బడ్జెట్‌ ధరలో సౌండ్‌బార్‌ను లాంచ్‌ చేసిన  సౌండ్‌కోర్‌ | Soundcore Infini Soundbar With 100W Output Launched In India | Sakshi
Sakshi News home page

Soundcore: బడ్జెట్‌ ధరలో సౌండ్‌బార్‌ను లాంచ్‌ చేసిన  సౌండ్‌కోర్‌

Published Wed, Dec 22 2021 7:31 PM | Last Updated on Wed, Dec 22 2021 7:32 PM

Soundcore Infini Soundbar With 100W Output Launched In India - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఆడియో టెక్నాలజీలో పేరొందిన సౌండ్‌కోర్‌ భారత మార్కెట్లలోకి సరికొత్త ‘సౌండ్‌కోర్‌ ఇన్ఫినీ’ సౌండ్‌బార్‌ను బుధవారం రోజున లాంచ్‌ చేసింది. సౌండ్‌బార్ 2.1 స్టీరియో స్పీకర్ సెటప్‌తో, వైర్‌లెస్, వైర్డు కనెక్టివిటీతో రానుంది. దీనిలో  రెండు 3-అంగుళాల సబ్‌ వూఫర్లను,  రెండు 2.5-అంగుళాల ట్వీటర్స్‌ ఉన్నాయి.

కంపెనీ ప్రకారం...కొత్త సౌండ్‌కోర్ ఇన్ఫిని సౌండ్‌బార్ మెరుగైన బేస్‌తో 100W RMS అవుట్‌పుట్‌తో రానుంది. దీనిలో మూడు రకాల మోడ్స్‌ కూడా ఉన్నాయి.  సౌండ్‌కోర్ ఇన్ఫిని సౌండ్‌బార్ ధర రూ. 9,999గా ఉంది. కొనుగోలుదారులు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలుచేయవచ్చును. 

చదవండి: 5 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల ప్లేబ్యాక్‌ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసిన సౌండ్‌కోర్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement