caregivers
-
కల్లోల ఇజ్రాయెల్‌లో ఇండియన్ సూపర్ ఉమెన్
బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు... అనుకునే భయానక పరిస్థితుల్లో ఉండి కూడా, తమకు ఏమైనా ఫరవాలేదు, నిస్సహాయులైన వృద్ధదంపతులకు ఏమీ కాకూడదని వారిని కంటికి రెప్పలా కాపాడారు ఇజ్రాయెల్‌లో హోమ్ నర్స్‌లుగా పనిచేస్తున్న కేరళకు చెందిన సబిత, మీరా మోహన్‌లు... దక్షిణ ఇజ్రాయెల్... గాజా సరిహద్దుకు రెండో కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్ ఓజ్ కిల్బట్జ్ పట్టణంలో ఒక ఇంట్లో... 85 సంవత్సరాల షౌలిక్, 76 సంవత్సరాల రహెల్ దంపతులకు నలుగురు పిల్లలు. పిల్లలు వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. రహెల్ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను చూసుకోవడానికి ఆరోజు ఆ ఇంట్లో సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు హోమ్నర్స్లు ఉన్నారు. ఉదయం ఆరున్నర ప్రాంతంలో సైరన్ మోత వినిపించింది. ప్రజలు బాంబ్ షెల్టర్లలో తల దాచుకోవాలని చెప్పే సైరన్ అది. ‘ఆ ఉదయం సైరన్ మోగేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సెకండ్ల వ్యవధిలో సేఫ్టీరూమ్లోకి వెళ్లాలి. ఇంతలో రహెల్ కుమార్తె నుంచి ఫోన్ వచ్చింది. బయట పరిస్థితి భయానకంగా ఉంది అని ఆమె చెప్పింది. మాకు ఏం చేయాలో తోచలేదు. ఇంటిముందు, వెనుక తలుపులకు తాళాలు వేసి అమ్మానాన్నలను తీసుకొని, పాస్‌పోర్ట్, డైపర్లు, యూరిన్ పాట్, మందులతో సెక్యూర్ రూమ్‌లోకి వెళ్లాలని ఆమె చెప్పింది. షౌలిక్, అనారోగ్యంతో ఉన్న రహేల్‌ను నడిపించుకుంటూ షెల్టర్ రూమ్‌లోకి వెళ్లాం. ఈలోపే మిలిటెంట్లు ఇంట్లోకి ప్రవేశించారు. అద్దాలు బద్దలు కొట్టారు. వస్తువులు ధ్వంసం చేశారు. షెల్టర్రూమ్పై కాల్పులు జరుపుతున్నారు. ఐరన్ డోర్ వెనకే మా శరీరాలను గట్టిగా ఆనించి ఎన్నో గంటలపాటు నిల్చున్నాం. అదృష్టవశాత్తు ఐరన్ డోర్ ధ్వంసం కాలేదు. ధ్వంసం అయి ఉంటే ఎవరి ప్రాణాలు మిగిలేవి కావు’ అంటూ ఆ భయానక ఘటనను గుర్తు తెచ్చుకుంది 39 సంవత్సరాల సబిత. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ల సాహసం, మానవత్వం గురించి దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ‘ఇండియన్ సూపర్ ఉమెన్’ అంటూ ప్రశంసించింది. -
Viral Video: పరుగెత్తుకొచ్చి హగ్గులిచ్చిన ఏనుగుల గుంపు
ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన పలు రకాలు వీడియోలు చూశాం. తమ యజమానులను రక్షించే జంతువులను చూశాం. అయితే ఇక్కడ ఏనుగులు తమ సంరక్షకుడిని 14 ఏళ్ల విరామంతో చూడంటంతో ఏం చేశాయో చూడండి. (చదవండి: సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్!) అసలు విషయంలోకెళ్లితే....సేవ్ ది ఎలిఫెంట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు డెరెక్ థాంప్సన్ 14 నెలలు తర్వాత తన సంరక్షణలో పెరిగిన ఏనుగులను ఒక నది వద్ద చూశాడు. అయితే ఆ ఏనుగులు తమ సంరక్షకుడిని చూడగానే ఆనందంతో ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చాయి. పైగా తమ కేర్‌టేకర్‌ని తొండాలతో చుట్టుముట్టి హగ్గ్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అవి మనుషుల ఏ విధంగా తమ ప్రియమైన వారిని చాలా రోజుల తర్వాత చూస్తే ఏవిధంగా ఆనందంగా దగ్గరకు వచ్చి ప్రేమగా ఆలింగనం చేసుకుంటారో అలాగే ఆ ఏనుగులు కూడా చేశాయి. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బ్యూటెంగేబిడెన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!) Elephants reunite with their caretaker after 14 months.. Sound on pic.twitter.com/wSlnqyuTca — Buitengebieden (@buitengebieden_) December 23, 2021 -
ఫేస్బుక్ ద్వారా వినూత్న స్టడీ, వాలంటీర్లు కావాలి
న్యూయార్క్: మతిమరుపు అనేది మనిషి జీవితంలో ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వయసుమళ్లిన వారిపై దాడి చేసిన వారి జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వ్యాధి అల్జీమర్స్. ఈ అల్జీమర్స్ వ్యాధి బారినపడ్డ రోగి జీవితంలో అనూహ్యంగా ఎంత గందరగోళం ఏర్పడుతుందో వారి సంరక్షకులపై అంతకంటే ఎక్కువ ఒత్తిడి నెలకొంటుంది. ఇరవై నాలుగ్గంటలూ వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన సంరక్షకులకు డిప్రెషన్, ఆతురత, నిద్రలేమి, హృదయసంబంధ (కార్డియోవాస్క్యులర్) తదితర వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని ఇటీవల ఓ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ఉపయోగపడేలా ఫేస్బుక్ వెబ్ యాప్ ద్వారా ఒక అధ్యయనం చేపట్టనున్నారు. ఇండియానా యూనివర్శిటీ-పర్డ్యూవిశ్వవిద్యాలయం ఇండియానాపోలిస్ పరిశోధకుల బృందం స్వచ్ఛందంగా ఒక వినూత్న రీతిలో పైలట్ అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ అధ్యయానికి గాను వాలంటీర్లను ఆహ్వానిస్తోంది. ఈ పార్టిసిపెంట్స్ తో మైక్రోవాలంటరీంగ్ గ్రూపు ను క్రియేట్ చేసి వారితో చర్చలు నిర్వహించనుంది. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెబ్ యాప్ ద్వారా సంరక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనుంది. దీని ద్వారా అల్జీమర్స్ పీడితుల సంరక్షలకు ఉపయోగపడాలని భావిస్తోంది. ఆరువారాల పాటు నిర్వహించనున్నఈ పైలట్ అధ్యయనంలో పాల్గొనే ఆసక్తి వున్నవారు alzgroup.iu.edu ద్వారా తెలుసుకోవచ్చని యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది.