న్యూఢిల్లీ: బోట్ పేరుతో వేరబుల్స్ విక్రయాల్లో ఉన్న ఇమేజిన్ మార్కెటింగ్ తాజాగా రూ.500 కోట్లు సమీకరించింది. సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వార్‌బర్గ్ పింకస్ అనుబంధ కంపెనీతోపాటు నూతనంగా మలబార్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ నిధులను సమకూర్చింది. నిధుల రాకతో వ్యక్తిగత ఆడియో ఉత్పత్తుల విభాగంలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేస్తూనే వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌వాచ్‌ల సెగ్మెంట్‌లో విస్తరణకు ఆజ్యం పోస్తుందని కంపెనీ తెలిపింది.
ఐపీవో ద్వారా రూ.2,000 కోట్లు సమీకరణకై కంపెనీ గతంలో సెబీకి దరఖాస్తు చేసుకుంది. లిస్టింగ్ ప్రణాళికను ప్రస్తుతానికి విరమించుకున్న ఇమేజిన్ మార్కెటింగ్.. 12–18 నెలల్లో ఐపీవో అంశాన్ని పునర్‌పరిశీలించనుంది. విదేశాల్లోనూ బోట్ ఉత్పత్తులను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది.
చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా
Comments
Please login to add a commentAdd a comment