విమానంలో మ్యూజిక్‌ వింటుంటే.. మంటలు వచ్చి.. | Woman Suffers Burns as Headphones Catch Fire During Flight to Australia | Sakshi
Sakshi News home page

విమానంలో మ్యూజిక్‌ వింటుంటే.. మంటలు వచ్చి..

Published Wed, Mar 15 2017 10:16 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

విమానంలో మ్యూజిక్‌ వింటుంటే.. మంటలు వచ్చి.. - Sakshi

విమానంలో మ్యూజిక్‌ వింటుంటే.. మంటలు వచ్చి..

సిడ్నీ: విమానంలో మ్యూజిక్‌ వింటున్న ఓ మహిళ తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనా రాజధాని బీజింగ్‌ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే విమానంలో ఎక్కిన ఓ మహిళ బ్యాటరీతో నడిచే హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని మ్యూజిక్‌ వింటోంది. కొద్దిసేపట్లోనే హెడ్‌ఫోన్స్‌ నుంచి మంటలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌ తిన్న ఆమె హెడ్‌ఫోన్స్‌ను పక్కకు తీసి కింద పడేసింది. ఈ ఘటనలో ఆమె ముఖం, మెడతో పాటు చేతులకు గాయాలయ్యాయి.
 
హెడ్‌ఫోన్స్‌ నుంచి మంటలు రావడంతో షాక్‌కు గురైన విమాన సిబ్బంది.. గాయాలపాలైన మహిళను శస్త్రచికిత్సకు తరలించారు. కిందపడిన హెడ్‌ఫోన్స్‌ విమానం ఫ్లోర్‌కు కరుచుకుపోవడంతో దాన్ని అక్కడి నుంచి తొలగించారు. బ్యాటరీలతో నడిచే వస్తువులను విమానంలో వాడొద్దని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement