపలకి అడుగు పెట్టనిచ్చేది లేదని ‘ఉమెన్స్ మార్చ్’ నిర్వాహకులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ తొలిసారిగా బ్రిటన్ వస్తున్న సందర్భం అది. ట్రంప్ బ్రిటన్ పర్యటనకింకా నెలకు పైగా సమయం ఉండగనే ఇప్పట్నుంచే ‘ఉమెన్స్ మార్చ్’ దేశవ్యాప్తంగా మహిళల్ని సమీకరించి ఆ రోజున ట్రంప్ రాకపై తన నిరసనను ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. ఈ నిరసన ఉద్యమానికి ‘బ్రింగ్ ద నాయిస్’ అనే పేరు పెట్టింది. ఇంట్లో గిన్నెల్ని, తపేళాల్ని వీధుల్లోకి తెచ్చి వాటిపై డబ్బు మోగించి, ట్రంప్ చెవుల్ని అదరగొడతారు. దక్షిణమెరికా దేశాలో మొదలైన ఈ తరహా ‘క్యాజరోల్ ప్రొటెస్ట్’ ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాలన్నిటికీ పాకుతోంది. ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానాలపై లండన్ మహిళల ప్రతిధ్వనే జూలై 13న జరగబోయే ‘బ్రింగ్ ద నాయిస్’ ప్రదర్శన. బధిరులైపోతారు జాగ్రత్త! స్మార్ట్ఫోన్లు వచ్చాక, చెవులకు ఇయర్‌ఫోన్స్ తగిలించుకుని గంటల తరబడి పాటలు వినడం చాలా మందికి అలవాటుగా మారింది. ముఖ్యం గా ముప్పయ్యేళ్ల లోపు వయసు వారిలో ఈ అలవాటు మరీ మితిమీరుతోంది. ఈ అలవాటును మానుకోకపోతే బధిరులైపోతారు జాగ్రత్త అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం వినే శబ్దాలు ఏవైనా సరే, వాటి తీవ్రత 85 డెసిబల్స్ వరకు పర్వాలేదని, అంతకు మించితే వినికిడి సామర్థ్యం క్రమంగా దెబ్బతింటుందని వారు చెబుతున్నారు. ఇయర్ ఫోన్స్ ద్వారా పూర్తి వాల్యూమ్‌తో మ్యూజిక్ వింటున్నట్లయితే, ఆ శబ్ద తీవ్రత 110 డెసిబల్స్ వరకు ఉంటుందని, ఇది జెట్ విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు వెలువడే శబ్ద తీవ్రతకు సమానమని బ్రిటన్‌లోని సెంట్రల్ మిడిలెసెక్స్ హాస్పిటల్‌కు చెందిన పీడియాట్రిక్ ఆడియాలజిస్ట్ డాక్టర్ రాస్బిన్ సయ్యద్ వివరిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల ద్వారా మ్యూజిక్ వినే అలవాటు ఉన్నవారిలో వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని, యువతరంలో ఇదే ధోరణి కొనసాగితే ఒక తరానికి తరమే బధిరులుగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. -
డ్రైవర్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం వల్లే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కుశి నగర్లో పాఠశాల వ్యాన్ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుని 13 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. వ్యాన్ డ్రైవర్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. గురువారం ఆయన సంఘటన స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం సీఎం యోగీ మీడియాతో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నాడని, అతడి చెవిలో ఇయర్‌ఫోన్స్ కూడా ఉన్నాయని తెలిపారు. అందువల్లే, క్రాసింగ్ వద్ద సెక్యూరిటీ గార్డు సంకేతాలిస్తున్నా డ్రైవర్‌కి వినిపించలేదని వివరించారు. డ్రైవర్... పాఠశాల నుంచే ఫోన్ మాట్లాడుతూ వ్యాన్ నడుపుకుంటూ వచ్చాడని, అయినప్పటికీ సదరు పాఠశాల యాజమాన్యం అతడిని ఎందుకు ప్రశ్నించలేదన్న విషయంపై తాము విచారణ చేపడతామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో కూడా చర్చించినట్లు సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కాగా మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయలైనవారికి బీఆర్డీ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. చదవండి...ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం