5 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల ప్లేబ్యాక్‌ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసిన సౌండ్‌కోర్‌..! | Soundcore Announces Its Q Series Headphones In India | Sakshi
Sakshi News home page

Soundcore: 5 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల ప్లేబ్యాక్‌ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసిన సౌండ్‌కోర్‌..!

Nov 23 2021 6:06 PM | Updated on Nov 23 2021 6:33 PM

Soundcore Announces Its Q Series Headphones In India - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఆడియో టెక్నాలజీలో పేరొందిన సౌండ్‌కోర్‌ భారత మార్కెట్లలోకి నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో రెండు సరికొత్త వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది. లైఫ్‌ క్యూ30,లైఫ్‌ క్యూ35 పేరుతో సౌండ్‌కోర్‌ హెడ్‌ఫోన్స్‌ భారత మార్కెట్లలోకి విడుదలయ్యాయి. లైఫ్‌ క్యూ30 ధర రూ. 7999, లైఫ్‌ క్యూ35 ధర రూ. 9999గా ఉంది. వీటిని ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చును.

లైఫ్‌ క్యూ30 హెడ్‌ఫోన్స్‌ కేవలం బ్లాక్‌ కలర్‌తో రానుంది. లైఫ్‌ క్యూ35 వేరియంట్‌ హెడ్‌ఫోన్స్‌ పింక్‌ కలర్‌లో లభించనుంది. వీటిని కొనుగోలు చేసిన కస్టమర్లకు ట్రావెల్‌ కేస్‌ను కూడా సౌండ్‌కోర్‌ అందించనుంది. ఫాస్ట్‌ చార్జింగ్‌తో, 60 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ వీటి సొంతం. ఐదు నిమిషాల ఛార్జ్‌తో నాలుగు గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తాయని సౌండ్‌కోర్‌ వెల్లడించింది. 

సౌండ్‌ కోర్‌ లైఫ్‌ క్యూ30, లైఫ్‌ క్యూ35 ఫీచర్స్‌..

  • యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్
  • ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌
  • 60 గంటల బ్యాటరీ బ్యాకప్‌
  •  40mm హెడ్‌ఫోన్‌ డ్రైవర్స్‌
  • ట్రాన్స్‌పోర్ట్‌, ఇండోర్‌, అవుట్‌డోర్‌ మోడ్స్‌ సపోర్ట్‌
  • మెమొరీ ఫోమ్‌ ఇయర్‌ కప్స్‌
  • హై-రెస్ ఆడియో వైర్‌లెస్ సర్టిఫికేషన్‌ సొంతం
  • బ్లూటూత్‌ సపోర్ట్‌
  • 18 నెలల వారంటీ

చదవండి:  సౌండ్‌కోర్‌ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్‌ స్పీకర్‌.! ధర ఎంతంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement