Nokia Launched New Laptop, Smart TV's: నోకియా భారత మార్కెట్‌లో విక్రయాలను మరింత పెంచేందుకుగాను సరికొత్త వ్యూహాలతో ముందుకువస్తోంది. కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు తాజాగా నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్, కొత్త నోకియా స్మార్ట్ టీవీ సిరీస్ మోడళ్లను కంపెనీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో భారత మార్కెట్‌లోకి మంగళవారం రోజున లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అక్టోబర్ 3 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 11 జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. కాగా నోకియా స్మార్ట్ టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో పనిచేస్తాయి. 50-ఇంచ్, 55-ఇంచ్ డిస్‌ప్లే పరిమాణాలలో నోకియా స్మార్ట్‌టీవీలను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు ఫుల్ హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ, క్యూఎల్‌ఈడీ వేరింయట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
ధర ఏంతంటే...?
నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్ ధర రూ. 56, 990. నోకియా 50ఇంచ్ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 44,999., కాగా అల్ట్రా హెచ్‌డీ 4కే క్యూఎల్‌ఈడీ ధర రూ. 49, 999గా నోకియా నిర్ణయించింది. నోకియా 55ఇంచ్ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 49,999., కాగా అల్ట్రా హెచ్‌డీ 4కే క్యూఎల్‌ఈడీ ధర రూ. 54, 999గా నోకియా నిర్ణయించింది. ఈ స్మార్ట్ టీవీ సెట్లు జేబీఎల్ స్పీకర్స్‌తో పనిచేస్తాయి. 2జీబీ ర్యామ్+ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌టీవీలు లభిస్తాయి.
నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 స్పెసిఫికేషన్‌లు
- విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- బరువు 1.4 కిలోలు
- 11 జెన్ ఇంటెల్ కోర్ i5 CPU
- డాల్బీ అట్మోస్ సపోర్ట్
- 14-అంగుళాల ఫుల్-హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లే
- 16జీబీ ర్యామ్ + 512జీబీ NVMe ఎస్‌ఎస్‌డీ
- యూఎస్‌బీ టైప్-సి పోర్ట్,
- హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్
Comments
Please login to add a commentAdd a comment