అల్జీమర్స్.. దాదాపు 60శాతం మంది వృద్దులు ఎక్కువగా బాధపడుతున్న సమస్య ఇది. అల్జీమర్స్ అంటే మెదడు దెబ్బతినడం లేదా జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే వ్యాధి. అల్జీమర్స్ ఉన్న వ్యక్తికి రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి వారు సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది? అన్నది ప్రముఖ వైద్యులునిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే...
అల్జీమర్స్ ఏ వయసువారికి?
అల్జీమర్స్ ఎందుకొస్తున్నది ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. మెదడులో ప్రొటీన్ గార పోగుపడటం దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మెదడు కణాలు తమను తాము శుభ్ర పరచుకునే సామర్థ్యం మందగించటం దీనికి కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్జీమర్స్ వ్యాధి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి ఎక్కువగా 65ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది.అల్జీమర్స్ వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా వంశపారం వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు ఇలా ఉంటాయి
- ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం,జ్ఞాపకశక్తి తగ్గడం
- రోజువారీ విషయాలను మర్చిపోవడం
- కుటుంబసభ్యుల పేర్లు కూడా మర్చిపోవడం
- వస్తువులు ఎక్కడ పెట్టారో గుర్తులేకపోవడం
- ఏకాగ్రత పెట్టలేకపోవడం, తీవ్రమైన గందరగోళం
- రాయడం, చదవడం,మాట్లాడేటప్పుడు ఇబ్బందులు
- కొద్ది నిమిషాల కింద జరిగిన విషయాలను కూడా మర్చిపోవడం
- పట్టరాని భావోద్వేగాలు, వ్యక్తిగత మార్పులు
అల్జీమర్స్‌కి ఆయుర్వేదంలో చికిత్స ఇలా..
►ఉసిరిక పొడి 2 గ్రాములు, నువ్వుల పిండి 2 గ్రాములు, తేనె, నెయ్యిలను కొద్ది కొద్దిగా తీసుకుని కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు రెండు సార్లు 40 రోజుల పాటు తీసుకోవాలి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది.
► ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగుతుండాలి. లేదా ఉసిరిక పొడిని 2 గ్రాముల మోతాదులో తేనెతో లేదా నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. ఉసిరికాయలతో చేసే మురబ్బాలను కూడా తినవచ్చు.
►అతి మధురం వేర్లను మెత్తగా నూరి పొడి చేసి 1 గ్రాము మోతాదులో తీసుకుని దానికి నీళ్లు కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలి.
► ప్రతి రోజూ 5-10 నానబెట్టిన బాదం గింజలను తింటుండాలి.
► తిప్పతీగ రసాన్ని రోజుకు 10-20 ఎంఎల్ మోతాదులో రెండు సార్లు తీసుకోవాలి.
► శంఖపుష్పి మొక్క పంచాంగ స్వరసాన్ని 10 ఎంఎల్ మోతాదులో తీసుకుని దానికి తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది..
-నవీన్ నడిమింటి
ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment