లండన్ : అధిక కొవ్వుతో గుండెకు చేటు అని వైద్యులు హెచ్చరిస్తున్న క్రమంలో తాజాగా హై కొలెస్ర్టాల్‌తో అల్జీమర్స్ త్వరగా వచ్చే అవకాశం ఉందని, ఇది మెదడుకూ ముప్పు కలిగిస్తుందని ఓ అథ్యయనం స్పష్టం చేసింది. అల్జీమర్స్ జన్యువులు శరీరంలో ఉన్నాయా, లేదా అనే దానితో సంబంధం లేకుండా రక్తంలో చెడు కొలెస్ర్టాల్ అధికంగా ఉండే వారిలో అల్జీమర్స్ ముప్పు త్వరగా చుట్టుముట్టే అవకాశం ఉందని ఎమరీ యూనివర్సిటీ, అట్లాంటా వెటరన్స్ అఫైర్స్ హాస్పిటల్‌తో కలిసి చేపట్టిన అథ్యయనంలో పరిశోధకులు తేల్చారు.
జ్ఞాపకశక్తిని కోల్పోయేందుకు దారితీసే అల్జీమర్స్‌కు దూరంగా ఉండేందుకు ఆరోగ్యకర ఆహారం తీసుకోవడమే మేలని తాజా అథ్యయనం సూచించింది. కాగా ఈ అథ్యయనం కోసం పరిశోధకులు 2215 మంది రక్త నమూనాలనూ, డీఎన్‌ఏ శాంపిల్స్‌ను పరీక్షించి ఓ అవగాహనకు వచ్చారు. చెడు కొలెస్ర్టాల్ అధికంగా ఉన్న మహిళలు, పురుషులు వారి రిస్క్ ఫ్యాక్టర్స్‌తో సంబంధం లేకుండా యుక్తవయసులోనే వారికి అల్జీమర్స్ ముంపు పొంచిఉందని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment