ఫేస్బుక్ ద్వారా వినూత్న స్టడీ, వాలంటీర్లు కావాలి
ఫేస్బుక్ ద్వారా వినూత్న స్టడీ, వాలంటీర్లు కావాలి
Published Mon, Aug 8 2016 1:19 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
న్యూయార్క్: మతిమరుపు అనేది మనిషి జీవితంలో ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వయసుమళ్లిన వారిపై దాడి చేసిన వారి జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వ్యాధి అల్జీమర్స్. ఈ అల్జీమర్స్ వ్యాధి బారినపడ్డ రోగి జీవితంలో అనూహ్యంగా ఎంత గందరగోళం ఏర్పడుతుందో వారి సంరక్షకులపై అంతకంటే ఎక్కువ ఒత్తిడి నెలకొంటుంది. ఇరవై నాలుగ్గంటలూ వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన సంరక్షకులకు డిప్రెషన్, ఆతురత, నిద్రలేమి, హృదయసంబంధ (కార్డియోవాస్క్యులర్) తదితర వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని ఇటీవల ఓ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ఉపయోగపడేలా ఫేస్బుక్ వెబ్ యాప్ ద్వారా ఒక అధ్యయనం చేపట్టనున్నారు. ఇండియానా యూనివర్శిటీ-పర్డ్యూవిశ్వవిద్యాలయం ఇండియానాపోలిస్ పరిశోధకుల బృందం స్వచ్ఛందంగా ఒక వినూత్న రీతిలో పైలట్ అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ అధ్యయానికి గాను వాలంటీర్లను ఆహ్వానిస్తోంది. ఈ పార్టిసిపెంట్స్ తో మైక్రోవాలంటరీంగ్ గ్రూపు ను క్రియేట్ చేసి వారితో చర్చలు నిర్వహించనుంది. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెబ్ యాప్ ద్వారా సంరక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనుంది. దీని ద్వారా అల్జీమర్స్ పీడితుల సంరక్షలకు ఉపయోగపడాలని భావిస్తోంది. ఆరువారాల పాటు నిర్వహించనున్నఈ పైలట్ అధ్యయనంలో పాల్గొనే ఆసక్తి వున్నవారు alzgroup.iu.edu ద్వారా తెలుసుకోవచ్చని యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
Advertisement