alzheimer disease
-
ఆదమరిస్తే మరపు ఖాయం
అల్జైమర్స్ ముప్పు మహిళల్లోనే ఎందుకు ఎక్కువ? క్రమక్రమంగా చాలా విషయాల మరపునకు దారితీసే ‘న్యూరో–డీజనరేటివ్’ వ్యాధి అల్జైమర్స్... మహిళ జ్ఞాపకశక్తి, ఆలోచన, ప్రవర్తనతీరు... ఇలా ఎన్నో అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తాము ఉన్న ఇంటి అడ్రస్‌తో సహా క్రమంగా అన్నీ మరచిపోయేలా చేసే ‘అల్జైమర్స్’ ముప్పు మహిళల్లోనే ఎక్కువ.కొన్ని పరిశీలనల ప్రకారం మొత్తం రోగుల్లో మూడింట రెండు వంతులు మహిళలే! ఎందుకిలా జరుగుతోందనే అంశంపై అధ్యయనాలు జరిగినప్పుడు చాలా అంశాలే ఇందుకు కారణమవుతున్నాయని తేలింది. ఉదాహరణకు జన్యుపరమైన, పర్యావరణ, జీవశాస్త్ర సంబంధితమైన పలు అంశాలు ఇందుకు కారణమవుతున్నట్లు గుర్తించారు. అన్నింటికంటే ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వారిలో వచ్చే హార్మోనల్ మార్పులు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కీలకమైన శుభవార్త ఏమిటంటే... దీనివల్ల కలిగే దుష్ప్రభావాల నివారణ చాలావరకు సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.మెనోపాజ్ తర్వాత మెదడులో వచ్చే మార్పులు... బ్రెయిన్ ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి పలు ఇమేజింగ్ పరీక్షల తర్వాత తేలిన అంశం ఏమిటంటే... మెనోపాజ్ తర్వాత మహిళల మెదడు పనితీరు, జీవక్రియల్లో మార్పు వస్తుంది. మెదడు పనితీరు తగ్గడంతో పాటు న్యూరాన్ల మధ్య కనెక్షన్లూ తగ్గుతాయి. ఈ న్యూరాన్ కనెక్షన్ల వల్లనే ఆలోచనలూ, విషయాలు జ్ఞప్తికి రావడం, నేర్చుకునే / అభ్యాసన శక్తీ... ఇవన్నీ కలుగుతాయి. మెనోపాజ్ తర్వాత మెదడు జీవక్రియలు (మెటబాలిజమ్) తగ్గడంతో జ్ఞాపకశక్తి తగ్గుతుండటం, ఏదీ ఠక్కున గుర్తుకు రాకపోవడం వంటి అనర్థాలు కనిపిస్తుంటాయి. ఇలా జరగడాన్ని ‘బ్రెయిన్ ఫాగ్’ గా పేర్కొంటారు. మెనోపాజ్ తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు వీటిని ‘అల్జైమర్స్’ తాలూకు ముందస్తు చిహ్నాలుగా కూడా భావించవచ్చు.మరి మహిళ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమెలా? ఇప్పటవరకూ అల్జైమర్స్‌ను నివారించడానికి నిర్దిష్టమైన చర్యలు లేకపోయినా, జీవనశైలిలో కొన్న మార్పుల ద్వారా (మరీ ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత) ఈ ముప్పును చాలావరకు నివారించవచ్చు. మెనోపాజ్ రాబోయే ముందర హార్మోన్ రీ–ప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ)లో భాగంగా ఈస్ట్రోజెన్ ఇవ్వడం వల్ల అల్జైమర్స్ ముప్పును చాలావరకు తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మెదడుకు మేత కల్పించేలా బాగా చదవడం, రకరకాల పజిల్స్ ఛేదించడం, కొత్త విద్యలు నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాల సాధన, తరచూ పలువురితో కలవడం, మాట్లాడుతుండటం (సోషల్ ఇంటరాక్షన్స్) వంటివి అల్జైమర్స్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. ఊ నిత్యం తగినంత శారీరక శ్రమతో, దేహంలో కదలికలతో ఉండేవారిలో అల్జైమర్స్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అందుకే వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్), ఈత, యోగా వంటి వ్యాయామాలు అల్జైమర్స్ రిస్క్‌ను తగ్గించడమే కాకుండా ఇతరత్రా మొత్తం ఆరోగ్యానికి బాగా దోహదపడతాయి. ఊ ఆహారంలో తగినంతగా ఆకుకూరలు, కూరగాయలు, చేపలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల అవి మెదడు ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. ఊ నిద్రను దూరం చేసే కెఫిన్‌ను పరిమితంగా తీసుకుంటూ మంచి నిద్ర అలవాట్లతో కంటినిండా నిద్రపోవడం అల్జైమర్స్ ముప్పును చాలావరకు తగ్గిస్తుంది. ఊ గుండె ఆరోగ్యం బాగుంటే మెదడు ఆరోగ్యమూ బాగుంటుంది. కీలకమైన ఈ రెండు అవయవాల ఆరోగ్యాలు ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. అందుకే గుండె సంబంధిత (కార్డియో వాస్క్యులార్) సమస్యలైన హైబీపీ, డయాబెటిస్ , అధిక కొలెస్ట్రాల్ వంటి జబ్బులను అదుపులో పెట్టుకోవడం ద్వారా అల్జైమర్స్ ముప్పును చాలావరకు నివారించవచ్చు. మహిళల్లోనే ఎందుకు ఎక్కువంటే... మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ల మోతాదులు మెనోపాజ్ తర్వాత తగ్గిపోతాయి. మెదడు కణాలను, మరీ ముఖ్యంగా న్యూరాన్లకు ఈస్ట్రోజెన్ మంచి రక్షణ కల్పిస్తుంటుంది. అంతేకాదు మెదడు తాలూకు జ్ఞాపకాల సెంటర్‌గా పేర్కొనే హి΄్పోక్యాంపస్కూ ఈస్ట్రోజెన్ రక్షణ ఇస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ దేహానికీ, అందులోని అన్ని అవయవాలకూ ఏజింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది కదా. ఈస్ట్రోజెన్ స్రావాలు అకస్మాత్తుగా తగ్గగానే మెదడు ఏజింగ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అలాగే మెదడులో అమైలాయిడ్స్ అనే పాచివంటి పదార్థాలు పేరుకుపోతుంటాయి. మహిళల్లో అల్జైమర్స్ ఎక్కువగా ఉండటానికి మరో కారణమం ఏమిటంటే... పురుషులతో పోలిస్తే వారు ఎక్కువకాలం జీవిస్తారు. వాళ్ల ఆయుర్దాయం కూడా ఈ ముప్పునకు మరో కారణం. ఇక జన్యుపరమైన కారణాల విషయానికి వస్తే పురుషులతో పోలిస్తే మహిళల్లో ‘ఏపీఓఈ–ఈ4’ అనే జన్యువు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... ఈ జన్యువును కలిగి ఉన్న మహిళల్లో అల్జైమర్స్ ముప్పు పురుషుల కంటే మరింత ఎక్కువ. మామూలుగానైతే వాతావరణంలో వాయుకాలుష్యానికి కారణమయ్యే సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్ అనే ధూళి కణాల వల్ల సాధారణంగా శ్వాససంబంధిత వ్యాధులు, ఆస్తమా వంటివి పెరుగుతాయన్నది చాలామందిలో ఉండే అభి్రపాయం. కానీ వాతావరణంలో పెరిగే కొద్దిపాటి కాలుష్యం మెదడుపై ప్రభావం చూపి మతిమరపునకు దారితీయవచ్చు. గాల్లోకి వ్యాపించే కొద్దిపాటి హానికరమైన ధూళికణాలు (టాక్సిక్ పార్టికిల్స్) ఏమాత్రం పెరిగినా అవి మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలను కనీసం 16 శాతం పెంచుతాయంటున్నారు అధ్యయనవేత్తలు. అలాగే అల్జైమర్స్ ముప్పునూ 11 శాతం వరకు పెంచవచ్చునంటున్నారు. ఈ విషయాలన్నింటినీ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ) అధ్యయనవేత్తలు గట్టిగా చెబుతున్నారు. నాడీవ్యవస్థకు సంబంధించిన ఇలాంటి రుగ్మతలను నివారించాలంటే వాతావరణంలో వాయువుల నాణ్యత తగ్గకుండా చూసుకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు. ‘అడల్ట్ ఛేంజెస్ ఇన్ థాట్ – (యాక్ట్)’ అనే అధ్యయనం కోసం దాదాపు పాతికేళ్లకు పైగానే ‘కైయిసర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ వారు సేకరించిన డేటాపై ఆ మాతృసంస్థతో పాటు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ) పరిశోధకులు సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించారు. వాషింగ్టన్–సియాటెల్ప్రాంతంలోని దాదాపు 4,000 మంది పరిశీలించినప్పుడు వాళ్లలో 1,000 పైగానే డిమెన్షియా రోగులు ఉన్నట్లు తేలింది. గాలిలోని హానికరమైన ధూళులు మతిమరపునకు కారణమయ్యే డిమెన్షియా, అల్జైమర్స్ జబ్బులు పెరుగుతాయని నిర్ద్వంద్వంగా తేలింది. అధ్యయనం నిర్వహించిన వారిలో నాలుగింట ఒక వంతు మందికి (దాదాపు 25›శాతం మందిలో) డిమెన్షియా ఉండటంతో ఇది కొంత ఆందోళన కలిగించే అంశంగా పరిశోధకులు పేర్కొంటున్నారు. గాల్లోని అత్యంత సూక్ష్మమైన ధూళికణాలను ‘ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్’ అంటారు. (ఈ ధూళికణాలు ఎంత చిన్నవంటే వీటి సైజు 2.5 మైక్రోమీటర్స్ మాత్రమే. ఒక పోలిక చె΄్పాలంటే వెంట్రుకను నిలువునా 30 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత సైజుంటుందో ఈ ధూళికణాల సైజు అంత ఉంటుంది). కారు ఎగ్జాస్ట్ నుంచి వెలువడే పోగ, భవన నిర్మాణ ప్రదేశాలు, మంటలూ, పోగలు ధారాళంగా వెలువడే ప్రదేశాలు... ఇలాంటిప్రాంతాలనుంచి వెలువడే ఈ ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ వల్లనే వాతావరణం బాగా కలుషితమైపోయి డిమెన్షియా, అల్జైమర్స్ వంటి నాడీ సంబంధ వ్యాధుల ముప్పు పెరుగుతోందంటున్నారు అధ్యయనవేత్తలు. ఈ అంశాలన్నీ ఇటీవలే ‘ద జర్నల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ప్రాస్పెక్టివ్స్’లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంతో... గాల్లోని కాలుష్యపదార్థాలను, ప్రమాదకరమైన ధూళికణాలను తగ్గిస్తే అటు శ్వాసకోశ వ్యాధులైన ఆస్తమా వంటివి వాటి నుంచి విముక్తి కలగడమే కాకుండా... ఇటు నాడీ వ్యవస్థకు సంబంధించిన మతిమరపూ, అల్జైమర్స్ వంటి సమస్యలూ తగ్గుతాయని స్పష్టమవుతోంది.∙ -
ఈ హెడ్‌బ్యాండ్‌తో అల్జీమర్స్‌కు చెక్!
గాగుల్స్, హెడ్‌ఫోన్స్‌తో కూడిన ఈ హెడ్‌బ్యాండ్ అల్జీమర్స్‌కు చెక్‌పెడుతుంది. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ‘కాగ్నిటో థెరప్యూటిక్స్’ ఇటీవల ఈ హెడ్‌బ్యాండ్‌ను రూపొందించింది. దీనిని తలకు పెట్టుకుంటే, ఇది విడుదల చేసే కాంతి, ధ్వని తరంగాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరును మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ బాధితుల్లో మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరు బాగా నెమ్మదిస్తుంది. వారు ఈ హెడ్‌బ్యాండ్‌ను ధరించినట్లయితే, స్వల్పకాలంలోనే మెరుగైన ఫలితాలను పొందగలరని ‘కాగ్నిటో’ నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరానికి అమెరికా జాతీయ ‘ఆహార ఔషధ సంస్థ’ (ఎఫ్‌డీఏ) అనుమతి కూడా మంజూరు చేసింది. ఈ హెడ్‌బ్యాండ్ తయారీ బృందానికి ‘కాగ్నిటో థెరప్యూటిక్స్’ వ్యవస్థపాకులు, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) న్యూరోసైంటిస్టులు లీ హ్యూయెయి సాయి, ఎడ్ బోడెన్ నేతృత్వం వహించారు. అల్జీమర్స్ ప్రారంభ దశ నుంచి నడి దశ వరకు గల రోగులకు ఈ పరికరం చక్కగా పనిచేస్తుందని వారు తెలిపారు. దీనిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావడానికి ‘కాగ్నిటో’ నిధులు సమకూర్చుకుంటోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. (చదవండి: 'అరుధంతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
సర్జరీ లేకుండా మతిమరుపును పోగొట్టొచ్చు, శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం
విద్యుత్ షాక్‌ని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని శాస్త్రవేత్తలు కొత్తరకం ప్రయోగం చేశారు. హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందట. అంతేకాకుండా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే ఈ చికిత్స నిర్వహించనున్నట్లు సైంటిస్టులు తెలిపారు. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్ ఒకటి. అల్జీమర్స్ కారణంగా మానసిక, ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి. ఈ న్యూరోలాజిక్ డిజార్డర్ కారణంగా బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటాయి. కాలక్రమేణా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి. మెదడులోని టెంపోరలో అనే భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి. అల్జీమర్స్ బారినపడినవాళ్ల లో ఈ కణాలు సన్నగా, చిన్నగా అవుతాయి. దాంతో టెంపోరల్ చిన్నగా అవుతుంది. అంతేకాదు 'హైపోమెటబాలిజం' ఉంటుంది. అంటే గ్లూకోజ్ తక్కువ అందుతుంది. దాంతో మెదడు చురుకుదనం కోల్పోతుంది. దాంతో ఆలోచనా శక్తి తగ్గిపోవడమే. కాకుండా జ్ఞాపకాలు చెదిరిపోయి, మతిమరుపు మొదలవుతుంది. హిప్పోకాంపస్లోని న్యూరాన్లను ఉత్తేజపరిచేందుకు కొత్త హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని రీసెంట్గా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ (ICL) శాస్త్రవేత్తల నేతృత్వంలో టెంపోరల్ ఇంటర్ఫెరెన్స్ (TI) బ్రెయిన్ స్టిమ్యులేషన్‌తో మతిమరుపును పోగొట్టచ్చని కనిపెట్టారు. ఇందులో భాగంగా హై ఫ్రీక్వెన్సీ విద్యుత్ కణాలకు బ్రెయిన్‌కు పంపించి జ్ఞాపకశక్తిని తిరిగి పొందేందుకు సహాయపడుతుందట. ఇందులో భాగంగా2,000 Hz,2,005 Hz, వద్ద విద్యుత్ కణాలను పంపిస్తాయి. ఇది ఒకరకంగా కరెంట్ షాక్ లాంటిదే. 5-Hz కరెంట్‌తో అదే ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. దీని వల్ల సెల్-పవర్ చేసే మైటోకాండ్రియాను పునరుజ్జీవింపజేస్తాయని, ఇది మతిమరుపును పోగొడుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో వివరించారు.''ఇప్పటివరకు మెదడుకు సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తితే రోగికి ఎలక్ట్రోడ్లను శస్త్రచికిత్స ద్వారా అమర్చాల్సి వచ్చేది. కానీ ఈ హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో ఎలాంటి నొప్పిలేకుండా రోగికి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేలా చేయొచ్చు.'' అని సైంటిస్ట్ నిర్ గ్రాస్మాన్ తెలిపారు. ఈ టెక్నిక్‌తో సర్జరీ అవసరం లేకుండా మనిషి మెదడులోని కణాలను ప్రేరేపించడం సాధ్యమవుతుంది. ఇది బ్రెయిన్ సెల్స్‌ను ప్రభావితం చేస్తుంది అని పేర్కొన్నారు. -
అమ్మమ్మలకు అండగా.. మతిమరుపుతో బాధపడేవాళ్లకు ఇది బెస్ట్ సొల్యూషన్
మన చుట్టూ మనకు తెలియకుండానే ఎంతో మంది రకరకాల బాధలకు లోనవుతుంటారు. వారిలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల సమస్యలకు సరైన పరిష్కారం తెలియక ఇబ్బందులు పడుతుంటారు. వారి మానాన వారిని అలాగే వదిలేయడం కన్నా పరిష్కారాన్ని కనుగొంటాను అనుకున్నాడు. తనదైన మార్గంలో ప్రయత్నించాడు. విజయం సాధించాడు. సత్కారాలను పొందుతున్నాడు హైదరాబాద్ వాసి హేమేష్ చదలవాడ. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలు అందించిన 21 ఏళ్ల లోపు 20 మంది యువ సాధకులను ఢిల్లీలో మొన్న జరిగిన ‘అన్‌స్టాపబుల్ 21’ వేదికగా సత్కరించారు. హ్యూమన్ స్టడీస్, సైన్స్, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్, సోషల్ ఇంపాక్ట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఏడు రంగాలలో ప్రతిభావంతులైన యువతకు ఈ సత్కారాన్ని అందజేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల హేమేష్ చదలవాడ ఎలక్ట్రానిక్స్ రంగంలో కనబరిచిన ప్రతిభకు గుర్తింపు పొందాడు. వృద్ధులకు సహాయం.. హేమేష్ పన్నెండేళ్ల వయసు నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగంలో గణనీయమైన ప్రతిభను చూపుతున్నాడు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న అమ్మమ్మను చూసి ఆమెకు ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. తన ఆలోచనల గురించి హేమేష్ చెబుతూ ‘నడిచేటప్పుడు అమ్మమ్మ అడుగులు తడబడుతుండేవి. మతిమరపు ఉండేది. ఆమెకు తన మీద తనకు కంట్రోల్ ఉండేది కాదు. కొన్నిసార్లు అర్థరాత్రి మంచంపై నుంచి లేచి ఎటో వెళ్లిపోయేది. దీంతో ఆమెను కనిపెట్టి ఉండటం కష్టమయ్యేది. అమ్మమ్మకు, ఆమెను చూసుకునే మాకూ ఇదో సవాల్‌గా ఉండేది. కొన్ని అందుబాటులో ఉన్న డివైజ్‌లను ప్రయత్నించి చూశాం. కానీ, ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. అమ్మమ్మకు సాయపడే డివైజ్‌ను నేనే సొంతంగా తయారుచేయాలనుకున్నాను’ అని తనలో రూపుదిద్దుకున్న ఆలోచనను వివరిస్తాడు. హేమేష్ కృషి, పట్టుదల, అంకితభావానికి అతని తల్లిదండ్రులు కిశోర్, సంధ్యలు ప్రోత్సాహం అందించారు. పరికరం ఎలా పనిచేస్తుందంటే.. ఈ పరికరం వాచ్‌లాగా మణికట్టుకూ కట్టుకోవచ్చు. బ్యాడ్జ్గానూ ధరించవచ్చు. రోగి నడక, భంగిమ, శరీర ఉష్ణోగ్రత, నాడిని పర్యవేక్షిస్తుంది. నీళ్లు జారిపడుతుండే శబ్దాన్ని కూడా గుర్తించగలదు. మనిషి దూరంగా తిరుగుతున్నప్పుడు లేదా పడిపోవడం వంటి ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే తెలియజేస్తుంది. ఇంకా అలారంలో ‘పిల్‌బాక్స్’ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది రోగులు వారి మందులు తీసుకునే సమయం వచ్చినప్పుడు హెచ్చరికలను పంపుతుంది. ‘ఈ డివైజ్ మా అమ్మమ్మ కోసం తయారు చేసినప్పుడు ఇంటర్నెట్ సరైన మార్గం చూపింది. అయితే, ఈ పరికరం పూర్తయ్యేసరికి అమ్మమ్మ చనిపోయారు’ అని హేమేష్ తెలిపాడు. ఇప్పుడీ అబ్బాయి 12వ తరగతి చదువుతున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్‌తో ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ రంగంలో మరిన్ని అడుగులు వేస్తున్నట్టుగా వివరించాడు. 2021లో ప్రధానమంత్రి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నాడు. పేరున్న కంపెనీల నుంచి గ్రాంట్లను పొందాడు. – నిర్మలారెడ్డి -
World Alzheimers Day: తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా అంటున్నారా..
గుంటూరు: ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి కొంతదూరం వెళ్లాక ఇంటి అడ్రస్ మర్చిపోవటం, తన పేరు కూడా రోగి మర్చిపోయే స్థితికి చేరుకోవటం ఈ జబ్బు లక్షణం. ఆరోగ్య సంస్థల నివేదిక ప్రకారం ప్రతి ఏడు సెకన్లకు ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సుమారు 8.8 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. జబ్బు సోకిన వారికి సహాయకులుగా ఉండేవారికి అవగాహన కల్పించటం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1994 నుంచి ఏటా సెప్టెంబర్ 21న అల్జీమర్స్ డే నిర్వహిస్తోంది. ప్రతిరోజూ 50 మందికి వైద్యం.. అల్జీమర్స్ వ్యాధికి చికిత్స కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మంది మానసిక వైద్యనిపుణులు, 15 మంది న్యూరాలజిస్టులను రోగుల సహాయకులు సంప్రదిస్తున్నారు. ప్రతిరోజూ న్యూరాలజిస్టులు, మానసిక వ్యాధి నిపుణుల వద్ద సుమారు 50 మంది వరకు అల్జీమర్స్ వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నట్లు అంచనా. రోజువారి పనులు మరిచిపోతారు వ్యాధి గ్రస్తులు రోజు వారి కార్యక్రమాలు మర్చిపోతారు. స్నానం చేయటం, బ్రష్ చేయటం, తిండి తినటం కూడా మర్చిపోతారు. వస్తువులను ఎక్కడో పెట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరో దొంగిలించినట్లుగా అనుమానించటం, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పటం, వస్తువుల పేర్లు మర్చిపోవటం, వాటిని ఏ విధంగా వినియోగించాలో, ఎందు నిమిత్తం వినియోగించాలో అనే అంశాలను మర్చిపోవటం రోగిలో కనిపిస్తాయి. ఇంటికి తాళాలు వేయటం, కూరలో ఉప్పు వేయటం, పాలల్లో తోడు వేయటం వంటివి మర్చిపోవటం వ్యాధి గ్రస్తుల్లో కనిపిస్తాయి. వయస్సు పెరుగుతున్న కొద్ది మతిమరుపు సహజం. దీనినే అల్జీమర్స్ వ్యాధి అంటారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఈ మతిమరుపు వ్యాధిబారిన పడే వారిసంఖ్య అధికంగా ఉండేది. ప్రస్తుతం మన దేశంలో కూడా బాధితుల సంఖ్య పెరిగిపోయింది. వ్యాధి లక్షణాలు... వయసు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వ్యాధి సోకిన వారు తమ పేరు మర్చిపోతారు. ఒకేచోట కూర్చుని వీడియోగేమ్స్, టీవీలు చూస్తూ ఉండటం, అతిగా మద్యం తాగడం, శారీరక, మానసిక వ్యాయామం లేకపోవటం, అధిక కొవ్వు ఉన్న మాంసం తినటం వలన ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. బంధువుల, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోతారు. పేర్లు మర్చిపోవటంతో పాటుగా వారిని గుర్తించటం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారిలో వస్తోంది. నేడు 45 ఏళ్ల వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది. -
ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే అల్జీమర్స్ కావొచ్చు
అల్జీమర్స్.. దాదాపు 60శాతం మంది వృద్దులు ఎక్కువగా బాధపడుతున్న సమస్య ఇది. అల్జీమర్స్ అంటే మెదడు దెబ్బతినడం లేదా జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే వ్యాధి. అల్జీమర్స్ ఉన్న వ్యక్తికి రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి వారు సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది? అన్నది ప్రముఖ వైద్యులునిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే... అల్జీమర్స్ ఏ వయసువారికి? అల్జీమర్స్ ఎందుకొస్తున్నది ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. మెదడులో ప్రొటీన్ గార పోగుపడటం దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మెదడు కణాలు తమను తాము శుభ్ర పరచుకునే సామర్థ్యం మందగించటం దీనికి కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్జీమర్స్ వ్యాధి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి ఎక్కువగా 65ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది.అల్జీమర్స్ వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా వంశపారం వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు ఇలా ఉంటాయి ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం,జ్ఞాపకశక్తి తగ్గడం రోజువారీ విషయాలను మర్చిపోవడం కుటుంబసభ్యుల పేర్లు కూడా మర్చిపోవడం వస్తువులు ఎక్కడ పెట్టారో గుర్తులేకపోవడం ఏకాగ్రత పెట్టలేకపోవడం, తీవ్రమైన గందరగోళం రాయడం, చదవడం,మాట్లాడేటప్పుడు ఇబ్బందులు కొద్ది నిమిషాల కింద జరిగిన విషయాలను కూడా మర్చిపోవడం పట్టరాని భావోద్వేగాలు, వ్యక్తిగత మార్పులు అల్జీమర్స్కి ఆయుర్వేదంలో చికిత్స ఇలా.. ►ఉసిరిక పొడి 2 గ్రాములు, నువ్వుల పిండి 2 గ్రాములు, తేనె, నెయ్యిలను కొద్ది కొద్దిగా తీసుకుని కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు రెండు సార్లు 40 రోజుల పాటు తీసుకోవాలి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. ► ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగుతుండాలి. లేదా ఉసిరిక పొడిని 2 గ్రాముల మోతాదులో తేనెతో లేదా నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. ఉసిరికాయలతో చేసే మురబ్బాలను కూడా తినవచ్చు. ►అతి మధురం వేర్లను మెత్తగా నూరి పొడి చేసి 1 గ్రాము మోతాదులో తీసుకుని దానికి నీళ్లు కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ► ప్రతి రోజూ 5-10 నానబెట్టిన బాదం గింజలను తింటుండాలి. ► తిప్పతీగ రసాన్ని రోజుకు 10-20 ఎంఎల్ మోతాదులో రెండు సార్లు తీసుకోవాలి. ► శంఖపుష్పి మొక్క పంచాంగ స్వరసాన్ని 10 ఎంఎల్ మోతాదులో తీసుకుని దానికి తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది.. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు -
బ్రష్ చేయడం కూడా మరిచిపోతున్నారా?.. అయితే కారణం ఇదే..
సాక్షి, గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల మతిమరుపు బాధితుల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతోంది. వయస్సు పెరుగుతున్న కొద్ది మతిమరుపు రావటం సహజంగా జరుగుతోంది. దీనినే అల్జీమర్స్ వ్యాధి అంటారు. ఆరోగ్య సంస్థల నివేదిక ప్రకారం ప్రతి 32 సెకన్లకు ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జబ్బు సోకిన వారికి సహాయకులుగా ఉండేవారికి అవగాహన కల్పించటం కోసం 1983 నుంచి ప్రతి ఏడాది నవంబర్ నెలను అల్జీమర్స్ అవగాహన నెలగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. నియంత్రణే తప్ప నివారణ లేని వ్యాధి.. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి కొంతదూరం వెళ్లాక ఇంటి అడ్రస్ మర్చిపోవడం, తన పేరు కూడా రోగి మర్చిపోయే స్థితికి చేరుకోవడం ఈ జబ్బు లక్షణం. ఆధునిక జీవనశైలి వల్ల ప్రతి విషయాన్ని కూడా స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్స్‌లో ఆన్లైన్లోనే వెతుకుతూ మెదడును ఏ మాత్రం వాడకుండా వదిలివేయడంతో వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందస్తుగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా ఉత్తమం. నియంత్రణే తప్పా నివారణ లేనిది ఈ వ్యాధి. వ్యాధి లక్షణాలు.. అల్జీమర్స్ వ్యాధి సోకిన వారు తమ పేరు కూడా మర్చిపోతారు. బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోవడంతో పాటుగా వారిని గుర్తించటం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారిలో వస్తోంది. నేడు 40 ఏళ్ల వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి రావటానికి కారణాలు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4.6 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి రావడానికి జన్యుపరమైన కారణాలు, కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు, నిద్రలేమి, ఒత్తిడికి గురవ్వడంతో పాటుగా బీపీ, షుగర్, గుండెజబ్బు వంటి దీర్ఘకాలిక వ్యాధి బాధితులు సైతం వ్యాధి బారిన పడుతున్నారు. రోజువారి పనులు సైతం మర్చిపోతారు.. వ్యాధిగ్రస్తులు రోజు వారి కార్యక్రమాలు మర్చిపోతారు. స్నానం చేయడం, బ్రష్ చేయడం, తిండితినటం కూడా మర్చిపోతారు. వస్తువులను ఎక్కడో పెట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరో దొంగిలించినట్లుగా అనుమానించటం, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం, వస్తువుల పేర్లు మర్చిపోవడం, వాటిని ఏ విధంగా వినియోగించాలో, ఎందుకు కోసం వినియోగించాలో అనే అంశాలను సైతం మర్చిపోవడం రోగిలో కనిపిస్తాయి. ఇంటికి తాళాలు వేయడం, కూరలో ఉప్పువేయడం, పాలల్లో తోడు వేయటం వంటివి మర్చిపోవటం వ్యాధిగ్రస్తుల్లో కనిపిస్తాయి. జీజీహెచ్‌లో మెమరీ క్లినిక్.. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు జీజీహెచ్ న్యూరాలజీ ఓపీ వైద్య విభాగంలో మంగళ, గురు, శనివారాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజూ 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వ్యాధిని పెరగనీయకుండా చేయడం తప్పా పూర్తిగా తగ్గించేందుకు మందు లేదు. జిల్లాలో 25 మంది న్యూరాలజిస్టులు ఉండగా ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్దకు ఇద్దరు అల్జీమర్స్ చికిత్స కోసం సంప్రదిస్తున్నారు. చదవండి: కృష్ణ బిలం వినిపించింది! వైరల్ వీడియో.. సముద్ర అలల ధ్వనిలా -
ఇవి కూడా అల్జైమర్స్ లక్షణాలేనట!!
మామూలు మతిమరపునకు, అల్జైమర్స్కీ తేడా చాలామందికి తెలిసిందే. అయినా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక వస్తువు ఎక్కడ పెట్టామో మరచిపోవడం మతిమరపు అయితే... అసలు ఆ వస్తువనేదొకటుంటుందనే కాన్సెప్ట్నే మరచిపోవడం అల్జైమర్స్. ఉదాహరణగా చెప్పాలంటే... కారు తాళాలను మరచిపోవడం మతిమరపైతే... అసలు కారు డ్రైవింగ్‌నే మరచిపోవడం అలై్జమర్స్ అనుకోవచ్చు. పెద్ద వయసు వచ్చాక చేసే ఆ ఐదు రకాల పనులు అల్జైమర్స్‌ను సూచిస్తాయంటున్నారు లాస్ ఏంజిలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యూఎస్సీ)కు చెందిన పరిశోధకులు. వారు చెప్పేదాన్నిబట్టి... కాస్త వయసు పైబడ్డాక చేసే పనులు వారిలో అలై్జమర్స్ వచ్చే సూచనలను పట్టి ఇస్తుంటాయని యూఎస్సీ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. వాటిల్లో కొన్ని సూచనలివి... 1. దుస్తులు తొడుక్కోవడంలో శుభ్రత పాటించకపోవడం, బట్టలు నీట్‌గా ధరించకపోవడం... వీళ్లు పొందిగ్గా కాకుండా నిర్లక్ష్యంగా, మురికిగా దుస్తులు తొడుక్కుంటుంటారు. 2. పార్కింగ్ చేస్తున్నప్పుడు వాహనాన్ని కుదురుగా కాకుండా... ఎలా పడితే అలా పార్కింగ్ చేస్తుంటారు. 3. మంచి ఆరోగ్యకరమైన హాస్యాన్నీ, మంచి అభిరుచితో ఉండే హ్యూమర్ ను కాకుండా... ఒకరు బాధిస్తుంటే ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందించే తరహా హాస్యాన్ని (బ్యాడ్ టేస్ట్ హ్యూమర్ ను / అపహాస్యాలను) ఇష్టపడుతుంటారు. 4. అందరి ముందూ మాట్లాడే సమయంలో పాటించాల్సిన నియమాలు పాటించకపోవడం వంటివి చేస్తుంటారు. ఉదాహరణకు మాట్లాడే సమయంలో విచక్షణ పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, పిల్లల ముందు మాట్లాడకుండా ఉండాల్సినవి కూడా మాట్లాడటం, వారి ముందర ఉచ్చరించకుండా ఉండాల్సిన అవాచ్యాలను, అశ్లీల పదాలను పలుకుతుంటారు. 5. అన్నింటికంటే ముఖ్యంగా ఇవ్వకూడని వారికి ఇష్టం వచ్చినంత పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తుంటారు. ఇలా చేయడం ద్వారా కొన్ని సమస్యల్లోనూ చిక్కుకుంటుంటారు. కాబట్టి ఓ వయసు దాటక ఇవన్నీ అసంకల్పితంగానూ, చాలా ఎక్కువగానూ చేస్తూ ఉంటే... ఎందుకైనా మంచిది... ఒకసారి డాక్టర్ / న్యూరాలజిస్ట్‌కు చూపించడం చాలా మేలు చేసే అంశం. -
అమ్మమ్మ కష్టంలోంచి పుట్టిన ఆలోచన, ప్రధాని ప్రశంస
సాక్షి, బంజారాహిల్స్: అమ్మమ్మ పడుతున్న అవస్థలను చూసిన ఆ బాలుడి మనసు కరిగిపోయింది. ఆ కష్టాలకు చెక్ పెట్టాలన్న ఆలోచన పుట్టింది. అల్జీమర్ వ్యాధితో తన అమ్మమ్మలాగే కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా బాధపడుతున్నారని తెలుసుకున్న ఆ బాలుడు పరిష్కారం చూపాలని మూడేళ్లు కష్టపడి మొత్తానికి అందులో విజయం సాధించాడు. ⇔ జుబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న చదలవాడ హిమేష్ అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారి ఆరోగ్య పరిరక్షణకు స్మార్ట్ వాచ్ కనిపెట్టి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డ్–2021ను గెలుచుకున్నాడు. ⇔ గుంటూరుకు చెందిన హిమేష్ తండ్రి కిశోర్‌కుమార్ ఆడియో ఇంజినీర్ కాగా, తల్లి సంధ్య గృహిణి. ⇔ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన హిమేష్ ఈ యంత్రాన్ని కనిపెట్టడంలో చేసిన కృషికి సోమవారం ప్రధాన మంత్రి నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌కు కూడా హిమేష్ హాజరయ్యాడు. వృద్ధులను, వికలాంగులను పర్యవేక్షించడానికి స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ తోడ్పడుతుందని హిమేష్ తెలిపాడు. ⇔ ప్రపంచంలో ప్రతి మూడు సెకన్లలో ఒక వ్యక్తి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని, అందులో మా అమ్మమ్మ కూడా ఒకరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి రోగులందరికీ ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పాడు. ⇔ ఈ పరికరాన్ని అల్జీమర్స్ రోగులు ధరిస్తారని, ఇది వారి ఆరోగ్య స్థితిని పరిరక్షించడమే కాకుండా సంచారం, పల్స్, బీపీ వంటి రోగాలను గురించి తెలియజేస్తుందని తెలిపారు. రోగికి ఏదైనా అసాధారణ పరిస్థితి ఎదురైతే ఒక హెచ్చరిక ఇవ్వడమే కాకుండా ఆ సమాచారాన్ని పంపుతుందన్నాని వివరించాడు. ⇔ అల్జీమర్స్ వ్యాధి సోకిన వారి ఆరోగ్య పరిరక్షణ కోసం స్మార్ట్ వాచ్ కనిపెట్టిన చదలవాడ హిమేష్‌ను రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ సోమవారం సత్కరించి బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులను అభినందించారు. -
మతిమరుపు వ్యాధికి మందు వచ్చేసింది
బీజింగ్: తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్‌ను నయం చేసేందుకు చైనాలో కొత్త మందు మార్కెట్లోకి వచ్చింది. దీంతో ఈ వ్యాధితో బాధపడుతున్న కొన్ని లక్షల మందికి ఎంతో ఊరట చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్రౌన్ ఆల్గే (శైవలం) నుంచి సంగ్రహించిన ఈ మందు.. అల్జీమర్స్ వ్యాధికి ప్రపంచంలోనే కనుగొన్న మొట్ట మొదటిదని చైనాలోని నేషనల్ మెడికల్ ప్రోడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పేర్కొన్నారు. జీవీ–971గా పిలుస్తున్న ఈ మందుకు నవంబర్ 2న అధికారికంగా చైనా ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాగా, ఆదివారం నుంచి మార్కెట్లోకి వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఏడాది పాటు వాడాలంటే ఒక రోగికి దాదాపు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మందును చైనాలో మెడికల్ ఇన్సూరెన్స్ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తామని, దీంతో రీయింబర్స్మెంట్ చేసుకునే వీలు కలుగుతుందని షాంఘై గ్రీన్ వ్యాలీ ఫార్మాసూటికల్స్ చైర్మన్ సొంగ్టావో తెలిపారు. -
కొలెస్ర్టాల్‌తో మెదడుకు ముప్పు
లండన్ : అధిక కొవ్వుతో గుండెకు చేటు అని వైద్యులు హెచ్చరిస్తున్న క్రమంలో తాజాగా హై కొలెస్ర్టాల్‌తో అల్జీమర్స్ త్వరగా వచ్చే అవకాశం ఉందని, ఇది మెదడుకూ ముప్పు కలిగిస్తుందని ఓ అథ్యయనం స్పష్టం చేసింది. అల్జీమర్స్ జన్యువులు శరీరంలో ఉన్నాయా, లేదా అనే దానితో సంబంధం లేకుండా రక్తంలో చెడు కొలెస్ర్టాల్ అధికంగా ఉండే వారిలో అల్జీమర్స్ ముప్పు త్వరగా చుట్టుముట్టే అవకాశం ఉందని ఎమరీ యూనివర్సిటీ, అట్లాంటా వెటరన్స్ అఫైర్స్ హాస్పిటల్‌తో కలిసి చేపట్టిన అథ్యయనంలో పరిశోధకులు తేల్చారు. జ్ఞాపకశక్తిని కోల్పోయేందుకు దారితీసే అల్జీమర్స్‌కు దూరంగా ఉండేందుకు ఆరోగ్యకర ఆహారం తీసుకోవడమే మేలని తాజా అథ్యయనం సూచించింది. కాగా ఈ అథ్యయనం కోసం పరిశోధకులు 2215 మంది రక్త నమూనాలనూ, డీఎన్ఏ శాంపిల్స్‌ను పరీక్షించి ఓ అవగాహనకు వచ్చారు. చెడు కొలెస్ర్టాల్ అధికంగా ఉన్న మహిళలు, పురుషులు వారి రిస్క్ ఫ్యాక్టర్స్‌తో సంబంధం లేకుండా యుక్తవయసులోనే వారికి అల్జీమర్స్ ముంపు పొంచిఉందని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయనం పేర్కొంది. -
మతిమరుపును తగ్గించే ఔషధం గుర్తింపు
న్యూయార్క్: అల్జీమర్స్.. పెద్ద వయసు వారిలో కనిపించే మానసిక వ్యాధి. ఇది సోకిన వారు క్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. ఇప్పటివరకు దీనికి సరైన చికిత్సంటూ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో నయం చేయగలిగే మందులంటూ ఏవీ లేవు. కానీ, అవయవ మార్పిడి చేయించుకున్న వారు తీసుకునే ఓ మందు అల్జీమర్స్‌ను కూడా అదుపు చేయగలదని పరిశోధకులు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకుల విశ్లేషణ ప్రకారం.. అవయవ మార్పిడి చేయించుకున్న వారు దుష్ర్పభావాలు సోకకుండా ఉండేందుకు తీసుకునే చికిత్స అల్జీమర్స్ నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స తీసుకున్న 2,644 మంది అమెరికా రోగులను పరిశోధకులు విశ్లేషించారు. వీరిలో ఎనిమిది మందిలో మాత్రమే మతిమరుపు సంబంధమైన లక్షణాలు కనిపించాయి. ఈ సమాచారాన్ని అల్జీమర్స్ అసోసియేషన్ ఫ్యాక్ట్స్, డాటా సమాచారంతో విశ్లేషించారు. దీని ద్వారా అవయవ మార్పిడి వల్ల దుష్ర్పభావాలు సోకకుండా చికిత్స తీసుకున్న వారిలో అల్జీమర్స్ తక్కువగా ఉన్నట్లు, కొందరిలో అసలు ఈ సమస్యే లేనట్లు వారు గుర్తించారు. మతిమరుపు రావడంలో కాల్షిన్యూరిన్ అనే ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుంది. అవయవ మార్పిడి చికిత్సలో తీసుకునే ఔషధాలు ఈ ఎంజైమ్‌ను నియంత్రిస్తాయి. ఫలితంగా వీరికి అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.