Alzheimer
-
సర్జరీ లేకుండా మతిమరుపును పోగొట్టొచ్చు, శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం
విద్యుత్ షాక్‌ని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని శాస్త్రవేత్తలు కొత్తరకం ప్రయోగం చేశారు. హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందట. అంతేకాకుండా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే ఈ చికిత్స నిర్వహించనున్నట్లు సైంటిస్టులు తెలిపారు. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్ ఒకటి. అల్జీమర్స్ కారణంగా మానసిక, ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి. ఈ న్యూరోలాజిక్ డిజార్డర్ కారణంగా బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటాయి. కాలక్రమేణా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి. మెదడులోని టెంపోరలో అనే భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి. అల్జీమర్స్ బారినపడినవాళ్ల లో ఈ కణాలు సన్నగా, చిన్నగా అవుతాయి. దాంతో టెంపోరల్ చిన్నగా అవుతుంది. అంతేకాదు 'హైపోమెటబాలిజం' ఉంటుంది. అంటే గ్లూకోజ్ తక్కువ అందుతుంది. దాంతో మెదడు చురుకుదనం కోల్పోతుంది. దాంతో ఆలోచనా శక్తి తగ్గిపోవడమే. కాకుండా జ్ఞాపకాలు చెదిరిపోయి, మతిమరుపు మొదలవుతుంది. హిప్పోకాంపస్లోని న్యూరాన్లను ఉత్తేజపరిచేందుకు కొత్త హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని రీసెంట్గా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ (ICL) శాస్త్రవేత్తల నేతృత్వంలో టెంపోరల్ ఇంటర్ఫెరెన్స్ (TI) బ్రెయిన్ స్టిమ్యులేషన్‌తో మతిమరుపును పోగొట్టచ్చని కనిపెట్టారు. ఇందులో భాగంగా హై ఫ్రీక్వెన్సీ విద్యుత్ కణాలకు బ్రెయిన్‌కు పంపించి జ్ఞాపకశక్తిని తిరిగి పొందేందుకు సహాయపడుతుందట. ఇందులో భాగంగా2,000 Hz,2,005 Hz, వద్ద విద్యుత్ కణాలను పంపిస్తాయి. ఇది ఒకరకంగా కరెంట్ షాక్ లాంటిదే. 5-Hz కరెంట్‌తో అదే ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. దీని వల్ల సెల్-పవర్ చేసే మైటోకాండ్రియాను పునరుజ్జీవింపజేస్తాయని, ఇది మతిమరుపును పోగొడుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో వివరించారు.''ఇప్పటివరకు మెదడుకు సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తితే రోగికి ఎలక్ట్రోడ్లను శస్త్రచికిత్స ద్వారా అమర్చాల్సి వచ్చేది. కానీ ఈ హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో ఎలాంటి నొప్పిలేకుండా రోగికి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేలా చేయొచ్చు.'' అని సైంటిస్ట్ నిర్ గ్రాస్మాన్ తెలిపారు. ఈ టెక్నిక్‌తో సర్జరీ అవసరం లేకుండా మనిషి మెదడులోని కణాలను ప్రేరేపించడం సాధ్యమవుతుంది. ఇది బ్రెయిన్ సెల్స్‌ను ప్రభావితం చేస్తుంది అని పేర్కొన్నారు. -
అమ్మమ్మలకు అండగా.. మతిమరుపుతో బాధపడేవాళ్లకు ఇది బెస్ట్ సొల్యూషన్
మన చుట్టూ మనకు తెలియకుండానే ఎంతో మంది రకరకాల బాధలకు లోనవుతుంటారు. వారిలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల సమస్యలకు సరైన పరిష్కారం తెలియక ఇబ్బందులు పడుతుంటారు. వారి మానాన వారిని అలాగే వదిలేయడం కన్నా పరిష్కారాన్ని కనుగొంటాను అనుకున్నాడు. తనదైన మార్గంలో ప్రయత్నించాడు. విజయం సాధించాడు. సత్కారాలను పొందుతున్నాడు హైదరాబాద్ వాసి హేమేష్ చదలవాడ. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలు అందించిన 21 ఏళ్ల లోపు 20 మంది యువ సాధకులను ఢిల్లీలో మొన్న జరిగిన ‘అన్‌స్టాపబుల్ 21’ వేదికగా సత్కరించారు. హ్యూమన్ స్టడీస్, సైన్స్, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్, సోషల్ ఇంపాక్ట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఏడు రంగాలలో ప్రతిభావంతులైన యువతకు ఈ సత్కారాన్ని అందజేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల హేమేష్ చదలవాడ ఎలక్ట్రానిక్స్ రంగంలో కనబరిచిన ప్రతిభకు గుర్తింపు పొందాడు. వృద్ధులకు సహాయం.. హేమేష్ పన్నెండేళ్ల వయసు నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగంలో గణనీయమైన ప్రతిభను చూపుతున్నాడు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న అమ్మమ్మను చూసి ఆమెకు ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. తన ఆలోచనల గురించి హేమేష్ చెబుతూ ‘నడిచేటప్పుడు అమ్మమ్మ అడుగులు తడబడుతుండేవి. మతిమరపు ఉండేది. ఆమెకు తన మీద తనకు కంట్రోల్ ఉండేది కాదు. కొన్నిసార్లు అర్థరాత్రి మంచంపై నుంచి లేచి ఎటో వెళ్లిపోయేది. దీంతో ఆమెను కనిపెట్టి ఉండటం కష్టమయ్యేది. అమ్మమ్మకు, ఆమెను చూసుకునే మాకూ ఇదో సవాల్‌గా ఉండేది. కొన్ని అందుబాటులో ఉన్న డివైజ్‌లను ప్రయత్నించి చూశాం. కానీ, ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. అమ్మమ్మకు సాయపడే డివైజ్‌ను నేనే సొంతంగా తయారుచేయాలనుకున్నాను’ అని తనలో రూపుదిద్దుకున్న ఆలోచనను వివరిస్తాడు. హేమేష్ కృషి, పట్టుదల, అంకితభావానికి అతని తల్లిదండ్రులు కిశోర్, సంధ్యలు ప్రోత్సాహం అందించారు. పరికరం ఎలా పనిచేస్తుందంటే.. ఈ పరికరం వాచ్‌లాగా మణికట్టుకూ కట్టుకోవచ్చు. బ్యాడ్జ్గానూ ధరించవచ్చు. రోగి నడక, భంగిమ, శరీర ఉష్ణోగ్రత, నాడిని పర్యవేక్షిస్తుంది. నీళ్లు జారిపడుతుండే శబ్దాన్ని కూడా గుర్తించగలదు. మనిషి దూరంగా తిరుగుతున్నప్పుడు లేదా పడిపోవడం వంటి ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే తెలియజేస్తుంది. ఇంకా అలారంలో ‘పిల్‌బాక్స్’ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది రోగులు వారి మందులు తీసుకునే సమయం వచ్చినప్పుడు హెచ్చరికలను పంపుతుంది. ‘ఈ డివైజ్ మా అమ్మమ్మ కోసం తయారు చేసినప్పుడు ఇంటర్నెట్ సరైన మార్గం చూపింది. అయితే, ఈ పరికరం పూర్తయ్యేసరికి అమ్మమ్మ చనిపోయారు’ అని హేమేష్ తెలిపాడు. ఇప్పుడీ అబ్బాయి 12వ తరగతి చదువుతున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్‌తో ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ రంగంలో మరిన్ని అడుగులు వేస్తున్నట్టుగా వివరించాడు. 2021లో ప్రధానమంత్రి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నాడు. పేరున్న కంపెనీల నుంచి గ్రాంట్లను పొందాడు. – నిర్మలారెడ్డి -
ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే అల్జీమర్స్ కావొచ్చు
అల్జీమర్స్.. దాదాపు 60శాతం మంది వృద్దులు ఎక్కువగా బాధపడుతున్న సమస్య ఇది. అల్జీమర్స్ అంటే మెదడు దెబ్బతినడం లేదా జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే వ్యాధి. అల్జీమర్స్ ఉన్న వ్యక్తికి రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి వారు సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది? అన్నది ప్రముఖ వైద్యులునిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే... అల్జీమర్స్ ఏ వయసువారికి? అల్జీమర్స్ ఎందుకొస్తున్నది ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. మెదడులో ప్రొటీన్ గార పోగుపడటం దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మెదడు కణాలు తమను తాము శుభ్ర పరచుకునే సామర్థ్యం మందగించటం దీనికి కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్జీమర్స్ వ్యాధి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి ఎక్కువగా 65ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది.అల్జీమర్స్ వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా వంశపారం వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు ఇలా ఉంటాయి ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం,జ్ఞాపకశక్తి తగ్గడం రోజువారీ విషయాలను మర్చిపోవడం కుటుంబసభ్యుల పేర్లు కూడా మర్చిపోవడం వస్తువులు ఎక్కడ పెట్టారో గుర్తులేకపోవడం ఏకాగ్రత పెట్టలేకపోవడం, తీవ్రమైన గందరగోళం రాయడం, చదవడం,మాట్లాడేటప్పుడు ఇబ్బందులు కొద్ది నిమిషాల కింద జరిగిన విషయాలను కూడా మర్చిపోవడం పట్టరాని భావోద్వేగాలు, వ్యక్తిగత మార్పులు అల్జీమర్స్కి ఆయుర్వేదంలో చికిత్స ఇలా.. ►ఉసిరిక పొడి 2 గ్రాములు, నువ్వుల పిండి 2 గ్రాములు, తేనె, నెయ్యిలను కొద్ది కొద్దిగా తీసుకుని కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు రెండు సార్లు 40 రోజుల పాటు తీసుకోవాలి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. ► ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగుతుండాలి. లేదా ఉసిరిక పొడిని 2 గ్రాముల మోతాదులో తేనెతో లేదా నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. ఉసిరికాయలతో చేసే మురబ్బాలను కూడా తినవచ్చు. ►అతి మధురం వేర్లను మెత్తగా నూరి పొడి చేసి 1 గ్రాము మోతాదులో తీసుకుని దానికి నీళ్లు కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ► ప్రతి రోజూ 5-10 నానబెట్టిన బాదం గింజలను తింటుండాలి. ► తిప్పతీగ రసాన్ని రోజుకు 10-20 ఎంఎల్ మోతాదులో రెండు సార్లు తీసుకోవాలి. ► శంఖపుష్పి మొక్క పంచాంగ స్వరసాన్ని 10 ఎంఎల్ మోతాదులో తీసుకుని దానికి తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది.. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు -
నాన్నల కంటే అమ్మల్లోనే ఈ సమస్య ఎక్కువ..ఇవీ కారణాలు! ఎలా నివారించాలి?
అమ్మకు మతిమరుపు ఎక్కువవుతోంది. అమ్మలో అయోమయం పెరుగుతోంది. అమ్మలో ఆ మార్పు ఎందుకు? అల్జైమర్స్ కావచ్చు. World Alzheimer Day 2022: ఒక వయసు దాటాక అమ్మా నాన్నల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్నల కంటే అమ్మలే ఎక్కువగా అల్జైమర్స్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి సందర్భంలో వారితో ఎలా మెలగాలి? వారికి ఎలాంటి సపోర్ట్ అందించాలి? పెద్దల మీద ఒక కన్ను వేసి వారికి వచ్చే ఈ ఇబ్బందిని సకాలంలో ఎలా గుర్తించాలి?తెలుసుకోక తప్పదు. ‘అల్జైమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ (ఏ.ఆర్.డి.ఎస్.ఐ) ప్రకారం 2030 నాటికి 75 లక్షల మంది భారతదేశంలో అల్జైమర్స్ బారిన పడి ఉంటారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే 65 ఏళ్లు దాటిన తర్వాత ఆరుమంది మహిళలలో ఒకరికి ఈ రుగ్మత సోకే అవకాశం ఉంటే పురుషులలో 11 మందిలో ఒకరికి దీని ప్రమాదం పొంచి ఉంటుంది. అంటే స్త్రీలలోనే ఎక్కువమంది అల్జైమర్స్ బారిన పడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయే. స్త్రీలే ఎందుకు? ఇవీ కారణాలు: ►డిప్రెషన్‌కు, అల్జైమర్స్‌కు నేరుగా సంబంధం ఇంకా తేలాల్సి ఉన్నా డిప్రెషన్ స్త్రీలలో ఎక్కువ కనుక వారికి ఈ రుగ్మత సోకుతున్నదనేది నిపుణుల పరిశీలన. డిప్రెషన్ వల్ల జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడు రసాయనాలు ప్రభావితమయ్యి మతిమరుపు, జ్ఞాపకాలు నశించడం జరుగుతున్నదని అంటున్నారు. ►అలాగే వ్యాయామం లేకపోవడం. పురుషుల కంటే స్త్రీలకు వ్యాయామం తక్కువ కావడం కూడా అల్జైమర్స్‌కు కారణం. పురుషులు ఎంతో కొంత వ్యాయామం కోసం బయటకు వెళతారు. కాని స్త్రీలు ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. వారికి వ్యాయామం చేసే సమయం కూడా ఉండదు. ►ఆరోగ్యకరమైన శరీరం మెదడును కూడా చురుగ్గా ఉంచుతుంది కనుక అల్జైమర్స్ పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఇంట్లో బాధ్యతలు కూడా స్త్రీలను తెలియని ఒత్తిడికి గురి చేస్తాయి. కుటుంబ సభ్యులలో ఎవరి ఆరోగ్యం బాగలేకపోయినా వారిని చూసుకోవాల్సిన, ఎవరికి ఏ సమస్య వచ్చినా దాని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత స్త్రీలలో ఎక్కువ కనిపిస్తుంది. ►వారికి తప్పని ఈ పని వల్ల కూడా మెదడుపై అనవసర ఒత్తిడి పడి అల్జైమర్స్‌కు కారణం కావచ్చు. ఇవి కాకుండా స్త్రీలలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోములు ఉంటాయి. ఇందువల్ల కూడా అల్జైమర్స్ వస్తున్నదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ►మెదడు నిర్మాణం కూడా పురుషులకు, స్త్రీలకు కొద్దిపాటి వ్యత్యాసమూ ఒక కారణం కావచ్చు. మరో విషయం ఏమంటే చురుగ్గా ఉండే మెదడు కలిగిన వారికి అల్జైమర్స్ తక్కువగా వస్తుంది. అంటే మెదడు నిరంతరం పని చేసేవారికి ఈ రుగ్మత సమస్య తక్కువ. ►కాని తరాల వెంబడి స్త్రీలను విద్యకు దూరం చేయడం, వారి ఆలోచనలు పరిమితం చేయడం, కూరా నారకు మాత్రమే ఆలోచిస్తే చాలు అన్నట్లుగా చూడటం వల్ల కూడా స్త్రీలకు ఈ రుగ్మత వస్తున్నదని అంటున్నారు. ►పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవించడం వల్ల కాలం గడిచే కొద్ది ఈ రుగ్మత బారిన వీరు పడుతుండటం మరో అనివార్యత. కాబట్టి 65 ఏళ్లు దాటాక పురుషుల గురించి కంటే అల్జైమర్స్ విషయంలో స్త్రీల గురించి మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదాన్ని ఎలా నివారించవచ్చు? ►యాభైలకు సమీపిస్తున్నప్పుడే జీవన విధానాలను మార్చుకోవడం, కళాత్మకమైన పనుల్లో నిమగ్నమవడం, పజిల్స్ నింపడం, సమతుల ఆహారం తీసుకోవడం, బరువు పెరక్కుండా చూసుకోవడం, మంచి పోషకాలుండే పండ్లు తినడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం. ►నిద్రలేమి మెదడు పై ప్రభావం చూపుతుంది. ఏ వయసులో అయినా ఏదో ఒక కోర్సు చదవడం. లేదా ఏదో ఒక క్లాసుకు (ఇంగ్లిష్, డాన్స్, పెయింటింగ్) హాజరు కావడం. బి.పి, డయాబెటిస్లను అదుపులో పెట్టుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, నలుగురితో ఎక్కువ కలవడం. సహాయం ►ఈ రుగ్మత ఉన్నవారిని కనిపెట్టుకుని ఉండటమే అసలైన సహాయం. వైద్యపరంగా చేసేది పెద్దగా లేకపోయినా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల, వాళ్లున్న గదుల్లో పోస్టర్లు ఫొటోలు పెట్టడం వల్ల, బాత్రూమ్లో సూచనలు అంటించడం వల్ల, అలారంలు పెట్టి వారిని ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకునేలా చేయడం వల్ల, పగటి పూట ఎండలో తిప్పుతూ నిద్ర తక్కువ పోయేలా చేసి రాత్రిళ్లు త్వరగా నిద్రపోయేలా చేయడం వల్ల ఇలాంటి బాధితులకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ►అల్జైమర్స్ అంటే పెద్దలు మళ్లీ పసిపాపలుగా మారడం. పిల్లలు వారికి తల్లిదండ్రుల అవతారం ఎత్తడం. సమాధానం లేని ఈ రుగ్మతను ప్రేమ, బాధ్యతలతోనే జయించాలి. ఎలా గుర్తించాలి? అల్జైమర్స్ సూచనలు ఎలా గమనించాలి? అల్జైమర్స్ వచ్చిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ►తరచూ మతిమరుపు ►స్థలకాలాల ఎరుక తగ్గుతుంది. ►మూడ్స్ తరచూ స్థిరంగా మారుతుంటాయి. ►ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తికమక ►నలుగురితో కలవకపోవడం ►రోజువారి పనులు చేసుకోవడంలో కూడా అయోమయం చదవండి: Urinary Problems: గర్భసంచి జారిందన్నారు.. ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గుతుందా? -
బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ?
కొన్ని జబ్బు లక్షణాలు వ్యాధి రాకముందే బయటపడతాయి. తాము రాబోతున్నామంటూ హెచ్చరికలు జారీచేస్తాయి. జాగ్రత్తపడమంటూ చెప్పి, నివారించుకునేందుకు అవకాశాలిస్తాయి. ఆ వార్నింగ్ సిగ్నల్స్‌ను ఎలా గుర్తించాలో ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తున్నారు. వాటిని నిలువరించే మార్గాలూ చెబుతున్నారు. తెలుసుకుందాం... రండి. ప్రశ్న : వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులేమైనా ఉన్నాయా? జ: న్యూరో విభాగానికి సంబంధించిన చాలా జబ్బులు ముందస్తు వార్నింగ్ ఇచ్చాకే వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్, ఫిట్స్, పక్షవాతం, అల్జైమర్స్ వంటివి. వీటిల్లో మైగ్రేన్ బాధాకరమే గానీ... చాలావరకు నిరపాయకరం. కానీ పక్షవాతం వల్ల అవయవాలు పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇతరులపై జీవితాంతం ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. ఫిట్స్ కూడా ప్రమాదమే. అందుకే ముందస్తు హెచ్చరికలు చేసే ఆ వ్యాధుల వార్నింగ్ సిగ్నల్స్ అర్థం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలను నివారించుకోవచ్చు. ప్రశ్న : పక్షవాతం ముందస్తు సిగ్నల్స్ ఇస్తుందా? అదెలా? జ: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్)లో చేయిగానీ, కాలుగానీ, లేదా రెండూ పడిపోవడం గానీ, ఒకవైపు చూపు తగ్గిపోవడం, మూతి వంకరపోవడం, మాట పడిపోవడం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తాత్కాలికంగా పది నిమిషాల నుంచి ఒక గంట లోపు వస్తే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అంటారు. ఈ టీఐఏ లక్షణాలు... అసలు పక్షవాతం కంటే కొంత ముందుగానే కనపడవచ్చు. ముందుగా వచ్చే ఈ ‘టీఐఏ’ తర్వాత బాధితులు పూర్తిగా కోలుకుంటారు. కానీ ఆ సిగ్నల్స్ పెడచెవిన పెట్టి... అసలు పక్షవాతం వచ్చే వరకు నిర్లక్ష్యం చేస్తే కోలుకోడానికి చాలా టైమ్ పట్టవచ్చు లేదా ఆ నష్టం జీవితాంతం బాధించవచ్చు. ప్రశ్న : బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ? జ: సాధారణంగా 50 ఏళ్లు దాటి... షుగరు, హైబీపీ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికీ, ఊబకాయం ఉన్నవారికీ స్ట్రోక్ ముప్పు ఎక్కువ. ప్రశ్న : మైగ్రేన్‌లో ఏయే ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి? జ: మైగ్రేన్ తలనొప్పి రెండు విధాలుగా వస్తుంది. మొదటిదానిలో తలనొప్పికి ముందర కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘మైగ్రేన్ విత్ ఆరా’ అంటారు. దాదాపు 20శాతం మందిలో ‘ఆరా’ కనిపిస్తుంది. రెండో రకంలో నేరుగా తలనొప్పి వస్తుంది. ‘మైగ్రేన్ ఆరా’లో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. ∙తలనొప్పి వచ్చే గంటలోపు చూపు కొద్దిగా మందగిస్తుంది. ∙కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం, శబ్దాలు వినడంలో ఇబ్బంది కలగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙చుట్టూరా ఉన్నవి కనిపించకుండా, ముందు ఉన్నవే కనిపిస్తాయి. దీన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు. ∙అరుదుగా ఏదో ఓ పక్క కాలు / చేతిలో బలం తగ్గడం. ∙త్వరగా కోపం రావడం, చికాకు పడటం వంటివి కనిపించిన గంట లేదా రెండు గంటల్లోపు అసలు తలనొప్పి మొదలవుతుంది. ప్రశ్న : మైగ్రేన్‌కు చికిత్స ఎలా? జ: దీనికి రెండు రకాలుగా చికిత్స అందిస్తారు. మొదటిది తీక్షణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులు. ఇవి ఎంత త్వరగా తీసుకుంటే, అంత త్వరగా ఉపశమనం కలుగుతుంది. రెండోవి... మళ్లీ రాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు. ప్రశ్న : ఫిట్స్‌లో కూడా ముందస్తు సిగ్నల్స్ కనిపిస్తాయా? జ: మూర్ఛను వైద్యపరిభాషలో ఫిట్స్ అనీ, ఆ జబ్బును ఎపిలెప్సీ అని అంటారు. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు చల్లటి నీటితో ఒళ్లు తుడుస్తూ, శరీర ఉష్ణోగ్రత తగ్గించి ఫిట్స్ రాకుండా నివారించుకోవచ్చు. కొంతమందిలో ఫిట్స్ వచ్చే కొన్ని నిమిషాల నుంచి గంటల ముందుగా తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లు జలదరించడం (జర్క్స్), కనురెప్పలు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు ఈ లక్షణాలను గమనించలేరు. కాబట్టి పెద్దలే వాటిని గమనించాలి. ముఖ్యంగా ముందురోజు నిద్ర సరిపోకపోవడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వంటి పరిస్థితుల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రశ్న : అల్జైమర్స్ జబ్బును ముందస్తుగా గుర్తుపట్టడం ఎలా? జ: అల్జైమర్స్‌లో ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం – కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలకు ముందుగా జరిగిపోయిన విషయాలను మరచిపోతుండటం. (వీళ్లలో చిన్నప్పటి విషయాలు మాత్రం బాగా గుర్తుండవచ్చు). తర్వాత క్రమంగా దారులు, తేదీలు, పండుగలు మరచిపోతారు. కొత్త విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోలేరు. క్రమంగా ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు. సరైన సమయంలోనే ఈ లక్షణాలను గుర్తించలిగితే... సరైన చికిత్సతో... వ్యాధి పెరుగుదలనూ, తీవ్రతనూ నియంత్రించవచ్చు. ఇక్కడ చెప్పిన ఏ వార్నింగ్ కనిపించినా వెంటనే ‘న్యూరో ఫిజీషియన్’ను సంప్రదించి, తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకుంటే... ఈ జబ్బులను చాలావరకు రాకముందే నివారించవచ్చు. - డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
వీళ్లకి అల్జీమర్సా.. అమేజింగ్ వీడియో
-
Alzheimer: అల్జీమర్సా..ఈ వీడియో చూస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద వయసు వారిన ఎక్కువగా బాధించే వ్యాధుల్లోఅల్జీమర్స్. మెదడులో కణాలు చనిపోవడంతో సంభవించే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్ధ్యం దెబ్బతింటాయి. బాగా సన్నిహితంగా ఉండేవారిని తప్ప కుటుంబ సభ్యులను కూడా మర్చిపోతారు. దీంతో ఈ అల్జీమర్స్‌కు గురైనవారితోపాటు, వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి సంగీతం మంచి సాధమని ఇదివరకే పరిశోధనలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో అల్జీమర్స్ బారిన పడిన కొంతమంది సంగీత సాధనలో, లయబద్ధంగా, శృతి తప్పకుండా ఏ మాత్రం తడబడకుండా ఆయా వాయిద్యాలను వాయించడంలో అద్భుతంగా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. తమ వారిని తలుచుకొని కొంతమంది భావోద్వేగానికి లోనవుతోంటే.. వారి ప్రతిభకు మేని పులకరించిందంటూ మరి కొంతమంది కమెంట్ చేస్తున్నారు. సంగీతం మానవజాతి విశ్వ భాష అంటూ సీజీఓ జావా, జుబిన్ మెహతాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ ఆర్కెస్ట్రా కండక్టర్, సంగీత దర్శకుడు జుబీన్ మెహతా, అమెరికా ఆర్కెస్ట్రా కండక్టర్, సీజీ ఓజావా ఈ సంగీత కార్యక్రమానికి నేతృత్వం వహించడం విశేషం. హారున్ రషీద్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. స్వయంగా అల్జీమర్స్ బాధితుడైన సీజీ ఓజావా సంగీతాన్ని ఏమాత్రం మర్చిపోలేదంటూ కమెంట్ చేశారు. అయితే 2016 నాటి వీడియో ఇదనీ, సీజీ ఓజావాకు అల్జీమర్స్ వ్యాధిలేదనీ, క్యాన్సర్‌తో బాధపడుతున్నారని మరో యూజర్ వివరణ ఇచ్చారు. -
అల్జీమర్స్‌కు అద్భుత ఔషధం
న్యూఢిల్లీ : అల్జీమర్స్ వ్యాధి గురించి నేడు అందరికి తెల్సిందే. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు భారతీయుల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ జబ్బు ప్రధాన లక్షణం. అతి మతి మరుపు. తన ఇంటివారు, ఇరుగు పొరుగు, పరిసరాలను ఎప్పటికప్పుడు మరచిపోవడమే కాకుండా తన గురించి తాను మరచిపోవడాన్ని ‘అల్జీమర్స్’ లక్షణాలుగా వైద్యులు చెబుతారు. ఈ వ్యాధి సోకిన వారు బయటకు వెళితే మళ్లీ వారంతట వారు ఇంటికి వచ్చే అవకాశం లేదన్న కారణంగా చాలా మంది వ్యాధిగ్రస్థులను ఇంటికో, ఇంట్లోని ఓ గదికో పరిమితం చేస్తారు. డిమెన్షియా వ్యాధి ముదురితే అల్జీమర్స్ వస్తుంది. డిమెన్షియా వ్యాధి వచ్చినవారు ఇతరులు, పరిసరాల గురించి మరచి పోతారు గానీ, తన గురించి జ్ఞాపకం ఉంటుంది. తన గురించి కూడా మరచిపోవడాన్ని అల్జీమర్స్‌గా పేర్కొంటారు. డిమెన్షియా వ్యాధికి తాము ఔషధాన్ని కనిపెట్టామని, తద్వారా అల్జీమర్స్ వ్యాధిగా అది ముదరకుండా నిరోధించగలమని అమెరికాకు చెందిన ఆలోపతి మందుల దిగ్గజ సంస్థ ‘బయోజెన్ ఇన్కార్పొరేషన్’ సోమవారం రాత్రి వెల్లడించింది. ఈ ఔషధ మాత్రల కోసం వచ్చే ఏడాది మొదట్లో అమెరికా, యూరప్, జపాన్ దేశాల్లో లైసెన్స్‌కు దరఖాస్తు చేస్తామని, అల్జీమర్స్‌కు సంబంధించి అదే ఓ గొప్ప విప్లవం అవుతుందని, తాము ఈ పరిశోధనల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించామని, మరే సంస్థ ఇంతగా ఖర్చుపెట్టలేదని, లైసెన్స్ దరఖాస్తు కోసం కనీసం ముందుకు వచ్చే అవకాశం లేదని కంపెనీ సీఈవో మైఖేల్ వోనత్సోస్ వ్యాఖ్యానించారు. అల్జీమర్స్‌కు ఇదో అద్భుత ఔషధమని చెప్పవచ్చని ఆయన అన్నారు. -
అందుకే ‘బాబుకో నమస్కారం’
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కొక్కరు దూరం కావడాన్ని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవాలను అంగీకరించలేని ఆయన... తప్పు తనది కాదంటూ మళ్లీ ఎదురు దాడికి దిగుతున్నారు. అంతేకాకుండా తన నియంతృత్వ పోకడలు బయటపెడుతున్న నేతలను డబ్బు కోసమే పార్టీలు మారుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ వలసలు వెల్లువెత్తుడటంతో చంద్రబాబు తీవ్ర నిరాశా నిస్పృహలతో సభ్యత, సంస్కారాన్ని మరిచిపోయారేమో అనిపిస్తోంది. చంద్రబాబుపై విశ్వాసం కోల్పోయి ‘బాబుకో నమస్కారం’ అంటూ టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్ సీపీలో చేరేందుకు వస్తుండటంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. స్వార్థం కోసం పార్టీలు మారినవారిని ప్రజలు ఆదరించరంటూ నీతి సూత్రాలు వల్లిస్తున్న చంద్రబాబుకు... గతం గుర్తుకు రావడం లేదా, లేక నిజంగానే ఆయన అల్జీమర్స్‌తో బాధపడుతున్నా అనే అనుమానం కలుగుతోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గుర్తుతో గెలిచి... ఆ తర్వాత ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు భారీ తాయిలాలు ఇవ్వడమే కాకుండా వారిలో ఓ నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీకి రాజీనామా చేయకుండానే... టీడీపీ కండువా కప్పుకున్నారు. మరి అప్పుడు నోరు మెదపని చంద్రబాబు ఇప్పుడు మాత్రం ...అయ్యో మా నేతలను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ ప్రతిపక్షంపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అప్పట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలే స్వయంగా తమకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు స్వయంగా ఒప్పుకున్న విషయం తెలిసిందే. డబ్బు సంచులతో రాజకీయాలను వ్యాపారంగా మార్చిన చంద్రబాబు మాత్రం తన అభివృద్ధిని చూసే వాళ్లంతా టీడీపీలోకి వచ్చారని చెప్పుకోవడం హాస్యాస్పదమే. టీడీపీలోకి వచ్చేవాళ్లంతా తన విజన్ చూసి వస్తారంటూ... అదే పార్టీని వీడితే మాత్రం...స్వార్థం, అమ్ముడు పోయారంటూ విమర్శలు చేయడం దిగజారుడు తనమే. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌పై పదేళ్లు అధికారం ఉన్నప్పటికీ ‘ఓటుకు కోట్లు’ కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ అడ్డంగా దొరికిపోయి ఆ తర్వాత అమరావతికి మర్చిన చంద్రబాబు నేను ఏపీలోనే ఉంటున్నానని మీడియా సాక్షిగా డప్పుకొట్టుకోవడం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లాంటిదే. నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుందనే దానికి ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక టీడీపీని వీడుతున్న నేతలు... ఆ పార్టీలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఉంటుందనే చెప్పే మాటలు కూడా అక్షర సత్యమే. చంద్రబాబు నాయుడే స్వయంగా ’దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అంటూ తన మనసులో మాటను గతంలోనే బయటపెట్టేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తాను ఏది చెప్పినా, ఏం చేసినా పిచ్చి జనం నమ్మేస్తారనే భ్రమలో నుంచి ఎప్పుడు బయటపడతారో మరి. -
బాసూ... మెమరీ లాసు!
గుర్తుండటం లేదు... గౌతమికి ఏమీ గుర్తుండటం లేదు. ఏయే పనులు చేశారో ఆమెకు గుర్తుండటం లేదు. అంతా మర్చిపోతున్నారు. మైండ్‌లో ఏ డేటా సరిగా స్టోర్ కావడం లేదు. గౌతమికి మెమరీ లాస్ జబ్బు వచ్చేసిందట. అల్జీమర్స్ అంటారు కదా... ఆ జబ్బే! అయితే, చుట్టుపక్కల వారికి ఈ సంగతి తెలియదు. ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్‌లో. కుక్కు సురేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మలయాళ సినిమా ‘ఈ’లో అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్న మ్యూజిక్ టీచర్‌గా గౌతమి నటిస్తున్నారు. -
ఫేస్బుక్ ద్వారా వినూత్న స్టడీ, వాలంటీర్లు కావాలి
న్యూయార్క్: మతిమరుపు అనేది మనిషి జీవితంలో ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వయసుమళ్లిన వారిపై దాడి చేసిన వారి జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వ్యాధి అల్జీమర్స్. ఈ అల్జీమర్స్ వ్యాధి బారినపడ్డ రోగి జీవితంలో అనూహ్యంగా ఎంత గందరగోళం ఏర్పడుతుందో వారి సంరక్షకులపై అంతకంటే ఎక్కువ ఒత్తిడి నెలకొంటుంది. ఇరవై నాలుగ్గంటలూ వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన సంరక్షకులకు డిప్రెషన్, ఆతురత, నిద్రలేమి, హృదయసంబంధ (కార్డియోవాస్క్యులర్) తదితర వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని ఇటీవల ఓ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ఉపయోగపడేలా ఫేస్బుక్ వెబ్ యాప్ ద్వారా ఒక అధ్యయనం చేపట్టనున్నారు. ఇండియానా యూనివర్శిటీ-పర్డ్యూవిశ్వవిద్యాలయం ఇండియానాపోలిస్ పరిశోధకుల బృందం స్వచ్ఛందంగా ఒక వినూత్న రీతిలో పైలట్ అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ అధ్యయానికి గాను వాలంటీర్లను ఆహ్వానిస్తోంది. ఈ పార్టిసిపెంట్స్ తో మైక్రోవాలంటరీంగ్ గ్రూపు ను క్రియేట్ చేసి వారితో చర్చలు నిర్వహించనుంది. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెబ్ యాప్ ద్వారా సంరక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనుంది. దీని ద్వారా అల్జీమర్స్ పీడితుల సంరక్షలకు ఉపయోగపడాలని భావిస్తోంది. ఆరువారాల పాటు నిర్వహించనున్నఈ పైలట్ అధ్యయనంలో పాల్గొనే ఆసక్తి వున్నవారు alzgroup.iu.edu ద్వారా తెలుసుకోవచ్చని యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. -
పక్కకు పడుకుంటే మతిమరుపు దూరం
న్యూయార్క్: మీరు వెల్లకిలాగాని, బోర్లాగాని పడుకుంటున్నారా..అయితే మీరు పడుకునే విధానం మార్చుకుని పక్కకు పడుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే..పక్కకు పడుకొనేవారిలో అల్జీమర్స్ (మతిమరుపు), పార్కిన్సన్ (వణుకురోగం)తోపాటు నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. పక్కకు పడుకోవడంవల్ల మెదడులోని వ్యర్థ, హానికారక రసాయనాలు చాలావరకూ తొలగిపోతాయి. ఇలాంటి వ్యర్థ రసాయనాలే అల్జీమర్స్‌తో పాటు నరాల వ్యాధులకు కారణమౌతాయి. పక్కకు పడుకునేవారి మెదడు సంబంధిత గ్లింపటిక్ పాత్‌వేను ఎమ్ఆర్ఐ స్కాన్ చేయగా ఈ సంక్లిష్ట వ్యవస్థ వ్యర్థాలను శుభ్రపరుస్తున్నట్లు తేలింది. -
అల్జైమర్స్‌కు ఆయుర్వేద పరిష్కారాలు..?
మా నాన్నగారి వయసు 68. గత ఆరునెలలుగా మతిమరపు ఎక్కువవుతోంది. డాక్టర్లు పరీక్ష చేసి అల్జైమర్స్ వ్యాధిగా అనుమానిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో మంచి మందులు, ప్రక్రియలు సూచించ ప్రార్థన. - నరసింహ, మెదక్ శిరస్సు ఎముకల సముదాయాన్ని పుర్రె అంటారు. దాని లోపలి పదార్థాన్ని మెదడు అంటారు. దీనినే ఆయుర్వేద పరిభాషలో కపాలం, మస్తిష్కం అనే పేర్లతో వ్యవహరిస్తారు. మెదడు క్రియలు లేదా కర్మలు అనేకం. అందులో మనోవ్యాపారాలు కూడా ఒకటి. మనసు నిర్వర్తించే ప్రధాన కర్మలు మూడు. అవి ‘ధీ, ధృతి, స్మృతి’. వాస్తవానికి మూడు శక్తులు. మేధాశక్తి, విషయ విజ్ఞానాలను పదిలపరచి భద్రంగా దాచుకునే శక్తి. దాగిన విషయాలను గుర్తుకు తెచ్చుకునే శక్తి. స్మృతి భ్రంశ లేదా స్మృతి నాశ అవస్థల్ని అల్జైమర్స్ వికారంగా సరిపోల్చుకోవచ్చు. మస్తిష్కంలోని కొన్ని కణాల క్రియా శైథిల్యమే ఈ వ్యాధికి సంప్రాప్తి. అనేక శారీరక, మానసిక వ్యాధులతోపాటు, వార్థక్యాన్ని కూడా దీనికి కారణం గా గమనించారు. రసాయనచికిత్సని ఆయుర్వేదం అభివర్ణించింది. రసాయన ద్రవ్యాలు అనేకరకాలు. ఇక్కడ వాడవలసినవి మస్తులుంగ పుష్టికర ఔషధాలు. వీటిన మేధ్య రసాయనాలంటారు. వీటిని వ్యాధిగ్రస్థులేగాక, ఆరోగ్యవంతులు, చిన్నపిల్లలు కూడా అనువైన మోతాదులో అనునిత్యం వాడుకోవచ్చు. దీనివల్ల మనస్సు తేజోవంతంగా, సునిశితంగా పనిచేస్తుంది. ఈ కింది సూచనల్ని, మందుల్ని ఆరునెలలపాటు క్రమం తప్పకండా వాడి ఫలితాన్ని సమీక్షించుకోండి. ఆహారం: శాకాహారం, సాత్వికాహారం, ఆవుపాలు, ఆవునెయ్యి, ఉప్పు, కారం, మసాలాలు మానెయ్యాలి. బాదం, పిస్తా, ద్రాక్ష, దానిమ్మ మంచివి. విహారం: తగినంత విశ్రాంతి, శ్రావ్య సంగీత వాయిద్యాలు, మధురమైన పాటలు ఉపయోగకరం. వీలును బట్టి ప్రాణాయామం మంచిది. మేధ్య రసాయన ద్రవ్యాలు: గోధుమ, ఆవుపాలు, ఆవువెన్న, ఆవునెయ్యి, ఓషధులలో బ్రాహ్మీ (సంబరేణు), మండూకపర్ణి (సరస్వతి), శంఖపుష్పి, అపరాజిత (దిరిశెన) ప్రశస్తమైనవి. మందులు: మహా పంచగవ్య ఘృతం: ఒక చెంచా మందుని నాలుగు చెంచాల ఆవుపాలలో కలిపి, రెండుపూటలా ఏదైనా తినటానికి ముందుగా తాగాలి స్మృతి సాగర రసమాత్రలు ఉదయం 1, రాత్రి 1 తిన్న తర్వాత వాడాలి. సారస్వతారిష్ట ద్రావకం-నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. స్వర్ణబ్రాహ్మి మాత్రలు రోజుకి-1. గమనిక: మేధ్య రసాయన ఓషధులలో ఏవైనా ఒక దాని ఆకుల్ని శుభ్రం చేసి, దంచి, స్వరసం తీసి, మూడు చెంచాల మోతాదుని తేనెతో రెండుపూటలా సేవించాలి. దీనికి ఒక చెంచా ఆమలకీ (ఉసిరికాయ) స్వరసం కలిపితే ఇంకా మంచిది. వసకొమ్ముని నీళ్లతో నూరి, ఆ ముద్దని రెండు చిటికెల (300 మి.గ్రా) తేనెతో వారానికి రెండుసార్లు నాకిస్తే మంచి మేధ్య రసాయనంగా పనిచేస్తుంది. (ఎక్కువైతే అది వాంతికరం) ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ‘ధారాచికిత్స’, మూత్రావస్తి అవసరాన్ని బట్టి అమలుపరిస్తే ఫలితం గణనీయంగా ఉంటుంది. ఇతర వ్యాధుల్ని గమనిస్తే, వాటికి కూడా సరియైన చికిత్స అవసరం. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్