headphones
-
హల్లో ప్లీజ్ హియర్..
ఇంట్లో, ఆఫీసుల్లో ల్యాప్టాప్స్ పట్టుకుని చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పనిచేయడం, రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదించడం.. ఇవి సరిపోవన్నట్టు వీకెండ్స్‌లో పబ్స్, క్లబ్స్‌లో చెవులు చిల్లులు పడే మ్యూజిక్ హోరులో మునిగి తేలడం.. ఇవన్నీ నగరంలో టీనేజర్లు, యువత జీవనశైలిలో రొటీన్ పనులు. అయితే నేడు వీరు అనుసరిస్తున్న ఈ రకమైన పద్ధతులు రేపటి వారి వినికిడి లోపానికి కారణం కానున్నాయా? అంటే.. అవుననే సమాధానం ఇస్తున్నాయి అధ్యయనాలు. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు.. సురక్షితం కాని శ్రవణ పద్ధతులు అవలంబిస్తుండడం వల్ల ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. వీరిలో కూడా అత్యధికులు యువత, టీనేజర్లే కానుండడం ఆందోళనకరం. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలు బిఎమ్‌జె గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం, పరిమితికి మించి స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాలు (పర్సనల్ లిజనింగ్ డివైజెస్/పిఎల్డిలు) ఉపయోగించడం, పెద్దగా ధ్వనించే సంగీత వేదికలు యువత వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24 శాతం టీనేజర్లు, 48 శాతం మంది యుక్తవయసు్కలు పరిమితికి మించి చెవులుకు పనిపెడుతున్నారని పరిశోధనలో తేలింది. ఈ సంఖ్యల ఆధారంగా, పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 0.67, 1.35 బిలియన్ల మంది మధ్య, యుక్తవయసు్కలు వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని కూడా పరిశోధకులు లెక్కగట్టారు.పరిమితి మీరుతున్నారు..గతంలో వెలువడిన ఓ పరిశోధన ఫలితాల ప్రకారం పీఎల్డీ వినియోగదారులు తరచూ 105 డెసిబుల్స్ కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటారు. వినోద వేదికలలో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డెసిబుల్స్మించి ఉంటాయి.. అయితే వైద్యులు అనుమతించిన స్థాయి పెద్దలకు 80 డెసిబుల్స్. పిల్లలకు 75 డెసిబుల్స్ మాత్రమే కావడం గమనార్హం. ‘ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు సురక్షితమైన వినికిడి మార్గాలను ప్రోత్సహించడం ద్వారా నష్ట నివారణకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం’ అని ఈ సందర్భంగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.టిన్నిటస్ సమస్యే ఎక్కువ.. నన్ను కలిసిన నగరవాసుల్లో కొందరికి చిన్న వయసులోనే వినికిడిలోపాలతో పాటు టిన్నిటస్ అనే ఒక సమస్య పెరుగుతోందని కూడా గుర్తించాం. టిన్నిటస్ అంటే ఫోన్ రింగింగ్, ఇతర శబ్దాలు పదే పదే తలలో, చెవుల్లో గింగురుమనే ఫాంటమ్ సెన్సేషన్స్. కొంత మంది దీని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే మరి కొందరు దీర్ఘకాలిక చెవినొప్పి అనుభవిస్తున్నారు. తీవ్రమైన శబ్దాలు, తద్వారా కలిగే అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వినికిడి లోపానికి దారి తీస్తాయి. అంతేకాదు వినికిడి సమస్యలు డిప్రెషన్, డిమెన్షియా, మతిమరుపు వ్యాధుల తీవ్రత పెరగడానికి కూడా కారణం అవుతాయి. – డా.ఎమ్.ప్రవీణ్‌కుమార్, ఇఎన్టీ వైద్యులు -
ఈ హెడ్‌బ్యాండ్‌తో అల్జీమర్స్‌కు చెక్!
గాగుల్స్, హెడ్‌ఫోన్స్‌తో కూడిన ఈ హెడ్‌బ్యాండ్ అల్జీమర్స్‌కు చెక్‌పెడుతుంది. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ‘కాగ్నిటో థెరప్యూటిక్స్’ ఇటీవల ఈ హెడ్‌బ్యాండ్‌ను రూపొందించింది. దీనిని తలకు పెట్టుకుంటే, ఇది విడుదల చేసే కాంతి, ధ్వని తరంగాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరును మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ బాధితుల్లో మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరు బాగా నెమ్మదిస్తుంది. వారు ఈ హెడ్‌బ్యాండ్‌ను ధరించినట్లయితే, స్వల్పకాలంలోనే మెరుగైన ఫలితాలను పొందగలరని ‘కాగ్నిటో’ నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరానికి అమెరికా జాతీయ ‘ఆహార ఔషధ సంస్థ’ (ఎఫ్‌డీఏ) అనుమతి కూడా మంజూరు చేసింది. ఈ హెడ్‌బ్యాండ్ తయారీ బృందానికి ‘కాగ్నిటో థెరప్యూటిక్స్’ వ్యవస్థపాకులు, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) న్యూరోసైంటిస్టులు లీ హ్యూయెయి సాయి, ఎడ్ బోడెన్ నేతృత్వం వహించారు. అల్జీమర్స్ ప్రారంభ దశ నుంచి నడి దశ వరకు గల రోగులకు ఈ పరికరం చక్కగా పనిచేస్తుందని వారు తెలిపారు. దీనిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావడానికి ‘కాగ్నిటో’ నిధులు సమకూర్చుకుంటోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. (చదవండి: 'అరుధంతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
స్పెషల్ఫీచర్తో డైసన్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయ్..యాపిల్‌కు కష్టమే!
Dyson Zone headphones: టెక్నాలజీ సంస్థ డైసన్ ఎట్టకేలకు తనప్రీమియం హెడ్ ఫోన్లను తీసుకొచ్చింది. తద్వారా ఆడియో విభాగంలోకి ప్రవేశించింది. డైసన్ జోన్ పేరుతో వాటిని లాంచ్ చేసింది. దాదాపు యాపిల్ ప్రీమియంహెడ్ఫోన్లు AirPods Max ధర లోనే డైసన్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 50 గంటల వరకు ప్లేబ్యాక్, 3 గంటల్లోనే 100 శాతం చార్జింగ్, యూఎస్బీ-సీ చార్జింగ్ సిస్టం, లిథియం అయాన్ బ్యాటరీలు, 11 మైక్రోఫోన్లు మొదలైన ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి. మైడైసన్ యాప్‌తో ఈ హెడ్‌ఫోన్స్‌ను నియంత్రించవచ్చు. స్వచ్ఛమైన గాలిని అందించే కార్బన్ ఫిల్టర్లను కూడా వీటికి అమర్చుకోవచ్చు. మోడల్‌ను బట్టి హెడ్‌ఫోన్స్ ధర రూ. 59,900 - రూ. 64,900 వరకు ఉంటుంది. (కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం) New Dyson Zone Absolute+ air purifying noise-cancelling headphones🎧 pic.twitter.com/XS7j3pbq7s — Milez (@MilezGrey) May 8, 2023 -
ప్రయాణాల్లో హెడ్ఫోన్లు వాడుతున్నారా? నిర్లక్ష్యంతో ప్రాణాలమీదికి..
హైదరాబాద్: వేసవి సెలవుల్లో బంధువుల ఇంటికి వచ్చి...తిరిగి ఆనందంతో సొంతూరికి బయలుదేరిన ఓ టెన్త్ విద్యార్థిని రైలుకింద పడి మృత్యువాత పడింది. చెవిలో మొబైల్ హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ చిన్నపాటి నిర్లక్ష్యానికి ఆమె ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ విషాదకర సంఘటన నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ –బోరబండ రైల్వే స్టేషన్ల మధ్యలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీదర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ చోటూమియా కుమార్తె మున్నీ బేగం (16) వేసవి సెలవుల్లో కె.ఎస్.నగర్ ప్రాంతంలో నివాసం ఉండే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల్లో కూడా మున్నీ బేగం పాసైంది. పదిహేను రోజుల క్రితం నగరానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో సొంతూరుకు తిరుగు ప్రయాణమైంది. బీదర్ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి ఎంఎంటిఎస్ రైలులో బోరబండ రైల్వే స్టేషన్లో దిగింది. చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ రైలు పట్టాల వెంబడి వెళ్తుండగా ఆమెను గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. హెడ్ఫోన్లు రెండు చెవుల్లో పెట్టుకొని నడవడం వల్ల రైలు శబ్ధం వినపడలేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని తెలిసింది. దీనిపై స్థానికులు అందించిన సమాచారంతో జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నారు. శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, శవాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెడ్ఫోన్లు చాలా ప్రమాదకరం మొబైల్ హెడ్ఫోన్లు వాడుతూ రైలు పట్టాల వెంబడి నడవటం, రైలు పట్టాలను దాటడం, ఫోన్లో మాట్లాడుతూ, రైలు ఎక్కడం, దిగడంప్రమాదకరమని నాంపల్లి జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రయాణికులు ఫోన్లు వాడటం వల్ల రైళ్ల రాకపోకల శబ్దాలు వినపడవని, తద్వారా ప్రమాదం జరిగే ఆస్కారం ఉందన్నారు. -
శబ్ధాలు, పరికరాలతో చెవిచిల్లు.. ఆధునిక జీవనశైలి చెవి‘నిల్లు’
ఇటీవలి కాలంలో వినికిడి సమస్యలతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వైద్యులు అంటున్నారు. వైద్యుల గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, ఒక బిలియన్ పైగా యువతకు వినికిడి లోపం ప్రమాదం పొంచి ఉంది. టీనేజర్లలో వినికిడి శైలిని విశ్లేషించి దాని ప్రకారం వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉన్న వారి సంఖ్యల గురించి పరిశోధకులు ఈ అంచనాను రూపొందించారు. కరోనా విజృంభణ సమయంలో, ఆన్లైన్ సమావేశాలు, స్నేహితులు కుటుంబ సభ్యులతో వీడియో కాల్లు లేదా అతిగా చూసే సెషన్ల కారణంగా, మనలో చాలా మంది గంటల తరబడి హెడ్ఫోన్లకు అతుక్కుపోయారు. ఇప్పుడు, కోవిడ్‌తో సంబంధం లేకుండా హెడ్ఫోన్లు రోజువారీ జీవితంలో భాగంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాల (పిఎల్డిలు) వాడకం తో పాటు పెద్ద ఎత్తున హైఓల్టేజ్‌తో ఉండే సంగీత వేడుకలకు హాజరుకావడం వంటివి వినికిడి పాలిట శాపాలుగా అధ్యయనం తేల్చింది. పరిమితి మించిన సంగీతధ్వని.. పెద్దలకు 80 డీబీ, పిల్లలకు 75 డీబీ మాత్రమే అనుమతించదగిన ధ్వని స్థాయి. వినియోగదారులు తరచుగా 105 డెసిబెల్ (డిబి) కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటున్నారని గతంలో ప్రచురించిన మరో పరిశోధన వెల్లడించింది, అయితే మ్యూజిక్ కన్సర్ట్స్, వినోద వేడుకల్లో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డిబి వరకు ఉంటాయి. ఇందుగలదందు లేదని సందేహంబు లేదు.. ఇతర శబ్ధాల సమస్య లేకుండా సంగీతాన్ని ఆస్వాదించడానికి స్ట్రీమ్ సిరీస్, సినిమాలను చూడడానికి ఇష్టపడే యువతరం పెరిగింది. వీరు తరచుగా ఇయర్‌బడ్‌లు లేదా హెడ్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. మెట్రో నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టుపక్కల వారి మాటలు, శబ్ధాలు.. వగైరా తప్పించుకోవడానికి ఇయర్ఫోన్లు పెట్టుకుని వినడం సర్వసాధారణం. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా ఉండడానికి తమ వాల్యూమ్లను పెంచుతారు. మరోవైపు ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లు వినోదం మాత్రమే కాకుండా చాలా మందికి వృత్తిరీత్యా కూడా అవసరంగా మారాయి. ఏతావాతా ఈ ఆడియో గాడ్జెట్ల పెరుగుతున్న వినియోగం జుట్టు కణాలు, పొరలు, నరాలు లేదా చెవిలోని ఇతర భాగాలకు హాని కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి నష్టం కలిగిస్తుంది. వైద్యుల సూచనలివే.. ► టీవీ లేదా స్పీకర్లను లేదా హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాల్యూమ్‌ను నియంత్రించండి. ► ఇయర్‌బడ్‌లు హెడ్ఫోన్లలో మీ పక్కన ఉన్న వ్యక్తి వినే స్థాయికి వాల్యూమ్ చేరకుండా జాగ్రత్తపడాలి. ► బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా తరచుగా వాల్యూమ్‌ను పెంచాల్సిన అవసరం రాకుండా బయటి నుంచి శబ్దం–రాకుండాచేసే ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లను కొనుగోలు చేయండి. ► ఇయర్‌బడ్‌లు ఇయర్లోబ్ను కవర్ చేస్తాయి చెవికి అతి దగ్గరగా ఉంటాయి. మరోవైపు, హెడ్ఫోన్లు సంగీతపు వైబ్రేషన్‌ను నేరుగా చెవులకు పంపవు. కాబట్టి, దీర్ఘకాలంలో ఇయర్ బడ్స్ కన్నా హెడ్ఫోన్లకు మారడం మంచిది. ► ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాల విరామం లేదా ప్రతి 60 నిమిషాలకు 10 నిమిషాల పాటు చెవులకు విరామం ఇవ్వాలి. ► స్మార్ట్ఫోన్ల సెట్టింగ్‌లలో అనుకూల వాల్యూమ్ పరిమితిని కూడా సెట్ చేయవచ్చు. జాగ్రత్తలు అవసరం.. చెవిలో సున్నితమైన చర్మం, పొర ఉంటుంది. చెవికి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంటుంది. అయితే అతిగా ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఈ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది. తద్వారా చర్మానికి ఇన్ఫెక్షన్స్ అవకాశాలు పెరుగుతాయి. వాక్స్ జిగిరీ అనే ఆ పొర పోయిదంటే... ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వీటిని అతిగా వినియోగించకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు వీలున్నంత వరకూ అసలు వాడకూడదు. ఇయర్ డ్రమ్ ముఖ ద్వారం కాస్త పెద్దగా ఉన్నవాళ్ల కన్నా సన్నగా ఉన్నవాళ్లకి ప్రమాదం మరింత ఎక్కువ. వీళ్లు వాడేటప్పుడు దాన్ని ఇంకా ఇంకా లోపలికి తోస్తారు. అలా మరీ లోపలికి పెట్టడం వల్ల ఇయర్ డ్రమ్‌కు నష్టం కలుగుతుంది. వీలున్నంత వరకూ అవసరాన్ని బట్టి తప్ప ఎడాపెడా ఉపయోగించడం మంచింది కాదు. అలాగే వినికిడి సామర్ధ్యానికి హెడ్ ఫోన్స్, హై ఓల్టేజ్ సంగీతం కూడా హానికరమే. –డా.ఎం.ప్రవీణ్ కుమార్, ఇఎన్టీ సర్జన్ అమోర్ హాస్పిటల్స్ -
వంద కోట్ల యువతకు శబ్దపోటు
వాషింగ్టన్: నిరంతరం హెడ్ఫోన్లు పెట్టుకునే సంగీతం వింటున్నారా ? ప్రతి ఫోన్‌కాల్, ఆడియో, వీ డియో శబ్దాలు నేరుగా కాకుండా కేవలం ఇయర్ బడ్స్ ద్వారానే వింటున్నారా ? చెవులు చిల్లులు పడే శబ్దమయ సంగీత విభావరిలకు హాజరవుతున్నారా ? అయితే వినికిడి సమస్య మిమ్మల్ని వెంటాడటం ఖాయమని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గ్యాడ్జెట్లకు అతుక్కుపోతున్న దాదాపు 100 కోట్ల మంది టీనేజీ వయసువారికి చెముడు సమస్య పొంచి ఉందని బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురి తమైన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ దేశాలు తమ టీనేజర్ల కోసం అత్యవసరంగా శబ్ద సంబంధ చట్టాలకు పదునుపెట్టాలని అమెరికా లోని సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయం పరిశో ధకులతో కూడిన అంతర్జాతీయ అధ్యయన బృందం సూచనలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడుతు న్నారని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయ ని పరిశోధకులు గుర్తుచేశారు . ‘‘సొంత శబ్ద సాధనాలు(పర్సనల్ లిజనింగ్ డివైజెస్–పీఎల్డీ) స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్, ఇయర్బడ్స్ల అతివాడకమే సమస్యకు కారణం. వాస్తవానికి వయోజనులు 80 డెసిబెల్స్, చిన్నారులు 75 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దాలు వినాలి. కానీ, పీఎల్డీ వినియోగదారులు అత్యధికంగా 105 డెసిబెల్స్ వాల్యూమ్స్‌లో శబ్దాలు వింటున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఇది 112 డెసిబెల్స్‌కు చేరుతోంది. 2022 ఏడాదిలో 12–34 ఏళ్ల వయసువారిలో ఏకంగా 280 కోట్ల మంది వినికిడి సమస్యను ఎదుర్కొనే ప్రమాదముంది’’ అని అంచనావేశారు. -
బోట్‌కు రూ.500 కోట్లు
న్యూఢిల్లీ: బోట్ పేరుతో వేరబుల్స్ విక్రయాల్లో ఉన్న ఇమేజిన్ మార్కెటింగ్ తాజాగా రూ.500 కోట్లు సమీకరించింది. సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వార్బర్గ్ పింకస్ అనుబంధ కంపెనీతోపాటు నూతనంగా మలబార్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ నిధులను సమకూర్చింది. నిధుల రాకతో వ్యక్తిగత ఆడియో ఉత్పత్తుల విభాగంలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేస్తూనే వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌వాచ్‌ల సెగ్మెంట్లో విస్తరణకు ఆజ్యం పోస్తుందని కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా రూ.2,000 కోట్లు సమీకరణకై కంపెనీ గతంలో సెబీకి దరఖాస్తు చేసుకుంది. లిస్టింగ్ ప్రణాళికను ప్రస్తుతానికి విరమించుకున్న ఇమేజిన్ మార్కెటింగ్.. 12–18 నెలల్లో ఐపీవో అంశాన్ని పునర్‌పరిశీలించనుంది. విదేశాల్లోనూ బోట్ ఉత్పత్తులను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
‘ఈయనేం ప్రధాని.. దేశానికి తలవంపులు తెస్తున్నారు’
వైరల్: పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అంతర్జాతీయ వేదిక నుంచి నవ్వులపాలయ్యారు. ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సమ్మిట్ సందర్భంగా.. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీలో పాక్ ప్రధాని షెహ్బాజ్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇయర్‌ఫోన్స్ పెట్టుకునే క్రమంలో ఆయన పడ్డ అవస్థలు చూసి.. పుతిన్ చిన్నగా నవ్వుకున్నారు. ఎంతకీ అవి సెట్ కాకపోవడంతో.. ‘ఎవరైనా వచ్చి సాయం చేయండి’ అంటూ కోరారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది నుంచి ఒకరు వచ్చి సాయం చేశారు. ఆ సమయంలోనూ షెహ్బాజ్ ఇబ్బందిగా ఫీల్ కావడంతో.. పుతిన్ నవ్వుకుంటూనే ఉన్నారు. This CrimeMinister is a constant embarrassment for Pakistan. Even President Putin had to eventually just laugh at this clumsy man. Pathetic. This is what conspirators wanted? To have by design a politician who would not only be a crook but also a pathetic apology for a PM? pic.twitter.com/mmEhLY7RZg — Shireen Mazari (@ShireenMazari1) September 15, 2022 When u are only there for a free trip & don't give a damn about your country u sleep thru meetings while the other side makes notes. Shameful & embarrassing behaviour of Imported govt at SCO. Who is responsible for inflicting this cabal of inept crooks on to the nation? pic.twitter.com/jAoZDWa8Xg — Shireen Mazari (@ShireenMazari1) September 16, 2022 ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. పాక్‌లో ట్రోల్ నడుస్తోంది. బయటా తన చేష్టలతో పాక్ పరువు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు కొందరు. ఇంకొవైపు ప్రతిపక్ష పీటీఐ షీరిన్ మజారీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎస్సీవో సమ్మిట్‌లో పాక్ బృందం తీరును ప్రశ్నిస్తూ.. ట్విటర్లో ఎండగడుతున్నారు. ఇదీ చదవండి: సేవింగ్స్ డబ్బులు ఇవ్వట్లేదని ఎంత పని చేసింది.. -
ఇయర్ ఎండ్ సేల్: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..!
ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీదారు సోనీ ఇయర్ ఎండ్ సేల్‌ను గురువారం (డిసెంబర్ 16) నుంచి ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, టీవీలపై భారీ ఆఫర్లను సోనీ ప్రకటించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్ 2022 జనవరి 3 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ఆఫ్‌లైన్, పలు ఎలక్ట్రానిక్ స్టోర్స్, సోనీ ఆన్లైన్ స్టోర్స్‌తో పాటుగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా పలు బ్రావియా టీవీలపై 30 శాతం మేర తగ్గింపు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను , రెండేళ్ల వారంటీని కొనుగోలుదారులకు సోనీ అందిస్తోంది. వీటితో పాటుగా వైర్లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్‌పై 60 శాతం మేర తగ్గింపును ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా సోనీ అందిస్తోన్న పలు ఆఫర్లు..! ►Sony Bravia XR-65A8OJ టీవీ కొనుగోలుదారులకు రూ. 2,65,990 కే రానుంది. దీని రిటైల్ ధర రూ. 3,39,900. Sony Bravia KD-55X8OJ మోడల్ టీవీ ధర రూ. 87,390కు రానుంది. దీని అసలు ధర రూ. 1,09,900 గా ఉంది. ►సోనీ WH-1000XM4 హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలుదారులు రూ. 24,990 కే సొంతం చేసుకోవచ్చును. దీని అసలు ధర రూ. 29,990. సోనీ WH-H910N హెడ్‌ఫోన్స్‌పై ఏకంగా 60 శాతం తగ్గింపుతో రూ. 9,990కు రానుంది. దీని అసలు ధర రూ. 24,990 ►సోనీ WH-CH710N హెడ్‌ఫోన్స్ ధర రూ. 7,990కు, సోనీ WH-XB900N ధర రూ. 9,990 కే కొనుగోలుదారులకు లభ్యమవుతోంది. ►సోనీ వైర్లెస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌పై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది, సోనీ WF-1000XM3 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ రూ. 9,990 ధరకు, సోనీ WF-SP800N TWS ఇయర్‌బడ్స్ ధర రూ. 10,990కు, సోనీ WF-XB700 ధర రూ. 6,990 కు రానున్నాయి. ►సోనీ SRS-XB13 వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్‌పై రూ. 3,590 కు రానుంది. కంపెనీ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్లపై కూడా తగ్గింపులను అందిస్తోంది, సోనీ WH-CH510 , WI-XB400 మోడల్స్ వరుసగా రూ. 2,990, రూ. 2,790 కే రానుంది. చదవండి: ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! -
5 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల ప్లేబ్యాక్ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్ చేసిన సౌండ్‌కోర్..!
ప్రపంచవ్యాప్తంగా ఆడియో టెక్నాలజీలో పేరొందిన సౌండ్‌కోర్ భారత మార్కెట్లలోకి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో రెండు సరికొత్త వైర్లెస్ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. లైఫ్ క్యూ30,లైఫ్ క్యూ35 పేరుతో సౌండ్‌కోర్ హెడ్‌ఫోన్స్ భారత మార్కెట్లలోకి విడుదలయ్యాయి. లైఫ్ క్యూ30 ధర రూ. 7999, లైఫ్ క్యూ35 ధర రూ. 9999గా ఉంది. వీటిని ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చును. లైఫ్ క్యూ30 హెడ్‌ఫోన్స్ కేవలం బ్లాక్ కలర్‌తో రానుంది. లైఫ్ క్యూ35 వేరియంట్ హెడ్‌ఫోన్స్ పింక్ కలర్లో లభించనుంది. వీటిని కొనుగోలు చేసిన కస్టమర్లకు ట్రావెల్ కేస్‌ను కూడా సౌండ్‌కోర్ అందించనుంది. ఫాస్ట్ చార్జింగ్‌తో, 60 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ వీటి సొంతం. ఐదు నిమిషాల ఛార్జ్‌తో నాలుగు గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తాయని సౌండ్‌కోర్ వెల్లడించింది. సౌండ్ కోర్ లైఫ్ క్యూ30, లైఫ్ క్యూ35 ఫీచర్స్.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 60 గంటల బ్యాటరీ బ్యాకప్ 40mm హెడ్‌ఫోన్ డ్రైవర్స్ ట్రాన్స్పోర్ట్, ఇండోర్, అవుట్డోర్ మోడ్స్ సపోర్ట్ మెమొరీ ఫోమ్ ఇయర్ కప్స్ హై-రెస్ ఆడియో వైర్లెస్ సర్టిఫికేషన్ సొంతం బ్లూటూత్ సపోర్ట్ 18 నెలల వారంటీ చదవండి: సౌండ్‌కోర్ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..! -
శామ్సంగ్ కొత్త బ్లూటూత్ హెడ్ ఫోన్స్ విడుదల
లెవల్ యూ2 నెక్‌బ్యాండ్ వైర్లెస్ హెడ్ఫోన్లను శామ్సంగ్ భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త హెడ్ఫోన్లు సింగిల్ ఛార్జీతో 500గంటల స్టాండ్‌బై టైమ్ ను అందిస్తాయి. శామ్సంగ్ 12ఎంఎం ఆడియో డ్రైవర్లతో పాటు వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపిఎక్స్ 2-రేటెడ్ బిల్డ్‌ను కూడా అందించింది. సరైన సౌండ్ అవుట్‌పుట్ కోసం శామ్సంగ్ స్కేలబుల్ కోడెక్ టెక్నాలజీని కూడా లభిస్తుంది. శామ్సంగ్ లెవల్ యు2 హెడ్ఫోన్లు మొదట నవంబర్‌లో దక్షిణ కొరియాలో విడుదల చేసింది.(చదవండి: రెడ్ మీ లవర్స్‌కు శుభవార్త..!) లెవల్ యూ2 హెడ్‌ఫోన్ ఫీచర్స్: శామ్సంగ్ లెవల్ యూ2 హెడ్ఫోన్లు 12ఎంఎం డ్రైవర్లతో వస్తాయి. దీనిలో 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అందించడం విశేషం. ఇది బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో పాటు రెండు మైక్రోఫోన్లతో వస్తుంది. ఇంకా ఏఏసీ, ఎస్బీసీ, స్కేలబుల్ కోడెక్‌లకు సపోర్ట్ చేస్తుంది. లెవల్ యు2కి కనెక్ట్ చేసిన ఫోన్‌ను బయటకి తీయకుండా కాల్‌లను స్వీకరించడానికి, మ్యూట్ చేయడానికి, తిరస్కరించే విదంగా వీలు కల్పించారు. దీనిలో ఇన్‌బిల్ట్ బ్యాటరీ 500గం. స్టాండ్‌బై టైమ్, 18గం. మ్యూజిక్ ప్లేబ్యాక్, 13గం. టాక్‌టైమ్‌ను సింగిల్ ఛార్జ్ తో అందిస్తుంది. అలాగే ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉంది. ఈ హెడ్ఫోన్లు 41.5 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. దీని ధర మనదేశంలో రూ.1,999గా ఉంది. బ్లాక్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. -
ఈక్యూ మోడ్‌తో లెనోవా వైర్లెస్ హెడ్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా బహుళజాతి సాంకేతిక సంస్థ లెనోవా తన కొత్త వైర్లెస్ హెడ్ఫోన్లను తాజాగా విడుదల చేసింది. సరికొత్త ఈక్యూ టెక్నాలజీతో 'హెచ్డి 116' పేరుతో ప్రస్తుతం అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంచింది. ఈ నెల చివరి నాటికి ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధరను రూ .2,499 గా వుంచింది. మంచి,లుక్, ఉన్నతమైన నాణ్యత, గొప్ప సౌండ్ అవుట్‌పుట్, బలమైన బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి క్లాసిక్ మేళవింపుతో తమ తాజా హెడ్‌ఫోన్స్ ఆకట్టుకుంటాయని షెన్జెన్ ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈవో జిసేన్జు తెలిపారు. డ్యూయల్ ఈక్యూ మోడ్, (ఒకే బటన్‌ను నొక్కడం ద్వారా వినియోగదారుడు రెండు మోడ్లకు మారడానికి అనుమతి), 240హెచ్ స్టాండ్‌బై సమయంతో 24 గంటల ప్లేయింగ్ సమయం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 2019లో తమ ఆడియో పరికరాలకు భారత వినియోగదారుల నుంచి వచ్చిన విశేష ఆదరణ నేపథ్యంలోఇక్యూ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను తీసుకొచ్చామని ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇండియా బిజినెస్ హెడ్ నవీన్ బజాజ్ తెలిపారు -
గిఫ్ట్ ఇస్తే...మింగేశాడు
శాన్ఫ్రాన్సిస్కో: తల్లిదండ్రులు క్రిస్మస్ గిప్ట్గా ఇచ్చిన ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను ఓ ఏడేళ్ల బాలుడు పొరబాటున మింగేసిన ఘటన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లి భయంతో వణికిపోయారు. వెంటనే తమ కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నామని స్వయంగా బాలుడి తల్లి సోషల్ మీడియాలో వెల్లడించారు. కియారా స్ట్రౌడ్ ఫేస్బుక్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ఆమె తన ఏడేళ్ల కుమారుడు క్యూజెకు క్రిస్మస్ బహుమతిగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను కొనిచ్చారు. కేవలం మూడు రోజుల తరువాత, దాన్ని నోటితో పట్టుకొని పొరపాటున ఒకదాన్ని మింగేసాడు. ఈవిషయాన్ని వెంటనే గమనించిన కియారా బాలుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసిన డాక్టర్లు ఎయిర్‌పాడ్ పిల్లాడి పొట్టలోనే ఉన్నట్లు గుర్తించారు. అయితే దాన్ని బయటకు తీయడానికి శస్త్రచికిత్స అవసరం లేదని, కొన్ని రోజుల్లో అదే బయటపడుతుందని చెప్పారు. అది పక్కటెముకలకు కింది భాగంలో ఉండటం వల్ల ఆ బాలుడికి ఎటువంటి హానీ జరగదని హామీ ఇచ్చారు. -
డేంజర్ జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: వాహనచోదకులు, పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు సెల్ఫోన్లు ఉపయోగించరాదని, స్వీయ నియంత్రణ పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ అంటున్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్ల అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతాయని వివరించారు. ఇయర్‌ఫోన్స్ కారణంగా రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వెనుక వచ్చేవాహనాలను పట్టించుకోవడం లేదు యువత చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్డుపై వాహనాలు నడుపుతూ వెనుక వచ్చే వాహనాలను పట్టించుకోవడం లేదు. మ్యూజిక్ జోష్‌లో వాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు. చాలామంది వాహన చోదకులు సెల్‌ఫోన్ మాట్లాడుతూ, ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వాహనాలను నడుపుతున్నారు. పాదచారులు కూడా ... బాటసారులు కూడా పాటలు వింటూ మైమరిచిపోతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆటోలు, కార్లలో పెద్ద సౌండ్స్‌తో పాటలు వింటూ డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు. ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోవడంతో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్‌లో సెల్‌ఫోన్.. హెల్మెట్ల వాడకం పెరిగిన తరువాత డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం మరింత సులభమైంది. సెల్‌ఫోన్‌ను హెల్మెట్ లోపల చెవిదగ్గర పెట్టి మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నారు. -
ఇదేం వింత.. హెడ్‌ఫోన్ ఆర్డర్ చేస్తే..?
కోలకతా: ఆన్లైన్ కొనుగోళ్లలో మోసానికి సంబంధించి మరో షాకింగ్ ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేసినపుడు సదరు వస్తువులకు బదులుగా రాళ్లు, రప్పలు, మరేదో రావడం చూశాం. కానీ కోలకతాకు చెందిన వినియోగదారుడికి మాత్రం మరో వింత అనుభవం ఎదురైంది. ఒక ప్రముఖ ఆన్లైన్ కంపెనీకి హెడ్‌ఫోన్స్ కోసం ఆర్డర్ చేసిన కస్టమర్ అనంతరం పరిణామాలకు గందరగోళంలో పడిపోయాడు. ఫుట్‌బాల్ పట్ల అమితమైన ప్రేమ ఉన్న ఓ అభిమాని అటు కుటుంబానికి, ఇటు తనకు ఏఇబ్బందీ లేకుండా మ్యాచ్లనుఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఇందుకు రెండుటీవీ హెడ్సెట్లను ప్రముఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ ప్యాకేజీ శుక్రవారం ఇంటికి చేరింది. అయితే ఆ సమయానికి ఇంట్లో లేకపోవడంతో అతడు శనివారం ఆ ప్యాక్ విప్పి చూశాడు. ఎంతో ఆసక్తిగా తన హెడ్‌ఫోన్‌కోసం ఎదురు చూసిన అతగాడు బాక్స్‌లో ఉన్నది చూసి బిత్తరపోయాడు. ఇక్కడే ఈయనకు మరో షాక్ తగిలింది. హెడ్‌ఫోన్‌కు బమదులుగా ఒక హెయిర్ ఆయిల్ డబ్బా దర్శనమిచ్చింది. దీంతో బాధితుడు బాక్స్‌మీద ఉన్న టోల్ ఫ్రీకి (1800) ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ ఒకసారి మ్రోగి.. డిస్ కనెక్ట్ అయింది. ఆ వెంటనే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి స్వాగతం అన్న సందేశం వచ్చింది. అయోమయంలోంచి తేరుకోకుండానే బాధితుడు అదే నెంబర్‌కు మళ్లీ డయల్ చేశాడు. సేమ్ ఎస్ఎంఎస్ రిపీట్. ఇక ఈ విషయాన్ని వాళ్ల స్నేహితులతో షేర్ చేస్తే.. వాళ్లు ఇదే అనుభవాన్ని పంచుకున్నారు. అయితే వారి సలహా మేరకు కంపెనీకి చెందిన అసలైన టోల్ ఫ్రీ నెంబరు తెలుసుకుని తన ఫిర్యాదు నమోదు చేశాడు. ఇక్కడ ఇంకో గమ్మత్తేమిటంటే..ఆయిల్ కావాలంటే వాడుకోండి..లేదంటే అవతల పారేయండి. దురదృష్టవశాత్తూ మా దగ్గర హెడ్‌ఫోన్ సెట్ ఒకటి మాత్రమే ఉంది. రెండో దానికి డబ్బులు వాపస్ చేస్తామంటూ సోమవారం ఉదయం షాపింగ్ పోర్టల్ నుండి కాల్ రావడం. దీంతో ఈ మొత్తం వ్యవహారంతో తెల్లబోయిన బాధితుడు మాత్రం మళ్లీ ఆన్లైన్ పోర్టల్ వాళ్లు వచ్చి ఆదే బాటిల్ వాపస్ ఇవ్వమంటే ఎలా అనుకుంటూ.. నూనె సీసాను బీరువాలో భద్రంగా దాచిపెట్టి... ఫుల్బాల్ మ్యాచ్‌లను మ్యూట్‌లోనే వీక్షిస్తున్నాడుట. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఆన్లైన్ పోర్టల్ కస్టమర్ కేర్ ప్రతినిధి ..అసలు 1800నెంబరు తమకు చెందినది కాదనీ.. మోసగాళ్ల వలలో పడి విలువైన సమాచారాన్ని షేర్ చేయొద్దంటూ కోరారు. అలాగే అంశాన్ని తమ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. -
చెవుల్లోనే పేలిపోయిన హెడ్‌ఫోన్స్
చార్జింగ్ సమయంలో స్మార్ట్‌ఫోన్ వినియోగంపై జరిగే ప్రమాదాలపై యువతను ఎంత అప్రమత్తం చేసినా ఘోరమైన ప్రమాదాలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. హెడ్‌ఫోన్ యూజర్ల వెన్నులో వణుకు పుట్టించే మరో ఉదంతం ఒకటి బ్రెజిల్లో చోటు చేసుకుంది. ఫోన్ చార్జింగ్‌లో ఉండగానే.. హెడ్‌ఫోన్ వాడుతుండగా అనూహ్య ప్రమాదం జరిగింది. దీంతో బాధిత యువతి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బ్రెజిల్‌లోని రియాస్ ఫ్రియోకి చెందిన లూయిసా పిన్హిరో(17) అపస్మారక స్థితిలో పడివుండగా బాలిక అమ్మమ్మ గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైద్యులు ఆమె జీవితాన్ని రక్షించలేకపోయారు. భారీ విద్యుత్ షాక్ వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. ఎలక్ట్రిక్ షాక్ తగిలిన గంట తరువాత అపస్మారక స్థితిలో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారనీ , హెడ్‌ఫోన్స్ చెవుల్లో కరిగిపోయినట్లు ఆస్పత్రి అధికార ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ఛార్జ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ లేదా టాబ్లను వాడొద్దని అనేక ఫోన్ కంపెనీలు హెచ్చరిస్తునే ఉన్నాయి. అంతేకాదు చార్జింగ్‌లో ఉన్నపుడు ఫోన్‌ను వినియోగిస్తే..చార్జింగ్ వేగం తగ్గుతుందని కూడా చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రపంచావ్యాప్తంగా ఈ తరహా ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్న కేసులు నమదవుతూనే ఉన్నాయి. దీనిపై ఎవరికి వారు అప్రమత్తంగా వ్యవహరించడం చాలా అవసరం. -
సిగ్గు చేటు: తేజస్ రైల్లో ప్రయాణీకుల చేతివాటం
భారతదేశపు తొలి లగ్జరీ రైలు తేజస్. సోమవారం ముంబై-గోవాల మధ్య ఈ రైలును అట్టహాసంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. ఎన్నో అత్యధునిక సౌకర్యాలున్న ఈ రైల్లో ప్రయాణీకులు వీక్షించేందుకు ప్రతి సీటు వెనుక భాగంలో ఎల్సీడీ స్క్రీన్లు, హెడ్ ఫోన్లను అమర్చారు. అయితే, సర్వీసును ప్రారంభించిన మూడు రోజుల్లోనే ప్రయాణీకులు చేతివాటం చూపించారు. మొత్తం రైలులో 20 బోగీలు ఉన్నాయి. వీటిలో కొన్ని బోగీల్లో ఎల్సీడీ స్క్రీన్లు పగలిపోయాయి. మరికొన్ని బోగీల్లో అందుబాటులో ఉంచిన హెడ్ ఫోన్లు మాయమయ్యాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్ధ కథనాన్ని ప్రచురించింది. రైలు ప్రవేశపెట్టిన మూడు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో విస్తుపోవడం రైల్వే అధికారుల వంతైంది. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తొలి లగ్జరీ రైలు తేజస్. అలాంటిది ప్రయాణీకులే సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తించడం సిగ్గు చేటు. -
స్మార్ట్.. జాకెట్..!
బైక్‌లో వెళుతున్నారు.. స్మార్ట్‌ఫోన్‌కు హెడ్‌ఫోన్స్ తగిలించుకుని ఓ పాట వింటున్నారు. నచ్చలేదు.. మార్చాలంటే బైక్ ఆపు చేయాలి. జేబులోంచి స్మార్ట్‌ఫోన్ బయటకు తీయాలి. నోటిఫికేషన్స్‌లోకి వెళ్లి ఏదో ఒక బటన్ నొక్కాలి. ఇది ఇప్పటివరకూ మనం పాటించే పద్ధతి.. కానీ ఫొటోలో ఒకాయన తొడుక్కు న్నాడే.. బ్లూ జెర్కిన్.. అదుంటే మాత్రం ఇది ఒక్క చిక్కే కాదు.. ఎడమ చేతి మణికట్టు దగ్గర కుడి చేత్తో ఓసారి రుద్దితే చాలు! అంతేనా... సౌండ్ వాల్యూమ్ తగ్గించాలనుకోండి... రెండుసార్లు రుద్దాలి. మ్యాప్స్ ఆన్ చేయాలనుకోండి. పైకి కిందకు మూడుసార్లు నొక్కితే సరి! అదెలా? ఆ జాకెట్లో మ్యాజిక్ ఉంది! అదేంటో తెలుసా? ఇందులోని ఒక్కో నూలుపోగు.. అత్యంత సున్నితమైన స్థాయిలో విద్యుత్తును ప్రసారం చేయగలదు. చేతి కఫ్ లింక్‌లో ఉండే బ్లూటూత్ రిసీవర్ మీ సంకేతాలను గుర్తిస్తుంది. వైర్లెస్ పద్ధతిలోనే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయిపోతుంది. మీరు చెప్పిన పని చేసేస్తుంది. కాకపోతే ఏ సంకేతానికి ఏ పని చేయాలో మనం ముందే నిర్దేశించుకోవాల్లెండి. జాకెట్ వావ్ అనిపించేలా ఉంది కదూ... ముందుముందు ఇలాంటివి మనం మరిన్ని చూడబోతున్నాం. ధరించే దుస్తుల్లోకి ఎలక్ట్రానిక్స్‌ను జొప్పించేందుకు గూగుల్, జీన్స్ తయారీ కంపెనీ లెవిస్‌లు కలిసికట్టుగా ‘ప్రాజెక్ట్ జాక్వర్డ్’ పేరుతో ఈ సరికొత్త జాకెట్‌ను అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఏడాదిన్నర క్రితం మొదలైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అంత్యదశలో ఉంది. అన్నీ సవ్యంగా సాగితే కొన్ని నెలల్లోనే ఈ జాకెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు లెవిస్ ప్రయత్నాలు చేస్తోంది. అయిదు రకాల సంకేతాలను గుర్తించేందుకు వీలుగా లెవిస్ ఒక స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను కూడా సిద్ధం చేసింది. కఫ్ లింక్‌లో ఉండే బ్లూటూత్ రిసీవర్‌ను తొలగించి ఉతుక్కుంటే చాలు..! ఒక్కో జాకెట్ ధర దాదాపు రూ.14 వేలు ఉండవచ్చునని అంచనా! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విమానంలో మ్యూజిక్ వింటుంటే.. మంటలు
-
విమానంలో మ్యూజిక్ వింటుంటే.. మంటలు వచ్చి..
సిడ్నీ: విమానంలో మ్యూజిక్ వింటున్న ఓ మహిళ తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనా రాజధాని బీజింగ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే విమానంలో ఎక్కిన ఓ మహిళ బ్యాటరీతో నడిచే హెడ్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటోంది. కొద్దిసేపట్లోనే హెడ్‌ఫోన్స్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఆమె హెడ్‌ఫోన్స్‌ను పక్కకు తీసి కింద పడేసింది. ఈ ఘటనలో ఆమె ముఖం, మెడతో పాటు చేతులకు గాయాలయ్యాయి. హెడ్‌ఫోన్స్ నుంచి మంటలు రావడంతో షాక్‌కు గురైన విమాన సిబ్బంది.. గాయాలపాలైన మహిళను శస్త్రచికిత్సకు తరలించారు. కిందపడిన హెడ్‌ఫోన్స్ విమానం ఫ్లోర్‌కు కరుచుకుపోవడంతో దాన్ని అక్కడి నుంచి తొలగించారు. బ్యాటరీలతో నడిచే వస్తువులను విమానంలో వాడొద్దని అధికారులు పేర్కొన్నారు. -
ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లతో ప్రమాదమా?
కాలిఫోర్నియా: ఇప్పటికే ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఫోన్లు అక్టోబర్ ఏడవ తేదీన భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. సంప్రదాయబద్ధమైన ఇయర్ ఫోన్లకు బదులుగా ‘ఎయిర్‌పాడ్స్’గా పిలిచే వైర్లెస్ ఇయర్ ఫోన్లను ఇందులో ప్రవేశపెట్టడం విప్లవాత్మకమార్పుగా ఐఫోన్ కంపెనీ అభివర్ణిస్తోంది. ఇది వైర్లెస్ యుగానికి నాంది పలికేందుకు తొలి ముందడుగుగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా వ్యాఖ్యానించారు. ఈ సిరీస్ ఐఫోన్లలో ఉపయోగిస్తున్న వైర్లెస్ ఎయిర్‌పాడ్స్ పూర్తిగా బ్లూటూత్ టెక్నాలజీపైనే పనిచేస్తాయి. ఎయిర్‌పాడ్స్‌లో బ్లూటూత్ కారణంగా విడుదలయ్యే రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. చెవికి సమీపంలో ఉండే మెదడు రక్తప్రసరణకు ఈ రేడియేషన్ అవరోధం కలిగిస్తుందని, దీనివల్ల మెదడుపై దుష్ప్రభావం ఉంటుందని ‘యుసి బెర్క్లీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ ప్రొఫెసర్ డాక్టర్ జోయెల్ మోస్కోవిట్జ్ హెచ్చరించారు. అయితే ఎయిర్‌పాడ్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ (పౌనపుణ్యం) ఎంతుంటుందో ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. కానీ ఎఫ్‌సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే రేడియేషన్ ఉంటుందని వీటిని తయారు చేసిన ఆపిల్ కంపెనీ ఇంజనీర్లు తెలియజేస్తున్నారు. మానవ ఆరోగ్యానికి హానికలిగించే రేడియేషన్, అయస్కాంత తరంగాలను నిరోధించేందుకు అనుగుణంగా ఎఫ్‌సీసీ మార్గదర్శకాలు లేవని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలు తేల్చారని డాక్టర్ జోయెల్ హెచ్చరించారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను వాడడం అంటే ఓ మైక్రోవేవ్‌ను చెవులో పెట్టుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మైక్రోవేవ్ నుంచి వెలువడే రేడియేషన్ కన్నా తమ ఎయిర్‌పాడ్స్ నుంచి తక్కువ స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుందని ఆపిల్ ఇంజనీర్లు సమర్థిస్తున్నారు. బ్లూటూత్ స్పీకర్లను దూరంగా ఉండి విన్నా కొంత రేడియేషన్ ప్రభావానికి మనం గురవుతామని, అలాంటప్పుడు నేరుగా, అందులో మెదడుకు దగ్గరగా విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ ముప్పు ఉంటుందని ఆయన అన్నారు. కార్డుతో పనిచేసే ఇయర్ ఫోన్లే అన్నింటికన్నా ఉత్తమమన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. -
ఐఫోన్ 7లో ఆ ఫీచర్లు వద్దు!
కాలిఫోర్నియా: సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్ తీసుకురానున్న ఐఫోన్ 7 సిరీస్‌లో మార్పులను వినియోగదారులు స్వాగతించలేకపోతున్నారు. ఈ ఏడాది విడుదల చేయనున్న ఐఫోన్ లో ఉన్న ఫీచర్ల గురించి ఆన్ లైన్ లో అంతులేకుండా రూమర్లు వస్తున్నాయి. ఇయర్ ఫోన్స్, హెడ్ఫోన్ల కోసం ఉపయోగించే సాకెట్‌ను, బ్యాటరీ చార్జింగ్ కోసం ఉపయోగించే 3.5 జాక్‌ను పూర్తిగా ఎత్తివేసి వైర్లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్ అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా ఇయర్ లేదా హెడ్ఫోన్లకు కనెక్ట్ చేసుకునేందుకు వీలు కల్పించనుంది. ఐఫోన్ 7కు సంబంధించి యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ప్రతిపాదిత ఫీచర్లపై ఐఫోన్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. ఈ ఫీచర్లు వద్దని కోరుతూ యాపిల్ సంస్థకు లేఖ పంపేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై 2 లక్షల మందిపైగా సంతకాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారు? వీరంతా ఐఫోన్ అభిమానులేనా? అనేది తెలియడం లేదు. -
ష్ష్... డ్యాన్స్ చేద్దామా!
నిశ్శబ్దంగా రండి. నెమ్మదిగా కాళ్లు కదపండి. ఎందుకంటే ఇది సెలైంట్ డిస్కో. లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున గల షార్ద్ టవర్లోని దృశ్యం ఇది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, మౌనంగా ఎవరికి వారు డాన్స్ చేసుకుంటారిక్కడ. డాన్స్ చేసుకోని వారు మృదువుగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఆధునికుల్లో సంప్రదాయవాదులకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చుతుందేమో! -
అధునాతన ఫీచర్లతో సోనీ హెడ్‌ఫోన్స్
న్యూఢిల్లీ: సోనీ కంపెనీ అధునాతన ఫీచర్లతో కూడిన మూడు రకాలైన హెడ్‌ఫోన్స్-ఎండీఆర్ 1, ఎండీఆర్-10 ఆర్, ఎన్డబ్ల్యూజడ్-డబ్ల్యూహెచ్303లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. బీట్ రెస్సాన్స్ కంట్రోల్, డిజిటల్ నాయిస్ క్యాన్సలింగ్, డిజిటల్ ఈక్విలైజర్, యాంప్లిఫయర్ వంటి ఫీచర్లున్న ఎండీఆర్ 1 ధర రూ.14,900. వన్ టచ్ ఈజీ కనెక్షన్, పూర్తిగా డిజిటల్ బ్లూ-టూత్ సౌండ్ హెడ్‌ఫోన్, వైర్లెస్ మ్యూజిక్ ప్లేబాక్, హ్యాండ్స్ ఫ్రీ సిస్టమ్స్ వంటి ప్రత్యేకతలున్న ఎండీఆర్-10 ఆర్ ధర కూడా రూ.14,900. ఎన్డబ్ల్యూజడ్-డబ్ల్యూహెచ్303లో మూడు మోడ్స్(మ్యూజిక్ ప్లేయర్, స్పీకర్, హెడ్ ఫోన్స్) ఉన్నాయి. దీంట్లో మ్యూజిక్ ప్లేయర్ ఉంది. స్పీకర్‌గా, హెడ్‌ఫోన్‌గా దీనిని ఉపయోగించుకోవచ్చు. దీని ధర రూ.8,990. ప్రతీ క్వార్టర్‌కు తమ హెడ్‌ఫోన్స్ మార్కెట్ మూడు రెట్ల వృద్ధి సాధిస్తోందని సోనీ ఇండియా కన్సూమర్ యూనిట్ హెడ్ (మొబైల్ డివిజన్) తడాటో కిముర చెప్పారు. మైక్రోఫోన్-ఎంబెడెడ్ హెడ్‌ఫోన్స్‌ను కూడా తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.