ఈ హెడ్‌బ్యాండ్‌తో అల్జీమర్స్‌కు చెక్‌! | Headband To Treat Mild And Moderate Alzheimers Disease | Sakshi
Sakshi News home page

ఈ హెడ్‌బ్యాండ్‌తో అల్జీమర్స్‌కు చెక్‌!

Published Sun, Mar 24 2024 5:06 PM | Last Updated on Sun, Mar 24 2024 5:06 PM

Headband To Treat Mild And Moderate Alzheimers Disease - Sakshi

గాగుల్స్, హెడ్‌ఫోన్స్‌తో కూడిన ఈ హెడ్‌బ్యాండ్‌ అల్జీమర్స్‌కు చెక్‌పెడుతుంది. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ‘కాగ్నిటో థెరప్యూటిక్స్‌’ ఇటీవల ఈ హెడ్‌బ్యాండ్‌ను రూపొందించింది. దీనిని తలకు పెట్టుకుంటే, ఇది విడుదల చేసే కాంతి, ధ్వని తరంగాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరును మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్‌ బాధితుల్లో మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరు బాగా నెమ్మదిస్తుంది.

వారు ఈ హెడ్‌బ్యాండ్‌ను ధరించినట్లయితే, స్వల్పకాలంలోనే మెరుగైన ఫలితాలను పొందగలరని ‘కాగ్నిటో’ నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరానికి అమెరికా జాతీయ ‘ఆహార ఔషధ సంస్థ’ (ఎఫ్‌డీఏ) అనుమతి కూడా మంజూరు చేసింది. ఈ హెడ్‌బ్యాండ్‌ తయారీ బృందానికి ‘కాగ్నిటో థెరప్యూటిక్స్‌’ వ్యవస్థపాకులు, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) న్యూరోసైంటిస్టులు లీ హ్యూయెయి సాయి, ఎడ్‌ బోడెన్‌ నేతృత్వం వహించారు. అల్జీమర్స్‌ ప్రారంభ దశ నుంచి నడి దశ వరకు గల రోగులకు ఈ పరికరం చక్కగా పనిచేస్తుందని వారు తెలిపారు. దీనిని త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురావడానికి ‘కాగ్నిటో’ నిధులు సమకూర్చుకుంటోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. 

(చదవండి: 'అరుధంతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement