సాక్షి, సిటీబ్యూరో: వాహనచోదకులు, పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు సెల్‌ఫోన్లు ఉపయోగించరాదని, స్వీయ నియంత్రణ పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్ కుమార్ అంటున్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్ల అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతాయని వివరించారు. ఇయర్‌ఫోన్స్ కారణంగా రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
వెనుక వచ్చేవాహనాలను పట్టించుకోవడం లేదు
యువత చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్డుపై వాహనాలు నడుపుతూ వెనుక వచ్చే వాహనాలను పట్టించుకోవడం లేదు. మ్యూజిక్ జోష్‌లో వాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు. చాలామంది వాహన చోదకులు సెల్‌ఫోన్ మాట్లాడుతూ, ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వాహనాలను నడుపుతున్నారు.
పాదచారులు కూడా ...
బాటసారులు కూడా పాటలు వింటూ మైమరిచిపోతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆటోలు, కార్లలో పెద్ద సౌండ్స్‌తో పాటలు వింటూ డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు. ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోవడంతో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
హెల్మెట్‌లో సెల్‌ఫోన్..
హెల్మెట్ల వాడకం పెరిగిన తరువాత డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం మరింత సులభమైంది. సెల్‌ఫోన్‌ను హెల్మెట్ లోపల చెవిదగ్గర పెట్టి మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment